Tuesday, May 20, 2014

శ్యామచంద్ర గజ రాజు

"ధనమేరా అన్నిటికీ మూలం" అన్నాడు సినీ గీతకారుడు.
బొమ్మా బొరుసా- అనే తెలుగు సినిమా,
కథా బలముతో సినీ విమర్శకుల ప్రశంసలను పొందింది.
ఎస్. వరలక్ష్మి నటన హైలైట్. పందెం కట్టి, పంతం పట్టి
ఆమెను చంద్రమోహన్, చలం,
(భర్త ముక్కామల, కుమార్తె వెన్నిరాడై నిర్మల) ఎలా ఓడించారు?-
అనే అంశముతో
అనేక ఆసక్తిదాయక మలుపులతో సాగిన చలన చిత్రము అది.
1971 లో రిలీజ్ ఐన "బొమ్మా బొరుసా" (Heads or Tails)-
కె. బాల చందర్ దర్శకత్వ ప్రతిభకు గీటురాయి.

daalphin fish


*******************
రూపాయి- అంటే నోట్లో వేలు వేస్కుని,
చీకుతూండే పసిపాపాయికి కూడా తెలుసు.
"ధనమూలమిదం జగత్"- అనిన్నీ,
"డబ్బుకు లోకం దాసోహం"- ఇలాంటి సామెతలతో-
ధనమునకు ఉన్న విలువ వెల్లడి ఔతూనే ఉన్నది.
రూకలు, వరహాలు, దీనార టంకములు, మొహిరీలు లాంటి పేర్లు
బి.సి.  నాటి నుండీ వినియోగములో ఉన్నవే!
“పైస మే పరమాత్మా హై”
అంతెందుకు, క్రికెట్టు వగైరా క్రీడలలో –
ఏ టీము ముందు ఆడాలో నిర్ణయించేది
ఈ కాసుకి - రెండు వైపులా ముద్రించబడి ఉన్న- బొమ్మా- బొరుసులే!
మనము ఇప్పుడు వాడుతూన్న “రూపాయి” రూపానికి
ప్రతిరూపమునకు మూల కారణము షేర్ షా.

*****************;

షేర్ షా సూరి  కాలం నాటికి అనేక రూపాలలో- ద్రవ్య వినిమయాలు ఉండేవి.
వస్తు మారక పద్ధతి, బంగారు, వెండి నాణెములు, తోలుపై ముద్రణలతో,
కాసులు, మున్నగునవి విపణివీధిలో చలామణీ ఔతూండేవి.
అప్పటికి “రూపయ్య”/ రుపయ్యా- Rupee
(బ్రిటీషు వారి పలుకుబడిలో అదే “రుపీ” అనే పేరును కూడా పొందింది)
ఏ వెండి నాణెము అయినా – రూపాయి- అనే చెప్పబడేది. వ రించి
దేనినైనా నాణెము- రుపయ్యా - అని ప్రజలు చెప్పేవారు.
అయినప్పటికీ - షేర్ షా డిజైన్ చేసిన పద్ధతి- గుర్తించబడినదని చెపవచ్చును.
షేర్ షా వెండి కాయిన్ కు ఉండవల్సిన బరువును నిర్ధారించాడు.
షేర్ షా నిర్ణయించిన రజత నాణెము బరువు పరిశీలనకు నిలిచి,
తర్వాతి వారు- ఆ ప్రామాణికతనే గైకొన్నారు.
178 గింజల బరువు సిల్వర్ కాయిన్ ది.
షేర్ షా బంగారు నాణెము బరువు – 169 గింజల ఎత్తు-అని నిర్ణయించాడు.
అలాగే షేర్ షా రాగి నాణాలకు ఉండాల్సిన బరువును నిర్ధారించి,
రాగి నాణెమును- “దం” అని చెప్పేవాళ్ళు.
స్వర్ణ నాణెమును “మొహర్” అని చెప్పారు.
మన ఇండియాలోనే కాక, నేపాల్. శ్రీ లంక, ఇండొనేషియా,
మారిషస్, మాల్ దీవులు, సిషిల్లెస్ దేశాలలో –
“జాతీయ కరెన్సీ” ( National Currency) రూపాయి/ రుపీ.
షేర్ షా దూర దృష్టికి దృష్టాంతము- నేటికి ఆయా దేశాల ప్రభుత్వాలూ, గవర్నమెంట్సూ -
షేర్ షా డిసైడ్ చేసిన బరువునే “స్టాండర్ద్ గా అనుసరించడమే
షేర్ షా  దక్షతకు నిదర్శనము.

షేర్ షా సూరి  1540 నుండి 1545 వరకూ పాలన చేసాడు.
ఆ అయిదు ఏళ్ళలో అతను ప్రవేశపెట్టిన సంస్కరణలు –
హుమాయూన్ కుమారుడు అక్బర్ కు రాజ్య పాలనకు,
సుపరిపాలనకు గట్టి పునాదులను అందించాయి.
నేటి ఇండియాలో కూడా అవి అనుసరించబడుతూన్నవి.
టాపాలా పద్ధతి, రూపాయి నాణెము అమలులోనికి వచ్చుట,
గ్రాండ్ ట్రంక్ రోడ్ ల నిర్మాణాలకు – సుగమమార్గములను ఏర్పరిచినవి.
షేర్ షా రూపకల్పనలు చేసి, అప్పటికప్పుడు- వాటిని అమలు అయ్యేలా చేయగలిగాడు.
ఈ కొత్త పద్ధతులు- ఆధునిక గవర్న్ మెంటుల ప్రభుత్వ కార్యక్రమాల
మెయింటినెన్సులు సజావుగా జరగడానికి మూలస్తంభాలు ఐనవి.

**************************************;

షేర్ షా సూరి  జీవితంలో ఒక విచిత్ర సంఘటన జరిగినది.
షేర్ షా జార్ ఖండ్ పైకి దండెత్తాడు.
ఆ సీమ బంగారం, వెండి వంటి అనేక ఖరీదైన ఖనిజాలకు నెలవు.
అందువలనఇతర రాజుల కన్ను ఈ ప్రాంతం పై ఉండేది.
తరచూ దండయాత్రలకు గురి ఔతూండేది.
కానీ షేర్ షా దండెత్తి రావడానికి మాత్రం
వింత కారణమొకటి ఉన్నది. అది,
అతను ఒక ఏనుగు కోసమై జార్ ఖండ్ పై
పోరుకు సిద్ధపడ్డాడు.
జార్ ఖండ్ రాజు వద్ద "శ్యామ చంద్ర" అనే తెల్ల ఏనుగు ఉన్నది.
శ్యామ చంద్ర - అంటే నల్ల చంద్రుడు - అని అర్ధము.
సాధారణ గజములు,తమ తొండములలో మట్టిని పూరించి,
తన దేహములపైన చల్లుకుంటాయి.
ఐరావతము జాతికి చెందినట్టి
ఈ జార్ ఖండ్ రాజా గారి శ్వేత హస్తి
అలాగ ఇసుకను తన ఒడలుపై వెదజల్లుకోక-
శుభ్రంగా ఉంచుకుంటుంది.
ఈ "శ్యామచంద్ర గజ రాజు" - భాగ్య దాయిని-
అనే నమ్మకము బహుళ వ్యాప్తిలో ఉన్నది.
షేర్ షా- కూడా- ఈ విశ్వాసముతో- పోరుకు రెడీ ఐనాడు.
"ఈ శ్యామ చంద్ర ఏనుగు  తన వద్ద ఉంటే-
తనకు ఢిల్లీ సింహాసనము హస్తగతమౌతుంది" అని అనుకున్నాడు.
అలాగ అతడు ఆ ఏనుగును స్వంతము చేసుకున్నాడు.
అటు తర్వాత ఆతని కోరిక నెరవేరింది కూడా!
;
(దీనార టంకములు

Sunday, May 18, 2014

చూడండి! ఓ అమ్మణీ!


తడబడెడు అడుగులతొ 
అడుగులే వేశాడు, 
చిన్ని క్రిష్ణమ్మ!;
పద్మాలు విరిసాయి ఆ అడుగులో||

అడుగడుగొ అతడేనె అల్లరి క్రిష్ణుడు;
మారాములన్ మేటి, గారాల క్రిష్ణుడు; 

అడుగుదాము రండి; 
ఆకతాయీ పనులు మానుకొమ్మనుచూను ||  

చేతులతొ నీటిలో: తపతపలు, 
కొట్టుచూ ఆటలే ఆడాడు, చిలిపి క్రిష్ణయ్య 
శంఖులే నీటిపై తేలి వచ్చాయి ||

చిరు నగవు విరియగా “అమ్మత్త” పలికాడు; 
తొక్కు లే పలుకుల్ల 
పగడాల పూవులే విరబూసినాయి ||                     

పుట్టచాటున నక్కి; దొంగాటలాడాడు; 
ఆదిశేషుని వేయి పడగల పైన 
మరకతమ్ముల ద్యుతులు, 
మిరుమిట్లు గొలిపేను, ఓ అమ్మలాల! 
కనుల మిరుమిట్లు గొలిపేను,  ॥ 

చెట్టు కొమ్మల ఎక్కి, వెక్కిరించాడు, కొక్కిరించాడు;
"కొక్కిరాయీ!" అనుచు పిలిచారు భామినులు;
అలుక బూని కన్న; బుంగమూతిని పెట్టి 
పొన్న కొమ్మల నెక్కి బాగ కూర్చున్నాడు, 
వెన్నముద్దలు తెండి! ఓ అమ్మలాలా! 
కినుకను మాన్పిస్తేను, తులిపి బాలకుడు ఆ
కు గుబురులనుండి, ఇట్టె దిగి వస్తాడు, 
మా మురిపాల చిన్ని క్రిష్ణమ్మ ||

పద్మములు, శంఖములు విరిసియున్నట్టి;
పదములతొ తడబడెడు అడుగులే వేసాడు, 
చిన్ని క్రిష్ణమ్మ! మా ముద్దు క్రిష్ణయ్య ||

*******************************,


taDabaDeDu aDugulato; aDugulE wESADu, chinni krishNamma!;
padmaalu wirisaayi , aa aDugulO||

chEtulato nITilO: tapatapalu, koTTuchU ATalE ADADu/
SamKulE niiTipai tEli wachchaayi ||

chiru nagawu wiriyagaa ammatta palikaaDu; 
pagaDAla puuwulE wirabUdinaayi ||

puTTachaaTuna nakki; domgaaTalADADu; 
aadiSEshuni wEyi paDagala paina marakatammula dyutulu, 
kanula mirumiTlu golipEnu, chuuDamDi! O ammalaala! 
cheTTu kommala ekki, wekkirimchaaDu, kokkirimchaaDu;
"kokkiraayii!" anuchu pilichaaru bhaaminulu;
aluka buuni kanna; ponna komma nekki kuurchunnaaDu, 
wennamuddalu temDi! O ammalaalaa! kinukanu maanpiste, 
aaku guburulanumDi, iTTe digi wastaaDu, maa muripaala ||

padmamulu, SamKamulu wirisiyunnaTTi;
padamulato taDabaDeDu aDugulE wEsaaDu, ||

నెహ్రూజీ, నీలం పుస్తకము


ఇండియా తొట్ట తొలి ప్రధాన మంత్రి. బాలలకు ఈయన “చాచా నెహ్రూ”. శాంతిపావురములను ఎగురవేసే  అలవాటు జవహర్ లాల్ నెహ్రూ ద్వారా వ్యాప్తి చెందింది. ఒక సాధారణ వ్యక్తికి జవహర్ లాల్ నెహ్రూ తటస్థపడినప్పుడు జరిగిన సంఘటన ఇది.

మహాన్ సింఘ్ బయస్ ఒక జూనియర్ పోలీసాఫీసర్. 1958 లలో అతను సెక్యూరిటీ డ్యూటీ చెయ్యాల్సివచ్చింది. బోంబే (నేటి ముంబై) దగ్గర తాన్సా అనే ఊళ్ళో భద్రతా విధుల పని పడింది. అక్కడికి వస్తూన్న వ్యక్తి సాక్షాత్తూ దేశ ప్రధాన మంత్రి. ప్రారంభోత్సవ వేడుక ఐపోయింది. నెహ్రూ వేదిక నుండి కిందకు దిగాడు. వెదురు కర్రలతో కట్టిన బారికేడులను దాటి వచ్చారు. ఆయనను కలవాలని ఉబలాట పడ్తూన్న ప్రజల వద్దకు జవహర్ లాల్ నెహ్రూ చేరారు.

జనాలను కంట్రోల్ చేయడం క్లిష్ట సమస్య ఐంది. సింగ్ తన లాఠీ (swagger stick)ని ఝళిపిస్తూ  జవహర్ లాల్ నెహ్రూ వెనుక బయల్దేరారు. గుంపులను అదుపు చేయడం దుస్సాధ్యంగా మారింది. నెహ్రూ చుట్టూ కమ్ముకున్న మనుషులను లాఠీని విసురుతూ, సింగ్ కాపలా కాస్తున్నాడు.

అకస్మాత్తుగా తన చేతిలోని లాఠీని ఎవరో లాగి విసిరేసారు. సింగ్ ఆగ్రహంతో చుట్టూ చూసాడు. తీరా చూస్తే అలా లాగి విసిరేసిన వారెవరో కాదు - జవహర్ లాల్ నెహ్రూ. లాఠీ కఱ్ఱను లాగి తీసుకుని, తన వైపు చూపిస్తూ అడుగుతున్నాడు-

“ఏమిటి నువ్వు చేస్తూన్న పని?”

నెహ్రూ కరకుగా అడిగాడు. అలా కర్కశంగా అరిచి, వెంటనే తన పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ కి ఆర్డర్ జారీ చేసాడు-“ఈతనిని ఈ పని నుంచి పంపిచేసేయండి.”

కనురెప్పల కరకట్టలను దాటి వస్తూన్న కన్నీళ్ళను ఎలాగో ఆపుకుంటూ అక్కడి నుండి మహాన్ సింఘ్ బయస్ నిష్క్రమించారు.

******

కాస్సేపటి తర్వాత తర్వాత ప్రైమ్ మినిష్టర్ నుంచి సింగ్ కి ఆదేశం (సమ్మన్లు) వచ్చింది. “నా ఉద్యోగానికి ముప్పు వచ్చింది.” అనుకుంటూ గడగడ వణుకుతూ అక్కడికి చేరారు సింగ్.

మొరార్జీ దేశాయి, తతిమ్మా లీడర్లతో   కూర్చుని ఉన్నారు నెహ్రూ.    

“నువ్వేం చేద్దామనుకున్నావు??” సింగ్ ధైర్యాన్ని కూడగట్టుకుంటూ ఎలాగో పలికాడు – నత్తి నత్తిగా ఇలాగ “సర్! బ్లూ బుక్ ను నేను ఫాలో అయ్యాను.”

Blue Book  ప్రముఖ వ్యక్తులు (VVIP security measures) వచ్చినప్పుడు వాళ్ళకు భద్రత ఎలాగ కల్పించాలో తెలిపే బుక్. సెక్యూరిటీ ప్రమాణాలను వివరిస్తూన్న విధుల నియమావళి పట్టిక రాసి ఉంచిన పుస్తకము                                                  

సెక్యూరిటీ ఆఫీసర్, మొరార్జీ దేశాయి లు ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూకి కొంచెం వివరంగా చెప్పారు.

నెహ్రూ కొంతసేపు మౌనంగా ఊరుకున్నారు. ఒక క్షణం ఊరుకున్న తర్వాత తల పంకిస్తూ అన్నారు “యంగ్ మాన్! వాస్తవం చెప్పాలంటే నువ్వే రైటు. నాదే పొరపాటు. అయాం సారీ!”

మహాన్ సింగ్ బయస్ ఆ సంఘటనను తలుచుకుంటూ చెబ్తూంటారు,

“కేవలం ఒక junior police officer వద్ద తన తప్పును ఒప్పుకునారు అంతటి ప్రధాన మంత్రి. అలాగ తన తప్పును తాను తెలుసుకుని, వెంటనే పశ్చాత్తాపంతో నెహ్రూజీ ఆడిగారు. అదే ఆయన గొప్పదనము.”

పండిట్ జీ అలాగ సారీ చెప్పగానే అప్పటిదాకా బిగబట్టున్న అశ్రువులు ధారాపాతంగా వెలువడినవి.

“ఈసారి నేను నా కళ్ళలో నీళ్ళను ఆపుకోవడానికి ప్రయత్నించ లేదు. అవి ఆనందబాష్పాలు కదా మరి!”

*******
జవహర్ లాల్ మరియు బ్లూ బుక్
User Rating:  / 1
Member Categories  - తెలుసా!
Written by kadambari piduri
Thursday, 01 May 2014 10:00
Hits: 197

అఖిలవనిత
పేజీ వీక్షణ చార్ట్ 26445 పేజీవీక్షణలు - 716 పోస్ట్‌లు, చివరగా Apr 24, 2014న ప్రచురించబడింది
Telugu Ratna Malika
పేజీ వీక్షణ చార్ట్ 3507 పేజీవీక్షణలు - 116 పోస్ట్‌లు, చివరగా Apr 17, 2014న ప్రచురించబడింది