Wednesday, September 30, 2015

stars బూజం బంతులాటలు

తారావళి తోడ బంతులాటలు; బూజం బంతులాటలు                                                                                         బువ్వ బూజం బంతులాటల్లు ఆడుదము రండి! 
వేడ్కతో మనము క్రీడలకు చక్కని పదములౌదాము 
 ,                   పర్యాయ పదములౌదాము || 
;
నీలాలనింగిలో; మందంగ ఉన్నట్టి 
తెలి మబ్బులటనటను తేలుతూ ఉన్నవి, 
-                    నటనాలు ఆడుతూ ఉన్నవి 
నురుగుల మబ్బుల అల్లరుల ఆడంగ ; 
వేడ్కతో రండి చెలియల్లార! 
క్రీడలకు చక్కని పదములౌదాము 
పర్యాయ పదములౌదాము|| 
;                            
మన జడపాయలందలి జాజి మల్లెల - విరుల ; 
రజత పాత్రలలోను  తెచ్చుకుందాము 
           జాగ్రత్తగాను తెచ్చుకుందాము
ఇంచక్క  నీరదం హిమరాశులను తేగ ;
వేడ్కతో రండి చెలియల్లార! 
క్రీడలకు చక్కని పదములౌదాము 
 పర్యాయ పదములౌదాము ||
;  
              ఆ నీరదమ్ములందున దూరి ; 
జలదముల బాష్పముల "ఆవిరులు" పట్టి; 
మంచు వడగళ్ళను ఏరి తెద్దాము! 
మనదు పిడికిళ్ళలోన ఒడిసి పట్టదము;
చిత్రాల బొమ్మల బంతులాటలకై 
వేడ్కతో రండి చెలియల్లార! 
క్రీడలకు చక్కని పదములౌదాము 
   పర్యాయ పదములౌదాము ||   
;   
{posted - 10:17 AM 9/18/2015 ; [కృష్ణాతరంగాలు];  } 
  [  గీతరచన :-   [ కుసుమాంబ 1955 ] = 
Kusuma Piduri to ‎కృష్ణాతరంగాలు
September 18 at 10:16am ·  

Tuesday, September 15, 2015

సంగీత ఆరాధనము:

ఉట్టిమీద పాలు పెరుగు; 
వెన్న పాలు, మీగడలు; 
ఇట్టె మాయమయ్యేను;
మటుమాయం ఔతూంటే 
ఏమి చేస్తుమమ్మా, 
మేమేమి సేయగలమమ్మా!?” 
యశోదమ్మ! చెప్పవమ్మ ||
;
కట్టుదిట్టంగా నీ పెంపకముంటేను; 
నట్టింటను నీ ఇంట్లో కుదురుగాను ఉంటేను;
ఊరి వారలందరము నిన్నిట్లు రట్టడి సేగలిగేరా!?” 
రోషముతో యశోదమ్మ ; 
చిన్ని కన్నయ్యను అదుపులోన పెట్టింది!

@@@@@@@@@@@@@@

పల్లీయులు, భామినులు
అందరికీ తోచదాయె!
తప్పు తెలిసివచ్చింది 
కట్టడిలో ఉంచేను తల్లి యశోదమ్మ! 
స్వాతిచిప్ప ముత్తెంలా 
లోగిట్లో క్రిష్ణమ్మ
అమ్మకొంగు మెలిపెడుతూ 
బుద్ధిగ తానున్నాడు ||
కన్నయ్య కనబడని; 
కంటిచూపు చూపేనా?
కిట్టమ్మ అగుపడితే: 
బాధలన్ని మటుమాయం; 
శోధనలు మటుమాయం;
దిట్టమైన కట్టుబాటు లెటుల 
ఇటుల మితిమీరి; 
అమ్మా! ఓ యశోదమ్మ!
మా ఎల్లరి మానసముల; 
ఆనందం ఆవిరాయె! అమ్మా! ఓ యశోదమ్మ!
అల్లరి అని పేరే, మరి 
కానీ, ఆ అల్లరి మురిపెమే!
అల్లరి అని పేరేను కాని
పేర్మి జ్ఞానగీతయే!
అల్లరి అని పేరైనా, అది గీతాసారమే!
రాధ ప్రేమ వోలె - బాలుని అల్లరికి
మురళీ రవళీ సంగీతారాధనమే!
తెలుసుకొంటిమమ్మా! 
అమ్మా! ఓ యశోదమ్మ!
ఆస్యమున విశ్వ, గోళములు
చూపిన శ్రీ బాలక్రిష్ణ మూరితిని;

**************************************** ********
[రచన:- కుసుమాంబ1955]
Kusuma Piduri ,to  - ‎భావుక ; August 28 at 9:46am · 

Friday, September 4, 2015

వానరాణి వాణి

పున్నాగపూవుల సన్నాయి పాటలు;  
కోయిమ్మలకు దొరికెను వింతగ;
సౌరభమధు సంగీతచషకములు; 
అవునవును అదె వర్షాభ్రహేల తొణికేనులే! || 
;
తన ప్రియ లేగదూడను గోవు నాకింది ప్రేమతో! 
ఇపుడేమొ నా మది; శ్రావణాల మేనా! 
అవునవును అదె వర్షాభ్రహేల తొణికేనులే! ||  
;
మొయిలుగుంపుల బాట; వానజల్లుల నడక; 
పురి విప్పుచు; నెమళుల సందడుల ఆటలు;
నాట్యాల కవాటాలు; -ఆనందాల తేనె తేట; 
పచ్చపచ్చని ఆకుల పృచ్ఛకులు; 
;                               
ఏలొ ఏలో పాట జానపదుల నోట; 
పెల్లుబుకు వేళలు; 
పుడమితల్లి ఒడిని ; 
చినుకుల హేలల తరుణమ్ములు ఇవి 
;
వర వర్ణిత సౌందర్యరాశి; 
పుష్ప కోమల వన్నెవాసి; 
వర్షరాణి చేస్తూన్న అష్టావధానములకు 
అందరికీ ఆహ్వానం!
అవునవును! 
ఇది వర్షాభ్రహేల తొణికేనులే! ||  
=====================

punnaagapuuwula sannaayi paaTalu; 
kOyimmalaku dorikenu వింతga;
సౌరభmadhu samgiitachashakamulu; 
awunawunu ade warshaabhrahEla tonikEnulE! || 
;
tana కింది lEgaduuDanu gOwu; naakimdi prEmatO! 
ipuDEmo నా మది; SraawaNAla mEnA! 
awunawunu ade warshaabhrahEla tonikEnulE! || 
;
moyilugumpula baaTa; waanajallula naDaka; 
puri wippuchu; nemaLula ; samdaDula aaTalu;
naaTyaala kawaaTaalu; - aanamdaala tEne tETa; 
pachchapachchani aakula pRchCakulu;
;
elo ElO pATa jaanapadula nOTa; pellubuku wELalu;
puDamitalli oDini ; chinukula hElala taruNam
;
wara warNita saumdaryaraaSi; 
pushpa kOmala wannewaasi; warsharaaNi chEstuunna; 
ashTAwadhAnaamulaku amdarikii aahwaanam

awunawunu idi warshaabhrahEla tonikEnulE! ||  

******************************************
వాన రాణి వాణి ;-  [ sahitheeseva (సాహితీ సేవ) ] ; & in -  [ akhila wanita  ]
**********

తెనుగు సీమ రూపురేఖలు

చిలకమ్మా! చిలకమ్మా! ఏడ ఏడ తిరిగినావు?
మడకసిర, మల్లప్పకొండ, పెనుగొండలు, ఆపైన; 
చిత్తూరు :- తిరుపతి, శేషాచలం, 
ఏనుగు ఎల్లమ్మ కొండలన్నిటినీ చుట్టినాను;
చిలకమ్మా! చిలకమ్మా! ఇంకేమి చూసినావు?       
;
కర్నూలు :- నల్లమల, తూర్పు కొండలు, పడమటి కనుమలు 
కొండపల్లి కొండలు; మొగల్రాజ పురం; 
ఇంకా గోదారిగాలిలోన నాదు రెక్కలను విప్పి
అట్లట్లా అట్లాగ ........     
కొండవీటికొండలు, మంగళగిరి; బెల్లం కొండలు తిరిగి;
పాపికొండల ప్రదక్షిణం; దూమకొండలన్నిటినీ 
తిలకిస్తూ ఎగిరాను
భద్రాద్రి రాములోర్ని తనివితీర చూసాను
చెట్టు చేమ, కొండకోన, తోటతోపు పొదరిళ్ళు
చిట్టడవులు, కారడవులు, దట్టమై ఉన్నట్టి
కీకారణ్యాలన్నిటిపై
'విహగవీక్షణం' సారించా నిండుగా
;
విహంగమా! విహంగమా!
బాగున్నవి నీ షికార్లు, చక్కర్ల హంగామా!
మొత్తానికి తెనుగు సీమ రూపురేఖలన్నిట్నీ
కన్నులకు బొమ్మలను కట్టించినావు, భలే! భలే!  
ఇవిగివిగో! జామపళ్ళు; దోరదోర జాంపండ్లు!
మా పెరటి తోటలోవి! మిగుల మగ్గనివి ఇవ్వి! 
కసరు కాయలు కావు! తీపి తీపి దోరదోర జాం పండ్లు!
 నీ కోసం జాగ్రత్తగ అట్టిపెట్టి ఉంచినాము 
కొరికి కొరికి తినవమ్మా! నీ రెక్కలపుష్టి కలుగు!
మళ్ళీ మళ్ళీ ; ఏరు, పాయ, జలపాతాల్
చెరువు దొరువు మడుగులను ;  
సెలఏళ్ళు, నదులను, మహాసాగరములను
చటుక్కునా చుట్టివచ్చి ; 
దేశ దేశాల గురించి
వివరించి చెప్పవమ్మ మాకు ; 
లోకాభిరామాయణం, ముచ్చట్లను
"విహంగవీక్షణ శక్తి" ఎంతెంతో గొప్పదని
లోకములకు చాటి చెప్పు

************************************
   [ త్రిలింగ దేశం, దర్శనీయత ]
 [ F. B. :- మన సంస్కృతి - ఆచారాలు సంప్రదాయాలు - group - 4/సెప్టెంబర్ /2015 ]]
=========================;
chilakammaa! chilakammaa! 
eda eda tiriginaawu?
;
madakasira, mallappakomda, penugomdalu, aa paina
chitturu, tirupati, Seshachalam
Enugu ellamma komda lannitinii chuttinaanu
;
chilakammaa! chilakammaa! 
imkEmi chuusinaawu?
karnuulu, nallamala, 
komdapalli komdalu, mogalraajapuram
imkaa godawari gaalilona 
naadu rekkalanu wippi ; 
atlatlaa atlaaga  ........      
;
mamgalagiri, bellam komdalu tirigi; 
uuri janulakamdarikii ; uurimche aatalu 
paapi komdala pradakshiNam; 
dhuuma komdalanniTinii tilakistuu egiraanu
bhadraadri raamulOrni taniwitiira chuusaanu
cheTTchEma, komDakOna, tOTatOpu podariLLu
chiTTaDawulu, kaaraDawulu, daTTamai unnaTTi
kiikaaraNyaalanniTipai
'wihagawiikshaNam' saarimchaa nimDugA
wihamgamaa! wihamgamaa!
baagunnawi nii shikaarlu, chakkarla hamgaamaa!
mottaaniki tenugu siima ruupurEKalanniTnI
kannulaku bommalanu kaTTimchinaawu, BalE! BalE!  
iwiwigO! jaamapaLLu;
dOradOra jaam pamDlu!
mA peraTi tOTalOwi!
migula magganiwi iwwi! 
kasaru kaayalu kaawu!
nii kOsam jaagrattaga
aTTipeTTi umchinaamu
dOradOra jaam pamDlu!
koriki koriki tinawammaa!
nii rekkalapushTi kalugu!
maLLii maLLI 
Eru, paaya, jalapaataal
cheruwu doruwu maDugulanu
selaELLu, nadulanu, mahaasaagaramulanu
chaTkkunaa chuTTiwachchi 
dESa dESAla gurimchi
wiwarichi cheppwamma maaku
lOkABirAmaayaNam, muchchuTlu
"wihamgawiikshaNa Sakti" emtemtO goppadani
lOkamulaku chATi cheppu

**********************************

profile picture in Face Book   ;-

maa profile picture in Face Buk


Thursday, September 3, 2015

మధురలో దొరకునా ఈ మధురసంగీతము

మువ్వగోపాలునికి తెలుసు
ఈ మధుర ధ్వని సంగీతము
మధురలో దొరకునా?
వ్రేపల్లెలోన మాత్రమే 
దక్కెడి రాగ సౌభాగ్య గరిమ - అనీ ||  
;
బాల క్రిష్ణు, ఆట పాటలందున 
వెండి గజ్జెలు, అందెలు; మువ్వలు 
చిరు సవ్వడిలో తడిసెను  
ప్రతి కదలిక; పద కింకిణి నిక్వాణము
నొందినదీ ప్రతి మువ్వయు ; 
||మువ్వగోపాలునికి ||   
;
ఎడద మలుపు మలుపులలో: 
ప్రతి తలపుయు "భోగ్" ఆయెను; 
ప్రతి ఊసు ప్రసాదమ్ము! 
లల్లాయి పల్లాయి కబురులు సైతం 
నైవేద్యం, కైంకర్యాలగును గదా చోద్యంగా! 
||మువ్వగోపాలునికి ||

*************************************************************
; =       [భోగ్ = పసాదము] भगवान को भोग]  :-

*************************************************************
 [రచన :- కుసుమాంబ1955]        [8:11 PM 9/3/2015]  

*************************************************************
పాట;-  పాట;- పాట;-     [f. b. group]

                          కృష్ణం వందే జగద్గురుం A Magazine of Shri Krishna
                                             [8:11పి. ఎమ్.  ,  సెప్టెంబర్ 9/3/2015]

-----------------------------------------------------------------------------------------

నవ్వు వెన్నెలల పారితోషికం

వడి వడిగా పదండీ పడతుల్లారా!
గడబిడ చేకుండానూ పణతుల్లారా! || 
;
వేణుగాన మహిమ ఏమొ, ఏమోగానీ, 
వెండివెన్నెలంతా పోగయ్యింది
వెన్నదొంగ అడ్డాలో చేరిపోయింది || 
;
చడి చప్పుడు లేకుండా ఈ పరిణామం 
ఎట్లు జరిగెనో ఏమో తెలుసుకుందాము,
వడి వడిగా పదండీ! పణతుల్లారా! || 
;
దొడ్డమనసు క్రిష్ణుడిది, ఇపుడే తెలిసింది; 
తన నవ్వు వెన్నెలలు ఇచ్చెను పారితోషికం ; 
ఎల్ల జగతికీ ఇచ్చెను పారితోషికం 
దండిగాను ఈ మార్పు బాగుందండోయ్! ||

[పాట – 3 :- నవ్వు వెన్నెలల పారితోషికం]
===============================

paaTa – 3;-
---------------

darahaasa chamdrikala paaritOshikam ;-
waDi waDigaa padamDii paDatullaaraa! 
gaDabiDa chEkumDaanuu paNatullArA! || 
;
wENugaana mahima Emo, EmOgAnI : ; 
wemDi wennelamtaa pOgayyimdi ; 
wennadomga aDDAlO chEripOyimdi ||
chaDi chappuDu lEkumDaa ii pariNAmam;
eTlu jarigenO EmO telusukumdaamu 
waDi waDigaa padamDii! paNatullaaraa! ||
;
doDDamanasu krishNuDidi, ipuDE telisimdi; 
tana nawwu wennelalu pachcha baasikam 
ella jagatikii ichchenu paaritOshikam ;
damDigaanu ii maarpu;baagumdamDOy! ||

++++++++++++++++++++++++++++++++++                   

[Kusuma Piduri‎ఉపశమన తరంగాలు = f. b.]  
September 1 at 10:27am · 

 Total Pageviews ; Sparkline 32,913