Sunday, September 16, 2018

అవలీలగ అన్నన్ని లీలలు

భళి భళీ భళి భళీ ;
ఈ వ్రేపల్లెనందు నీ మేటి లీలలు ; భళి భళీ ;
ఎన్నైన ఎన్నైన వర్ణించుకొన - 
చాలునా యుగములు ;
వనమాలి, చాలునా కల్పములు ;  ||
;
కూర్మావతారమున నాడు మందర గిరిని ; 
పాల - కడలిలోన నీ మూపు పయిన ;
పదిలంగ నిలిపావు; 
కొనగోటి పయిన గోవర్ధనమ్మిది;
కూర్మావతారుడా, నీకేమి లెక్కా  ;  ||
;
క్షీరాబ్ధి శయనించి - ఎల్ల లోకమ్ములను ;
చల్లగా బ్రోచేటి చిద్విలాస స్వామి! ;
అల్లరుల క్రిష్ణయ్యగ నీకిపుడు 
ఉట్టి మీద పాలు ఎంత గనుక,
ఒక్క గుక్క, అంతే కదా ;  ||
;
శేషతల్పమునందు సుఖముగా శయనాలు ; 
కాళిందిలోన పెను పాము మర్దనము ; 
ఫణముల నాట్యాలు ఆడుతూ 
కాళీయు నణచుట, అది ఎంత ఒక లీల ;
నీకింక చిటికెలో అవలీల ;  || 
;
=======================; ;
;
bhaLi bhaLI bhaLi bhaLI ;
ee wrEpallenamdu ; 
mETi needu leelalu ; 
ennaina ennaina warNimcukona ;
needu - leelalennennaina ;
caalunaa yugamulu,
wanamaal, caalunaa  kalpamulu ;  ||
;
kuurmaawataaramuna naaDu ;
mamdara girini ;
padilamga nilipaawu; 
konagOTi payina gOwardhanammidi ;
kuurmaawataaruDA, neekEmi lekkaa ;  ||
;
ksheeraabdhi Sayanimci - ella lOkammullnu ; 
callagaa brOcETi cidwilaasa swaami ;
allarula krishNaga neekipuDu ;
uTTi meeda paalu emta ganuka,
okka gukka, amtE kada ;  ||  
;
SEshatalpamunamdu sukhamugaa Sayanaalu ; 
kALimdilOna penu paamu mardanamu ; 
phaNamula nATyAlu ADutU ;  
kaaLIyu naNacuTa, adi emta oka leela ;
neekimka ciTikelO awaleela ;  || 

కృష్ణుని సాక్షాత్కార సృష్టి నిఖిలం సమ్మోహ హర్షం

నీల కుంతల రాధమ్మ మనసు ; 
ఏల ఆయెను నేడు అతలాకుతలం ;
కల్లోలము, అల్లకల్లోలము ;  ||  
;
నీలి యమునా ఝరి ; 
లోలోన - బాడబ ; 
ఎందులకు ఇటులిటుల ; 
నేడు అతలాకుతలం ;
కల్లోలము, అల్లకల్లోలము ;  ||  
;
గుబులు నిండి వణుకుచున్న ; 
మిరుమిట్లు గుంపుల మెరుపు  మబ్బులు ;
నేడు అతలాకుతలం ;
కల్లోలము, అల్లకల్లోలము ;  || 
;
శ్యామకృష్ణుని సాక్షాత్కార అనుగ్రహమ్ము ;
నిఖిలం సృష్టికి - ప్రశాంతం హర్షం .......  ; 
అందులకే -
లీలా - మానుషరూపుని రాకకు ;
సతతం సుస్వాగతం ; 
శ్యామకృష్ణుని ఆగమనం ;
దివ్య పరిమళ శోభితం ;  || 
;
======================;  ;
;
neela kumtala raadhamma manasu ; 
Ela aayenu nEDu atalaakutalam
kallOlam, allakallOlamu ; ||  
;
neeli yamunaa jhari ; 
lOlOna - baaDaba ; 
emdulaku iTuliTula ; 
nEDu atalaakutalam
kallOlam, allakallOlamu ; ||
;
gubulu nimDi waNukucunna ; 
mirumiTlu gumpula merupu mabbulu ; 
nEDu atalaakutalam
kallOlam, allakallOlamu ; || 
;
leelaamaanusha ruupuDu ; 
Syaama kRshNuni saakshaatkaaram ;
nikhila sRshTiki ; SAmtam harsham ;
amdulakE -
leelaamaanusha - ruupuni raakaku ;
satatam suswaagatam ; 
Syaama kRshNuni aagamanam ; 
diwya parimaLa SObhitam ;  || 

తమలపాకు చిలక ఉళ్ళుళ్ళళ్ళా ప్రేమకు కొలతలు

ఆకు, వక్క, సున్నం - తమలపాకుల చిలక ; 
పొందికగా చేద్దాము చెమ్మచెక్క ;; 
స్త్రీ  - 1 ;-
పోక చెక్క కొరికి, పంటి బలము చూపు - చెమ్మచెక్క ; 
నాలిక పండిందంటే, ప్రేమాస్పదమైన మానసము కలిగి ఉన్నట్లు ; 
అందుకె - తాంబూలాన్ని నమిలి నోరును చూపు, చూపు క్రిష్ణయ్యా! ;
నీ నాలిక చాపి చూపించు చెమ్మచెక్కల క్రిష్ణయ్యా!
స్త్రీ 2 ;-
అరెరే - అన్ని షరతులు మోహన కృష్ణునికేనా!!? ; 
పణతులు మీరేమో - ఆకుల చిలకల జోలికి పోరు, 
బల్ చమత్కారముల వారు ; 
స్త్రీ  3 ;-
తాంబూల చర్వణమును - మాకు వేరుగ ఎవ్వరు నేర్ప నక్కలెదు - 
కనుమో సఖియా ; ఇదిగో నెమరేస్తున్నాము - లేత నవలాకులను ;
స్త్రీ 4 ;- 
సహజంగానే మోవులు - కెంపుల మించిన ఎరుపులు ; 
భేదం, తేడా లెటుల తెలియును - చాలు చాలమ్మా ; 
చాల్లే పోవమ్మా  ;  || 
;
రేపల్లె వాడలలో భామామణులలోన వేళాకోళాలు ;
మణికంకణముల మెరిసి, నవ్వు సూర్య కిరణాలు ;  
;
========================; ;
;
aaku, wakka, sunnam ; tamalapaakula cilaka ; 
pomdikagaa cEddaamu cemmacekka ;; 
stree  - 1 ;-
pOka cekka koriki ; pamTi balamu cUpu - cemmacekka ; 
naalika pamDimdamTE ; 
prEmaaspadamaina maanasamu kaligi unnaTlu ; 
amduke - taambuulaanni namili nOrunu cuupu, 

cemmacekkala krishNa ;
naalika caapi cuupimcu krishNayyaa!
stree 2 ;-
arerE - anni sharatulu mOhana kRshNunikEnA!!? ; 
paNatulu meerEmO - aakula cilakala jOliki pOru, 
bal camatkaaramula waaru ; 
stree  3 ;-
taambuula carwaNamunu - maaku wEruga ewwaru nErpa nakkara lEdu - 
kanumO sakhiyaa ; idigO nemerEstunnaamu - 
lEta nawalaakulanu ;
stree 4 ;- 
sahajamgaanE mOwulu - kempula mimcina erupulu ; 
BEdam, tEDA leTula teliyunu - caalu caalammaa ; 
caallE pOwammaa  ;  || 
;
rEpalle wADalalO bhaamaamaNulalOna wELAkOLaalu ;
maNikamkaNamula merisi, nawwu suurya kiraNAlu ; 

బాలకృష్ణ సింగారం కోసమే ప్రయాస

ఈక ఈక తెచ్చి - చేసెదము మేము - 
చక్కని గుత్తి - పొందికగా ఇంచక్కా ; 
బాల క్రిష్ణుని సిగముడిని - నెమలి కన్నుల గుత్తిని ; 
తురిమెదము పొందికగ ఇంచక్క ;  ||
&
పురిని విప్పవమ్మా - నాట్యాల వేళాయెను - 
వయ్యారి ఓ నెమలీ - సయ్యాటల వన మయూరి  ;
ఓ కేకి, నీదు పింఛము నుండి -
మిలమిలల పింఛములు - కరుణతో ఇవ్వమ్మ! ; 
కొన్ని - మిలమిలల పింఛములు ;
కరుణతో ఇవ్వమ్మ! ;  ||

పువ్వు పువ్వును చేర్చి - అల్లెదము అందరము ; 
వన్నెల దండలు - పొందికగా ఇంచక్కా ;
కన్నయ్యకు ఇపుడు వేసి, సింగారించి ; 
తనివితీరా కనుల నింపుకుందాము ; 
&
కొమ్మ కొమ్మన - పరిమళములు పూయండి ;  
బృందావని మొలకలార! నందనవని తరువులార!
మీ కొమ్మ, రెమ్మల నుండి - ఘుమఘుమ ప్రసూనములు ;
ప్రేమతో ఇవ్వండి ;  ||  
;
=================; ;
;
baalakrishNa simgaaram kOsamE prayaasa ;- 

eeka eeka tecci - cEsedamu mEmu - 
cakkani gutti - pomdikagaa imcakkaa ; 
baala krishNuni sigamuDini ; 
nemali kannula guttini ; 
turimedamu pomdikaga imcakka ;  ||
&
purini wippawammaa - nATyaala wELAyenu - 
wayyaari O nemalee - sayyaaTala wana mayuuri  ;
O kEki, needu pimCamu numDi -
milamilala pimCamulu ;
karuNatO iwwamma! ; 
konni - milamilala pimCamulu ;
karuNatO iwwamma! ;  || 

puwwu puwwunu cErci - alledamu amdaramu ; 
wannela damDalu - pomdikagaa imcakkaa ;
kannayyaku ipuDu wEsi, simgaarinci ; 
taniwiteeraa kanula nimpukumdaamu ; 
&
komma kommana - parimaLamulu puuyamDi ;  
bRmdaawani molakalaara! namdanawani taruwulaara!
mee komma, remmala numDi ; 
ghumaghuma prasuunamulu ;
prEmatO iwwamDi ;  ||  

ఉళ్ళుళ్ళళ్ళాలు - సాదు బొట్టు

ఉంగరమ్ము వేలు తోటి పెట్టమని అంటాడు ; 
నెన్నుదుట బొట్టును పెట్టమనంటాడు ; 
బుంగమూతి పెట్టి క్రిష్ణుడు ;
బుగ్గలు పూరించి, దిబ్బున గాలిని కొట్టి ;
"నీతో పచ్చి, అంతే." అంటాడు బులిపిస్తూ క్రిష్ణుడు ;  || 
;
"సున్నా చుట్టావు కదా - నీ లేత పెదవులు ;
ఈ బుంగమూతికి మల్లే, పెడుదును గుండ్రని బొట్టును - 
చాదు బొట్టును బుగ్గను పెడుదును."

తల్లి పలుకులకు ; 
ఉలుకు, ఉక్రోషం - గోవర్ధన కొండంతగ - 
మా క్రిష్ణునికి, చిన్నారికి, ఇంత బుల్లి మా బుజ్జాయికి ; 
బుడి బుడి ఏడ్పులు, మము బెల్లిస్తూను ; 
;
అంటూ నవ్వులు వెదజల్లులు - 
అన్ని దిక్కులకు పరువంగా ; 
పరుగులు పెట్టే నల్లనయ్యను పట్టి -  
తిలకమును తీర్చిరి భామలు ;
;
ఌఌౡ ఌఌౡ ఌౡ ఌౡ ళుళ్ళుళ్ళా .....  
అంటూ ఉళ్ళుళ్ళలు కొట్టుతూ ..... 
సాదు బొట్టుతో ఈ తూరి -
కస్తూరి  తిలకము కూడా ;
తీర్చి దిద్దిరి భామలందరు ;    
;
===================; ;
;
umgarammu wElu tOTi peTTamani amTADu ; 
nennuduTa boTTunu peTTamanamTADu ; 
bumgamuuti peTTi krishNuDu ;
buggalu puurimci, dibbuna gaalini koTTi ;
"neetO pacci, antE." amTADu bulipistuu krishNuDu ;  || 
;
sunnaa cuTTaawu kadaa - 
nee lEta pedawulu ;
ee bumgamuutiki mallE ; 
peDudunu gumDrani boTTunu - 
caadu  boTTunu bugganu peDudunu."

talli palukulaku ; 
uluku, ukrOsham - gOwardhana komDamtaga - 
maa krishNuniki, cinnaariki ; 
imta bulli maa bujjaayiki ; 
buDi buDi EDpulu ; 
mamu bellistuunu ; 
;
amTU nawwulu wedajallulu - 
anni dikkulaku paruwamgaa ; 
parugulu peTTE nallanayyanu paTTi -  
tilakamunu teerciri bhaamalu ;
;
ఌఌౡ ఌఌౡ ఌౡ ఌౡ LuLLuLLA .....  
amTU uLLuLLalu koTTutuu ..... 
saadu boTTutO ee tuuri -
kastuuri  tilakamu kUDA ;
teerci diddiri bhaamalamdaru ;

గుమ్మపాలు రుచిని కృష్ణుడు చెప్పాలి

ఆ కుండలోన ఏమున్నది చెపుమా 
చెలులు ;- 
కుండను నడుమున పెట్టి ; 
కోమలి వెళుతూన్నది ;
కుండలోన ఏమున్నది!? 
ఆ కుండలోన ఏమున్నది చెపుమా ~
ఆమె సమాధానం ;-
కపిల ధేనువు భక్తి ఉప్పొంగగా ; 
చేపిన గుమ్మపాలు ఓ భామినీ! ;  ||
;
2] భుజముల దుత్త పెట్టి ; 
నడచి పోతున్నావు ; 
దుత్తలొ ఏమున్నది!? ;
ఆ దుత్తలొ ఏమున్నది!?  ; 
నుడువుమ హంసగామినీ ~~ 
ఆమె ;- ఈ దుత్తలలొ,
అరచేతి మందాల చిక్కని - మీగడల పొరలు ; 
తేటతెల్లముగ ఇంతియె పడతీ ;  ||
;
తలపయి కుదురులోన - కుదురుగ ఉన్నది కుంభం ; 
కుంభమునందేమున్నది?
పూర్ణ కుంభమున ఏమున్నదో ; 
కులుకుల నొలకబోసే కౌముది, చెప్పమ్మా ~~ 
ఆమె ;- తొణికే పెరుగులు, పొర్లే మజ్జిగలందున ; 
చందమామంటి నవనీతాల ముద్దలు, ఓ కలికీ ;  ||
;
తియ్య తియ్యని ఆ వెన్నను ; 
కొంచెం మాకు రుచికి - దయ ఉంచి ఇవ్వమ్మా  ~
ఆమె ;- కోరక దళ పెదవుల ; 
మా చిన్ని క్రిష్ణమ్మ; 
వచ్చేదాకా అందరు ఆగండి ; 
క్రిష్ణుడు చవి చూచి ; 'ఓహో' అని అంటే ; 
అందరికీ ప్రసాదం ;  కొండంత సంపత్తి ;  || 
;
=========================; ;
celulu ;- 
kumDanu naDumuna peTTi ; 
kOmali weLutuunnadi ;
kumDalOna Emunnadi!? 
aa kumDalOna Emunnadi cepumaa ~~ 
aame samaadhaanam ;-
kapila dhEnuwu bhakti uppomgagaa ; 
cEpina gummapaalu O bhaaminii! ;  ||
;
2] bhujamula dutta peTTi ; 
naDaci pOtunnaawu ; 
duttalo Emunnadi!? ;
aa duttalo Emunnadi!?  ; 
nuDuwuma hamsagaaminee ~~ 
aame ;- ee duttalalo,
aracEti mamdaala cikkani - meegaDala poralu ; 
tETatellamuga imtiye paDatee ;  ||
;
talapayi kudurulOna - 
kuduruga unnadi kumbham ; 
kumbhamunamdEmunnadi?
puurNa kumbhamuna EmunnadO ; 
kulukula nolakabOsE kaumudi, ceppammaa ~~ 
aame ;- toNikE perugulu, porlE majjigalamduna ; 
camdamaamamTi nawaneetaala muddalu, O kalikee ;  ||
;
tiyya tiyyani aa wennanu ; 
komcem maaku ruciki - 
daya umci iwwammaa ~~ 
aame ;- kOraka daLa pedawula ; 
maa cinni krishNamma; 
waccEdaakaa amdaru aagamDi ; 
krishNuDu cawi cuuci ; 'OhO' ani amTE ; 
amdarikee prasaadam ; komDamta sampatti ;  ||

Saturday, September 15, 2018

తోట శుభ్రం - ఆటలు ఆరంభం

తోట యావత్తూ పరిశుభ్రం అయ్యింది ; 
నిగనిగలాడుతు - అద్దంలా -
పరిశుభ్రం అయి ఉంది ;
రావయ్యా క్రిష్ణయ్యా, 
వేగమె రావయ్యా క్రిష్ణయ్యా  ;  || 
;
ఆకులు అలములు ఊడ్చీ ఊడ్చీ ; 
తోటను శుభ్రం చేసారు అందరూ ; 
ఆటలాడుకుందము, రావయ్యా క్రిష్ణయ్యా ;  
తొందరగా - రావయ్యా క్రిష్ణయ్యా ;
గమ్మున రావయ్యా క్రిష్ణయ్యా ;  || 
;
దుమ్ము ధూళీ బాగా తుడిచీ ; 
సిద్ధం చేసిరి నేస్తాలు ; 
ఆటలాడుకుందాము, 
త్వర త్వరగా రావయ్యా క్రిష్ణయ్యా ;  || 
;
నందనవని కళకళలు ; 
బృందావని మిలమిలలు ; 
నీ అల్లరి, నీ నవ్వులు - 
జత ఐతే - 
సూర్య గోళమును మించిన కాంతులు - 
ఇచ్చట కురియును ;  
ఆటలాడుకుందాము, 
వైళమె వేగమె  రావయ్యా క్రిష్ణయ్యా ;  ||

==================; ;
;
tOTa Subhram -  ATalu aarambham ;-
;
tOTa yaawattuu ; pariSubhram ayyimdi ; 
niganigalADutu - addamlaa ;
pariSubhram ayi umdi ;
raawayyaa krishNayyaa ;  
wEgame raawayyaa krishNayyaa  ;  || 
;
aakulu alamulu ; uuDcee UDcee ; 
Subhram cEsaaru amdaruu ; 
ATalADukumdamu, raawayyaa krishNayyaa ;  
tomdaragaa - raawayyaa krishNayyaa ;  || 
;
dummu dhULI baaga tuDici ; 
siddham cEsiri nEstaalu ; 
twara twaragaa ........
raawayyaa krishNayyaa ;  || 
;
namdanawani kaLakaLalu ; 
bRmdaawani milamilalu ; 
nee allari, nee nawwulu - 
jata aitE - 
suurya gOLamunu mimcina kaamtulu - 
iccaTa kuriyunu ; 
waiLame wEgame ;
gammuna raawayyaa krishNayyaa ;  ||

కృష్ణ పదం నిత్య పారాయణం

కృష్ణ కృష్ణ పదమెప్పుడు ; 
నిత్య పారాయణం ;
కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ ; 
పదమెప్పుడు నిత్య పారాయణం ; ||
;
కృష్ణ పదము హత్తుకునే ;
గాలితెరల కనుగొనేటి ;
భక్తులకిది వేడుక ;
సమ్మోదపు వేడుక ; ||
;
భక్తిపూర్ణ మానసముల ;
ప్రతిధ్వని నిరంతరం ;
అనుక్షణము అధరములకు -
ఆ మాటే వాడుక ;
నిత్య వాడుక ; ||
;
==============; ;
;
kRshNa kRshNa padameppuDu ; 
paaraayaNam ; 
nitya paaraayaNam ;
kRshNa kRshNa kRshNa kRshNa 
padameppuDu ; 
nitya paaraayaNam ; ||
;
kRshNa padamu hattukunE - ;
gaaliterala kanugonETi ;
bhaktulakidi wEDuka ;
sammOdapu wEDuka ; ||

bhaktipuurNa maanasamula ;
pratidhwani niramtaram ;
anukshaNamu adharamulaku ;
aa maaTE wADuka ;
nitya wADuka ; ||

నూరు వేడుకోళ్ళు, లక్ష ప్రార్ధనలు

చిరు అలకల క్రిష్ణయ్యా ;
కినుక మాని రావయ్యా! ; ||

నగుమోము ఇట్లాగ ; 
డీలా ఐతే ఎట్లాగ!? ; 
చిన్నబోవును వ్రేపల్లె ;
మన వ్రేపల్లె ; ||
;
డజను వేడుకోళ్ళు - 
పాతికల ప్రార్ధనలు ;
నీ కోసం, నీకోసం - 
&
వంద వేడుకోళ్ళు ; 
లక్ష ప్రార్ధనలు ;
మా కోసం, మా కోసం -
ఆ పైన మాకు దొరుకు ;
వేడుకలు లక్షలాది ; 
కేరింతలు శతకోటి ; ||

కిలకిలలకు మెలకువలు ; 
కువకువలకు కిలకిలలు ; 
దశదిశలును తోటలయె ; 
కిలకిలల కళకళలు ; ||
;
=====================; ;
;
ciru alakala krishNayyaa ;
kinuka maani raawayyaa! ; ||

nagumOmu iTlaaga ; 
Deelaa aitE eTlAga!? ; 
cinnabOwunu kada wrEpalle ;
mana wrEpalle ; ||
;
Dajanu wEDukOLLu ; 
paatikala praardhanalu ;
neekOsam - 
Dajanu wEDukOLLu ; 
aa paina maaku doruku ; 
paatikala praardhanalu ;
wEDukalu lakshalaadi ; 
kErimtalu SatakOTi ; ||

kilakilalaku melakuwalu ; 
kuwakuwalaku kilakilalu ; 
daSadiSalunu tOTalaye ; 
kilakilala kaLakaLalu ; ||

కృష్ణ క్రీడలున్న చోట సంభవమే

క్రిష్ణ క్రీడలున్న చోట ;
ఏదైనా సంభవమే ;  || 
;
అమర కోశ భ్రమర మమర ;
నాదమును తెచ్చెను ; 

మరల మరల 
ఝుమ్ ఝుమ్ ఝుమ్ ; 
ఝుంకారము అభ్రకమై ; 
మిరుమిట్లను గొలుపుచుండె ;  || 
;
భాండీర వనమిందుకె ; 
అందుకొనును ప్రతి క్షణము ; 
మధుర మధురమౌ విందులు ; 
;
క్రిష్ణ క్రీడలున్న చోట ;
ఇంతయునూ సంభవమే కద ;  || 
;
=======================;
;
krishNa kreeDalunna cOTa ;
Edainaa sambhawamE ;  || 
;
amara kOSa bhramara mamara ;
naadamunu teccenu ; 
;
marala marala 
jhumm jhumm jhumm ; 
jhumkaaramu abhrakamai ; 
mirumiTlanu golupucumDe ;  || 
;
BAmDeera wanamimduke ; 
amdukonunu prati kshaNamu ; 
madhura madhuramau wimdulu ; 
;
krishNa kreeDalunna cOTa ;
imtayunuu sambhawamE kada ;  || 

శ్యామకృష్ణుని తెల్లని నవ్వులు

ఊగగలవ నిరంతరం - 
తళుకు తళుకు చుక్కలు ; 
ఆ చురుకు చురుకు చురుక్కు 
తారకల మాలికలు ; || 
;
నీలి వన్నె ప్రజ్ఞ - విశాలమౌ గగనానిది ;
తెలి నవ్వుల ప్రజ్ఞలెన్నొ - నీల మోహనాంగునివి ; 
విస్తుబోవుచుందురు పల్లియలో జనులందరు ;
జవరాండ్రకేమొ ఎప్పటికీ బోధపడదు 
ఈ భేదంలోన దాగి ఉన్న ;
మర్మముల వింత - విచిత్రముల గోల ; || 
;
విరుద్ధము, ఈ విభేదము ; 
సమన్వయా లిటుల ఎటుల ; 
ఇటు ఇప్పుడు తారసిల్లె ; 
తారలైన తీర్చగలవ ..... ;

పెను సందేహం డోలలందు ; 
సదా అలసిపోకుండా ;
ఊగగలవ తారకలు - 
తళుకు తళుకు చుక్కలు ; 
ఈ సందేహం డోలలందు ; || 
;
===================; ;
SyaamakRshNuni tellani nawwulu  ;-
;
uugagalawa niramtaram - 
taLuku taLuku cukkalu ; 
aa curuku curuku curukku ;
aa taarakala maalikalu ; ||
;
neeli wanne prajna wiSAlamau gaganaanidi ; 
teli nawwula prajnalenno - neela mOhanaamguniwi ;
wistubOwucumduru - palliyalO janulamdaru ;
jawaraamDrakEmo eppaTikee bOdhapaDadu ;
ee BEdamlOna daagi unna ;
marmamula wimta - wicitramula gOla ; ||
;
wiruddhamu, ee wiBEdamu ; 
samanwayaa liTula eTula ; 
iTu ippuDu taarasille ; 
taaralaina teercagalawa ....... ; 
;
penu sandEham DOlalamdu ; 
sadaa alasipOkumDA ;
uugagalawa taarakalu -
taLuku taLuku cukkalu ;
sandEham DOlalamdu ; ||

ఇక్షుధన్వి మన్మధుని గిల్లి కజ్జాలు

క్రిష్ణ సాన్నిధ్యాన - ఆత్మానందం ;
శ్రీక్రిష్ణ సాన్నిధ్యాన - పరమానందం ; 
గడియించును ప్రకృతి, ఆబాలగోపాలం ; || 
;
వెదురుగడలు - తన చేతిలోన పిల్లగ్రోవులు ;
చెరకు గడలు - రాధ నవ్వు తీపి పాటలు ;
;
బోలు చెట్ల గడలు అన్ని - 
గడుసుగాను ఎత్తుగడలు ఎన్నొ వేసి ; 
నేడిటుల ఇటను ఔరా -
సంగీత, కళా సామ్రాజ్య - 
స్థానములను పొందెను ; 
అగ్రస్థానములను పొందెను ; || 

ఐతేనేం -
బహు బడాయి పోవుచుండు - మన్మధుడు ;
చిలక జోదు - మన్మధుడు ;
"చెరకు వింటి వేల్పును నేనంటూ" 
అందరితో లడాయి ; గిల్లి గిల్లి కజ్జాలు ;
సాక్షాత్తూ మహావిష్ణు పుత్రుడే కద ; మదనుడు ;
ఆమాత్రం గంగడోలు నిమురించుకొనుట 
సాధ్యమే కద, పోనిద్దూ ........ ; ||  
;
==================;  ;
;
krishNa saannidhyaana - aatmaanamdam ;
SreekrishNa saannidhyaana - paramaanamdam ; 
gaDiyimcunu prakRti, aabaalagOpaalam ; || 
;
wedurugaDalu - tana cEtilOna pillagrOwulu ;
ceraku gaDalu - raadha nawwu teepi pATalu ;
;
bOlu ceTla gaDalu anni - 
gaDusugaanu ;
ettugaDalu enno wEsi ; 
nEDiTula iTanu auraa -
samgeeta, kaLA saamraajya - 
sthaanamulanu pomdenu ; 
agrasthaanamulanu pomdenu ; || 

aitEnEm -
bahu baDaayi pOwucumDu - manmadhuDu ;
cilaka jOdu - manmadhuDu ;
"ceraku wimTi wElpunu nEnamTU"
 amdaritO laDAyi, gilli gilli kajjaalu ;
saakshaattuu mahaawishNu putruDE kada madanuDu ;
aamaatram gamgaDOlu nimurimcukonuTa 
saadhyamE kada, pOnidduu ........ ; || 

మూసకట్టు - ఆట విడుపు

మూసకట్టు బ్రతుకు నడక ;
సుంత మనకు ఆట విడుపు ;
కదలండిక నేస్తులార!
సుదామాది మిత్రులార ;  || 

శ్రీకృష్ణ మాయ యవనిక ;
మధుర మాయె లహరిక ; 
కదలండిక నేస్తులార!
సుదామాది మిత్రులార ;  || 

వింత వన్నె చిన్నియల ;
అపురూపం మేళవింపు ;
కదలండిక నేస్తులార!
సుదామాది మిత్రులార ;  || 

సురభిళ గాధా లహరి ; 
అనునిత్య లాస లాహిరి ;
కదలండిక నేస్తులార!
సుదామాది మిత్రులార ;  || 
;
====================;
;
muusakaTTu bratuku naDaka ;
sumta manaku ATa wiDupu ;
kadalamDika nEstulaara!
sudaamaadi mitrulaara ;  || 

SreekRshNa maaya yawanika ;
madhura maaye laharika ; 
kadalamDika nEstulaara!
sudaamaadi mitrulaara ;  || 

wimta wanne cinniyala ;
apuruupam mELawimpu ;
kadalamDika nEstulaara!
sudaamaadi mitrulaara ;  || 

surabhiLa gAdhA lahari ; 
anunitya laasa laahiri ;
kadalamDika nEstulaara!
sudaamaadi mitrulaara ;  || 

విస్తుబోవుచుందురు రేపల్లె జనులందరు

ఊగగలవ నిరంతరం - 
తళుకు తళుకు చుక్కలు ; 
ఆ తారామాలికలు ;  || 
;
నీలి వన్నె ప్రజ్ఞ - విశాలమౌ గగనానిది ;
తెలి నవ్వుల ప్రజ్ఞలెన్నొ - నీల మోహనాంగునివి ; 
విస్తుబోవుచుందురు పల్లియలో జనులందరు ;
జవరాండ్రకేమొ ఎప్పటికీ బోధపడదు 
ఈ భేదంలోన దాగి ఉన్న ;
మర్మముల వింత - విచిత్రముల గోల ;  || 
;
విరుద్ధము, ఈ విభేదము ; 
సమన్వయా లిటుల ఎటుల ; 
ఇటు ఇప్పుడు తారసిల్లె ; 
తారలైన తీర్చగలవ ..... ;

పెను సందేహం డోలలందు ; 
సదా అలసిపోకుండా ;
ఊగగలవ  తారకలు - 
తళుకు తళుకు చుక్కలు ; 
ఈ సందేహం డోలలందు ;  || 
;
================; ;
;
uugagalawa niramtaram - 
taLuku taLuku cukkalu ; 
aa curuku curuku curukku ;
aa taarakala  maalikalu ;  ||
;
neeli wanne prajna wiSAlamau gaganaanidi ; 
teli nawwula prajnalenno - neela mOhanaamguniwi ;
wistubOwucumduru - palliyalO janulamdaru ;
jawaraamDrakEmo eppaTikee bOdhapaDadu ;
ee BEdamlOna daagi unna ;
marmamula wimta - wicitramula gOla ;  ||
;
wiruddhamu, ee wiBEdamu ; 
samanwayaa liTula eTula ; 
iTu ippuDu taarasille ; 
taaralaina teercagalawa ....... ; 
;
penu sandEham DOlalamdu ; 
sadaa alasipOkumDA ;
uugagalawa  taarakalu -
taLuku taLuku cukkalu ;

sandEham DOlalamdu ;  ||

చాందినీ మిసమిసలు

నల్లని మై ఛాయ వాడు ; 
తెల తెల్లని నవ్వులాడు ;
మోహాలను వీడుమనును ; 
మర్మమంటె వీడులే ;  ||  
;
క్రిష్ణ వేషము - చంద్రహాసము - 
బేల రాధికకు అయోమయం, 
గోపెమ్మలకు తికమకలు ;  || 
;
పరువం చిన్నెలు, మిలమిలలు ; 
జవ్వని పోకడ మిసమిసలు ; 
అది గని జాబిలి కిలకిలలు ;  ||
;
===================;
;
nallani mai CAya wADu ; 
tela tellani nawwulADu ;
mOhaalanu weeDumanunu ; 
marmammTe weeDulE ;  ||
;
krishNuni wEshamu - candrahaasamu ; 
bEla raadhikaku ayOmayam ;
gOpemmalaku tikamakalu ;  ||
;
paruwam cinnelu, milamilalu ; 
jawwani pOkaDa misamisalu ; 
adi gani jaabili kilakilalu ;  ||

అటు తానే, ఇటు తానే మహా మేటి కృష్ణుడు

అటు తానే, ఇటు తానే, విశ్వవిభుడు దైవము ;
అటు నుండి ఇటుగా ; ఇటు నుండి అటుగా ; 
దోబూచులాటలందు మహా మేటి కృష్ణుడు :  || 
;
అటువారికి అటుగా ; ఇటు వారికి ఇటుగా ; 
అటు ఇటుగా- మాటలెన్నొ చెప్పుచూ ; 
రాజీలను కుదిరించు రాయబారి తానేను :  ||

& అటుకేసి ఒక చూపు ; ఇటు కేసి ఒక చూపు ; 
యశోదమ్మ, యమునాతటి ; 
నట్ట నడిమి బిందువు :  ||
;
ఇటు అటుగా, అటు ఇటుగా ;
పల్లె, నగరి అనుబంధం ; 
ఏర్పరచగలుగు తుంటరి మేధావి :  ||
;
అటుకు చిటుకు - చిటుకు అటుకు లాటలు ;
విస్తారం ఆటలిటుల ఇచట ; 
పటుతరముగ ఎటులిటుల ;
సంఘటనల పరంపరలు :  || 
;
వ్రేపల్లె నుండి మధుర దాక ; 
బాటలను పరచినట్టి ;
క్రిష్ణ లీల పరిమళాల పూవులు ;
ఇవి ఇటుల మరల మరల ;
మరల మరల ;
గుబాళించు నిరంతరం :  || 
;  
=====================; ;
;
aTu taanE, iTu taanE ; wiSwawibhuDu daiwamu ;
aTu numDi iTugaa ; iTu numDi aTugaa ; 
dObUculaaTalamdu mahaa mETi kRshNuDu :  || 
;
aTuwaariki aTugaa ; iTu waariki iTugaa ; 
aTu iTugaa ; maaTalenno ceppucuu ; 
kudirimcunu raajeelu ;
raajeelanu kudirimcu ; 
raayabaari taanEnu :  || 
;
& aTukEsi oka cuupu ; 
iTu kEsi oka cuupu ;
yaSOdamma, yamunaataTi ; 
naTTa naDimi bimduwu ; 
iTu aTugaa ; aTu iTugaa ;
palle, nagari anubamdham ; 
Erparacagalugu tumTari mEdhaawi :  || 
;
aTuku ciTuku - ciTuku aTuku laaTalu ;
wistaaram aaTaliTula icaTa ;  
paTutaramuga eTuliTula ;
samghaTanala paramparalu :  ||
;
wrEpalle numDi madhura daaka ; 
baaTalanu paracinaTTi 
krishNa leela parimaLAla puuwulu ; 
iwi iTula marala marala ;
marala marala ;
gubaaLimcu niramtaram :  ||