Thursday, February 23, 2017

నీ ఆరాధనయే పరమావధి

వనితా మణి కరములందు  
అరుణోద్యానాలు వెలసె ; 
ఎటుల? ఎటుల!? :  || 
;
కురువకం, గోరింట మోజు తీర ; 
నారీ మణి అర చేతులందు ; 
పంటలయీ పండినవి ;
గోరింటల ఎరుపులుగా పూసినవి,  
                         విరబూసినవి ;  ||
;
నవ రత్న ప్రభల కాంతులన్ని ; 
నేడు కాందిశీకులైనవి ; 
పడతి రాధ దరహాస శోభల ;
అభయములు పొందినవి ; 
                     ఆశ్రయాలు పొందినవి ;  ||
;
ఇన్నిన్ని సొబగుల కలిమిలను కలబోసుకొని ;
కోమలి రాధికతో నిన్ను చేరినాయి ; 
అవి అన్ని నిన్ను చేరినాయి ; 
నీ ఆరాధనయే వానికి పరమావధి కద ; క్రిష్ణా! :  ||  
;
- రాధా మనోహర ;

వ్రతము చేయు జానకి

శ్రీరామచంద్ర చరణాబ్జ పూజా వ్రతము 
                              చేయు జానకి ;  ||

మొగలి రేకు, మొల్లలు, మల్లెలు, సంపెంగలు - 
సురభిళ ఘుమఘుమల వ్రతములను ;
భక్తి, వినయములతోటి శ్రద్ధగా చేసినాయి ; 
           బహు శ్రద్ధగాను చేసినాయి ;  
శ్రీరామ పత్ని కుంతలముల ; 
        అవి తావులై విరబూసినవి ;  ||

భూమి పుత్రి సన్నిధిలో - 
       నోముల మయమాయెను ;
    సకలము - నోములమయమాయెను ...........,
;
"సౌమ్యతయే ఈ సీత- ఐనప్పుడు
ఇందేమి వింత ఉన్నదిలే!" - అని
సీతాపతి చిందించే చిరునగవుల 
శోభలతో నిఖిల సృష్టి విలసిల్లును ;  || 
;
; రామనిధి  ;

Thursday, February 16, 2017

ॐ నాద గీత - అఖిలవనిత - 1

భగవంతుని మెరుపు నవ్వులను 
సముపార్జించాను , ఎటులనో! ఎట్లాగో! ; 

మెరుపు పూవుల తోటి ; 
మేఘమాలికలకు గిలిగింతలు పెడతాను ; 
"ఇంత ప్రజ్ఞ మీకెప్పుడు అలవడెననీ" ; 
స్వామి సంభ్రమమొందేను ; 

అపుడు నేను నవ్వాను ; 
"నా అధరముల దరహాసములన్నీ 
          నీ లీలలే కద స్వామీ!"  ;
;
ॐ నాద గీత,  ॐ నాద గీత,  ॐ నాద గీత,  ॐ నాద గీత,  ॐ నాద గీత,  

bhagawamtuni merupu nawwulanu 
  samupaarjimchaanu , eTulanO! eTlAgO!  ; 

merupu puuwula tOTi ; 
mEGamaalikalaku giligimtalu peDataanu ; 
" imta praj~na meekeppuDu alawaDenanI" ; 
swaami sambhramamomdEnu ; 

apuDu nEnu nawwAnu ; 
"nA adharamula darahaasamulannee 
          nee leelalE kada swAmI!"  ;
;
ॐ నాద గీత,  ॐ నాద గీత,  ॐ నాద గీత,  ॐ నాద గీత,  ॐ నాద గీత,  

క్రిష్ణ క్రిష్ణ క్రిష్ణా

బేల రాధ పిలుస్తోంది ;
రయమున రావోయీ, కృష్ణా! రయమున రావోయీ ;  ||
;
కనుగవలో హత్తుకొనును ; నవ జంటల సౌరులు ;  
రాధ- కనుగవలో హత్తుకొనును ; నవ జంటల సౌరులు ;
కంటిపాప తారకల మిలమిలల చిత్రాలు ; 
తన, కంటిపాప తారకల మిలమిలల చిత్రాలు ;  ||
;
నవ నవలాడే ఆశల ; నీ ఊహల పూవులు ;
కృష్ణా! తన ఆశల నీ ఊహల పూవులు ;
తెగ సందడి చేస్తున్నవి : మది నెమ్మది లేదోయీ!
క్రిష్ణా! రమణి మది నెమ్మది లేదోయీ! ; || 
; =
 ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦ ; ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦ ;

                kRshNa kRshNa SreekRshNA!

bEla raadha pilustOmdi ;
raయmuna raawOyI, kRshNA! raయmuna raawOyI ;  ||   
kanugaవlO hattukonunu ; nawa jamTala saurulu ;  
raadha- kanugaవlO hattukonunu ; nawa jamTala saurulu ;
kamTipaapa taarakala milamilala citraalu ; 
tana, kamTipaapa taarakala milamilala citraalu ;  ||
2. nawa nawalADE ASala ; nee uuhala puuwulu ;
kRshNA! tana ASala nee uuhala puuwulu ;
tega samdaDi cEstunnawi ; madi nemmadi lEdOyI! 
krishNaa! ramaNi madi nemmadi lEdOyI! 
;
*****************************;
krishNaa! కృష్ణ కృష్ణ శ్రీకృష్ణా! ॐ నాద గీత, 
ॐ। ॐ। ॐ। ॐ। ॐ। ॐ।  ॐ। ॐ। ॐ। ॐ। ॐ। ॐ।  

Monday, February 13, 2017

భోగి, కనుమల జత సంక్రాంతి

 మొదటిసారి పువ్వో, పువ్వో; 
         నవ్వింది చూడవోయి - 
       అది కాస్త తోటలోని నువ్వో నువ్వో!? || 
1. పువ్వులోని నవ్వులన్ని 
    గువ్వా! గువ్వా! విరబూసి ; 
     నింగి కెగసె అవ్వాయ్ చువ్వల్లాగా ||  
2. మాట కాస్తా పాట అయ్యీ , హాయ్ రే, హాయిరే ;; 
    ఆట లన్నీ - పాటలయ్యీ లెస్సగ హైలెస్సా!   ||  
3. ఆట పాటల తోటీ రంగరించి ; 
    వన్నెచిన్నె రంగులెన్నొ గుమ్మరించి ;
    ముంగిలిలొ ముగ్గులుగ వెలసెనమ్మా!  || 
4. లాస్య కళ మేళనాల రంగేళీలు ; 
     ముద్దుగుమ్మ లందరున్ను ; 
      చేరి పెట్టు గొబ్బి పూలు ; ;
       గొబ్బెమ్మలుంచిన కోలం వల్లీలు ; 
        కోలాహలాల పొంగల్ పర్వం ;  ||  
5. లక్ష్మీ కళలు ఉప్పొంగు ప్రతి గుమ్మమున ; 
     ఆకాశ గుమ్మటముల వెలుగుల వరముల ; 
      భోగి, కనుమల జత కట్టి  సంక్రాంతి ;
         విచ్చేసే వేడుకలు మన కొరకు ;  || 

-----------==============;  
paaTa ;- 

modaTisaari puwwO, puwwO; 
nawwimdi chUDawOyi - 
adi kaasta tOTalOni nuwwO nuwwO!? ||
 
puwwulOni nawwulanni guwwaa! guwwaa! wirabuusi ; 
nimgi kegase awwaay chuwwallaagaa ||  

maaTa kaastaa pATa ayyii , haay rE, haayirE ;; 
aaTa lannii - pATalayyii lessaga hailessaa!   ||  

ATa pATala tOTI ramgarimchi ; 
wannechinne ramgulenno gummarimchi ;  
mumgililo mugguluga welasenammaa!  || 

laasya kaLa mELanaala ramgELIlu ; 
muddugumma lamdarunnu ; 
chEri peTTu gobbi puulu ; ; 
gobbemma lumchina kOlam walliilu ; 
kOlaahalaala pomgal parwam ;  ||  

lakshmee kaLalu uppomgu prati gummamuna ; 
aakaaSa gummaTamula welugula waramula ; 
bhOgi, kanumala jata kaTTi  samkraamti ;
wichchEsE wEDukalu mana koraku ;  || 
;
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
;
హర్రీఅమూల్! హర్రీహర్రీ! 1969 లో "హరే రామ హరే క్రిష్ణ ఉద్యమం" ;-
 తెలుగు రత్న మాలిక ;;- 
▼  2017 (3) ;- ▼  February (3) ;-  టక టక టక టక ; గిబ్బెరిష్ లాంగ్వేజ్ - తికమకగా ;
హర్రీఅమూల్! హర్రీహర్రీ! ; 

Thursday, February 9, 2017

శ్రీరామ చిలుక , parrot

నిత్యకళ్యాణము పచ్చతోరణములు ;
పెళ్ళిబాజాల సందడితో
శ్రీరంగనాధ స్వామివారి కోవెలలో ;
నిత్యకళ్యాణము పచ్చనీ తోరణములు ; ||

రంగయ్యకు రహస్యాలు నుడివెను శ్రీరామ చిలుక 
కీరవాణి ఊసులేవొ భలేగా అందినవి ;
భలే భలేగా అందినవి ; ||

ఎటు నుండి వచ్చినదో విల్లిపుత్తూరుకి 
ఈ చిలుక, ముద్దు ముద్దు రా చిలక ;
బేల గోదాదేవి గృహమునే చేరినది ; ||

కావేరీ భాగ్యమిది ;
కాదేదీ ఇట మొద్దు ;
పక్షికినీ చతురతలు ; ||

జ్ఞానమబ్బు పిట్టలకు
బుల్లి పిట్టలకున్ను ;
మబ్బు వన్నె రంగనాధు
నిట్టె ఒప్పించినదీ రామ చిలుక ;
పెళ్ళిబాజాల సందడితో
నిత్యకళ్యాణము పచ్చతోరణములు ;
శ్రీరంగనాధ స్వామివారి కోవెలలో ; ||
;
రాధా మనోహర ;

Saturday, February 4, 2017

ప్రకృతి

దోబూచాటల, దాగుడుమూతలు ;

గెలుపు ఎప్పుడూ క్రిష్ణుని సొంతం! ;  || 

వ్రజబాలునికే సహకరించును ;  ప్రకృతి అంతా! ; 
ఇది ఎంత వింతయో ఓ సఖియా! :  || 

దోబూచాడెడి నీలవర్ణుని ; 
  దివి, నీలిమబ్బుల నీడలు క్రమ్మును :  || 

ఈదులాడెడి లీలా కృష్ణుని ; 
  అట, కాళిందీ సతి కుబుసము కప్పును :  || 

భ్రమర కీటక న్యాయము కోరుచు ; 
  ఆ నల్ల కలువకై వెదికాను, వేసారాను  :  ||  ===========================; 
;          prakRti 
dObuuchATala, daaguDumuutalu ;
gelupu epppuDU krishNuni somtam! ;  || 

wrajabaalunikE sahakarimchunu ;  
prakRti amtA! ; idi emta wimtayO O saKiyA! :  || 

dObuuchADeDi neelawarNuni ; 
diwi, neelimabbula neeDalu krammunu :  || 

iidulADeDi leelaa kRshNuni ; 
aTa, kaaLimdI sati kubusamu kappunu :  || 

bhramara keeTaka nyaayamu kOruchu ; 
aa nalla kaluwakai wedikaanu, wEsaaraanu :  || 

పేజీ 140 - శ్రీకృష్ణగీతాలు     

Friday, February 3, 2017

హేలామూర్తి

నా అక్షర గవాక్షాల శ్రేణుల గుండా ;
సుతార హృదయం దర్శిస్తూన్నది ; 
పదే పదే నందబాలుని ;  
ఆనందబాలుని!
నా హృదయం 
వీక్షించును సుతారముగ స్వామి హేల  
నా హృదయం తిలకిస్తున్నది 
సున్నితమౌ క్రిష్ణ లీలలు
వియత్తలవేదికపై నర్తించే నృత్య హేలామూర్తిని.
=============================;
          hElaamuurti ;-
naa akshara gawaakshaala SrENula gumDA ;
sutaara hRdayam darSistuunnadi ; 
padE padE namdabaaluni ;  
aanamdabaaluni!
naa hRdayam 
weekshimchunu sutaaramuga swaami hEla  
naa hRdayam tilakistunnadi 
sunnitamau krishNa leelalu
wiyattalawEdikapai 
nartimchE nRtya hElaamuurtini.
;
-  పేజీ 140 - శ్రీకృష్ణగీతాలు ;- ୲୲
కోణమానిని ;- తమలపాకుల చిలకలీయవే! ;- 
12, మే 2009, మంగళవారం ; 
హేలామూర్తి  ;-  
LINK - jalleda 

రమ్య జామాతృ ముని

"శ్రీ వేంకటేశ్వర సుప్రభాతము" ,"శ్రీ వేంకటేశ మంగళాశాసనమ్"లు సుప్రసిద్ధమైనవి. 
భక్త కోటి హృదయములను పులకింప జేసే మాధుర్య శ్లోక గుచ్ఛములు ఇవి. 
శ్రీ వేంకటేశ పుణ్య శ్లోకములను రచించుటచే పునీతుడైన మహనీయుని పేరు తెలుసా?
ఆ భక్త వరేణ్యుని నామ ధేయం "రమ్య జామాతృ ముని" 
శ్రీ వేంకటేశ మంగళాశాసనమ్ 
"శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం 
శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ " అనే మొదటి శ్లోకముతో ప్రారంభమౌతున్నది.
"శ్రీ మత్సుందర జామాతృ ముని మానస వాసినే 
సర్వ లోక నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ ."
అని, రచయిత 'జామాతృ ముని' నామ ధేయం ప్రస్తావన ఉన్నది.

************************************:

శ్రీనివాస పద్మావతి లక్ష్మి ;- label ; 
Bakti Kusumaalu     ;   2 ఫిబ్రవరి 11:09 AMకి · &
రమ్య జామాతృ ముని ;- & 14, మే 2009, గురువారం ; కోణమానిని blg 
కోణమానిని [ link ] 

మంగమ్మ చూపులే రంగారు బంగారు

హంగు మీరగ రంగ వల్లికలు వేలాదిగా ;
వలయాలు,వలయాలుగా, వెలయు చున్నాయి ;
తెల్ల తామరల పూల కళ్ళున్న" అలమేలు ; 
మంగమ్మ " చూపులే ముగ్గులై విరిసాయి ;  || 

ఏడు కొండలె నిండు బంగారు చుక్కలు ;
ఆమె క్రీ గంటి చూపులె వల్లికల అల్లికలు ;
సతి వాలు చూపుల సొంపారు ముగ్గులే ;
ఏడు కొండల స్వామి ఎద తీపి గురుతులు ;  ||

కొండలకు దిగువన ఆమె కొలువున్నాది ;
శిఖరాల పైనేమొ స్వామి కొలువున్నాడు ;
ఈ ముగ్గుల "లో గుట్టు"- తన మనసులో "గుట్టు" ;
అమ్మనే అడుగుదాం! అంగనలారా! రండి! ;  || 
;
& 25, జనవరి 2009, ఆదివారం ; శ్రీ వేంకటేశుడు ,కోవెల (కసం) ;- 
కోణమానిని blg

Wednesday, February 1, 2017

క్రిష్ణయ్య వెన్నపూసల దండలు

ఉట్టి మీది చట్టిలోన వెన్న ఏమయ్యింది?
 నక్కి వచ్చి కన్నయ్య మాయం చేసేనండీ , 
                    మటు మాయం చేసేనండీ! :  || 

గప్ చుప్ గా మటుమాయం కుండలలో నవనీతం!  
నూలుపోగు, సూత్రం, దారం అక్కర లేకుండగనే ;  
     ముద్దు ముద్దు మేను నిండ వెలసినవి ;   ||  

వైనంగా పేర్చుకున్న వెన్నపూస దండలు ;
నవరత్న హారముల కాంతి మించినవీ 
నవ్య నవ్య నవనీతం హారములు ;  ||   

========================;

   krishNayya  puusala damDalu ;-  

uTTi meedi chaTTilOna wenna Emayyimdi?
 nakki wachchi kannayya maayam chEsEnamDI ,
                              maTu maayam chEsEnamDI! :  || 

gap chup gaa maTumaayam kumDalalO nawaneetam!
nuulupOgu, suutram, daaram akkara lEkumDaganE ; 
              muddu muddu mEnu nimDa welasinawi ;   || 

wainamgaa pErchukunna wennapuusa damDalu ;
nawaratna haaramula kaamti mimchinawee 
nawya nawya nawaneetam haaramulu ;  || 
;

క్రిష్ణయ్య  butter పూసల దండలు ; 
విభక్తి పట్టికలో కూడా ప్రథమా విభక్తియే!  Monday, December 19, 2016 ;-
Link :- 
[ http://telugublogranks.blogspot.in/2014/10/sakalakalars.html &