Tuesday, July 31, 2018

అది ఏమి పెద్ద విశేషమా!?

క్రిష్ణ లాస్య లాస, నాట్య గతులు ; 
దామినీ లయ జతులు ; 
జతగా - దామినీ లయ జతి గతులు; || 
;
నృత్య విన్యాసములకు ;
కదలికలు ప్రతి ఒక్కటి ;
పద న్యాసము విన్యాసము ;
రజతాద్రిని అచ్చెరువై ;
ఆది దంపతుల సౌరు ; || 
;
అమూల్యముగ లభియించెను ;
ఇంత కళా సంపద ;
అహం మరచి లీనమైతి ;
అది ఏమి పెద్ద విశేషమా!? ; || 
;
======================;
;
krishNa laasya nATya gatulu
daaminee laya gatulu ;
jatagaa - daaminee laya gatulu ;  ||
;
nRtya winyaasamulaku ;
kadalikalu prati okkaTi ;
pada nyaasamu winyaasamu ;
rajataadrini acceruwai ;
aadi dampatula sauru ;  || 
;
amuulyamuga labhiyimcenu ;
imta kaLA sampada ;
aham maraci leenamaiti ;
adi Emi pedda wiSEsha maa!? ;  ||

సరియైన సిరి హద్దు

చరణమ్మది ; 
మదిని హత్తు మంచి అచ్చు ;
చరణమిది శరణమొసగు - 
సిరి హద్దు ;
సరియైన సిరి హద్దు ; ||
;
చరణ యుగళ విన్యాసం ;
భరత శాస్త్ర లక్షణ 
సుమ దళముల 
మధు పుప్పొడి ; ||
;
క్రిష్ణ లాస నర్తనముల ;
అంది పుచ్చుకున్న ;
ప్రతి ఒక్కరు ధన్యులు ;
అందులోన నేను ఒకరు ; ||
=
caraNamidi SaraNa mosagu ;
siri haddu ; ; sariyaina siri haddu  ;  ||
;
caraNa yugaLa winyaasam ;
bharata SAstra lakshaNa ;
suma daLamula 
madhu puppoDi ;  ||
;
krishNa laasa nartanamula ,
amdi puccukunna ;
prati okkaru dhanyulu ;
amdulO nEnu okaru ;  || 
;
అందులోన నేను ఒకరు ; 

శ్రీకృష్ణ లాసనర్తనం

క్రిష్ణ లాస నర్తనం ;
అందె రవళి మనోజ్ఞం ; 
కనువిందుగ శ్రీక్రిష్ణ నర్తనం ;
శ్రీక్రిష్ణ నాట్య మనోహరం ; ||
;
అడుగు అడుగు తధిగిణ తోమ్ ;
చరణ యుగళ ఝణన ఝణన;
ఝణన ఝళన నాద రవళి 
ఝుమ్ ఝుమ్ ఝుమ్ ; ||
;
మువ్వంచుల ఝళం ఝళం ;
మువ్వొంపుల ఓమ్ కారం ;
క్రిష్ణయ్య మేని కదలికల వంపులు ;
ఒంపు వంపు సొంపులు ; ||
=
SreekrishNa laasa nartanam ;
amde rawaLi manOj~nam ; 
kanuwimduga SreekrishNa nartanam ;
SreekrishNa naaTya manOharam ;  ||
;
aDugu aDugu tadhigiNa tOmm ;
caraNa yugaLa jhaNana jhaNana;
jhaNana jhaLana naada rawaLi ;
jhumm jhumm jhumm ;  ||
;
muwwamcula jhaLam jhaLam ;
muwwompula Omm kaaram ;
krishNayya mEni kadalikala wampulu ;
ompu wampu sompulu ;  ||

దాగుడుమూత దండాకోర్

దాగుడుమూత, దండాకోర్ ; 
దాగుడుమూతలు, దోబూచి ; ||
;
గుట్టుగ ఒదిగి, ఎంచక్కా ; 
నక్కి నక్కి పొంచి చూస్తుండే ఆటల మేటి ;
అల్లరి పిల్లడు, ఇట్టే పట్టుకుందమా ;
తుంటరి క్రిష్ణుని ; నీల మణిని, 
మన మరకత క్రిష్ణయ్యని ; ||

అట్టే ఉన్నాడంటే ; 
ఇట అట ఇట ;
అటు ఇటు నటు ; 
నిగూఢముగ ఉన్న వాడు ; 
నటనాల క్రిష్ణుడే - అని ;
అంటావా, అంటున్నావా!? ; || 
;
అట్టే బొమ్మల్లే నిలిచి ; 
మనకు భ్రమలు కల్పిస్తాడు ; 
శిల్పమల్లె నిలుచుండి ; 
కనుమాయలు కల్పించి ; 
చటుకున ఎటనో 
మటుమాయం ఔతున్నాడిట్లా ; || 
;
అటు ఇటు నటు ; 
నటనాల క్రిష్ణుడటనే ...... 
ఔరా! ఆ పెను మాయ, 
మర్మ మెటుల తెలిసేది 
ఈ పట్టున తటాలున ; 
చెప్పగలవ, మిత్రమా! ; ||

హొంబట్టు చేలాంచలము

రహస్యాలు తెలుపమని ;
అణకువతో క్రిష్ణమ్మను ;
ముక్తాఫల మడిగేను ;  ||
;
ప్రార్ధనతో మౌక్తికము ;
డస్సి పోయినది చాలా ;
:
నీ నుదుట నుండి 
జారుతున్న "చెమట బొట్టు"ను ; 
శరణు వేడెను ;
ఆణి ముత్యం శరణు వేడెను ;  ||
;
అంత'అందం బొట్టు తనమును' ; 
తాను ఎటుల పొందగలనని ; 
ఆ కిటుకు చెప్పమన్నది ; 
ఆ గుట్టు కాస్త నుడువమనెను ;  ||
;
చక్కని ఆ ఊసును ;
చక చక్కని మర్మమును ; 
చెప్పమంటూ వేడుకుంటూ ; 
నీ హొంబట్టు చేలాంచలము పట్టి ; 
శరణు వేడెను మరి మరీ ;  || 
;

కృష్ణలీలలకు తూనిక రాళ్ళు

క్రిష్ణ లీలలను తూచే ;
తులాభారమందుంచే ;
తూకం రాళ్ళు ;
ఇవి తూనిక రాళ్ళు కాబోలు ;  ||
;
నిలువు నామము, 
ఊర్ధ్వ పుండ్రం ; 
దోస గింజ బొట్టునా, 
ఏది పెట్టమందువయ్య, క్రిష్ణా ;  ||

చిట్టి బొట్టు, చినుకు బొట్టు ; కమ్మనైన కస్తూరి బొట్టు ; 
ఈ తూరి ఏమి బొట్టు పెట్టమందువు!? త్వరగ చెప్పుము ; 
త్వరితముగా చెప్పవయ్యా ; బెట్టు చేయక చిన్ని క్రిష్ణా ;  ||
;
ఉంగరమ్ము వేలు తోటి పెట్టమన్నావు ; 
కాదు, కాదు - చూపుడేలును చూపమనంటివి ; 
వద్దు వద్దని, ముద్దుగాను ; 
చిన్ని వేలుతొ పెట్టమందువు ; 
ఔర క్రిష్ణా, ఇంత అల్లరి ;  ||
;
=============; ; 
;
krishNa leelalanu tUcE ; 
tulaabhaaramamdumcE ; 
tuukam raaLLu  ;
iwi tuunika raaLLu kaabOlu ;  ||
;
niluwu naamamu ;
uurdhwa pumDram ; 
dOsa gimja boTTunaa, 
Edi peTTamamduwayya, krishNA ;  ||
;
ciTTi boTTu, cinuku boTTu ; 
kammanaina kastuuri boTTu ; 
ee tuuri Emi boTTu peTTamamduwu!? 
twaraga ceppumu ; 
twaritamugaa ceppawayyaa ;
beTTu cEyaka cinni krishNA ;  || 
;
umgarammu wElu tOTi peTTamannAwu ; 
kaadu, kaadu - cuupuDElunu cuupamanmTiwi ; 
waddu waddani, muddugaanu ; 
cinni wEluto peTTamamduwu ; 
aura krishNA, imta allari ; 

మరకత మణి జిగేల్ జిగేల్

మరకత మణి జిగేల్ జిగేల్ ;
సుధా మధుర మకరందం ;
మాధుర్యానంద గాధ ; 
క్రిష్ణ హేల ; 
జగత్ క్రిష్ణ హేల ; || 
;
తీపి తీపి పుప్పొడుల ;
పూర్ణ కలశమిది ఇదియే , 
వ్రేపల్లియ ;
ఇది మన వ్రేపల్లియ ; ||  
;
===========; ;
;
marakata maNi jigEl jigEl ;
sudhaa madhura makaramdam ;
maadhuryaanamda gaadha ; 
krishNa hEla ; 
jagat krishNa hEla ; || 
;
teepi teepi puppoDula ;
puurNa kalaSamidi idiyE , 
wrEpalliya ;
idi mana wrEpalliya ; ||  

Monday, July 30, 2018

విశ్వమంత వ్రేపల్లె

చెమ్మ చెక్క చెమ్మ చెక్క  ; 
అతివలందరి ఆట ఇట ; 
యమున ఒడ్డు వేదికంట ;; 
ఆ కంట ఈ కంట ; 
రాధిక వెదజల్లిన పూ తావియట ;
అట -
వెదజల్లిన పువుల మధుతావి ;  || 

లేమల లేచేతులందు ; 
లేత తమలపాకు ;
లేత తమలపాకులందు పోక చెక్కలు ; 
సున్నమెక్కువైనదంట ; 
ముద్ద వెన్న - అక్కర ఇట ; 
ముద్దు ముద్దు - 
ముద్ద వెన్న - అక్కర ఇట ;  ||
;
రమణీ వర్తులముల రాసలీలలు,  
కోటి రాసలీల కోటలిటను ; 
గగనములను ముట్టినవట ; 
వ్రేపల్లెలోన ఇంటింటా ; 
క్రిష్ణ రాధ గాధలే ; 
విపుల విశ్వమిప్పుడు 
రేపల్లెగ ఆయెనంట ;  || 

=====================; ;

cemma cekka cemma cekka  ; 
atiwalamdari ATa iTa ; 
yamuna oDDu wEdikamTa ;; 
aa kamTa ee kamTa ; 
raadhika wedajallina puu taawiyaTa ;
aTa -
wedajallina puwula madhutaawi ;  || 

lEmala lEcEtulamdu ; 
lEta tamalapaaku ;
lEta tamalapaakulamdu pOka cekkalu ; 
sunnamekkuwainadamTa ; 
mudda wenna - akkara iTa ; 
muddu muddu - 
mudda wenna - akkara iTa ;  ||
;
ramaNI wartulamula raasaleelalu,  
kOTi raasaleela kOTaliTanu ; 
gaganamulanu muTTinawaTa ; 
wrEpallelOna imTimTA ; 
krishNa raadha gaadhalE ; 
wipula wiSwamippuDu 
rEpallega aayenamTa ;  || 
;
- wiSwamamta wrEpalle ;

కస్తూరి అగరుల లేపనములు

చెన్నకేశవుని మేన మైపూత పూయండి ;
సుగంధ ద్రవ్య సమ్మేళనమ్ములను ;
రంగనాధునికి - మన శ్రీరంగనాధునికి ;  || 
;
కస్తూరి అగరుల లేపనములలమండి ;
ఓ లలనలారా, లాలిత్య లాలనగ - 
కస్తూరి రంగనికి - మన కావేరి రంగనికి ;  || 
;
చెంగల్వ కోష్టమ్ము కడిని పూయండి ; 
చిలిపి తనముల బంగారు చెలులార ; 
చెలువముగ పూయండి ;
చెంగలువ రేకుల ముద్దను ; 
చెన్నకేశవునికి - మేన చెన్నకేశవునికి ;
;
కావేరి రంగడు, మన శ్రీరంగశాయి ;
చెలువార చనువుగా స్నానాలు చేయగా ;
నది నీట  పునుగు, జవ్వాది ;
ద్రవ్యాల పరిమళము వ్యాపింప .......  ;
కావేరి నది నీట పరిమళము వ్యాపించగా ; 
మదను ధనువున - పువులు వికసించును ;  || 
=====================; ;
;
cennakESawuni mEna maipuuta puuyamDi ;
sugamdha drawya sammELanammulanu ;
ramganaadhuniki - mana Sreeramganaadhuniki ;  || 
;
kastuuri agarula - lEpanamulalamamDi ;
O lalanalaaraa, laalitya laalanaga - 
kastuuri ramganiki - mana kaawEri ramganiki ;  || 
;
cemgalwa kOshTammu kaDini pUyamDi ; 
cilipi tanamula bamgaaru celulaara ; 
celuwamuga pUyamDi ;
cemgaluwa rEkula muddanu ; 
cennakESawuniki - mEna cennakESawuniki ;
;
kaawEri ramgaDu, mana SreeramgaSAyi ;
celuwaara canuwugaa - snaanaalu cEyagaa ;
nadi neeTa  punugu, jawwaadi ;
drawyaala parimaLamu wyaapimpa .......  ;
kaawEri nadi neeTa parimaLamu wyaapimcagaa ; 
madanu dhanuwuna - puwulu wikasimcunu ;  || 
;

కృష్ణ పదములు - ఉయ్యాల గొలుసులు

మా ఎడదల డోలలివే ;
ఉయ్యాలలు ఊగుమోయి ;
నటన సూత్రధారీ క్రిష్ణయ్యా ; ||
;
పెదవులపై పదములు ;  
డోల త్రాళ్ళు ఆయెను ;
పద సంపద చేరి చేరి ; 
కృష్ణాకృతి ఆయెను ; 
నవ్య కృష్ణ కృతులు ఆయెను ; ||
;
చిన్ని చిన్ని తేనెల - 
పలుకులన్ని ఇవియే కద ;
మధువు మాట కావ్యాలై ;
నడచు క్రిష్ణ పధమున ; ||
;
నెలవంక డోల నీకు ;
అమరిస్తిని కన్నయ్యా ;
నాదు పదము కీర్తనలు ;
అందు మెత్త పరుపులు ; ||
;
యశోదమ్మ "అయ్యారే" 
అనుచు, సంభ్రమించునటుల ; 
ఉయ్యాలలు ఊగుమోయి ;
;
మా ఎడదల డోలలివే ;
ఉయ్యాలలు ఊగుమోయి ;
నటన సూత్రధారీ క్రిష్ణయ్యా ; || 

pedawulapai padamulu ;  
DOla traaLLu aayenu ;
pada sampada cEri cEri ; 
kRshNaakRti aayenu ; ;
nawya kRshNa kRtulu aayenu ; ||
;
cinni cinni tEnela - 
palukulanni iwiyE kada ;
madhuwu maaTa kaawyaalai ;
naDacu krishNa padhamuna ; ||
;
nelawamka DOla neeku ;
amaristini kannayyaa ;
naadu padamu keertanalu ;
amdu metta oarupulu ;
yaSOdamma "ayyArE" anucu ;
sambhramimcunaTula ; 
uyyaalalu uugumOyi ;
maa eDadala DOlaliwE ;
naTana suutradhaaree ; 

యమున నీట కొత్త ముగ్గులు

వింత  వింత ముగ్గులు ; వింత కొత్త ముగ్గులు ; 
యమున నీలి నీటి పైన ; చిత్రించిన క్రిష్ణ లీల ; 
చిత్రంగా చిత్రించిన క్రిష్ణ లీల ;  || 
;
ఒకరిపైన ఒకరు ;  పరస్పరం పరిహాసం ; మోదముల తపతపలు ;
మిన్ను ముట్టె నీటి జల్లు ; ........ నీళ్ళు నీళ్ళు జల్లులు ;
మిన్ను ముట్టె కేరింతలు ; ........ కిలకిలల కేరింతలు ;
ప్రకృతి నిలువెల్ల ; పులకింతల ఝల్లుమనె ;  ||  
;
భామినులు జలములందు ; 
గుండ్రంగా తిరిగేరు ;
'రాసక్రీడ' - ముద్దు ; 
'రాసలీల' - ముగ్గు ;
వర్తులముల ఆట ; 
వలయాల వెలసేను ; 
వింత కొత్త ముగ్గులు ; 
సూర్య కాంతి, చంద్ర జ్యోత్స్న ; 
జల గీతల మెరసెను ; 
లయల హొయల మెరసేను ;  ||  

నేలపైకి దిగగానే, కన్నయ్య అమ్మ కూచి

చిలిపి చిలిపి చిలిపి క్రిష్ణుడు ;
అల్లిబిల్లి ఆటలు ;
అందరికీ నేర్పుటలో ;
తన కన్న మిన్న ఎవరు? ;  ||
;
కడవలలోమీగడలు ; 
ఉట్ల పైన వెన్నలు ; 
చిక్కనైన పాలు, జున్ను  ;
అందుకునే తుంటరి - 
పట్టబోతె చిక్కడు ;
ఇట్టి ప్రజ్ఞ ఎటుల కలిగె -
ఈ చిలిపి క్రిష్ణమ్మకు ;  ||
;
చెట్లు, పొదల మాటున ; 
నక్కి నక్కి దాగేటి ;
ప్రజ్ఞ వీని సొమ్ము సుమీ ;
కొమ్మలలో రెమ్మలలో ; 
ఒదిగి ఆట దోబూచి ; 
నేలపైకి దిగగానే ; 
కన్నయ్య అమ్మ కూచి ;  || 
==================;  ;
;
cilipi  cilipi  cilipi  cilipi krishNuDu ;
allibilli ATalu ; andarikee nErpuTalO ;
tana kanna minna ewaru? ;  ||
;
kaDawalalO meegaDalu ; 
uTla paina wennalu ; 
cikkanaina paalu, junnu ;
amdukunE tumTari - 
paTTabOte cikkaDu ;
iTTi prajna eTula kalige -
ee cilipi krishNammaku ;  ||
;
ceTlu, podala maaTuna ; 
nakki nakki daagETi ;
prajna weeni sommu sumee ;
kommalalO remmalalO ; 
odigi ATa dObuuci ; 
nElapaiki digagAnE ; 
kannayya amma kuuci ;  || 

కేరింతలు శతకోటి దొరికెను

చిరు అలకల క్రిష్ణయ్యా ;
కినుక మాని రావయ్యా! ;  ||
;  
నగుమోము ఇట్లాగ ; 
డీలా ఐతే ఎట్లాగ!? ; 
చిన్నబోవును వ్రేపల్లె ;
మన వ్రేపల్లె ;  ||
;
డజను వేడుకోళ్ళు ; 
పాతికల ప్రార్ధనలు ;
నీకోసం - 
డజను వేడుకోళ్ళు ; 
పాతికల ప్రార్ధనలు ;
ఆ పైన మాకు దొరుకు ;
వేడుకలు లక్షలాది ; 
కేరింతలు శతకోటి ;  ||

కిలకిలలకు మెలకువలు ; 
కువకువలకు కిలకిలలు ;  
దశదిశలును తోటలయె ; 
కిలకిలల కళకళలు ;  ||
;
=====================; ;
;
ciru alakala krishNayyaa ;
kinuka maani raawayyaa! ;  ||
;  
nagumOmu iTlaaga ; 
Deelaa aitE eTlAga!? ; 
cinnabOwunu kada wrEpalle ;
mana wrEpalle ;  ||
;
Dajanu wEDukOLLu ; 
paatikala praardhanalu ;
neekOsam - 
Dajanu wEDukOLLu ; 
aa paina maaku doruku ; 
paatikala praardhanalu ;
wEDukalu lakshalaadi ; 
kErimtalu SatakOTi ;  ||

kilakilalaku melakuwalu ; 
kuwakuwalaku kilakilalu ;  
daSadiSalunu tOTalaye ; 
kilakilala kaLakaLalu ;  ||
;

కృష్ణ పద పారాయణం

కృష్ణ కృష్ణ పదమెప్పుడు ; 
నిత్య పారాయణం ;
కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ ; 
పదమెప్పుడు ;
నిత్య పారాయణం ;  ||
;
కృష్ణ పదము హత్తుకునే ;
గాలితెరల కనుగొనేటి ;
భక్తులకిది వేడుక ;
సమ్మోదపు వేడుక ;  ||
;
భక్తిపూర్ణ మానసముల ;
ప్రతిధ్వని నిరంతరం ;
అనుక్షణము అధరములకు -
ఆ మాటే  వాడుక ;
నిత్య వాడుక ;  ||
;
==============; ;
;
kRshNa kRshNa padameppuDu ; 
paaraayaNam ; 
nitya paaraayaNam ;
kRshNa kRshNa kRshNa kRshNa 
padameppuDu ; 
nitya paaraayaNam ;  ||
;
kRshNa padamu hattukunE - ;
gaaliterala kanugonETi ;
bhaktulakidi wEDuka ;
sammOdapu wEDuka ;  ||

bhaktipuurNa maanasamula ;
pratidhwani niramtaram ;
anukshaNamu adharamulaku ;
aa maaTE  wADuka ;

nitya wADuka ;  ||
;

Saturday, July 28, 2018

శ్రీక్రిష్ణ ఉవాచ - శ్రీవాణి రాయంచ

క్రిష్ణ వాక్య సంపద ;
శ్రీక్రిష్ణ ఉవాచ సదా ; 
శ్రీవాణి రాయంచ కదా ; ||
;
పాలు, పాడి కోరినంత - 
ఇచ్చు- కామధేనువులు ;
గోమాతలు మన వేల్పులు ;
కొంగు బంగారము క్రిష్ణుని నుడువు ; 
క్రిష్ణ ఉవాచ - ఇది శ్రీక్రిష్ణ ఉవాచ ; ||
;
కొండ మనకు నీడనిచ్చె ;
నీడ నిచ్చు మన ఊరి -
గోవర్ధన - గిరియె మనకు వేలుపు ;
కొంగు బంగారము - క్రిష్ణుని పలుకు ;
క్రిష్ణ ఉవాచ - ఇది శ్రీక్రిష్ణ ఉవాచ ; ||

=============================;
;
krishNa waakya sampada ;
SreekrishNa uwaaca sadaa ;

SreewANi raayamca kadaa ;  || 
;
paalu, pADi kOrinamta ; 
iccu kaamadhEnuwulu ;
gOmaatalu mana wElpulu ;
komgu bamgaaramu - krishNuni nuDuwu ;

krishNa uwaaca - idi SreekrishNa uwaaca ;  ||
;
komDa manaku neeDanicce ;
nIDa niccu  mana uuri  ;
gOwardhana - giriye manaku wElupu ;
komgu bamgaaramu -  krishNuni paluku ;

krishNa uwaaca - SreekrishNa uwaaca ;  ||
;

సుగంధ పుప్పొడి

కళ్యాణి పల్లకీ లలన మానసము ;
కళ్యాణ కారకం క్రిష్ణుని ఊసులు ;   || 
;
సుమవని రమణీ హృదయమ్మే! - 
బృందావనికిది సురభిళ సంపంగి ;

కృతి ఒసగిన సుగంధ పుప్పొడి, 
ఓహో, ఓహో, ఓహోహో ;   || 
;
బృందావనికి నృత్యాశీస్సులు ;
సృష్టి సారంగి  దీవెనలు ; 
విరాళి మధురం మురళీ రవళి ;
ఓహో, ఓహో, ఓహోహో ;   ||  ;

సుగంధ పుప్పొడి

కళ్యాణి పల్లకీ లలన మానసము ;
కళ్యాణ కారకం క్రిష్ణుని ఊసులు ;   || 
;
సుమవని రమణీ హృదయమ్మే! - 
బృందావనికిది సురభిళ సంపంగి ;

కృతి ఒసగిన సుగంధ పుప్పొడి, 
ఓహో, ఓహో, ఓహోహో ;   || 
;
బృందావనికి నృత్యాశీస్సులు ;
సృష్టి సారంగి  దీవెనలు ; 
విరాళి మధురం మురళీ రవళి ;
ఓహో, ఓహో, ఓహోహో ;   ||  ;

వేణువింత చిన్నది - రవళికింత శక్తి!

నమో నమో కృష్ణ కృష్ణ మురళీ కృష్ణ ;
వేణురవమదే - సుధా సమానం ;  || 

అడుగడుగున ఓమ్ కారం ; 
వేణు గాన రస ధ్యానం ; 
బృందావన ధామం ; 
అను నిత్యం అభిషిక్తం ;  ||
;
దిశలన్నియు డోలలుగా ;
చిరు మురళీ గానములు ;
ఊగాడును, తూగాడును ;
జగతి పారవశ్యాలు ;  ||
;
వేణువింత చిన్నది ;
రవళికింత శక్తియా!?
ఎల్ల ప్రకృతి దాసోహం ;
భక్తి పొందు సమ్మోహం ;  || 
;
నమో నమో మురళీ కృష్ణ ;
\\\\\\\\\\\\\\\\\\\\\\
             sudhaaraagamu  ;  ;
=================;
;
namO namO muraLI kRshNa ;  
wENurawamadE - sudhaa samaanam ;  || 

aDugaDuguna Omm kaaram ; 
wENu gaana rasa dhyaanam ; 
bRmdaawana dhaamam ; 
anu nityam abhishiktam ;  ||
;
diSalanniyu DOlalugaa ;
ciru muraLii gaanamulu ;
uugaaDunu, tuugaaDunu ;
jagati paarawaSyaalu ;  ||
;
wENuwimta cinnadi ;
rawaLikimta Saktiyaa!?
ella prakRti daasOham ;
bhakti pomdu sammOham ;  || 
;
namO namO muraLI kRshNa ;   

పద యుగళ చిత్రాలు - వింత!

వేణువింత చిన్నది ;
రవళికింత శక్తియా!?
;
వింత ఎంత కొలువగలను!? ;
నీ గాన సుధా మాధురిని ; 
గానలోల నీ గాన సుధా మాధురిని ; ||
;
క్రిష్ణ, పదములింత చిన్నవి ;
పెను నాగు పడగలపై ; 
అరుణ పద్మ చిత్రాలను ;
అచ్చు వేసె, నెంత వింత!? ;
;
వింత ఎంత కొలువగలను!? ;
నీ గాన సుధా మాధురిని ; 
గానలోల నీ గాన సుధా మాధురిని ; ||
;
క్రిష్ణ నడుము ఇంత చిన్నది ;
కోపించిన జనని కట్టె ;
బంధనముల రోలు లాగి ;
పెను మద్దుల కూల్చె వింత ;
;
వింత ఎంత కొలువగలను!? ;
నీ గాన సుధా మాధురిని ; 
గానలోల నీ గాన సుధా మాధురిని ; ||
;
===========================; ;
;
wENuwimta cinnadi ;
rawaLikimta Saktiyaa!?
wimta emta koluwagalanu!?  ||
;
krishNa, padamulimta cinnawi ;
penu naagu paDagalapai ; 
aruNa padma citraalanu ;
accu wEse, nemta wimta!? ;  ||
;
krishNa naDumu IMTA cinnadi  ;
kOpimcina janani kaTTe ;
bamdhanamula rOlu laagi ;

penu maddula kuulce wimta ;  ||
;

ఓమ్ కార జలఘోష

కాళింది నది జనని ;  
అందుకో హారతి ;  ||
;
నీలాంబర చుంబితం కాళింది కెరటాలు ;
నీల మేఘ శ్యామ - వినీలోత్పన్నం విరాళి ; 
ఉవ్వెత్తు ఉవ్వెత్తు ఉరికే తరంగములు ;
అలల శంఖాలన్ని చేరె అవనీ పతిని ;
ఓమ్ కార జలఘోష - సమ్మిళిత వ్యాహ్యాళి ;  ||
;
అవధి అన్నది లేని శ్రీక్రిష్ణ నాట్యాలు ;
మోహనం ధవళిమ - తరళతల అరుణిమ ;
ఎగసెగసి ఎగసెగసి చరణోత్పలం ధూళి ;
ఆదిశేషుని రూపు ఆకట్టుకొను జగతి  ;
వాణికి అందినది వర మురళి రసకేళి ;  ||
;
కాళింది నది జనని ;
అందుకే హారతి ;
అందుకో అందుకో అందుకో హారతి  ;  || 
;
===========================; ;
;
kaaLimdi nadi janani ;

amdukO haarati ;  ||
;
neelaambara cumbitam kaaLimdi keraTAlu ;;

neela mEGa SyAma wineelOtpalam wirALi ; ;
uwwettu uwwettu urikE taramgamulu ;
alala SamKAlanni ;
awanipati cErinawi ;

Omm kaara jala ghOsha sammiLita wyaahyaaLi ;
;
awadhi annadi lEnidi Sree krishNa nATyaalu ;
mOhanam dhawaLima - taraLatala aruNima ;

egasegasi caraNOtpalam dhuuLi ;
Adi SEshuni ruupu aakaTTukonu jagati ; 
wANiki amdinadi wara muraLi rasakELi ;
;
 kaaLimdi nadi janai ;
amdukE haarati  ;

amdukO amdukO amdukO haarati ;  ||

ప్రేమికా శిల్పిక

పదములన్ని తొణికించును ; 
పెను - అనురాగ భావముల ;
పదములన్ని తొణికించును ;  ||  
;
పలు మమతానురాగ ;
భావములను చిలికించును రాధిక ;
చిలకరించేను క్రిష్ణ ప్రేమిక  ;  ||  
;  
లోహ పదములను -
ఇరుమారు ముమ్మార్లు 
- పుటం పెట్టి - సానబట్టి ;
పసిడి ప్రతిమ గీతిగా మలిచి ;
నిలిపినది- రాధిక - ప్రేమికా శిల్పిక ;  || 
;
ప్రణయాలయ అర్చిణి* ; 
రాధమ్మా!
నీదు పెదవిని మృదు వాణి, 
చలువ రాయి వేదిక ; 
పేర్చుమా ఇవ్వుమా ;
వినూత్న శశి వెన్నెల వేదిక ;  || 
;
అర్చిణి* ;  = స్త్రీ - అర్చన + ; అర్చకురాలు ;
===============;
;

palu mamataanuraaga ;
bhaawamulanu cilikimcunu raadhika ;
cilakarimcEnu krishNa prEmika ; 
;
lOha padamulanu ; irumaaru mummaarlu ;
puTam peTTi - saana baTTi ;
pasiDi pratima geetigaa malici ;
nilipinadi- raadhika - prEmikaa Silpika ;
;
praNayaalaya arciNi* ; 
raadhammaa!
needu pedawini mRdu wANi ;
caluwaraayi wEdika ; 
pErcumaa iwwumaa ; 
winuutna SaSi wennela wEdika ;  ||
;
arciNi* ;  = stree - arcana + ; 

భావ రధము అపూర్వం

మమత తీరు ఇదేలే ;
దాని తీరు తెన్ను అంతేలే ;  ||
;
క్రిష్ణ రాధ ప్రియ జగతి ;
పదముల గతి - భావ గీతి ;
ఈ తూరి,  మరో తూరి ;
ఎన్నిసార్లు నుడివినా ;
మమత తీరు ఇదేలే ;
దాని తీరు తెన్ను అంతేలే ;  ||

భావ రధము అపూర్వం ;
అనురాగం సారధి ;
మునుముందుకు సాగేటి ;
త్వరిత తురగ వల్గనం ;
మమత తీరు ఇదేలే ;
దాని తీరు తెన్ను అంతేలే ;  ||

గమనమ్మనితర సాధ్యం ;

ప్రణయ మహిమ శక్తికి ;
ఆ వేగం అతి సాక్ష్యము ;
బహుళ ప్రబల సాక్ష్యము ;
మమత తీరు ఇదేలే ;
దాని తీరు తెన్ను అంతేలే ;  ||  

చెప్పరాని అల్లరికి పదవల్లరి

ఎంతెంతో అల్లరి ; 
పదే పదే చెప్పరాని అల్లరి ;
హరి హరీ,
ఇది - క్రిష్ణ లీలల లహరి ;  ||

ప్రాణేశుని మనోరధం ;
ఈడేరెడు పదవల్లరి ; 
రాధా - అధరమ్ముల మాటున ; 
చేయుచుండె అల్లరి ; 
హరి హరీ ;
ఎంతెంతో అల్లరి ;  ||
;
అనురాగ భావ జగతి ;
స్ఫటిక ప్రణయ ఆకృతి ;
రాధికా సంస్కృతి ;
యుగ ప్రబంధ సత్కృతి ;
సరి, సరి ;
కవి కలములకిదియె ఆస్థి ;  ||
=
emtemtO allari ;
padE padE cepparaani allari ;
hari haree,
idi /krishNa leelala lahari ;  || [+ amtaa] ;;;;;;;

prANESuni  manOradham ;
eeDEreDu padawallari ; 
raadhaa adharammula mATuna ; 
cEyucumDe emtemtO allari ; 
hari haree ;
emtemtO allari ;  ;  ||
;;  ;
anu;raaga bhaawa jagati ;
sphaTika praNaya aakRti ;
raadhikaa samskRti ;
yuga prabamdha satkRti ;
kawi kalamula kidiye aasthi ;  ||

లెక్కపెట్టగలమా శ్రీకృష్ణలీలలు

ఇన్ని ఏల, లెక్కలేల, 
ఏ వేళనైన లెక్కపెట్టగలమా ; 
క్రిష్ణయ్యా, నీ లీలలు ;  ||  

గోవర్ధన గిరిని నీదు కొనగోటి పైన ;
కుదురుగ్గా  నిలిపి గొడుగు చేసి ;
భద్రముగా కాపాడిన నీ చాతుర్యం అచ్చెరువు ; 
ప్రజలందరిని వైనంగా; 
కాపాడిన చాతుర్యం అచ్చెరువు ;  ||  
;
గీతాచార్యుడివి ఐనా ; గానలోలుడివి ఐనా ; 
లాస నర్తనా నిపుణుడివే ఐనాను ; 
నీదు ముగ్ధ మోహనాల నవ్వు ; 
అవే చాలు కోటి విలువ ; 
ఇన్ని ఏల, లెక్కలేల, 
లెక్కపెట్ట గలమా క్రిష్ణయ్యా, నీ లీలలు ;  || 

మాటలకు మౌన ముద్ర

మనసిచ్చి మాటాడు మగువ 
ఇపుడు ఇంత ;
మౌన ముద్ర పట్టెనేమేమి!?
కినుక కింత కానుకా!?
చాలు చాలునో రాధా! ;  ||
;
పెదవి గొడుగు నీడలందు ; 
తల దాచుకున్నాయా ;
మాటలు తల దాచుకున్నాయా ;
కినుక కింత కానుకా!?
చాలు చాలునో రాధా! ;  ||
;
నిశ్శబ్దం, మౌనములను ;
మోసి మోసి పెదవులు ;
అలసిపోవునో ఏమో, 
;
= నిశ్శబ్దం, మౌనములను ;
ఈ పగిదిని మోసి మోసి ;
తన కోమల పెదవులు 
అలసిపోవునో ఏమో, 
కినుక కింత కానుకా!?
చాలు చాలునో రాధా! ;  ||
;
మాటలకు మౌన ముద్ర ;