Thursday, April 23, 2009

అదిగో! ఆనంద ధామం!

అదిగో! ఆనంద ధామం!


నిర్మల తేజో రూపం 
నిఖిలానంద దీపం 
సన్నుత పరమార్ధ లాసం 
సంహిత శక్తి విలాసం! 

అను పల్లవి 

శ్రీ వేంకట వల్లభ రూపం 
సుస్వర ఆహ్లాద ధామం! 

1)ఎగుడు దిగుడు, మిట్టలు, పల్లాలు 
రాయిరప్పలు, కొమ్మలు తుప్పలు 
అసలే అంతంత మాత్రం! 
ఈ రీతిగ త్రోవలు, బాటలు నేస్తం! 
అయినా ఆపకు నీ గమనం! 

2)గజగజ మంచులు, మిడిమిడి ఎండలు 
జడిజడి వానలు, కుండలపోతలు ! 
అసలే అంతంత మాత్రం! 
ఈ సరళిగ వాతావరణం! 
అయినా దృష్టి మరల్చకు నేస్తం! 

3)దడదడ, గడబిడ, వజవజ వణుకులు 
అటు నిటు తమసున తారట్లాటలు! 
అయినా వీడకు పట్టును మిత్రం! 
మన గమ్యం సన్నిధానం 
అదిగో! ఆనంద ధామం! 

Views (105)

No comments:

Post a Comment