Tuesday, October 25, 2011

దీపావళి దేవికి ఇష్టమైన రాగాలుదీపావళి దేవికి
ఇష్టమైన రాగాలు
టపాసుల మోతలు
బాణసంచా ధ్వనులు
;
దీపావళి దేవికి
ఇంపైన గీతాలు
ఇష్టమైన రాగాలు
||ఇవే! ఇవే! ఇవేనండి! ||
;
కాకర పూ కడ్డీలు
వెన్నముద్ద తెలికాంతులు
సర్రుమని నింగిలోకి
దూసుకెళ్ళే రాకెట్లు
||ఇవే! ఇవే! ఇవేనండి! ||
;
  వాడ వాడలన్ని
ప్రభల చిత్రలేఖనలు
ఆడ ఈడ అన్ని చోట్ల
అల్లుకునే వెలుగులు ;                                         ||ఇవే! ఇవే! ఇవేనండి!                                             ఇవే! ఇవే! ఇవేనండి! ||


  rachana: కాదంబరి

దీపావళి దేవికి ఇష్టమైన రాగాలు (Link 1:- Newaavakaaya - WEB)

జాబిల్లి తడబాటు (Link 2 :-"konamanini"- My Blog)


ఘనమైన దీపావళి (Forkids- WEB)Member Categories  - బాల


&&&&&&&&&&&&&&


Written by kusuma
Tuesday, 25 October 2011 05:06
ఇవే! ఇవే! ఇవేనండి!
Happy Deepavali
;

బొమ్మలు


toys- socks / wool 

;
బూట్స్ సాక్సు తో చేసిన 
చిట్టి చిట్టి బొమ్మలు; 
చూడండి. 
ఎప్పుడైనా చేయాలనిపిస్తే, 
ది ఒక ఐడియా కోసరమన్నమాట.


   Wool బొమ్మలు (Link)
;

Saturday, October 22, 2011

మాండలే Tree


big tree in Mandalay


మాండలే పేరు- బాలగంగాధర తిలక్ 
ఆరు సంవత్సరాలు ఖైదీ గా నిర్బంధం లో ఉన్న చెరసాల -
బ్రిటీష్ పాలిత దేశంలోని "మాండలే జైలు"ను
గుర్తుకు తెస్తుంది కదూ!!???????
ఈ పెద్ద చెట్టు మాండలేలో ఉన్నది.
ఈ బిగ్ ట్రీ వ్రేళ్ళను గమనించండి.
పిల్లలు కూర్చుని ఆడుకుంటున్నట్లుగా రూపు దిద్దుకున్న
ఆ వైనాన్ని ఎంజాయ్ చేయండి.

key words:-
Mingun, Mandalay, బిగ్ big tree in Myanmar

Sunday, October 16, 2011

ముల్లోకములకు పారవశ్యము


మంజుల వాణీ! శార్వాణీ! 
పినాక పాణి, హృదయ రాణివి!
అమ్మా!
నీ ఒడిలోన  
ముల్లోకములు మైమరచేను!   ||       


అమ్మా! 
నీ తమాల పల్లవ కటాక్ష దృక్కుల 
ముల్లోకములు మైమరచేను!   ||

తుషార మౌక్తిక ధవళ కాంతులు/ లను ;  
నిండిన చల్లని దరహాసములందున  ;
ముల్లోకములు మైమరచేను!   || 


(ఎల్ల లోకములకు పారవశ్యము )
;

మరువపు వరముల పరిమళములు
 ;;                          ప్రణవ సరసున అనుక్షణమును 
ఓలలాడు కేళీ హంసవు! మా అమ్మా!  గౌరీ!
తొణుకులాడును మా మానసముల 
నీ స్పర్శతొ పావనమైన జలములు  ||       


గాంధర్వ గానముల లాహిరిగా;
సౌందర్య వర్ణముల ఇంద్ర ధనువుగా
ప్రతి కెరటము ఎగయగ ఉల్లాసముగా 
మనసులు మానస సరోవరమ్ములే! ||తొణుకు||


ఈ మరువపు వరముల గుబాళింపులు
రంగరించిన అగరు పన్నీరులు
నిండుట  భక్తుల హృదయములు         
నీ చల్లని చూపుల అనుగ్రహమ్ములే!   ||తొణుకు||


( మా మనసులు నిండుట
        నీ అనుగ్రహము )

నిత్యము నీకు ముత్యపు హారతి!


సత్యము నిలిపే జగజ్జననివి!
నిత్యము నీకు ముత్యపు హారతి 
ఆరాధనలివె! గైకొనుమమ్మా!  ||  


కాత్యాయని! జననీ! కరుణార్ద్ర వర్షిణీ!  
పూర్ణ చంద్రికా విరాజ మానిని!
ఆరాధనలివె! గైకొనుమమ్మా!  ||


గాన విలాసిని! రాగ రూపిణీ!
మీన నేత్రి! శ్రీ విద్యాధికారిణీ!
                                                        ఆరాధనలివె! గైకొనుమమ్మా! ||
;

మాణిక్య వీణను సవరింపుమా!


మాణిక్య వీణను సవరింపుమా!
మా తల్లి! కామాక్షి!
అణువణువు ఈ విశ్వమే హర్షమై,
జల తరంగిణీ రాగ హేలోజ్జ్వలముగా
ఉప్పొంగుతూ పులకించగా   ||

శత కోటి సన్నుతులు వెల్లువలుగా
సతతమ్ము వెన్నెలలు జాల్వారగా
మా గళములే స్వర్ణాలయములై
శోభిల్లు మణి ద్యుతులు ఇవె! అందుకోవమ్మ!  ||

తరళాక్షి! శ్రీ చక్రసంచారిణీ!
సుర పూజితా! నీరద నీల వేణీ!
జిత మదన పరమేశు ప్రియ భామినీ!
రాజిల్లు అర్చనలు అందుకోవమ్మా!  ||
;
(మా గళ హేమ ఆలయములు)
;


'ఓమ్'కార మరాళీ!


ఇందు శేఖరుని ప్రియ పత్నీ!
ఆనంద దాయినీ! భగవతి! దేవీ!
పొందికగా మా పూజలందుకో!  || 

నంది వాహనుని మనోహారిణి!
మంద గామినీ! గగన దామినీ!
పొందికగా మా పూజలందుకో!  || 

హంస గామినీ! కళ్యాణీ!
త్రిభువన రాజ్ఞీ! శ్రీ మాతా!
పొందికగా మా పూజలందుకో!  ||  


$$$$$$$$$$$$$$$$$$$$$$$$iMdu SEkharuni priya patnI!
aanaMda daayinI! bhagavati! dEvI!
maa pUjalaMdukO!   ||

naMdi vaahanuni manOhaariNi!
maMda gaaminI! gagana daaminI!
poMdikagaa maa pUjalaMdukO! ||

haMsa gaaminii! kaLyaaNI! ;  
tribhuvana kaariNi! SrI maataa!
poMdikagaa maa pUjalaMdukO! ||


;

మృదు దామిని! దుర్గా!


పావని! దుర్గా! హేమ ఖచిత సింహాసని! జననీ!
జయ హారతులను గైకొనుమమ్మా! ||


జీవనదాయిని! జగన్మోహినీ! ; 
దేవ దేవి! లావణ్య హాసినీ!; 
జయ హారతులను గైకొనుమమ్మా! || 


కరుణా మధు రస సుధా వాహినీ!
మంజుల వాణీ! మృదు సౌదామిని! 
జయ హారతులను గైకొనుమమ్మా! ||


నాద రూపిణీ! శాంభవి! దుర్గా! 
వేద సార 'ఓమ్'కార మరాళీ! 
విజయ హారతులు గైకొనుమమ్మా! || 


$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$paavani! durgaa! hEma khachita siMhaasani! jananI!
jaya haaratulanu gaikonumammaa! ||


jIvanadaayini! jaganmOhinI! ; 
dEva dEvi! laavaNya haasinI!; 
jaya haaratulanu gaikonumammaa! ||


karuNA madhu rasa sudhaa vaahinI! ; 
maMjula vANI! mRdu saudaamini! 
jaya haaratulanu gaikonumammaa! ||


naada rUpiNI! SAMBavi! durgaa! 
vEda saara Oమ్ kaara maraaLI!
jalapaata mOhinI!
vijaya haaratulanu gaikonumammaa! ||


$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

Thursday, October 13, 2011

థాయ్ లాండ్ తెప్ప పండుగ


థాయ్ లాండ్ లో అనేక ఆసియా దేశాలలో వలెనే, 
చాంద్రమానము వాడుకలో ఉన్నది.
Thai traditional calender ప్రకారము -12 వ నెలలో -
అనగా ఇంచుమించు నవంబర్ లో
"లొయ్ క్రథాంగ్" పండుగ (Loy Krathong) ను చేస్తారు.
థాయ్ ప్రజలు ఈ వేడుకను పౌర్ణిమ నాడు చేస్తారు.
"Loy" అంటే "తేలాడుట" అని అర్ధము.
క్రథాంగ్ - అంటే "తెప్ప"(Krathong) అని అర్ధము.
అరటి చెట్టు బెరడు పొరలతో, చారెడు దొప్పలను చేస్తారు.
రొట్టెతో, ధర్మొకోల్ వంటి మెత్తని వానితో/ styrofoam తోనూ
ఇలాగ జానెడు దొప్పలను (a hand span in diameter) చేస్తారు.
చెరువులలోనూ, నీళ్ళలోనూ వీటిని వదులుతారు.
;
థాయ్ లాండ్ కార్తీక దీపాలు
థాయ్ లాండ్ ప్రజలు "జల దేవత"ను కొలుస్తూ, ఇలాగ పర్వం చేస్తారు.
Goddess of rivers and waterways, Mae Khongkha వారు కృతజ్ఞతలను 
చెప్పే సాంప్రదాయిక పర్వము ఇది.
మన కార్తీక దీపాల ఉత్సాహ పండుగ వంటిదే ఇది.
థాయ్ ప్రజలు "Goddess of Water, Phra Mae Khongkha" ను భక్తితో  కొలుస్తారు.
దిఇనినే ఆధునిక సాంకేతిక పరిభాషలో - "పర్యావరణ పూజ" అని పేర్కొనవచ్చు.
హిందూ మహిళలు దివ్వెలను పెడ్తారు.
కార్తీక దీపం సంబరము- నోము వలె ఉన్న Traditional festival.
;
థాయ్ లాండ్ "తెప్ప"పండుగ  ;
ఉత్సాహము; ఫెస్టివల్ ;

;
Monday, October 10, 2011

త్రివర్ణ హంస ఫొటోtri kalar hansa
;
అందమైన విహంగం.
ఈ ఫొటోలో నాకు నచ్చిన ఇంకో విశేషం ఉన్నది.
మన మువ్వన్నెల జెండాలోని రంగుల మాదిరిగా-
అనుకోకుండా  అలముకున్న పక్షి ఇది.
గూడు కట్టుకొనే బృహత్తర ప్రయాణం,
ప్రయాసను తెలీనీయని ప్రకృతి ధర్మం!!!!!!
అందుకే నాకు నచ్చిన ఫొటో ఇది.
శ్రీనివాసెన్. కామ్ - నుండి సంగ్రహితం, 
కళాభిజ్ఞులకు కానుక;
 సొగసుల పక్షి;

త్రివర్ణ హంస  (Link)


టెడ్ ప్రైజు, The TED prize ($100,000)

టెడ్ ప్రైజు - సాంఘిక అంశాలను ,
కన్నులకు బొమ్మ కట్టినట్లు చూపించే ప్రతిభకు కడ్తూన్న పట్టము.
అక్షరాలా లక్ష డాలర్లును- ఇస్తున్నారు మరి.
ఈ బ్లాగులో ప్రతి అక్షరమూ చదవదగినదే, చూడదగినదే!
అందుకే అనువాదాలు వేరేల?
ఇప్పటికిప్పుడే ఆ లింకు- ను తిలకించేసేద్దురూ!!!
;@@@@@@@@@@@@@@@@@@@@

;


;
The TED Prize is awarded ;
a big prize ($100,000) and portrays social issues;
"Women Are Heroes"
has been shown on slum housing in Paris,
bridges in Africa and
the walls of favelas in Brazil.
;;
1. Bonnie Alter ; Photo: tedprize : Phenom Penh;
2. Photo: tedprize : Kenya
3. Photo: JR-art; he is 27 and Parisian.
       He calls himself
    a "photograffeur" (graffeur is French for graffiti artist). ;
4. Photo: tedprize : Brazil;
;
;
;;

the 2010 TED Prize Winner Jamie Oliver's wish was:
"I wish for your help to create a strong,
sustainable movement to educate every child about food,
inspire families to cook again and
empower people everywhere to fight obesity."
;

@] Parisian Graffiti Artist Wins TED Prize for Photo's
         Treehugger, 27 October 2010

@) indianartcollectors.com (See here)

@) TED Prize Value $100,000 (Link 1)

@) Details TED project   (Link 2)
;

Sunday, October 9, 2011

పెన్సిళ్ళ చెక్కులతో బొమ్మలు


బ్రిటీష్ డిజైనర్ హస్త కళల తయారీలో
నూతన పోకడలను ప్రవేశపెడ్తూంటాడు,
అతని పేరు కైల్ బీన్ (Kyle Bean).
పెన్సిళ్ళ చెక్కుల క్రియేషన్స్ అలాటి సృష్టిలలోనివే!

పెన్సిళ్ళను చెక్కిన తర్వాత,
వచ్చిన pencil peels తో ఇమేజ్ లను చేసే ప్రతిభ అతనిది.

pencil shaving portraits are made of the pencil peels
పెన్సిళ్ళ చెక్కులతో Images 

చైనా లోని ఉద్యానవన ప్రదర్శనచైనా దేశంలోని ఉద్యానవన ప్రదర్శన ;
షెన్యాంగ్ ఇంటర్నేషనల్ హార్టి కల్చర్ ఎక్స్ పో ఇది.
లియా ఓనింగ్ ప్రావిన్స్ లో ఈ ఎగ్జిబిషన్ అందాలు ఇవి.
2011 లో లియ్యోంగ్ మండలంలో
ఒక శిలాజం బయటపడింది.
16 కోట్ల సంవత్సరల క్రితం ఉన్న
అతి పురాతన మూషికము- అని
జంతు, పక్షి శాస్త్ర పరిశోధకులు భావిస్తున్నారు.
very old rat fossil- రీసర్చ్ చేసే వారికి
చేతి నిండా పనినీ, మేధస్సులనిండా ఆలోచనలను నింపి,
తమ పరిశోధనలకు కొత్త ఆధారములు దొరికిన కారణంతో సంతోషిస్తునారు.

Tags:-

China,Liaoning Province,
Windmills among blooming flower beds,
Shenyang International Horticultural Expo,
Liaoning Province, China


'

&&&&&&&&&&&&&&&&&&&&&&&&

Saturday, October 8, 2011

చిలకను ఎక్కిన కోతి


"మత్తు వదలరా; నిద్దుర మత్తు వదలరా...."
ఈ పాట (N.T.రామారావు, K.R. విజయ నటించిన
శ్రీకృష్ణపాండవీయము- అనే తెలుగు పౌరాణిక సినిమాలోనిది)
ఈ గీతాన్ని ఈ వానరం దగ్గర మాత్రం గానం చేయకండి.


ఎందుకంటే, అది హాయిగా
ఓ పంచవన్నెల రామచిలక వీపుపై ఎక్కి కులాసాగా కూర్చుంది.
చిటారు కొమ్మపైకి ఎక్కాలంటే మహా బద్ధకం వేసింది
ఆ కోతిపిల్లగారికి.
macaws చిలక మెడను వాటేసుకున్నది,
26 ft tree కొన కొమ్మకు ఏమాత్రం శ్రమ లేకుండా చేరుకున్నది.
ఇది "విహంగ యాన - కిష్కింధ కాండ".
రెండు మకావ్/ మకావు కీరములతో
(two blue and gold  macaws) తోటి
ఈ చమత్కార వానరం  
హోటళ్ళలో, చెట్లపైనా, ఖుషీఖుషీగా నివసిస్తూన్నది.

@@@@@@@@@@@@@@@@@@హనుమాన్ జంక్షన్ :-
ఇంకో నాలుగు కోతిపిల్లలు కూడా
"మేము మాత్రం తక్కువా?" అన్నట్టుగా 
వేషాలు వేస్తున్నాయి, తిలకించండి.;;

Thursday, October 6, 2011

ఏలగిరి


బెంగుళూరు , కర్ణాటక రాష్ట్రములో -
ఏలగిరి వరుసలు ఉన్నవి.
"Yelagiri" hills ఔత్సాహికులకు,
పర్యాటకుల్కు, ట్రెక్కింగ్ చేసే ఉల్లాస జనులకు
గొప్ప అనుభూతిని ఇస్తుంది.

tree at Yelagiri

ఈ చెట్టు కాండము వింతగా ఉన్నది కదూ!!!!!
రెండు విభాగాలులాగా విస్తరించింది.
ఆ రెండిటి మొదళ్ళు యొక్క మధ్యలో
ఒక చిన్న ఇల్లు/ తొర్రలాగా ఏర్పడిందికదూ!!

Yelagiri  (Link) 

Queen ని మనమే అలంకరిద్దాము

యువరాణి అప్ అలంకరణ ఆట మరియు దుస్తులు;
మీ అంతట మీరే ఈ చిన్నారి క్వీన్ గారిని
ఎంచక్కా అలంకరించ వచ్చు.
చేసి చూడండి.
స్టార్ట్ ఇమ్మీడియట్లీ.
అన్నట్టు, ఈ ఆట 
అచ్చ తెలుగులోనే 
అందరికీ  అందుబాటులో ఉన్నది.
అందుకనే start immediatly.

అందం, అలంకరణ ఆట (Link 1)

అలంకరణ ఆట (Link 2)

Design By:-

Webmaster@Chrilla.com | Licence Creative Commons

-----------------------------------------------

Wednesday, October 5, 2011

తమాషా గణిత ప్రశ్నలు


   ;

హల్లో!childrean!
ఇక్కడ కొన్ని లెక్కల చిట్కాలు; 
ఇంటర్నెట్ లో ఈ చిట్కా లెక్కలు
మంచి కాలక్షేపం + బుద్ధికి మెరుగులు దిద్దే
                        తమాషా గణిత ప్రశ్నలు,

చిటికెలో ఆన్స్వర్సు చెప్పేస్తారా?

ఏమోనబ్బా! మీరే చూడండి.

ఈజీ కాలిక్యులేషన్స్  (link 1)

మాథ్స్ magics (Link 2)

Phone Number trick (Link 3)

ew math trick play

చతుర్దశ భువన హారము


;

పదునాల్గు భువనముల సుమ మాలను;
సుతారముగ అల్లిన జగదేక జననీ!;
అంబ! జగన్మాత! జయ మంగళం!
 శ్రీ దుర్గ! నిత్య శుభ మంగళం!   ||  
;
నటరాజ దేవేరి! కరుణామయీ!
ఇటు ధాత్రి ప్రజలెల్ల నీ బిడ్డలే!
నీ కొంగు పటుతర దుర్గమ్ము మాకు
నీ ఒడియె మాకు మెత్తనీ పొత్తిళ్ళు ||
;
పరమేశు అర్ధాంగి, శుభదాయినీ!;
నీ - కర కమలద్యుతి,క్రొత్త అరుణోదయాలు;
మరలించు మత్తులను, బద్ధకమ్ములను;
తెరలించు శక్తులను, ఉత్సాహములను ||
;
ఫణి భూషణుని రాణి, పరమేశు భామినీ!
పదునాల్గు భువనముల సుమ మాలను;
ముదముగా అల్లిన గౌరీ! భవాని!;
అంబా! జగజ్జనని! జయ మంగళం!
ఓ అమ్మ! నిత్య శుభ మంగళం! ||
;
     చతుర్దశ భువన సుమ హారము ;

&&&&&&&&&&&&&&&&&&


padunaalgu bhuvanamula suma maalanu;
sutaaramuga allina jagadEka jananI!;
aMba! jaganmaata! jaya maMgaLaM! ||
;
naTaraaja dEvEri! karuNAmayI!;
iTu dhaatri prajalella nI biDDalE!; nI oDini;ye ;
paTutaramau durgammu mu O amma! ;
nI oDiye maaku mettanii pottiLLu ||
;
paramESu ardhaaMgi, SuBadaayinI!;
nI kara kamaladyuti,krotta aruNOdayaalu;
maraliMchu mattulanu, baddhakammulanu;
teraliMchu Saktulanu, utsaahamul/ lan nu ||
;
phaNi BUshaNuni rANi, paramESu bhaaminii ni!;
padunaalgu bhuvanamula suma maalanu;
mudamugaa allina tivi; gaurI! bhavaani!;
aMbaa! jagajjanani!
aMba! jaganmaata! jaya maMgaLaM! ||
;
&&&&&&&&&&&&&&&&&&&&&

కొడైకెనాల్ లో 500 years tree

500 years tree, Kodaikenal

;


కొడైకెనాల్ లో  
౫౦౦ సంవత్సరముల పాదపము.

500 years old tree, 
in Kodaikanal ,
Tamil Nadu state. 

Tuesday, October 4, 2011

మందర గిరి కోవెల


సుమేరు పర్వత కోవెల 

ఇండొనీషియా ద్వీప సముదాయములు,
నిరంతరమూ లలిత కళా సంపదకు నిలయములు.
సుమేరు పర్వతము పరిసరాలలో
నాట్య, సంగీత చిత్రములై విలసిల్లుతూ ఉంటూంటాయి.
బాలి ద్వీప వాసుల నాట్యాలు హృదయాకర్షకమై ఉంటూంటాయి.
జూలై నెలలో జరిగే సాంప్రదాయక పండుగలు
కళాప్రపంచమును ఆవిష్కరిస్తూంటాయి.

మందర గిరి కోవెల జావా ద్వీప ములోని,
లుమాజంగ్ (Lumajang) లో ఉన్నది.
తీర్థ యాత్రికులకు (pilgrimage)
ఆసక్తి కలిగించే శిల్ప విన్నాణముతో - దేవాలయము.


సెండ్రాగో జిల్లాలోని  Mandara Giri Temple
రక రకముల పండుగలతో వర్ణభరితంగా అలరారుతూన్న కోవెల. 

మందర గిరి కోవెల 

ప్రసిద్ధ పర్యాటక కేంద్రముగా
యాత్రికుల నేత్రములకు కలిగిస్తూన్న
దృశ్య వైభవముతో Lumajang పట్టణము చారిత్రకంగా ప్రజలకు 
గర్వ కారణమౌతూన్నది.

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&


Tags:-

 Mandara Giri Pura Semeru Agung 
MEMENDAK THIRTHA ceremony ;
MJEJAUMAN ceremony on Mount Semeru.
The annual ceremonies are conducted in July.
Balinese traditional dances
Sendoro district, about 25 km west of Lumajang

లుమజంగ్ (link 1)  
East Java province (link 2)
;
;

చెట్టు కాండముతో కన్య వదనము


ఒక చక్కని ఐడియాతో ఈ గోవర్ధనాదునికం.
అరవింద్  (లింక్ 1)
[036
By Aurobindo  posted on Monday, September 01, 2008వింత ఆకారాన్ని సంతరించుకున్న
ఈ చెట్టు ఉత్తరప్రదేశ్ లక్నోలో ఉన్నది.