Thursday, April 23, 2009

చరణములకు పారాణి
చరణములకు పారాణి

ఓలాలా! ఓలాలా! 
చిద్విలాస దంపతులకు 
నడకలన్ని పద్మములు 
మ్రొక్కిన మన శిరములకు 
స్వర్ణ పొడులు, పుప్పొడులు 
మనకు దొరికిన పెన్నిధులు // 

1)చిటికెడంత పసుపులోన 
రవ్వంత సున్నమును 
పసిడి పాత్రలలోన ,పన్నీటి జలములలో 
ఎలమి రంగరించండీ! 

శ్రీరంగనాధ చరణములకు 
పారాణిని దిద్దండీ! ఉవిదలార! // 


2) దేవేరీ పద కమలము 
రేకైనా కంద నీక 
ముచ్చటగా తీర్చండీ! 
ముచ్చటగా పారాణిని ! // 

శ్రీ రమణుని మెరుపు లతల 
పదముల పారాణికి 
దీటుగాను మెరువ వలెను 
అలివేలుకు పారాణిని 
అలవోకగ మెలచండీ, 
అతివలార! //

'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''' 
Views (100)

No comments:

Post a Comment