Thursday, April 23, 2009

ధన్యమైనవిధన్యమైనవి 

By kadambari piduri, Feb 10 2009 5:09PM
అర్చనలను చేద్దాము! - ఆరాధిద్దాము! 
ఏడు కొండల స్వామినీ! 
అహర్నిశలు,నిరంతరము 
అహోరాత్రము // 

1)ఆటలాడుతాం! 
నాట్యాలు, నటనలాడుతాం! 
ఆనంద మూర్తి! నీ లీలలు చూపుటచే 
వెలసిన మా క్రీడలు ధన్యమైనవి! // 

2) పాట పాడుతాం! 
నుతి,నుడువుల కీర్తించుదాం! 
"శ్రీ " మృదు హాసమ్ములను 
వినుతి చేయు గీతములు 
అక్షరాక్షరము, ఆహా! ధన్యమైనవి! //
 
Views (109) |

No comments:

Post a Comment