Thursday, April 23, 2009

స్వామి నామధ్యానము


స్వామి నామధ్యానము 

(పల్లవి) 
భజనలు చేయుచు కదలండీ! 
సోపానములను ఎక్కండీ! // 

(అను పల్లవి) 

"సప్త గిరీశుని నామ కోటిని"......
సప్త గిరీశుని నామ కోటిని 
మనసా, వాచా,కర్మణా 
పునః పౌన్యముగ ధ్యానించండీ! 
పుణ్య రాశికి శిఖరము అదియే! // 


1)బాటల తరువులు - తరువుల ఛాయలు 
ఛాయలు -ఒహో! ఘన శ్యాముని పోల్కెలు(=పోలికలు) 
"గోవిందా!" అను నామ ధ్యానము 
తొలి ,మలి పొద్దులు, మధ్యాహ్నం 
నవ నవ లాడే నామ మననము // 

2)రహ దారులపై పుప్పొడి రజనులు 
స్వామి చెక్కిలి బంగరు రజనులు 
"గోవిందా!" పేరు పనసలు 
రేయి,పగలు , అహరహమూ ,మరి 
మై మరిపించే పేరు ఉరవడి! // 


(కోరస్) ;;;;; 
'''''''''''''''''''''''''''''''' 
భక్తి తత్పరతల 
కదియే " ఒరవడి"! 
మురిపించే నామమునకు 
మా "డెందము"యే "గుడి" // 

Views (119)

No comments:

Post a Comment