Saturday, December 24, 2011

దేవానందపూర్


Hooghly
శరత్ చంద్రఛటర్జీ పేరు తెలీని వారెవరు?
బెంగాలీ రచయిత రాసిన అన్ని రచనలూ,
తెలుగులో అనువదించ్బడి, ఆంధ్ర పాఠకులను/కు
శరత్ బాబు తెలుగు రచయితయే!" అన్నంతగా అభిమానాన్ని పొందాడు.
దేవదాసు, మా వదిన, బాటసారి, తోడికోడళ్ళు ఆదిగా
అనేక సినిమాలు ఆయన రచనల ఆధారంగా నిర్మించబడినవి.

15 సెప్టెంబర్ 1876 లో దేవానందపూర్, హుగ్లీ జిల్లాలోని- లో జన్మించాడు.
శరత్ చంద్రఛటర్జీ యొక్క నివాసము, మున్నగునవి,
స్మారక చిహ్నములుగా ఉన్నవి.
ఆ దారిలో ఉన్న ఒక పెద్ద వృక్షము కనులకింపు.

Tags:-

Colours Bengal  ;

from Bandel station,Debanandapur/ DewaanaMd pur, Hoogly
;శరత్ చంద్రఛటర్జీ birth place  "దేవానందపూర్"
;

Friday, December 23, 2011

మా చూపులకు దృశ్యప్రసాదము


నవ నళిననేత్రా! 


ఇభరాజ వరద! సుగుణాలయా! నవ నళిననేత్రా! నారాయణా! ;
శుభముగా సుఖ శాంతి సౌభాగ్య పెన్నిధుల నీ జగతి కొసగుమా!
                                                                     మురళీధరా!                ||

దధి క్షీర నవనీత మీగడలు; ఆరగింపులు ఇవిగొ! ఆనందబాలుడా!
అభిమానము, భక్తి ప్రేమానురాగముల; రంగరించీ బాగ
తెచ్చి ఇస్తున్నాము-గారాలు కుడుచుచూ గ్రోలుమోయీ!
నే"నడిగినదె తడవుగా తేలేదు, ఏమనుచు"
కాస్తంత అలిగితే; నీ బుంగమూతిని ముద్దాడు   వెన్నెలలు                      ||

చిన్ని పెదవులను "సున్న"గా చుట్టుంచి; ఆలాగునే ఉంటే ఏలాగయా?
నీ నోటిలో సకల విశ్వమ్ములను చూపు; భాగ్యమొక్క నీ జననికేనా?!
మా ఎల్లరీ చూపులకు ఆ వింత పుణ్య మధుర ప్రసాదమ్మును
అనుగ్రహించ మరిచితే మేమూరుకోము, ముద్దుల క్రిష్ణయ్య!!                   ||

******************************************

       రచన:- కోణమానిని ;

Thursday, December 22, 2011

మహిష్యాల మదుర్ చాపల తయారీ

సిందూ నాగరికతా కాలమునుండీ 
ఉత్తరభారతదేశములో  ఛటాయీల నిర్మాణములలో  
ప్రజలు నిపుణత్వమును సాధించారు.
మహిష్య- లు  పశ్చిమ బెంగాల్ రాష్ట్రములోని 
నేత పని వృత్తిగా కలిగిన వ్యక్తులు.
మహిష్య- లు అధికులు బెంగాల్  లోని 
మిడ్నపూర్ జిల్లాలో నివసిస్తూటారు.
మదుర్ చాపల తయారీలో ప్రశంసలు పొందినవారు 
మహిష్యా వీవర్స్ గా నేడు వీరు పేరు గాంచారు. 

madur grass (Cyperus tegetum) ను 
చాపలకై ఉపయోగిస్తారు.
వాళ్ళు వెదురుతో చేసిన సింపుల్ గా- ఫ్రేము పైన ఈ
 చటాయీ లను అల్లుతారు.
సున్నితమైన కాటన్ దారముపోగులను 
మాదు కథీర్, శీతల చాపల అల్లికలలో వాడుతారు. 
నూలుకు అవసరమైన ప్రత్తిని:- 
Sabong, Kholaberia, Sadirhat, Ramnagar, 
Narayan Chak of Midnapur district  లలో 
సాగు చేస్తూన్నారు. 
మిడ్నపూర్ లోని మాదుర్ చటాయీలు మూడు రకములు.
అవి- Ek-rokha, do-rokha.
ఏక్-రోఖా- ఇవి సింగిల్ నేత కలిగినవి. 
దో-రోహ్కా:- డబుల్ నేత, జమిలి నేత అల్లికలతో, 
ఈ చాపలు మెత్తగా, 
కూర్చుండడానికి సుఖవంతముగా ఉంటాయి. 
Madur mats కళాత్మకతకు - 
జాతీయంగా గుర్తింపు పొందినవి.

Shital Pati Mats 

‘శీతల్ పతి ’ అనగా "చల్లని చాప".  
వీనికి వాడే వెదురు/ నారకు అవసరమైన మొక్క "ముద్ర".
ఈ murta plant  కొన్ని ప్రదేశాలలో పెంచబడే సున్నితపు మొక్క.
ఈ చెట్లు areas of Cooch Bihar districts ల 
పరిసరములలో సేద్యములో ఉంటూంది.
ఈ శీతల్ మ్యాట్స్ ఫర్ సింగ్ పారా, గవోల్ పరా పల్లె స్త్రీలు 
వీటిని నేయుటలో నైపుణ్యం కలిగినవారు.
ఆ సీమల పురుషులు 
శీతల చటాయీలకు కావలసిన ముడిసరుకులను సేకరించి తెస్తారు.
వారు. 
ఫార్సింగా, గ్యోల్పరా గ్రామ ప్రజలు 
ఎక్కువగా అల్లుతారు. 
మొహ్త్రా ఊచలు/ ఆకుపచ్చని లేత పుల్లలు-  
వీటితో తయారైన శీతల  ఛటాయీలకు 
అక్కడ ఎక్కువ విలువ ఉన్నది


ఆధారములు:- 

Shital Pati a popular mat of West బెంగాల్ ::
Shital Pati:: murta plant::
Cooch Bihar districts:-  Pharsingpara and Goalpara.; 
The raw materials:- mohtra reeds or green patidai;

Nice Catayiis: (Lokfolk- Link) 
murta plant, MATS: (Link 1) 
;

Monday, December 19, 2011

భగవానునికి వందనాల వరములు!
మబ్బుల మెడలో 
చక్కని- మెరుపుల దండలు వేసిన వారు ఎవ్వరో? 

వానదేవుణ్ణి- డమడమ ఉరుముల
జడిపించేదది ఎవ్వరో?

జడి, వానధారల 
చిక్కని- మెలికల -
దారుల నేర్పరచిన వారు ఎవ్వరో? 

పుడమికి మేల్ కలనేత చీరలను 
                కట్టిన వారు ఎవ్వరో? 
ఆ వలువల మడుగుల
అద్దపు బిళ్ళలు  కుట్టిన 
ప్రజ్ఞా-వంతులు ఎవరో? 
     ఎవ్వరో? వారెవరో?   

నదీఝరులలో అలల కొసలలో; 
నురుగుల ముత్యాల్ చల్లినదెవరో?  
        ఎవ్వరో? వారెవరో? 

పైరు పంటలకు  
పచ్చని "పాటల వినిపించేది" ఎవ్వరో?

ఆ గాలిబాలలకు 
చక్కని ఈ పని 
అప్పగించినది ఎవ్వరో?  
             ఎవ్వరో? వారెవరో?   
ఇన్నీ ఇన్నీ ఇన్నిన్నీ; 
ఆ విధాతసృజనల కలిమి చిత్రముల  
నిశితముగా గమనించగలిగిన వాడే కద,
                       ఈ మానవుడు!!!!!!

ఈ మనిషి పెదవుల 
చక్కని చల్లని- 
నగవు వరముల నొసగినట్టి 
                   ఆ దైవమ్మునకు
మేమిస్తాము బులిపించేటి బుల్లి వరమ్ములు,
అవే అవే! 
ఈ "శత కోటి నమస్సులు"!
"మానవత"కివి మురిపాల ఉషస్సులు!!!!!!

**********************************;
భగవానునికి వందనాల వరములు!   
;
 

Sunday, December 18, 2011

పుణ్యవతి యశోదమ్మ

నిఖిల జగతినీ లీలల నూపే 
జగనాటకసూత్రధారి!
మర్రి ఆకును
డోలగ గొంటివిదేలర? క్రిష్ణా! ||

యశోదమ్మ నీ అలంకారములకు
మురిసే పుణ్యవతి;
పింఛధారి!  
నుదుట మెరిసేటి
మృగమద తిలకము;
సూర్యకిరణాళి ఊయెల; ||

నాట్యమాడు నీ పదముద్రలవి;
కాళియ ఫణమున మణులాయె
వేణుగానప్రియ!
త్రిభంగి నృత్యమ్ము సకల,
సౌందర్యాలకు డోల కదా! ||
;

nikhila jagatinI lIlala nUpE jaganaaTakasUtradhaari!
marri aakunu DOlaga goMTividEla? krishNA! ||

yaSOdamma nI alaMkaaramulaku murisE puNyavati;
piMCadhaari!  
nuduTa merisETi mRgamada tilakamu; suuryakiraNALi Uyela; ||

nATyamaaDu nI padamudralavi; kaaLiya phaNamuna maNulaaye
vENugaanapriya!
tribhaMgi nRtyammu sakala, sauMdaryaalaku DOla kadaa! ||
;

Friday, December 16, 2011

విప్రతిపత్తి లేని కథ నీదే!


;
;
;

నీ ప్రతి కదలిక మనోహరమ్ము;
విప్రతిపత్తి లేనిదీ కథ,
ఔను కదా! స్వామీ!                    ||నీ ప్రతి||

వినీల విలసిత కేశములందున;
గోలలు సేయుచు చేరె భ్రమరములు;
                 స్వామి! నీదు
వినీల విలసిత కేశములందున;
గోలలు సేయుచు చేరె భ్రమరములు            ||నీ ప్రతి||

సరసిజ రాసులు- హాస కుశలముగ;
నీ హస్త కమల; విలాసము పొందె చతురముగ        ||నీ ప్రతి||

కొలనుజలమ్ముల; రవి కిరణ బింబములు;
మెలగు వినయముగ; నీ పద నఖముల                  ||నీ ప్రతి||

ఇదియే వింత!- సకల జీవులకు; ఉన్నపాటున;
చకిత చతురముగ; ఒనగూడినవి; చిత్తోల్లాస వైభోగములు

|| నీ ప్రతి కదలిక మనోహరమ్ము;
           విప్రతిపత్తి లేని కథ, ఇది నీదే!
                                ఔను కదా! స్వామీ!!               ||నీ ప్రతి||

*********************************************;

nI prati kadalika manOharammu;
vipratipatti lEnidii katha,
               aunu kadaa! swaamii!!  ||

vinIla vilasita kESamulaMduna;
gOlalu sEyuchu chEre bhramaramulu;  swaami! nIdu           ||

sarasija raasulu- haasa kuSalamuga;
nii hasta kamala; vilaasamu poMde chaturamuga        ||

kolanujalammula; ravi kiraNa biMbamulu;
melagu vinayamuga; nI pada nakhamula ||

idiyE viMta!- sakala jIvulaku; unnapATuna;
chakita chaturamuga; onagUDinavi;
chittOllaasa vaibhOgamulu
nI prati kadalika manOharammu;
vipratipatti lEnidii katha,
                  aunu kadaa! swaamii!/mi!  ||

*********************************************;    

పునీతా గాంధిః - ఓ తాళపత్ర వినతి;(Desk-File)

Wednesday, December 14, 2011

ఆకు బంగారంలో "పచ్చ"దనపు మణి


పత్రమా!
నీ గొప్పదనాన్ని చిత్రించేందుకు
ఆకు పచ్చ వర్ణం- చాలు!
ఐతే,
ప్రకృతి -
తన మేనంతా
పచ్చ దనాన్ని అలుముకున్న తర్వాతే గదూ
ఏ వన్నెకైనా
శ్రీకారం చుట్టుకోబడుతూన్నది!
పూలూ, పైర్లు,
నవ నవలాడే నవ ధాన్యాలు, పళ్ళూ
వానితో అనుసంధానమైన ప్రాణి కోటీ.....
ఇన్నిన్నీ, ఇన్ని రంగులు
సింగారంగా  ప్రతిష్ఠించబడుతూన్నాయి
అంటే- మూలం నీవే సుమీ!

అందుకేనేమో
ఆది దంపతులకు
ప్రీతి ఐనవి బిల్వార్చనాదులు!!!!
గణపతికి నూటొక్క పత్రి పూజలే బహు వేడుక !!!!!!

ఓ ఆకులోని హరితదనమా!
నాడు యుగ సంధి వేళలలో
శ్రీ హరి వైకుఠాన్నీ 
ఆ ఆదిశేషు -  తల్పాన్ని వీడినాడు
ఆ వెనువెంటనే
మర్రి ఆకును పట్టాడు
శ్రీవిష్ణుమూర్తి
వటపత్రశాయిగా ముద్దులొలికాడు
వరహాల ఎత్తుగా నిన్ను గుర్తించాడు,
దైవ అర్చనలో
నిన్ను –
తన అంతర్భాగస్వామినిగా చేకూర్చుకున్నాడు
భళీ!
ఆ భగవంతుని ఈ చమత్కారం!!!!
“పత్రం పుష్పం ఫలం తోయం.....”
తామరాకుల లేఖలు
అభిజ్ఞాన శాకుంతలమ్
కాళిదాసు మహర్నాటక రచనకు
కాంతి రేఖలు ఐనవి

తాళ పత్రములే
ప్రాచీన కాలమ్మునందిన
భారతీయ సాహితిని పదిలపరచీ,
మనకు అందించినాయి

మరి, మామిడాకుల తోరణాలు
గృహ సామ్రాజ్యముల సమీరములతో
చెబుతూనే ఉంటాయి ఈలాగున....
“ఓ మానవుడా! భగవంతుడే గుర్తించినాడు
హరితదనముల పత్ర సంపద గొప్ప విలువలను
పుడమినందున సంతసాలు
నిరంతరమూ పల్లవించాలంటే
పచ్చదనమును సంరక్షించుకొనుటయె
నీదు బాధ్యత, తెలుసుకొనుమా!”

అందుకే ఓ మనుజులారా!
ధరణి తరువుల పసిడి భరిణగ
నిరంతరము ప్రకాశించాలనుచు
ఎల్లరు కోరుకుందాము

ఇలాతలముకు
ఈ సద్భావనా ఆకాంక్షలు
శుభాశీస్సుల తుషార శీకర అక్షింతలు!

&&&&&&&&&&&&&&&&&&&&

       aaku baMgaaraMlO "pachcha"danapu maNi


# patramA!
nI goppadanaanni chitriMchEMduku
aaku pachcha varNaM- chAlu!
aitE,
prakRti pachcha danaanni alumukunna tarvAtE gadU
E vanne kainA
SrIkAraM chuTTukObaDutUnnadi!
pUlU, pairlu,
nava navalADE nava dhaanyaalu, paLLU
vaanitO anusaMdhaanamaina prANi kOTI.....
inninnii, inni raMgulu pratishThiMchabaDutUnnaayi
aMTE- mUlaM nIvE sumI!

aMdukEnEmO
Adi daMpatulaku
prIti ainadi bilvArchanaadulu!!!!
gaNapatiki nUTokka patri pUjala vEDka!!!!!!
aadiSEshu talpaanni vIDi
SrIvishNumUrti
vaTapatraSAyigaa maarADu;
varahAla ettugaa ninnu gurtiMchADu,
daiva archanalO
ninnu – aMtarBAgaswaaminigaa chEkUrchukunnaaDu
BaLI!
aa BagavaMtuni I chamatkaaraM!!!!
“patraM pushpaM phalaM tOyaM.....”
taamaraakulEKalu
SAkuMtala maharnATaka kaaMti rEKalu ainaayi.
mari, maamiDAkula tOraNAlu
gRha saamraajyamula samIramulatO
chebutUnE uMTAyi iilaaguna....
“O maanavuDA! BagavaMtuDE gurtiMchinADu
haritadanamula patra saMpada goppa viluvalanu
puDaminaMduna saMtasaalu
niraMtaramuu pallaviMchaalaMTE
 pachchadanamunu saMrakshiMchukonuTaye
nIdu bAdhyara, telusukonumA!”

aMdukE O manujulArA!
dharaNi taruvula pasiDi BariNaga
niraMtaramu prakASiMchaalanuchu
ellaru kOrukuMdaamu

ilaatalamuku
I sadBAvanaa aakaaMkshalu
SuBASiissula SIkaramulu

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&


  కవితా ప్రపంచంలో కవితా పల్లవం,
                   
                      (  కాదంబరి (pen name))


pachcha"danapu maNi ;

"ఆకు బంగరంలో "పచ్చ"దనపు మణి"
;

Saturday, December 3, 2011

Kannimara Teak చెట్టు


;
ఆసియాలో అతి పెద్ద టేకు చెట్టు ఇది.
కేరళ రాష్ట్రములో,
పాల్ ఘాట్ మండలములోని
నేషనల్ పార్కు లో ఉన్న టేకు చెట్టు కన్నెమరా.
400 ఏళ్ళ ఈ మహా పాదపము,
47.5 మీటర్ ల పొడవు కలది.
కేరళలోని ,
పరంబూర్ అభయారణ్యము
(Parambikulam Wildlife Sanctuary ) లో ఉన్న
కన్నిమరా తరువు
యాత్రికులకు ఆకర్షణీయమైనది, దర్శనీయమైనది.
largest Kannimara Teak కి
1994-95 లో ఇండియా ప్రభుత్వముచే-
"మహా వృక్ష పురస్కారము" వచ్చినది.

400 old tree ; (Link)

Tuesday, November 29, 2011

తోటల, తోపుల దోబూచి ఆటలు

చెట్టు చెట్టు కారడవి;
చెట్టుకు జట్టు చిట్టడవి;

అటవికి ఆని, ఒక తోపు
మావి తోపుల వెనుక
ఉన్నది రంగుల పూ దోట;

తోటలలోన పొదరిళ్ళు;
అక్కడ నక్కి, ఇక్కడ దాగుతు
దోబూచీ, దొంగాట;


ప్రశ్న:-
ఆటల క్రీడల బాలుడు ఎవరు?
ఆన్సర్:-
ఇంక ఎవ్వరు?
చిన్నారి క్రిష్ణయ్య;
చిట్టి తల్లి రాధమ్మ ;

(ఏ బాల బాలికలు ఆడుతున్నారో
    వాళ్ళు తమ తమ names ను 
ఆ పేరును ఇక్కడ చెప్తూ ఆడాలి)
     - అనిల్ పిదూరి 


తోటల, తోపుల దోబూచి ఆటలు ;
Web Magazine (Link1 )

తోటల, తోపుల దోబూచి ఆటలు
November 14, 2011
By: జాబిల్లి Category: ఆటలు
;

photo (Link 2 ; English Web)
;

కోతి, పావురాయి


;
టిబెట్ ప్రజలు ప్రకృతి ప్రేమికులు.
బౌద్ధమత ఆచరణలో,
విహంగ, జంతు లాలనలు ఆ సీమలో ప్రత్యేకంగా ఉన్నవి.
బౌద్ధమతం, అహింసా సిద్ధాంతములు ,
మనిషినే కాక, మృగాలు, పక్షులూ,
ఇతర ప్రాణులు కూడా సద్భావనతో, స్నేహశీలతతో మెలగడం,
ఈ చోట గాలి కూడా పవిత్ర పరిమళపూర్ణతతో స్పందిస్తూన్నది-
అనడానికి ప్రత్యక్ష నిదర్శనాలు అనేకములు.
ఇక్కడ ఒక కోతి, పిట్టను అనురాగంతో ఆడిస్తూండటం చూడగలము.
వానర, విహంగ క్రీడా సౌందర్యము
నయన పర్వమౌతూ, ఈ ఫొటోలో ఉన్నది.
(కోతి, పావురాయి; పారావతము, వానరము;)
;

Tibetan national character Charles Bell noted that
“Most Tibetans are fond of birds. Certainly the Dalai Lama was.
Whenever I visited him,
there was always a bird or two, not far away,
perhaps a talking myna from India….”

 older Tibetans,...........
the birds of Tibet especially the crane (tung-tung),
the lammergeyer (jha-goe) and the cuckoo (khuyu).
They would sometimes mention a special shrine dedicated to birds
somewhere near Tsetang, south of the Tsangpo,
at the head of the Yarlung valley.

Yarlung valley ;(Link for Photo)
monkey playing pigeon;
;


Friday, November 25, 2011

కార్తీక పిక్నిక్ లు


 శ్రీ  Vadakkunatha Temple,Thrissur. 

పొగడల, పొన్నల చెట్ల నీడలలొ
పొడలు పొడలు ఆ నీడలలోన
వన భోజనముల సందడి సందడి

పిల్లలు, పెద్దలు అందరునూ
దడులను కట్టి, తడికలు నిలిపిరి
శిబిరములేసిరి;వంటలు చేసిరి
కార్తీకముల సందడి సందడి

దడబిడ వచ్చి, చేతులు కలిపి
పంటలు వేసీ, ఆటల పైరుల చప్పట్లు
లోక జ్ఞానం ముచ్చట్లు
మంచు మాసముల మంచి కబుర్లు
;
బుడ బుడ ప్లేటుల; ఫలహారాలు,
విందు భోజనము రుచుల హేలలు;
షడ్రుచుల, నల భీమ పాకముల
వన భోజనముల సందడి సందడి

గడబిడ  గంతులు, క్రీడల హోరు
సంతోషాలు మిన్నుల తాకెను
నింగికి కూడా హుషారు కోరిక
తాను కూడ ఇట పాల్గొనాలని!

&&&&&&&&&&&&&&&&&&
;

;
[Festival "Anayuttu"]:- (Link for ESSAY)

‘Ashta Dravya Maha Ganapathy Homam’, offering of holy materials in sacrificial fire to propitiate Lord Ganesa. About 1,000 kg rice flakes, 10,000 coconuts, 2,000 kg of jaggery, 200 kg of ghee and 50 kg honey were used for the ‘homam’.

Temple Melsanthi (Chief priest) Kottampilly Narayanan Namboodiri inaugurated the ‘anayoottu’ by giving the feed to the youngest elephant of the lot “Kuttumukku Kannan”.

The elephants were given rice mixed with jaggery, ghee and turmeric powder. They were also fed coconut, sugarcane, pineapple, bananas and cucumber.
;
Utee, Shimla Summer Festival

;


;;;
(కార్తీక పిక్నిక్ లు)
User Rating: / 1 
Member Categories - బాల
Written by kadambari piduri   
Tuesday, 22 November 2011 11:11

ఎవ్వరమ్మా!వారెవ్వరమ్మా!?


నీలాల నిగ నిగల కాంతులకు;  
ఈలాగు-  స్నానాలు చేయించునది
ఎవరు? - ఎవ్వరమ్మా!వారెవ్వరమ్మా!?
ఎవ్వరమ్మా!వారెవ్వరమ్మా!?  ||

గగనాల నీలిమల కాంతులన్నిటికిని    
చాల గుబులౌతోంది,ఓయమ్మ! చూడవే!
"స్వామి కురులందున కులుకు వీలు
తమకు కలుగలేదే", అనుచు; ||

క్రిష్ణ! నీ కుంతలము లల్లనల్లన గాలి
కెగురుచు బాగ అల్లరి సేయు, ఈ వైనమిది ఏమి?
అదుపు సేయుము వానినందాలబాలుడా!
మా నంద నందనుడ! ఆనంద మోహనుడా!  

పరిసరమ్ములన్నిటికీ ; క్రమశిక్షణను నేర్పు
ఘన- అధ్యాపకుడివీవు; అందుకే గదుటయ్య
ఇంతగా మేము మనవి సేసేము, చేస్తున్నాము!?!
మా నంద నందనుడ! ఆనంద మోహనుడా!   ||

నీలాల నిగ నిగల కాంతులకు;  
ఈలాగు స్నానాలు చేయించునది
ఎవరు? ఎవ్వరమ్మా!వారెవ్వరమ్మా!?
;|
అందాలబాలుడు! మా నంద నందనుడు!
ఆనంద మోహనుడు!

Thursday, November 24, 2011

హెచ్చుతగ్గుల వీరుడు


కన్నయ్య రాకకై ఎదురుచూచీ చూచి;      
చిన్నబోయీ ఉన్నబేల రాధను గనుచు
ఎగతాళి సేయకురా! చందురూడా!                  ||  

పదహారు కళల హెచ్చుతగ్గుల జోదు! చందురుడా!
నాటి నీ గాధలను గ్యాపకము చేసుకో!
ఒరులను- నిరతము అపహసించేవు
నీ -చిన్న బుద్ధినీ మానుకోవోయీ! చందురుడా!    ||  

బొజ్జ గణనాధునీ- తిలకింఛి అలనాడు ; హేళనగ నవ్వితివి                  
హిమపుత్రి ఆగ్రహము నీ పాలి శాపమయె
శుక్ల, బహుళముల రూపులైనవి  నీవి!        
నీ -చిన్న బుద్ధినీ మాపుకోవోయీ! చందురుడా!    ||    
                     
"గ్రహపాటున నీదు- వదన దర్శనమున ;    
జనులెల్ల ఇక్కట్ల పాలు ఔతారనీ    
" ఘోర శాపము మాట మరచిపోతావా?
 నీ -చిన్న బుద్ధినీ మాపుకోవోయీ! చందురుడా!    ||      

దక్షునికి వెరచిన,నీ ఉనికి కాస్తా;
ఈశుని సిగపాయలందున దూరినది;
"కను లొట్ట పోవుట అను మాట వాడుక      
నీ మూలముననే! మరువకు శశాంకుడా!             ||

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

ఇందిరాగాంధీ సిగలో పూలచెండు


Indira Gandhi సిగలో పూల చెండు


;
ఇందిరాగాంధీ తలలో పూలదండను ముడిచి పెట్టుకున్నారు.
అరుదైన దృశ్యం యొక్క "కలిమి" ని కలిగి ఉన్నది ఈ ఫొటో.

"తల నిండ పూదండ దాల్చిన........"
ఘంటసాల గాన సుధ తొణికిసలాడిన
 గీతికా చషకము.
ఈ పాట  జ్ఞాపకము వస్తుంది కదూ!

Indira Gandhi సిగలో పూవుల దండ  ;

; (Link for many photos)

interestingnewsfromallover ;
(14 photo)

THURSDAY, JUNE 2, 2011

;
Sunday, November 20, 2011

నిత్య కార్తీకము- మా బాలల సాన్నిధ్యం


లల్లాయ్ పల్ల్ల్లాయ్ కబుర్లు;
;
లల్లాయ్ పల్ల్ల్లాయ్ కబుర్లు;
కోలాటములూ, కోలాహలములు
నిత్య కార్తీకము- మా బాలల సాన్నిధ్యం    ||
~
చందమామలో-కుందేలమ్మ-
దుముకుచు పరుగులు తీయుచుండును
అలల పడవలోయ్ ఈ దీపాలు     ||
~
ఉసిరిక, ద్రాక్షలు,నిమ్మ మామిడి
తరువుల క్రింద ;పిల్లల ఆటలు;
చప్పట్లోయ్! తాళాలోయ్! చైతన్యానికి ప్రతీకలు ||
~
సాగ దీతుమా, ఆ మెరుపులను!?
ఇలకు దించుదుము ఆ నక్షత్రాలను!
నిత్యము కార్తీకం-బాలల సాన్నిధ్యం  ||
;
;
;

[నిత్యము కార్తీక మాసము
            మా బాలల సాన్నిధ్యం]
  ;
********************** ||
 (Dalliance);

భద్ర పరుస్తాము, ఒట్టు!


ఒకే జట్టుగా ఉందామే!
గోవిందుని పట్టుకుందామే!
          ఇట్టే  పట్టుకుందామే!   ||
~
మల్లెల పొదలలొ దాగునాడో?
పందిరి వేస్తాము;
              పందిరి మీకు వేస్తాము;
మురళీ క్రిష్ణుని జాడలెక్కడో; దయతో కాస్త చెప్పండి;
ఓ మల్లియలారా! మాలతీ మాధవ సంపెంగల్లారా! ......
బృందా వనమున మీ నెలవులను,
              బాగా భద్ర పరుస్తాము ఒట్టు!  ||
~
కన్నెల నవ్వుల వెన్నెల  కాంతుల
                అరువుగ మీకు ఇస్తాము
చక్రధారి చిరు గురుతు వివరణలు
చక్ర వడ్డీలుగ ఇచ్చేయండీ!
              మాకు చక్ర వడ్డీలుగ ఇచ్చేయండీ!             
కనకాంబరములూ!మిము మాలలు అల్లీ,
శృంగార రాయునీ- గళమున ఉంచీ, అలంకరించీ ;
రాధాదేవి మమతలను మీకందిస్తాము  ||
~
::::: ఓ యమునమ్మా!
మా,కన్నుల కలువల రేకుల శోభల ;
                   అరణముగా ఇచ్చేస్తాము
యమునా జలములదాగున్నాడో?        
ఉప్పొంగే ఓ కెరటములారా!        
స్వామీ స్పర్సలో మైమరచేరు!
అదనును చూసీ,
అనంత పద్మనాభుని జాడలు; బాగా చెప్పేసేయండీ  ||
~

********************** ||
 

Saturday, November 19, 2011

మనసులు హంసలు


వరుస వరములు మాకు
నీ అనుగ్రహములు!          ||
;
పరమ హంసలు ఆయి-
        మా మానసములు
ఈదులాడుచు గ్రోలు
  స్వచ్ఛ పరవశములను ||
;
ఎడదలో ఏ మూల సంకుచిత భావములు
ఉండబోవు, అవి కాస్త కరిగి, మరగీ పోవు ||
;
అంకురముల భక్తి మహిమాన్వితములు
మధుర, సౌరభములను మోయు మలయానిలములు ||
;
(మనసులు  హంసలు)
;
(krishna, hansa)

గగన హాసము


ఆకాశమే శ్రీధరుని దరహాసమ్ము  
శాంతి దుర్గమునకు గొప్ప ప్రాకారమ్ము   ||
;
అందుకే నా మది
ప్రభు మందిరమ్మాయె - ననుచు
కనుగొంటినీ నాడు - నేడే! ఈ నాడే!      ||
;
నాకమున దివ్యులు అతి శ్రద్ధతోడ
నక్షత్ర శిల్పములు చెక్కి నిలిపినారు!
తారల చెక్కుల మిల మిలల రజనులు;
స్వామి నును చెంపలకు అద్దిన పుప్పొడులు ||
;
యక్షులు, కిన్నెరలు అతి మమతతోడ;
కస్తూరి తిలకములు తీర్చి దిద్దారు;
నీదు చుబుకములను మృదువుగా పుణికేరు
దిష్టి బాగా తీసి మెటికలను విరిచేరు       ||
;
(గగనమంతటి హాసము)

సప్త గిరి సోపాన శోభ


;

సప్త గిరి వలయముల 
సోపాన పంక్తులు ఇవి!
భక్త కోటి పాద ముద్రలు
                 ఇవియే!
నక్షత్ర మణుల సుప్రభలను ఈను
కాంచన ఆభరణమ్ములివియియే!  ||            


సాదా సీదా నడకలు కూడా
నాట్యములాయెడు వేయి వరముల
సాతాళములు దొరికె కదా!
అపురూపముగా దొరికే గదా!  ||

ఇంద్రుని పూజలు, చంద్ర అర్చనలు ;
సప్త గిరీశుడు గైకొనగా ;
నగముల శోభల నేమి అందును?!
      మాటలకూ అవి అందనివి!    ||
;

**********************\\\\\\\\\\\\

Friday, November 18, 2011

కేరళలోని ఏకైక పుష్కరిణీ కోవెల


తిరువనంత పురం
"అనంత పద్మ నాభ స్వామి కోవెల"
అపార నిధులు కలిగి,
ప్రపంచ వార్తల శీర్షికలతో అందరికీ తెలిసినది.
"కుంబాల"లో అనంత పద్మనాభస్వామికి
ఒక ప్రత్యేకత ఉన్నది.
కేరళ రాష్ట్రములో,
పుష్కరిణిని కలిగిన
ఏకైక దేవళము ఈ "కుంబల కోవెల".
9 వ శతాబ్దములో నిర్మించారు.

kadanbari MAIL (~~~~~~~~~&~~~~~~~~)

(Tags:- SRI ANANTHAPADMANABHA SWAMY TEMPLE -KUMBALA
Ananthapuram Lake Temple is the only lake temple in Kerala.
moolasthanam (original abode) of
Anandapadmanabha, the deity of Sri Padmanabha Swami temple, Thiruvananthapuram.
It is located at Ananthapuram,Kumbala- Kasargod.)

kumbala tample (Link details)

సంగీత ప్రభావము గొప్పదిలలిత కళలు నాలుగు :-
అవి  సంగీత, సాహిత్యములు, చిత్రలేఖన, శిల్ప కళలు.    
జ్ఞాపక శక్తిని పెంపొందించే అద్భుత శక్తి "సంగీతము"నకు ఉన్నది.
మానవుని మానస, అలోచనా విధానాలను, ఫీలింగ్సునూ
అతలాకుతలం అవకుండా-
క్రమబద్ధీకరించే శక్తి "సంగీతము"నకు కలదు.
గురజాడ అప్పారావు నాటక హీరో గిరీశం భణితిలో - చెప్పినట్లు
"మన వాళ్ళు ఎప్పుడో కనిపెట్టారోయ్!" అని
మనమూ అనుకుందామా?
మానవుని పంచేంద్రియాలనూ, ఇంద్రియ వ్యవస్థనూ
సక్రమ పద్ధతిలో సంగీతము ఉంచగలుగుతూన్నదని -
మన ఆర్య దేశంలో - వేల యుగాల క్రితమే కనిపెట్టారు.
ఇప్పుడు పాశ్చాత్యులు కూడా వెల్లడించిన వారి Reasearch ల ఫలితాల సారాంశం సైతము
అదే కావడము, సుంత విభ్రమాన్ని కలుగ జేసే అంశమే!
 " Nature Neuro Science " వారు కొన్ని సంగతులను చెప్పారు.
వారు తమ  on line - edition   లోని, -
" North Western University " చేసిన
పరిశోధనల కొన్ని వివరాలను తెల్పారు.
(Nina Kraus, Professor of Neurobiology,
Physiology and Communication Sciences
at Northwestern University)
ప్రొఫెసర్ లూ, శాస్త్రవేత్తలూ , నీనా క్రౌజ్ మున్నగు వారి అధ్యయనాల ప్రకారం,
సంగీతం వలన కలిగే ఉపకారముల చిట్ఠా విశేషాలు  లోకానికి వెల్లడి ఐనాయి.  
పియానో, గిటార్, వయొలీన్ లాంటి వాయిద్యాలను నేర్చుకుంటూన్న
బాల బాలికలనూ, పెద్ద వాళ్ళను పరిశీలించారు.
 music instruments  పైన సంగీత సాధన చేసిన
వ్యక్తుల  మెదడు భాగాల పని తీరును  పరీక్షించారు.
సంగీత అభ్యాసకుల మెదడు భాగాలు
సంగీతంలోని స్థాయీ భేదాలను గ్రహిస్తూంటాయి.
Pitch - అనగా స్థాయీ వ్యత్యాసాలను పరిశీలన చేయడము అలవాటు అయిన
brain parts
నిత్య జీవితంలో  తటస్థ పడుతూన్న
ధ్వని తరంగాలలోని స్వల్ప భేదాలను కూడా
చిటికెలో పసి గట్ట గలుగుతున్నాయి.
ప్రపంచంలో ఉచ్ఛారణ పరంగా అత్యంత క్లిష్టమైన భాష " చైనా భాష ".
సంగీత విద్యార్ధులు సులువుగా ఆ పదాలనూ, నేర్చుకో గలిగారు.

;
మ్యూజిక్ కి గల శక్తిని గుర్తించిన తర్వాత
సంగీతానికి అమిత  గౌరవం ఇనుమడించసాగింది.
అనేక పరిశోధనలతో ఉప శాఖలు అభివృద్ధి గాంచ సాగాయి.
మన భారత దేశంలో ఆర్యుల రాకతో "వేదములు",
నిత్య జీవన విధానాలను తీర్చిదిద్దినవి .

ఋగ్ వేదము,
యజుర్ వేదము,
సామ వేదము,
అధర్వణ వేదములు

ఈ నాలుగు వేదములూ,
వీనిలోని మంత్రాలు లయ బద్ధంగా రూపొందినవి .
ముఖ్యంగా "సామ వేదము" లోని  మంత్రోచ్చారణలు
సంగీత నిర్మాణానికి పునాదులు వేసినవి.
ఫలితముగా ప్రజలకు సంగీతము పట్ల అభిరుచిని
పెంపొంద జేసినది ఈ ప్రక్రియ.
క్రమేణా ప్రజా జీవితములతో పెనవేసుకుని,
సంగీతమునకు అవినాభావ సంబంధము ఏర్పడినది.

అందుచేతనే మన ఇండియా లో
సాంప్రదాయకముగా " సంగీత కళ "
అత్యున్నత శిఖరములను అందుకున్నది.
లలిత కళలు - లో "సంగీతము" ప్రధాన స్థానమును ఆర్జించినది.

               (By:- kadanbari)

సంగీత ప్రభావము గొప్పది! మ్యూజిక్ ఇస్ Divine

Thursday, November 17, 2011

గ్వాలియర్ లో “సూరజ్ కుండ్”


 సూరజ్ సేన్ మహారాజుకు ఉన్నట్టుండి, మాట తడబడ సాగింది.
ఆయనకు “నత్తి” వచ్చింది.
తత్కారణంచే అమాత్య, సేనాధిపతి, ప్రజలతో
రాజ కార్య, ముఖ్య కార్యాలను గురించి చర్చించడానికి
ఈతని నత్తి- పెద్ద అవరోధంగా మారినది.
“ప్రభూ! మృగయావినోదము చేస్తే, మనోవ్యధ తగ్గుతుంది” అంటూ
రాణి, మంత్రులు సలహా ఇచ్చారు.
సూరజ్ సేన్ మహారాజు అడవిలో వేటకు వెళ్ళాడు.
అలాగా గుఱ్ఱముపై స్వారీ చేస్తూ, దారి తప్పియాడు.
గొంతు ఎండి పోయి, దాహంతో నాలుక పిడుచ కట్టుకుపోతూన్నది.
దారీ తెన్నూ తెలియందు, దికుతోచని స్థితి!
అక్కడ ఒక పెద్ద చెట్టు కింద ముని తపస్సు చేసుకుంటూన్నాడు.
అతని పేరు “గ్వాలిపా”.
గ్వాలిపా మహర్షికి సూరజ్ సేన్ నమస్కారం పెట్టి,
“మహాత్మా! నా పేరు సూరజ్ సేన్.
ఇక్కడ కీకారణ్యంలో చిక్కుకున్నాను.
భరించలేనంత దప్పికగా ఉంది” అంటూన్న
ఆతనితో- మౌని ఇలాగ చెప్పాడు
“ఓ రాజా! అదిగో అక్కడ నీరు ఉన్నది.
ఆ కుండములోని జలము గొప్ప శక్తి కలది.
ఆ నీళ్ళను తాగితే, రుగ్మతలు, జబ్బులు తగ్గిపోతాయి”
వెంటనే సూరజ్ సేన్ ఆ నీటి మడుగు వద్దకు వెళ్ళి, నీటిని గ్రోలాడు.
ఆ రాజు అంతకు మున్ను కొన్ని ఏళ్ళ నుండీ,
దేహబాధతో అలమటిస్తూన్నాడు.
అక్కడి నీళ్ళు త్రాగగానే-  ఆతడి బాధ, నత్తి కనికట్టులా మాయమైనవి.
ఇట్టి వింతను ఊహించని రాజు,
హర్షానందములతో ఆ ఋషికి మోకరిల్లాడు.
“స్వామీ! మీకు నేను ఏమి ప్రతిఫలమును ఇవ్వగలను?
మీరు ఏది కోరితే అది ఇస్తాను, చెప్పండి”
అందుకు బదులుగా మహర్షి ఏమి కోరాడో తెలుసా?
బదులుగా రాజ్యాలనూ, ధనాలనూ, ఆస్థిపాస్థులనూ కోరలేదు,

“రాజా! సన్యాసులకు వేరే కోరదగినవి ఏమి ఉంటాయి?
సరే! నీవు ఉగ్గడించిన విధంగా ఒక చిన్న మనవి,  తీర్చగలవా?”
“అవశ్యం! సెలవీయుము స్వామీ!”
“ఈ మహత్తు గల జలములు
ప్రజలు అందరికీ అందుబాటులోనికి వచ్చే మార్గమును అనుసరించుము”
అందుకు “వల్లె!”అన్న రాజు తన మహలుకు వెళ్ళాడు.
అక్కడ తన భార్యకు జరిగినదంతా పూసగుచ్చినట్లు వివరించాడు.
పట్టమహిషి, పరిజనమూ
“మన మహా ప్రభువు సంపూర్ణ ఆరోగ్యవంతుడు ఐనారు” అని
సంభ్రమాశ్చర్యాలతో చెప్పుకున్నారు.
మంత్రి, అమాత్యులు, అంతఃపుర స్త్రీలు అందరూ
ముని వాక్కు గూర్చి- ఆ విషయాలను చర్చించి, తుది నిర్ణయానికి వచ్చారు.
తాపసి వాక్కు ఆచరణలోనికి రావాలంటే-
అక్కడ ఆ అటవీ ప్రాంతాన్ని జనావాస యోగ్యంగా మార్చాలి- అనుకున్నారు.
కొన్నిరోజులలోనే వాస్తు పండితులు,శిల్పులు, భవన నిర్మాణము వారూ,
యావన్మందీ తలా ఓ చెయ్యీ వేసారు,
ఆ ప్రాంతము ఒక నగరముగా మారిపోయినది.
పేద ప్రజలు,  నీరస పీడితులు. ఆ జలములతో పునః శక్తిమంతులు అవసాగారు.
అందరూ ‘గ్వాలిపా’ ముని పట్ల కృతజ్ఞతతో- “గ్వాలియర్” అని పిలవసాగారు.
అలాగే ఆ జలనిధి “సూరజ్ కుండ్” అనే నామముతో విరాజిల్లినది.
మధ్యప్రదేశ్ రాష్ట్రములోని గ్వాలియర్ -
తాన్ సేన్ మున్నగు చక్రవర్తుల కట్టిన దుర్గములు, తటాకములు,
ప్రకృతి దృశ్యములతో   కనువిందు చేస్తూన్న చారిత్రక నగరము.


గ్వాలియర్ లో “సూరజ్ కుండ్” (Link:- Forkids, WEB)
Published On Thursday, October 13, 2011 By ADMIN. 
Under: విజ్ఞానం, వ్యాసాలు.   
రచన: కాదంబరి

[కాదంబరి -  http://akhilavanitha.blogspot.com/ ]
 

నాట్య హేలలు నీవి! పారవశ్యము మాది!
కాళీయ మర్దనము; నెపముగా దొరికింది;
నాట్య హేలలు నీవి; క్రిష్ణా!; పారవశ్యము మాది! ||
 ;
ముందు జన్మలలోన మా కన్నుదోయి
ఏమి నోముల నోచుకున్నాయొ గానీ
నందబాలుడ!
పుణ్య దృశ్యాలను పొదువుకున్నాయిరా!     ||
;
పడగల పాన్పులలోన శయనించు నీకు
కాళీయ నాగము చుట్టమే లేరా!    
కాళీయమర్దన!
నీవు చెప్పని ఊసు, గుట్టు తెలిసిందిరా! ||
;
(నాట్య హేలలు నీవి! పారవశ్యము మాది!)
;

వనదేవత నివాసముఆలమందల కాచుచూ ఆ అడవిలోన;
గోపబాలుడ!
విద్యలను, కళలను  రమ్యమొనరిస్తావు;
నీవున్న ప్రతి తావు
వనదేవి వాసమే! రస రమ్య రాజ్యమే!  ||      
;
లీలగా  తన వ్రేళ్ళు, నాట్యమాడిన వేళ;    
వెదురు కాస్తా; వేణువైనాదిరా!
దొరా! -      
శూన్య వంశీ కూడ;                
రాగ భోగినిగా మారి పోయిందిరా! ||
;
సిగలోన పూవులకు, పోటీగ పింఛములు;  
ఆసీనులవగాను; పట్టుబట్టిన నెమలి గెలిచిందిరా!
దొరా!
తన పురిని విప్పార్చి
నెమలి కన్నులు చాల ఇచ్చిందిరా!  ||

**************************\\\

 వనదేవత నివాసము  ; కళా రస రమ్య రాజ్యము ;
;

Wednesday, November 16, 2011

మబ్బులు, చందమామ


నీలి నీరద రాసులు రాసులు;
అగుడూ దిగుడూ పరుగులు, పరుగులు||

జాబిలి కసిరెను;
"మా కాళ్ళకు వేళ్ళకు
అడ్డం వస్తూ ఉంటే అలాగ?"
అంటూ, జాబిలి కసిరెను   ||

భామల మోములు చంద్ర బింబములు;
శ్యామ కృష్ణుడు నీలి మేఘము;
భువిలో కుదిరిన శత్రుల స్నేహము;
గనినంతనె;
ఆ గగన జీవులకు కడు ఆశ్చర్యము ||

&&&&&&&&&&&&&&&&&&&&

Tuesday, November 15, 2011

క్రిషుని మాయలు


రాధ ప్రేమల రాజు;
ఈ రోజు కన రాడు;
ఏ రోజాల కౌగిటిలొ;
మైమరచి ఉండేనొ? ||

రాజీవలోచనుని జాగీరు ఆయెనే;
పూర్ణేందు చంద్రికలు
వలపు జాలములెల్ల;
తన-పరికరములాయె ||

మారీచునీ వోలె మాయ లేడిగ మారి;
ఇనబింబమున చేరె;
ఏమి చోద్యములమ్మ!
మోడీలు తగునా?! ||


(క్రిషుని  మాయలు, మోడీలు)
;

పరశురాముని Calender పద్ధతి పేరు "కొల్లమ్


చిప్లన్ పట్టణం మహారాష్ట్రలో ఉన్నది.
ఇక్కడ "పరశురామ కోవెల"ఉన్నది.
వాశిష్ఠీ నదీ తీరాన ప్రకృతి సోయగాలు,
జలపాతాల జలజలలూ సౌందర్యభరితాలు.              
;

పరశురాముడు రూపొందించిన కాలనిర్ణయ పద్ధతి పేరు "కొల్లమ్ ".
అప్పుడే కొత్త సంవత్సరం వస్తూన్నది,          
కనుక ఈ విశేషాన్ని గుర్తుకు తెచ్చుకుందాము.
"కొల్లమ్" కేలండర్ ను  -
కేరళ లో అనుసరిస్తూన్నారు.
కొల్ల వర్షమ్/ మళయాళ కేలండరు/ కొల్లమ్ శకము ను
కేరళ రాష్ట్రములో ప్రజలు అనుసరిస్తున్నారు.
పరశురామ నిర్మాణము ఐనట్టి
ఈ కొల్లమ్ శకము
క్రీస్తు పూర్వము ౮౨౫ నుండి ఆరంభమైనది.
"కలరి పయట్టు" అనే యుద్ధ కల కూడా పరశురాముని సృష్టియే!
Malyalam Calender :- Kollam Era (AD 825);
"బంద్ గంగా సరస్సు" ఉన్నది.
ఇది పరసురాముడు ఐదు బాణములను వేసి
పాతాల జలను బైటికి తెప్పించాడు.
అదే ఈ "BandGanga"పుష్కరిణి.

parasurama (Link )
;
;

Monday, November 14, 2011

ఇసుక తిన్నెలకు పాపిటి బిళ్ళలు

కొలనున తామర, కలువల్లు;
అందాలకు విలువౌ  నెలవుల్లు ||

జలముల ఈదే నెలవంక;
కొబ్బరిమట్టలు ఇచ్చునులే!;
“చంద్రుని కెన్నో నూలుపోగులను ||

ఒడ్డున కులుకుతు లుకలుకలాడే
పీతలు, నత్తలు, చిటి తాబేళ్ళు
పరుగు పందెమున జమాజెట్టిలు ||

పిలలు కట్టిన పిచ్చుక గూళ్ళు;
తీరములందున ఇసుక తిన్నెలకు;
సింగారించిన పాపిటి బిళ్ళలు     ||

పెద్దల్లారా! శషభిషలెందుకు?;
మీ ఉడుకుమోతుతనములు తొలగించి,
పిన్నలతోటి చేతులు కలిపి;  
శాంతితొ చేద్దురు సహవాసమును ||
;

ఇసుక తిన్నెలకు పాపిటి బిళ్ళలు ;
October 30, 2011 By: జాబిల్లి  (Link for poem song)
Category: పాటలు

రచన : కుసుమ


యశోద కనుదోయి


నీ కన్న తల్లి యశోదమ్మ ముందరనా,
ఏమిన్ని మాయలు, నటనలూ, ఆటలూ
చిన్నారి క్రిష్ణయ్య! కితకితలు ఆపవూ!? ||

మిన్నులను తాకేటి విశ్వ రూపములను;
కన్నులకు బొమ్మగా కట్టించినావు;
చిన్ని క్రిష్ణయ్యా!
నా కన్నులు చిన్నవి, చింతాకు లంతవి,
అన్నన్ని చిత్రములు ఎటుల పట్టేను? ||

మిరుమిట్ల జిగినీలు, ఆయె నీ కనుదోయి;
వరముల బరువాయె- నీ సృష్టి విభ్రాంతి
పురి విప్పనీవోయి భువనముల అందాలు
తురుముకోకుండునా ఎవరి నయనాలైన!? ||
:

యశోద కనుదోయి (Forkids)
Published On Friday, October 21, 2011
By ADMIN. Under: పాటలు.  
రచన: కాదంబరి
:

సారసాక్షుని సన్నిధి


సందేహములేలనె? ;
సన్నుతాంగుని ;మేలిమి
ప్రేమా అనురాగముల పెన్నిధి
దొరకబుచ్చుకోవే! ఓ మనసా! ||    

సారసాక్షుడే సదా మనకు;
రక్షణగా ఉండగా;
లక్ష యోచనలు సేయ;
ఏల తత్తరలు, నిరీక్షణలు, మనసా! ||

భక్త కోటినీ కాచు;
దక్షత గల హస్తము;
అభయహస్తము;
అండ నీకు దొరికెను గద మనసా! ||

జగన్నాధుడు చల్లని ;
నీడ నొసగెడు స్వామి;
వేరు చూపులు ఏలనె?; మనసా!   ||

సందేహములేలనె? ;
సన్నుతాంగుని ;మేలిమి
అనురాగముల పెన్నిధి
దొరకబుచ్చుకోవే! మనసా! ||

************************///

saMdEhamulElane? ;
sannutaaMguni ;
mElimi prEmaa anuraagamula pennidhi ;
dorakabuchchukOvE! manasaa! ||

saarasaakshuDE sadaa manaku;
rakshaNagaa uMDagaa;
laksha yOchanalu sEyaga;
Ela tattaralu, niriikshaNalu, manasaa! ||

bhakta kOTinii kaachu;
dakshata gala hastamu;
abhayahastamu;
aMDa nIku dorikenu gada manasaa! ||
jagannaadhuDu challani ;
nIDa nosageDu swaami;
vEru chUpulu Ela?; manasaa! ||
;

Monday, November 7, 2011

పెద్దపట్నం జాతర


ఇంద్రకీలాద్రి అనే కొండ తెలంగాణాలో ఉన్నది. (బెజవాడ కనకదుర్గమ్మ కొలువు ఐన చోటు "ఇంద్రకీలాద్రి")
చెర్యాల మండలములో కొలువుతీరాడు కొమరెల్లి మల్లన్న దేవర.
వరంగల్ కు దగ్గరలో ఉన్న సుప్రసిద్ధ క్షేత్రము.
మల్లన్న యాదవ కన్య "గొల్ల కేతమ్మ"నూ, లింగబలిజ "మేడలమ్మ"నూ పెళ్ళి చేసుకున్నాడు. భార్యల మూర్తులు కూడా ఇక్కడ ఉన్నవి.
కొమురవెల్లి మల్లన్న స్వామి దేవళము,
తెలంగాణా ప్రాంతాలలో ప్రసిద్ధి.
విగ్రహ రూపములో గుట్ట పైన గుహలో వెలిసిన దేవుడు .
"కొమురవెల్లి మల్లన్న కోర్కెలు తీర్చే మల్లన్న" అని భక్తి కీర్తనలు ప్రసిద్ధి.
ఈ కొమురవెల్లి మల్లన్న స్వామి Statue
"పుట్టమన్నుతో తయారు చేయబడినది"
అదీ ఇక్కడి విశేషం.
కొమురవెల్లి మల్లన్నస్వామి విగ్రహము యొక్క నాభి(బొడ్డు) లో
"స్వయంభూ లింగము(పుట్టు లింగము)" ఉన్నది.
అందు చేతనే ఈ మూర్తికి
ఎంత తడి, తేమ తగిలినప్పటికీ,
నిత్య నూతనంగా ఉంటున్నది.
కొమురవెల్లి మల్లన్నపుణ్యక్షేత్రములో ఒక వృక్షము ఉన్నది.
అది గంగరావిచెట్టు. కొమురవెల్లి మల్లన్న కోవెల,
ఈ గంగరావి చెట్టు సమాన వయస్సు ,
అనగా 500 ఏళ్ళు.
కాకతీయుల కాలము నాటి వీర శైవ ఆచారాలు అనుసరించబడుతూన్నవి.
"ఒగ్గు కథ, ఒగ్గు విధాన అర్చనలు"ఆచరణలో ఉన్నవి.
మట్టి పాత్రలలో ప్రసాదములను వండుతారు.
ఆ ప్రసాదపు కుండలను తమ తమ గృహాలకు తీసుకువెళ్ళి, తింటారు.
భుజించిన  తరువాత
ఆ పవిత్ర పాత్రలను పాడి వృద్ధి అనే దృక్కోణముతో వాడుతారు.
ప్రసాద కుండలలో గేదెల, ఆవుల,పశువుల పాలను పికుతారు.
అందు చేత ఏడాది పొడువునా తమ ఇళ్ళలో
పశు సంపద, క్షీర సంపదలు సమృద్ధిగా ఉంటాయని
భక్తుల నమ్మకము.
పెద్దపట్నం జాతర అని పేరుపొందిన
శివరాత్రి జాతర   ఘనంగా జరుగుతుంది.

&&&&&&&&&&&&&&&&&&&&&

గంగరావి చెట్టుకి 500 సంవత్సరములు (Tulip tree ?)
;

Tuesday, October 25, 2011

దీపావళి దేవికి ఇష్టమైన రాగాలుదీపావళి దేవికి
ఇష్టమైన రాగాలు
టపాసుల మోతలు
బాణసంచా ధ్వనులు
;
దీపావళి దేవికి
ఇంపైన గీతాలు
ఇష్టమైన రాగాలు
||ఇవే! ఇవే! ఇవేనండి! ||
;
కాకర పూ కడ్డీలు
వెన్నముద్ద తెలికాంతులు
సర్రుమని నింగిలోకి
దూసుకెళ్ళే రాకెట్లు
||ఇవే! ఇవే! ఇవేనండి! ||
;
  వాడ వాడలన్ని
ప్రభల చిత్రలేఖనలు
ఆడ ఈడ అన్ని చోట్ల
అల్లుకునే వెలుగులు ;                                         ||ఇవే! ఇవే! ఇవేనండి!                                             ఇవే! ఇవే! ఇవేనండి! ||


  rachana: కాదంబరి

దీపావళి దేవికి ఇష్టమైన రాగాలు (Link 1:- Newaavakaaya - WEB)

జాబిల్లి తడబాటు (Link 2 :-"konamanini"- My Blog)


ఘనమైన దీపావళి (Forkids- WEB)Member Categories  - బాల


&&&&&&&&&&&&&&


Written by kusuma
Tuesday, 25 October 2011 05:06
ఇవే! ఇవే! ఇవేనండి!
Happy Deepavali
;

బొమ్మలు


toys- socks / wool 

;
బూట్స్ సాక్సు తో చేసిన 
చిట్టి చిట్టి బొమ్మలు; 
చూడండి. 
ఎప్పుడైనా చేయాలనిపిస్తే, 
ది ఒక ఐడియా కోసరమన్నమాట.


   Wool బొమ్మలు (Link)
;

Saturday, October 22, 2011

మాండలే Tree


big tree in Mandalay


మాండలే పేరు- బాలగంగాధర తిలక్ 
ఆరు సంవత్సరాలు ఖైదీ గా నిర్బంధం లో ఉన్న చెరసాల -
బ్రిటీష్ పాలిత దేశంలోని "మాండలే జైలు"ను
గుర్తుకు తెస్తుంది కదూ!!???????
ఈ పెద్ద చెట్టు మాండలేలో ఉన్నది.
ఈ బిగ్ ట్రీ వ్రేళ్ళను గమనించండి.
పిల్లలు కూర్చుని ఆడుకుంటున్నట్లుగా రూపు దిద్దుకున్న
ఆ వైనాన్ని ఎంజాయ్ చేయండి.

key words:-
Mingun, Mandalay, బిగ్ big tree in Myanmar

Sunday, October 16, 2011

ముల్లోకములకు పారవశ్యము


మంజుల వాణీ! శార్వాణీ! 
పినాక పాణి, హృదయ రాణివి!
అమ్మా!
నీ ఒడిలోన  
ముల్లోకములు మైమరచేను!   ||       


అమ్మా! 
నీ తమాల పల్లవ కటాక్ష దృక్కుల 
ముల్లోకములు మైమరచేను!   ||

తుషార మౌక్తిక ధవళ కాంతులు/ లను ;  
నిండిన చల్లని దరహాసములందున  ;
ముల్లోకములు మైమరచేను!   || 


(ఎల్ల లోకములకు పారవశ్యము )
;

మరువపు వరముల పరిమళములు
 ;;                          ప్రణవ సరసున అనుక్షణమును 
ఓలలాడు కేళీ హంసవు! మా అమ్మా!  గౌరీ!
తొణుకులాడును మా మానసముల 
నీ స్పర్శతొ పావనమైన జలములు  ||       


గాంధర్వ గానముల లాహిరిగా;
సౌందర్య వర్ణముల ఇంద్ర ధనువుగా
ప్రతి కెరటము ఎగయగ ఉల్లాసముగా 
మనసులు మానస సరోవరమ్ములే! ||తొణుకు||


ఈ మరువపు వరముల గుబాళింపులు
రంగరించిన అగరు పన్నీరులు
నిండుట  భక్తుల హృదయములు         
నీ చల్లని చూపుల అనుగ్రహమ్ములే!   ||తొణుకు||


( మా మనసులు నిండుట
        నీ అనుగ్రహము )

నిత్యము నీకు ముత్యపు హారతి!


సత్యము నిలిపే జగజ్జననివి!
నిత్యము నీకు ముత్యపు హారతి 
ఆరాధనలివె! గైకొనుమమ్మా!  ||  


కాత్యాయని! జననీ! కరుణార్ద్ర వర్షిణీ!  
పూర్ణ చంద్రికా విరాజ మానిని!
ఆరాధనలివె! గైకొనుమమ్మా!  ||


గాన విలాసిని! రాగ రూపిణీ!
మీన నేత్రి! శ్రీ విద్యాధికారిణీ!
                                                        ఆరాధనలివె! గైకొనుమమ్మా! ||
;

మాణిక్య వీణను సవరింపుమా!


మాణిక్య వీణను సవరింపుమా!
మా తల్లి! కామాక్షి!
అణువణువు ఈ విశ్వమే హర్షమై,
జల తరంగిణీ రాగ హేలోజ్జ్వలముగా
ఉప్పొంగుతూ పులకించగా   ||

శత కోటి సన్నుతులు వెల్లువలుగా
సతతమ్ము వెన్నెలలు జాల్వారగా
మా గళములే స్వర్ణాలయములై
శోభిల్లు మణి ద్యుతులు ఇవె! అందుకోవమ్మ!  ||

తరళాక్షి! శ్రీ చక్రసంచారిణీ!
సుర పూజితా! నీరద నీల వేణీ!
జిత మదన పరమేశు ప్రియ భామినీ!
రాజిల్లు అర్చనలు అందుకోవమ్మా!  ||
;
(మా గళ హేమ ఆలయములు)
;


'ఓమ్'కార మరాళీ!


ఇందు శేఖరుని ప్రియ పత్నీ!
ఆనంద దాయినీ! భగవతి! దేవీ!
పొందికగా మా పూజలందుకో!  || 

నంది వాహనుని మనోహారిణి!
మంద గామినీ! గగన దామినీ!
పొందికగా మా పూజలందుకో!  || 

హంస గామినీ! కళ్యాణీ!
త్రిభువన రాజ్ఞీ! శ్రీ మాతా!
పొందికగా మా పూజలందుకో!  ||  


$$$$$$$$$$$$$$$$$$$$$$$$iMdu SEkharuni priya patnI!
aanaMda daayinI! bhagavati! dEvI!
maa pUjalaMdukO!   ||

naMdi vaahanuni manOhaariNi!
maMda gaaminI! gagana daaminI!
poMdikagaa maa pUjalaMdukO! ||

haMsa gaaminii! kaLyaaNI! ;  
tribhuvana kaariNi! SrI maataa!
poMdikagaa maa pUjalaMdukO! ||


;

మృదు దామిని! దుర్గా!


పావని! దుర్గా! హేమ ఖచిత సింహాసని! జననీ!
జయ హారతులను గైకొనుమమ్మా! ||


జీవనదాయిని! జగన్మోహినీ! ; 
దేవ దేవి! లావణ్య హాసినీ!; 
జయ హారతులను గైకొనుమమ్మా! || 


కరుణా మధు రస సుధా వాహినీ!
మంజుల వాణీ! మృదు సౌదామిని! 
జయ హారతులను గైకొనుమమ్మా! ||


నాద రూపిణీ! శాంభవి! దుర్గా! 
వేద సార 'ఓమ్'కార మరాళీ! 
విజయ హారతులు గైకొనుమమ్మా! || 


$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$paavani! durgaa! hEma khachita siMhaasani! jananI!
jaya haaratulanu gaikonumammaa! ||


jIvanadaayini! jaganmOhinI! ; 
dEva dEvi! laavaNya haasinI!; 
jaya haaratulanu gaikonumammaa! ||


karuNA madhu rasa sudhaa vaahinI! ; 
maMjula vANI! mRdu saudaamini! 
jaya haaratulanu gaikonumammaa! ||


naada rUpiNI! SAMBavi! durgaa! 
vEda saara Oమ్ kaara maraaLI!
jalapaata mOhinI!
vijaya haaratulanu gaikonumammaa! ||


$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$