Tuesday, April 21, 2009

గుబులు గుబులుగా...

'''''''''
ఏమన్నది? ఏమన్నది?
తోరణాల మేనా! // 
'ఓ అమ్మాయీ! అమ్మాయీ! 
అందాల భరిణా! 
పెళ్ళి కూతురవ మన్నది. 
కొత్త పెళ్ళి కూతురవ" మన్నది! // 

చిరు నవ్వుల రవ్వలు 
తళుకు మనాలి 
కిల కిలల పన్నీరుల 
రువ్వమన్నది // 

సన్నాయి రాగాల పొడుపు కథలు ఎన్నెన్నో 
నీ వాలు జడల చిక్కుల్లో చిక్కుకున్నాయి // 

ఏమన్నది?ఏమన్నది? 
తులిపి రామచిలక? 
"వలపు తలపు ముచ్చట్లను 
తనివి తీర మోస్తాను 
యుగ యుగాల 
ప్రణయ చరితలకు 
చేర వేస్తాను 

అందుకనే,,,.... 
నీ గుస గుసల ఊసులన్ని 
చెవిలోన చెప్పమంది 
గుండెలలో గుబులు, గుబులు 
బాసలు బహు సొగసు" లంది //

''''''''''

No comments:

Post a Comment