Monday, August 31, 2009

తెలి గోళ్ళు - వెన్నెల ప్రతి ఫలనము


-
-
-
-
-
-
-
-
-
-
-
-
-

మురళిలోన తారాడే - మలయ పవన వీచిక


ఆయె రాగ మాలిక !- అది, ఎల్లరికీ వేడుక


బృందా-వనిలోన,అందందున - వలయ నాట్య హారములు భామినుల్ ఆట పాటలన్నీ -


యమునా తటి, యామినిపై వెద జల్లుతూన్న - కువలయ విరి సౌరభములు


రాస లీల వేళలలో - వెదురు పైన స్వామి వ్రేళ్ళు !


శూన్య వంశి" వేణువు "గా - అవతరించు క్షణములలో


శ్రీ కృష్ణుని నఖములపై - విరియు జ్యోత్స్నల కాంతుల


రిమ రిమలు, మిల మిలలు - జిలి బిలి జాబిల్లి నవులు


ఆ,కిల కిలల అలల పయిన - రిం ఝిం ఝిం -రిం ఝిం ఝిం

Saturday, August 29, 2009

రాసలీలా లోలుని రూప విలాసము

వ్రజ బాలుని నాసికాగ్రమున -
ఆణిముత్యములు కాంతు లీనెడు -
నీదు దంత పంక్తియా -
రమణి రాధికా!

రాసలీలా లోలుని మణి కుండలములు -
నీ నీలి కన్నులై మిలమిలమన్నవి

శౌరి కౌస్తుభాభరణము నీదు -
చక్కని పొక్కిలాయెనో? ఏమో?

శ్రీ హరి కస్తూరి తిలక రేఖలు, నీదు -
చివురు పెదవులుగ రూపు దీరెనో?! -

కుంజ విహారీ దేహ ధాళిమ -
కుంతలములుగ శాంతమొందెనో?! -

Kovela

రాసలీలా లోలుని రూప విలాసము

By kadambari piduri, Jul 2 2009 7:39PM )

Wednesday, August 26, 2009

ఆ బాల గోపాలము (ఆటలుకాని ఆటలు)

# Kovela #
ఆటలుకాని ఆటలు
# By - kadambari piduri, Jul 4 2009 5:44PM #

మృదు మధుహాసము
-మంజుల రూపము
కని కని మురిసెను
ఆ బాల గోపాలము //

1)నెమలి పింఛ మాడినది
నుదురు పయిన
నీలి నీలి ముంగురులాడినవి //

2)ఎరపు పెదవు లాడెను
పెదవి పయిన వేణువుపై
చివురు వ్రేళు లాడినవి //

3)కుండలములు ఆడినవి
గళములోన రంగు రంగు
పూల ; దండ నాట్యమాడినది //

4)హరి నడుము ఆడినది
సిరి మువ్వలు ఘలు ఘల్లన
పద పద్మము లాడినవి //

5)రస -ధునియై ఋతు హేల
ఉప్పొంగుచు దరహసించ
బృందావని నిలువెల్లా
కమనీయపు పులకింత //

Monday, August 24, 2009

వన మయూరి

Baala

గోడలపై నానుడులు

చిన్నోడా!చిన్నోడా!సరదాగా రారండీ!
పలక,బలపం పట్టి
పుస్తకం చేత పట్టి
పాఠశాల కెడదాము! //

1)అమ్మకు,అయ్యకు మనము
ఇప్పుడే చెబుదాము
వేలి ముద్రలను మాని
చే వ్రాళ్ళను చేదమనీ! //

2)గుడి గోడలపై పాటల
నిట్టే చదివేస్తాము
లెక్కలు,సైన్సులు నేర్చి
లోక జ్ఞానమలవడేను //

3)నోట్లు,అప్పు పత్రాలను
వివరా లు తెలుసుకుంటారు
ప్రపంచమ్ము చరిత్రలను
బాగ తెలుసుకుంటారు

************************************************

Baala

జీవనగమ్యం

ఊగూ ఊగూ ఉయ్యాలా!
ఉగ్గూ పాల జంపాలా!
లాలీ లాలీ జో!(2) //

రమ్యమైనదీ రామాయణము
ఆదర్శ జీవన పథ గమ్య మది !
లోకమ్ముల ధన్య పరచు
కాంతి "గది"గ నీదు మదిని
సృజియించే భక్తి నిధి, ఇది //

ఇతిహాసమ్ముల నెలవు
పవిత్రతల కొలువు
సన్మార్గముల నడిపే
ధ్యేయమైన గురువు //

*********************************************************

మయూరి అందాలు

అంద చందాల నెమలి
ఆట లెన్నొ ఆడింది
పురి విప్పి సందడిగా
నాట్యాలే చేసినది //

నెమలి కనుల సోయగాలు
ఆమని గీతాలకు
ఆమోదపు పల్లవులను,
అను పల్లవి,చరణాలను
సమ కూర్చును ముచ్చటగా//

చంద మామ వెన్నెలలు
తోట పైకి జారాయి
చెట్ల ఆకు సందులలో
సన సన్నని నవ్వులుగా //

ఉద్యానంలో జాడలు
నింగిలోని తారకలు
విప్పారిన నెమలి పురికి
ఏ మాత్రం సాటి వచ్చు!?! //

********************************************************

చిరు గాలికి గిలి గింతల జిలిబిలి

Kovela

ధరణీకాంతుడు

కొంగు బంగారు ముడి
శ్రీ కాంతుని వేంకట గిరి //

దివి అంతయు గాలించి
భువిని-ఇచ్చగించి తానె
దిగి వచ్చెను తిరుమలకు!
సప్త గిరుల హారమునకు!

శ్రీ లక్ష్మీ రమణుని గిరి
శ్రీమంత నివాసము //

శ్రీ వేంకట నాయకుని
తోడిదే మా లోకము
అఱ చేతికి అందినట్టి
దివియే కద ఈ సన్నిధి!

ఈ సన్నిధి యే పెన్నిధి
ఆసాంతం మన సొంతము //

******************************************

Kovela

అనురాగమాలిక

By kadambari piduri, Aug 18 2009 5:10AM
శిఖి పింఛ ధారీ!
శ్రీ కృష్ణ!వన మాలీ!
నీ మురళీ రవళులు
చిరు గాలికి
గిలి గింతల జిలిబిలి ||

అల్లదే!అల్లదే!
మలయ పవన వీచిక
వేణు గాన లోలుని
ఆగమనపు సూచిక ||

మారుతములకు
అందెనులే నేడు
మంచి ఆశీస్సులు!
"చిరంజీవ!"దీవెనలు !
అవి, అవిరళ శృతి రాగమ్ములు ||

మందార మృదు బాల -రాధిక
ఆనంద బాలునుకు అభిమానపు సేవిక
అనురాగముల వర మాలిక
అరుదెంచినదదిగో!అందాల అభి సారిక
చక చకా! చక చకా! ( 2 )

******************************************************


మానసధామం

ఏ పొద్దూ,నవ నవముగ
తిరు వేంగళ నాధుని
చిరు నవ్వుల ముగ్గులందు
విర బూసే వన్నియలు ||
మేఘ శ్యాము హృదయము
సు - విశాల గగన ధామము
పూ సౌరభ దామినులకు
నీల మోహనుని మేను
ఆయె నయ్యారె ! ఆవాసము ||

శత పుష్ప దళమ్ములార !
స్వామి - తనువునందున
పరిమళ శతకమ్ములార !
గడించినారు గడుసు వరము
అందులకా గీర్వాణము ||

లతా ప్రసూనమ్ములార!
పత్ర పూ ఫలమ్ములార!
ప్రకృతికి ప్రతి కృతి
ఎలమి స్వామి దేహము
మీ సుందర హర్మ్యమ్ము ||
( కోరస్ ) ::::::
మేఘ శ్యాము హృదయము
సువిశాల -గగన ధామము
ఏ పొద్దూ,నవ నవముగ
తిరు వేంగళ నాధుని
చిరు నవ్వుల ముగ్గులందు
విర బూసే వన్నియలు
చెప్పొద్దూ,ఎంతొ ముద్దు!
చెప్ప రానంత ముద్దు ||

_

Saturday, August 22, 2009

ముద్దు గుమ్మడు


కమ్మనైన గుమ్మ పాలు - తెండీ!తెండీ!
ముద్దు గుమ్మడు కన్నయ్యకు-ఇవ్వండి,ఇవ్వండీ!

చెమ్మ చెక్క ఆటలన్ని మనవేనండీ!
"ని-జమ్ము"!యమున - చూసినది గోపాలుని లీలలు!

గోవర్ధన గిరియె-"గొడుగు"టమ్మా!చోద్యం!
రండమ్మా!కన్నయ్యకు దిష్టిని తీద్దాం!

"తుమ్ము-'శ్రీరామ రక్ష"పూ బొమ్మల్లారా!
కంటి దీ-పమ్ము కదా ప్రతి వారికి - కృష్ణుడు సుమ్మీ!

కన్నయ్య ప్రతి ఆటయు - బ్రహ్మ మించునటుల,
బమ్మెర పోతన్న శైలికింపును గూర్చెన్ .


-

-

Tuesday, August 18, 2009

నానా సూన వితాన వాసనలు

శ్రీ కృష్ణ దేవరాయలు ఆస్థానములోని అష్ట దిగ్గజములలో ప్రముఖుడు. ఈయన ,రాయలు భార్య,వినతి పై,రాసిన"పారిజాతాపహరణము"నకు,"రాయలు,రాణి పైన కోపగించుకోవడము " కూడా మూల కారణమైనది
సత్య భామా దేవి కినుకను తగ్గించడానికీ,ఆమె తన భర్తతో అనురాగముతో వర్తించడానికీ ఒక పద్యాన్ని రాసేసి ,
"ముక్కు తిమ్మన"గా లోక బిరుదును సంపాయించేసాడు ధూర్జటి.
ఆ నాసికాభరణము కాంతులు చూడండి/చదవండి.
"నానా సూన వితాన వాసనల నానందించు
సారంగ మేలా తన్నొల్లదటంచు
గంధ ఫలి బల్కానల్ తపం బొంది
యోశా నాసాకృతి బూనె సర్వ సుమన
సౌరభ్య సంవాసియై బూనెం బ్రేంఖణ
మాలికా మధుకరీ పుంజంబు లిర్వంకలన్ .

"అన్ని పుష్పాల మీద వాలుతూంటుంది మిళిందము.
కానీ , ఆ తుమ్మెద నా మీద ఎందుకు వాలడం లేదు?" అని అలిగింది సంపెంగ పువ్వు.
దుర్గమారణ్యాలలోనికి వెళ్ళింది సంపంగి పూవు.తీవ్రంగా తపస్సు చేసి భగవంతుని వరం కోరినది.
" ప్రేయసి నాసిక (= ముక్కు) గా పునర్జన్మను పొందినది. ఆ నాటి నుండీ,వర ప్రభావముచే అన్ని పూవుల వాసనలని ఆస్వాదించసాగినది .
ఇరు వైపులా "నయనములు -( గండు తుమ్మెద ) చూపులను తుమ్మెదల మాలగా ధరించింది .


"ముక్కు తిమ్మన "గా - వాసి కెక్కిన, ధూర్జటి వివరాలకై,"వేంకటార్య కవి"( పౌత్రుడు) రచించిన "శ్రీ కృష్ణ రాయ విజయము"ను ఆధారముగా భావిస్తారు. "భారద్వాజ గోత్ర ; పాక నాటి ; ఆర్వేల నియోగి ; అని తెలుస్తూన్నది. శ్రీ కాళ హస్తీశ్వర శతకము" మూలంగా ధూర్జటి మహా కవి,"శ్రీ కాళ హస్తి లో నివసించెనని " స్పష్టమౌతున్నది.

Monday, August 17, 2009

ధరణీకాంతుడు

-

-

-

-

-

-

Bali" word derives from "vAli".
vali,sugriva are the charecters in Ramayana".
This temple is in the country "Bali"
see and enjoy the marvellous sculpture.


2."bali chakravarthi"famous ,renowned for his "datRtva guNamu".


కొంగు బంగారు ముడి
శ్రీ కాంతుని వేంకట గిరి //

దివి అంతయు గాలించి
భువిని-ఇచ్చగించి తానె
దిగి వచ్చెను తిరుమలకు!
సప్త గిరుల హారమునకు!

శ్రీ లక్ష్మీ రమణుని గిరి
శ్రీమంత నివాసము //

శ్రీ వేంకట నాయకుని
తోడిదే మా లోకము
అఱ చేతికి అందినట్టి
దివియే కద ఈ సన్నిధి!

ఈ సన్నిధి యే పెన్నిధి
ఆసాంతం మన సొంతము //

(ధరణీకాంతుడు ;

By kadambari piduri, Aug 8 2009 8:16PM )

వటపత్ర శాయీ! - Kovela, Jan 6 2009 _ Jul 29 2009