Thursday, April 23, 2009

కారుణ్యము! ఇంత కారుణ్యము!


కారుణ్యము! ఇంత కారుణ్యము!

తామరస నయనుడు - 
శ్రీ పన్నగ శయనుడు 
ఆది నారాయణునిది 
కృపా జ్యోత్స్న ఎనలేనిది! 

1) శ్రీ వారిజ నాభుడు 
నారీ జన మనోహరుడు 
తామసమింతైన లేని 
పరిధి లేని గగన సదృశ 
కారుణ్యమా! ఇంత కారుణ్యమా! 

2)కరి వరదుడు 
ప్రహ్లాద బాల రక్షకుండు 
వైనతేయ వాహనుడు 
గోరోచనమే ఎరుగని 
కారుణ్యము! ఇంత కారుణ్యము!
 

Views (89) 

No comments:

Post a Comment