Thursday, April 23, 2009మా హృదయ శిబిరముల...

పల్లవి 

నయము మీర 
అనునయము మీరగా 
మా నయనములందున 
అనయము స్వామీ! 
కొలువు సేయరా! 
మా హృదయ శిబిరముల 
కొలువు దీరరా! 

1) నిరుపమ శీలా! 
నిర్మల భావా! 
నిరామయ భావా! 
నిరతము భక్తులు తరియించేరు 
భక్తి భావముల తరియించేరు 

2)ఆగమ వేద్యా! 
ఆనంద రూపా! 
అనంత తేజా! 
ఆ బాల గోపాల ముల్లసిల్లెదరు 
నీ లీలా హేలల ఉలసిల్లుదురు 

మా నయనములందున కొలువు సేయరా! 
మా హృదయ శిబిరముల కొలువు దీరరా


Views (91)

No comments:

Post a Comment