Thursday, July 26, 2012

పుష్పక విమానము


Pushpaka vimanam



విశ్రావసు కుమారుడు, దేవతలకు గురువు కుబేరుడు. 
ఆతడు గొప్ప శివ భక్తుడు. మహేశ్వరుడు
"కుబేరా!" నీ భక్తికి మెచ్చి, ఈ గగన గామిని ని ఇస్తున్నాను,! " అని
ఘన వస్తువును తన భక్తునికి ఒసగాడు.
అదే విశ్వఖ్యాతి గాంచి, ఇతిహాస చరిత్ర సృష్టించిన "పుష్పక విమానము".
తన విమానము (aircraft)లో-
సకల మహేశ దేవళములను- దర్శిస్తూ,
కుబేరుడు పుష్పక విమాన యానము చేయసాగాడు.
అలా వివిధ ఆలయాలను సందర్శిస్తూ, 
ఒక చోట ఒక విచిత్ర దృశ్యాన్ని తిలకించాడు.
కావేరీ తీరాన (Cauvery) జింక, పులి, ఆవు, ఏనుగు, పాము, ఎలుక - లు
ఒకే చోట నిలబడి, నదిలోని నీళ్ళను తాగుతున్నాయి.
జంతు సహజ వైరము లేకుండా ఆ ఐదు
మైత్రీభావముతో అలాగ మెలగడము చూసిన కుబేరుడు, అక్కడ దిగాడు.
సుర గురువు- "సజ్జనులు, పుణ్య చరితులు, గంధర్వులు, మహర్షులు- 
ఇక్కడకు వచ్చి, నివసిస్తున్నారు. 
ఆ సౌజన్య ప్రవర్తనా పరిమళాలు విస్తరించిన పరిసరములు అవి! 
కనుకనే అచ్చట స్నేహభావ, సౌమ్య భావములు విరబూస్తూన్నవి.
అందువలననే ఈ సీమలో జంతువులు సైతమూ 
తమ తమ సహజ వైరాలను మరిచి, 
స్నేహ భావముతో కలిసి మెలసి జీవిస్తూన్నవి" అని గ్రహించాడు.  
కుబేరునికి ఆకాశములో నుండి- ఒక  స్వరము వినిపించింది.
"ఇచ్చటి ఇల్లిందై చెట్టు (= రేగు చెట్టు/ బదరీ వృక్షము)  ఉన్నది.
ఆ తరువు మూలమున తాళపత్రములు ఉన్నవి.
ఈ ప్రాంతమునకు వేదములు వచ్చినవి.
కనుక ఇది పవిత్ర మహిమాన్విత ప్రదేశము" అంటూ ఆ అశరీర వాణి పలికినది.
ఈ రేగి చెట్టు  (Ilandhai Tree) దరిని- నీవు పూజించ వలసిన పరమేశ లింగము ఉన్నది. 
భక్తుల సకల ఈప్సితములు నెరవేరు ప్రదేశము ఇది.
"ఈ మాటలకు విస్మయ చకితుడైన కుబేరుడు అన్వేషణలో- పవిత్ర లింగమును కనుగొన్నాడు.
కుబేరుని ఆరాధనలు పొందిన ఈశుడు-
కుబేరుని కోరికపై "అలఘేశుడు" (Alagesan) - అనే నామధేయ విలాసునిగా
భక్తులను అనుగ్రహిస్తున్నాడు.
"భవాని" అనే ప్రదేశములో వెలసిన ప్రసిద్ధ కోవెల పేరు "శ్రీ సంగమేశ్వర కోవెల", 
కావేరీ, భవానీ, అంతర్వాహిని ఐనట్టి "అమృత" అనే మూడు నదులు కలుస్తూన్నవి.
అందుచేత- దక్షిణ భారతమున "త్రివేణీ సంగమముగా" వినుతి కెక్కినది.
సంగమేశ్వరుడు - స్వయంభువుగా వెలిసినాడు.అమ్మవారి పేరు "వేదనాయకి". తల్లి సౌందర్యవల్లి.
ఇక్కడ విష్ణుమూర్తి- "అధికేశ్వరర్" అని   పేరు.
కావేరీ నది ఒడ్డున- పవిత్ర తీర్ధము ఇది. తేవారం అర్చకుల గానములు
ఈ చల్లని గాలులలో- మనోహరముగా వినిపిస్తూ ఉంటాయి.
ఈరోడ్ జిల్లాలో( Erode) భవానీ గుడి- "శ్రీ సంగమేశ్వర కోవెల" ఉన్నది.  
; 

Monday, July 9, 2012

శరత్ చంద్రఛటర్జీ , Devanandapur, Hugly


Hooghly

శరత్ చంద్రఛటర్జీ పేరు తెలీని వారెవరు?
బెంగాలీ రచయిత రాసిన అన్ని రచనలూ,
తెలుగులో అనువదించ్బడి, ఆంధ్ర పాఠకులను/కు
శరత్ బాబు తెలుగు రచయితయే!" అన్నంతగా అభిమానాన్ని పొందాడు.
దేవదాసు, మా వదిన, బాటసారి, తోడికోడళ్ళు ఆదిగా
అనేక సినిమాలు ఆయన రచనల ఆధారంగా నిర్మించబడినవి.

15 సెప్టెంబర్ 1876 లో దేవానందపూర్, హుగ్లీ జిల్లాలోని- లో జన్మించాడు.
శరత్ చంద్రఛటర్జీ యొక్క నివాసము, మున్నగునవి,
స్మారక చిహ్నములుగా ఉన్నవి.
ఆ దారిలో ఉన్న ఒక పెద్ద వృక్షము కనులకింపు.

Tags:-

DewaanaMd pur, Hoogly
;

Friday, July 6, 2012

చెట్టు, పంజాలు- ఆ ఊరి పేరు


"హిందూ మతము"- అనే పదముకంటే
"హిందూ సంప్రదాయము" అని
చెబుతేనే బాగా నప్పుతుంది.
ఆచార, సంప్రదాయాలు, ప్రకృతితో అనుసంధానిస్తూ-
ఒక మతముగా రూపొందిన అద్భుత  వైనము-
ఈ పుణ్యభూమి- లోనే సాధ్యమైనది.
ఆర్యభూమిలో అతి ప్రాచీన కాలమునుండీ అనేకమంది
సమాజశ్రేయస్సు గూర్చి పరితపిస్తూ అనేక ఆలోచనలు చేసారు.
కాలానుగుణముగా- అవి పరిణామము చెందుతూ,
పరిణతి చెందిన "హిందూమతము" గా ప్రజలు రూపు దిద్దుకున్నారు.
ఆ ఘన చారిత్రక ఆవిష్కరణయే - హిందూ మతము-
కేవలము మతముగానే కాక,
చతుష్షష్ఠి కళల సమామ్నాయమై తనను తాను ప్రౌఢీకరించుకున్నది.
ప్రకృతితో పెనవేసుకున్న అనుబంధమే "కలిమి" గా కల హైందవమును-
నా శక్తి పరిధిలో-  వ్యాసీకరించే ప్రయత్నమిది.

                      ************************;

తిరుపత్తిరిపులియూర్:- ఈ ఊరికి, అలాగే ఊరిలోని కోవెలకు -
ఆ పేరు రావడానికి వ్యుత్పత్తి ఒకటి ఉన్నది.
"తిరు+పాదిరి+పులియూర్" అనే పదములు ఆధారము.
శ్రీ + పాటల + పులి- ఊరు -  కొన్ని సంఘటనల ద్వారా
ఈ మాటలకు స్థల నామార్హత ఏర్పడినది.
పాటలీశ్వరుని దేవాలయము  "తిరుపత్తిరిపులియూర్"
(Sri Padaleeswarar Temple,Thirupathiripuliyur) లో  ఉన్నది .
తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఉన్న ఈ కోవెల విశిష్టమైనది.
7 వ శతాబ్దికి పూర్వమే కట్టిన అతి ప్రాచీనమైనది పాటలీశ్వరుని దేవాలయము.
ఉమాదేవి  1008 పుణ్యతీర్ధాలను దర్శించుకున్నది. ఈ పావనదేశమును చేరినది ఉమాదేవి.
పెద్ద పదిరి చెట్టు (పాటలీ తరువు) ఛాయలో వెలసి ఉన్న మహా శివ మూర్తిని ఆమె వీక్షించినది.
అచట భవుని మూర్తి ప్రతిష్ఠించబడినది.
పాటలీ పాదపము నీడలో ప్రభవించినందున "పాటలీశ్వర స్వామి" అని పేరు పొందాడు.
దేవాలయమునందు 5 సువిశాల నడవాలు ఉన్నవి. మే- జూన్ లలో వైకాశి నెలలో-
బ్రహ్మోత్సములు జరుగుతూంటాయి. ఐదవ కారిడార్ ని  "రాజ వీధి"
అనగా రాయల్ స్ట్రీట్ (royal street) అని పిలుస్తారు.

                   ************************;

పాటలీశ్వరుని దేవాలయము:-   ఈ క్షేత్రమున స్థల వృక్షము పాదిరి చెట్టు ( Pathiri Tree).
మధ్య నందన ఋషి గొప్ప పరమేశ భక్తుడు.
శివపూజకు పూసిన పుష్పాలను కోసుకోవడానికని-
పాదిరి చెట్టును ఎక్కడానికి - అ ఋషికి చాలా కష్ట సాధ్యమయేది.
పాటలీశుని అర్చనకై- ప్రతి రోజూ-
ఈ వ్యాయామము వంటి పని
క్లిష్టతరమవగా
"పాడలీసా! నాకు పులి కాళ్ళును ఇవ్వు" అని వేడాడు.
సత్వర వరానుగ్రహాన్ని పొందాడు. పులి పంజాలను పోలిన పాదములను పొంది,
పూజావిధులను నిరాటంకముగా సులువుగా చేసుకోగలిగాడు.
ఆ మహా ఋషి చరణ యుగములచేత -
"పులి"-  కూడా జత కలిసినది.
(Pathiri Tree); అటు తర్వాత వ్యాఘ్ర పాదములను వరముగా పొందినట్టి
Madyanandana Rishi పేరు కూడా జత ఐ,
ఈ ఊరికి - "తిరు పదిరి పులియూర్" అనే నామమును పొందినది.
నయనానందమును కలిగించే గుడి, పరిసరాలు ఉన్న ప్రదేశము  "Thirrupathiripuliyur".

ముఖ్య ట్యాగ్ పదములు:-
Thirupathiripuliyur in Cuddalore, Sri Padaleeswarar Temple

చెట్టు, పంజాలు- ఆ ఊరి పేరు ;

అనురాగ సదనము



రాధ హృదయం- రాగసదనం;
శ్రీ క్రిష్ణానురాగ  - నందనమ్మున
రాగసదనం రాధ హృదయం             ||

వేణురావ(ము) విశాల గగనము;
భావగీతులు ఇంద్రధనుసులు;
కన్నె కన్నుల భరిణలందున
విరియు వన్నెలు వీక్షణమ్ముల
                        అను రాగసదనము
                             రాధ హృదయము;       ||

నిరతమూ శ్రీ క్రిష్ణ యోచన, చింతన;
మరుని శరమున పూవుటమ్ములు
రతికి కురుల తావి ఎగయగ
తురుము మదనుడు తన్మయముతో
                   శ్రీ క్రిష్ణానురాగ  - నందనమ్మున
                        రాగసదనము  రాధ హృదయము"> || 

Wednesday, July 4, 2012

వకుళము- "పొగడ చెట్టు", 200 years old


వకుళము- అంటే "పొగడ చెట్టు".
ఈ పాదపమునకు పూచే పూలు పరిమళాలను వెదజల్లుతూ ఉంటాయి.
శ్రీ వేంకటేశుని పెంచిన జనని "వకుళ మాల",
సువాసనభరితములైన వకుళ మాలలను ధరిస్తుందని జన వాణి.
హిందీ, సంస్కృతాది భాషలలో "bakul" అని పేరు.
200 ఏళ్ళ నాటి చెట్టు ఈ ఫొటోలోనిది.

హుగ్లీ మండలములోని ( మిత్రబటి)అంత్ పూర్ మార్గములో ఒక చెట్టు ఉన్నది.
;
వకుళము / పొగడ చెట్టు
;
ఆ "బకుల్ వృక్షం" 
200 సంవత్సరాల వయస్సు ఉన్నదని అంచనా.

Antpur, Hooghly (Mitra Bati)  : link here!


*********************************,
ఆలయాలలో ఎక్కువగా-  "పొగడ చెట్లు" పెంచుతారు.

మంగళ గిరి మున్నగు పుణ్యక్షేత్రములలో శివరాత్రి ఉత్సాహ సందర్భములలో
(గంగా భ్రమరాంబా సమేతుడైన మల్లికార్జునస్వామి)
పరమేశుని పొగడ చెట్టు వాహన ఊరేగింపును భక్తులు నిర్వహిస్తూంటారు.