Wednesday, August 1, 2018

మధురాపురి - ఇటు రేపల్లె

క్రిష్ణయ్య చేరాడు మధురాపురికి ; 
వ్రేపల్లియ చిన్నబోయె - 
తన నీడను విడచి - 
ఇంతేనా క్రిష్ణయ్యా!?;
నీదు సాన్నిహిత్యం ; 
మరీచికల మైత్రియేనా!? ;  || 
;
సుదామాది మిత్రుల 
అశ్రుధారలందున ; 
నగరి బాట అంతటా ; 
ఎండమావి నిలిచెనే ; 
ఇంతేనా క్రిష్ణయ్యా!? 
మరీచికల మైత్రియేన ;
నీదు సాన్నిహిత్యం ;
మరీచికల మైత్రియేనా!? ;  ||
;
నిన్న మొన్నటి దాకా ; 
పల్లె జానపదాలను ; 
మురిపించినావు కదా,  
నీదు ఆట పాటలతో ;
మురిపించినావు కదా, 
;
నగరి మత్తు కమ్మినదా!?
సిరి భోగము లుప్పతిల్లు 
'పురి మైకం' క్రమ్మినదా ; 
ఇటుకేసి ఒక్క సారి
పరికించి, చెప్పవోయి!?  ||

కళారాజ్య యామిని

మురళి గానము మేలుమేలు ; 
తరుణి రాధ జాగు ఏల!!!?
కినుకలా, భళి ; మేలుమేలు ;  ||
;
కళారాజ్య యామినీ - 
సౌందర్య మయమాయెను ; 
సకల సృష్టి ;
ఈ స్వర్ణ తేజమ్మేలు ;
తరుణి రాధిక జాగు ఏల, 
కినుకలా, భళి ; మేలుమేలు ;  ||
;
బుంగమూతి అలుకలేల ; 
అంత సెగలు ఉరుములు ఏల, ఏల?
నీదు - కోర చూపుల నిండుగా ; 
పాల వెన్నెల నగవు చిలుకరించుచును నీవు ; 
పాల్కడలివాసుని చేరుమమ్మా! ;  ||  
;
=================; ;
;
muraLi gaanamu mElumElu ; 
taruNi raadha jaagu Ela!!!?
kinukalaa, bhaLi ; mElumElu ;  ||
;
kaLAraajya yaaminee - 
saumdarya mayamaayenu ; 
sakala sRshTi ;
ee swarNa tEjammElu ;
taruNi raadhika jaagu Ela, 
kinukalaa, bhaLi ; mElumElu ;  ||
;
bumgamuuti alukalEla ; 
amta segalu urumulu Ela, Ela?
needu - kOra cuupula nimDugaa ;
needu - kOra cuupula nimDugaa ; 
pAla wennela nagawu cilukarimcucunu neewu ; 
;
కళారాజ్య యామిని ; link - jalleda ;

యోజనాల దూరం - మధురా నగరం

యోజనాల దూరం ; 
మధురా నగరం ; 
వెళ్ళిపోయె నటకు  ; 
నిఖిల కళల ప్రతిబింబం ; 
నటనావతంస క్రిష్ణుడు :  ||
;
పురములోన పసందు ; 
షడ్రుచుల భోజనం 
నగరి విందు భోజనం ; 
అందుతున్నదో లేదో 
అందులోకి నవనీతం ; 
స్వచ్ఛమైన నవనీతం ;  ||
;
నిన్న మొన్నటిదాకా 
ఆస్థానం వ్రేపల్లెది ; 
ఈ రేపల్లెది ;
ఆ పురికి ఇక నుండీ 
తగని గోరోజనము ;
అందించినది - ఔరా! 
మన శ్రీకృష్ణుని ప్రస్థానం ;  ||

============; ;
;
yOjanaala duuram ; 
madhuraa nagaram ; 
weLLipOye naTaku  ; 
nikhila kaLala pratibimbam ; 
naTanaawatamsa krishNuDu :  ||
;
puramulOna pasamdu ; 
shaDrucula BOjanam ;
nagari wimdu BOjanam ; 
amdutunnadO lEdO ;
amdulOki nawaneetam ; 
swacCamaina nawaneetam ;  ||
;
ninna monnaTidaakaa ;
aasthaanam wrEpalledi ; 
ee rEpalledi ; 
aa nagariki ika numDI ;
tagani gOrOjanamu ; 
amdimcinadi - auraa! 
mana SreekRshNuni prasthaanam ;  ||

గోరు మీద వెన్నముద్దలు

గోపాల బాలుడు - బృందావన సంచారి
మురళీ ధరుడు, మురిపాల క్రిష్ణుడు;
మన పాలి దేవుడు ||
;
గోరు ముద్దలన్నిటినీ మెసవుచుండును;
కూర్మి- యశోదమ్మ గారాలపట్టి వీడేను!
మాకెల్లపుడూ వీని ధ్యాస, వీడము ఈ ధ్యానము ||
;
గోటి మీద కొండనే నిలిపి ఉంచినాడు;
గోటి కింద పెద్ద పాము నణచినాడు గదటమ్మా!
సాటిలేని మేటి, అసాధ్యుడంటె వీడేను ;
మాకెల్లపుడూ వీని ధ్యాస, వీడము ఈ ధ్యానము ||
;
గోరు మీద వెన్నముద్ద చాలంటాడు;
సంగోరు భాగమీవే -
నవనీతమింత చాలు, ఇవ్వమంటూను 
రాధను బులిపించును ;
గోపాలబాలుడు గోవిందుడు పురుషోత్తముడు ;
మాకెల్లపుడూ వీని ధ్యాస, వీడము ఈ ధ్యానము ||

నది ఒడ్డు - వడ్డాణం

యమునా తీరం ; 
అమూల్యమౌ ఆభరణం ; 
ఆ నది ఒడ్డు వడ్డాణం ; 

ఆభరణములో పొదిగి ఉన్న
నవ నవలాడే మణులెన్నో ; 
ధగధగలాడే నవ రత్నాల సిరులెన్నో ;  ||
;
రస క్రీడాకారులు, 
రసమయ లోకముల ఆవిష్కర్తలు ; 
విలంబనమ్ములు ఏలనె చెలులూ, 
పాలు పంచుకొన త్వరగా రండి ;  ||
;
ఆట పాటల సూత్రధారి ; 
క్రిష్ణుడు రానే వచ్చాడు ; 
లీలాకర్తల మౌదాము ; 
మనమూ ఇపుడే - 
రాస లీలల కర్తల మౌదాము ;  ||
===================;
;
# yamunaa teeram ; 
amuulyamau aabharaNam ; 
aa nadi oDDu waDDANam ; 
aabharaNamulO podigi unna
nawa nawalADE maNulennO ; 
dhagadhagalADE nawa ratnaala sirulennO ;  ||
;
rasa kreeDAkaarulu, 
rasamaya lOka aawishkartalu ; 
wilambanammulu Elane celuluu, 
paalu pamcukona twaragaa ramDi ;  ||
;
ATa pATala sUtradhaari ; 
krishNuDu rAnE waccADu ; 
leelaakartala maudaamu ; ; 
manamuu ipuDE - 
raasa leelala kartala maudaamu ;  ||
;
నది ఒడ్డు - వడ్డాణం ;-
జల్లెడ - బ్లాగుల link - 2  ;

వేడుకోలు చిత్రప్రజ్ఞ

వేడుకోలు చిత్రమే,
ఆ నేరుపు, ప్రజ్ఞలను ;
నేర్చుకోండి క్రిష్ణుని కడ ;  ||
;
నీ వన్నె చెరగునందున  ; 
చిటికెడంత ఒసగుమా -
అంటాడు క్రిష్ణుడు :  ||
;
"మౌనమేల రాధికా,
ఆ పగిదిని బిర్రుగా బిగియిస్తే -  ;
అలసి పోవు నీ పెదవులు" ;
బులిపిస్తూ, నవ్విస్తూ ;
అంటాడు క్రిష్ణుడు :  ||
;
wEDukOlu citramE,
aa nErupu, prajnalanu ;
nErcukOMDi krishNuni kaDA ;  ||
;
nee wanne ceragunamduna  ; 
ciTikeDamta osagumaa -
karuNa cuupi osagumaa - 
neeDa caalunu sumdaree/ ri ;  
anTaaDu krishNuDu :  ||
;
maunamEla raadhikaa,
aa pagidini bigiyistE -  ;
- birrugaa bigiyistE - 
nee pedawulu alasi pOwu/ nu ;
bulipistuu, nawwistuu ;
anTaaDu krishNuDu :  ||

- వేడుకోలు చిత్ర ప్రజ్ఞ ;
బ్లాగుల link - తెలుగు పత్రిక - 1 ;

వన మయూరి వింజామర

మువ్వలందు ఝుళం ఝళం ఓమ్ కారం ; 
ఓమ్ కారం ఝంకారం మువ్వీణియ నాదం ; 
రస వినోద తన్మయీ భావ భువన కేదారం; 
హృదయములందు అభిజ్ఞగా పరిఢవిల్లు విచిత్రం ;  || 
;
అటు ఉన్నది రాధిక ;
ఇటు నిలచెను వన మయూరి ;
పింఛమొకటి ఎటు చాలును!?

అందులకే కోటి కనులు ;
వింజామర సేవ చేయు అవకాశం కేకిది ;

'నెమలి కనుల పురి - ఆటల'
వింజామర సేవలను ; 
పుచ్చుకొన్న ఓ నెమలీ!                 
గుత్తకు పుచ్చుకొన్న ఓ నెమలీ!
నీవు ధన్యవు, ఇది నిజం ;
;
===================;
రస వినోద తన్మయీ భావ భువన కేదారం ;-
;
muwwalamdu jhuLam jhaLam ;Omm kaaram ; 
Omm kaaram jhamkaaram ; muwweeNiya naadam ; 
rasa winOda tanmayee bhaawa bhuwana kEdaaram; 
hRdayamulamdu abhijnagaa ;pariDhawillu wicitram ;  || 
;
aTu unnadi raadhika ;
iTu nilacenu wana mayuuri ;
pimCamokaTi eTu caalunu!?
amdulakE kOTi kanulu ;
wimjaamara sEwa cEyu ;
cEyu awakASam kEkidi ;

'nemali kanula puri - ATala' ;
wimjaamara sEwalanu ;
pucchukonna O nemalee! 
guttaku pucchukonna O nemalee!
neewu dhanyawu, idi nijam ;

బులిపించి ఉక్కిరిబిక్కిరి

కరుణకు కరుణ కలుగుచున్నది ; 
ప్రకృతి నిశ్వాసలు జాలిగ కురియుచున్నవి ; 
పడతి రాధిక పల్లవించెనే ; ;
పలు పలు మార్లు పల్లవించేనే ; || 

గోవర్ధనగిరి ధారి ఈతడు ; 
మోహన క్రిష్ణుడు ఇతగాడే; 
తడవ తడవకూ ;
బులిపించి, బేల మనసును ;
ఉక్కిరిబిక్కిరి చేస్తాడిటుల ; ||

వివరములెన్నో తెలిసిన వాడు ; 
విశ్వరూపము దాల్చే నిపుణుడు ;
వనితల నుడికించే ;
పనిలో మాత్రం ప్రజ్ఞాశీలుడు ;
నంద నందనుడు ఇతడు ; ||
;
================;
;
pallawi ;- karuNaku karuNa kalugucunnadi ; 
prakRti niSwaasalu jaaliga kuriyucunnawi ; 
paDati raadhika pallawimcEnE ;  || 
;
gOwardhanagiri dhaari eetaDu ; 
mOhana krishNuDu itagADE; 
taDawa taDawakU ;
bulipimci, bEla manasunu ;
ukkiribikkiri cEstaaDiTula ;  || 

wiwaramulennO telisina wADu ; 
wiSwaruupamu daalcE nipuNuDu ;
wanitala nuDikimcE ;
panilO maatram prajnaaSIluDu ;
namda namdanuDu itaDu ;  ||

మౌనముద్రికల భారము

మౌన ముద్ర పట్టెనేమేమి!? రాధిక ;
పల్లవాధరములు డస్సిపోయెనా!? ;  ||
;
మౌనముద్రలను మోసి మోసి ; 
అధరములు అలసిపోవునో ఏమో ;  || 
;
తన కోమల పెదవులు ; 
అలసిపోవునో ఏమో, 
మౌన ముద్రికల భారము ;
మోసి మోసి  మోసి  ; || 
;
పెదవి గొడుగు నీడలందు ;
తల దాచుకున్నాయా, 
మాటలు -
రాధ చిగురు పెదవులందు ;
తల దాచుకున్నాయా ;  ||  
;
=====================;  ;
;
mauna mudra paTTenEmEmi!?  raadhika ;
palaawaadharamulu DassipOyenA!? ;  ||
;
maunamudralanu mOsi mOsi ; 
adharamulu alasipOwunO EmO ;  || 
;
tana kOmala pedawulu ; 
alasipOwunO EmO, 
maunamudrikala bhaaramu ;
mOsi mOsi  mOsi  ; || 
;
pedawi goDugu neeDalamdu ;
tala daacukunnaayaa, 
mATalu -
raadha ciguru pedawulamdu ;
tala daacukunnaayaa ;  ||

జాజర పాటల జిలిబిలి

జాజర పాటల జిలిబిలిలో ; 
మోజుల జాజుల అలిబిలిలో ;
బేల రాధిక మానసము ; 
గజిబిజి ఆయెను ఎందుకనో!!? ;  ||
;
అంగనామణి చేతి విపంచి ; 
సరిగమ పలుకదు, ఎందుకనీ ; 
సరిగా - సరిగమ పలుకదు, ఎందుకనీ ;  || 
;
సంగతులెందుకు మ్రోగదు వీణియ ; 
సరిగ మెరుపుల అశ్రువులు ; 
చెంపల జారును - ఎందుకనీ!? 
భామిని చెంపల జారును - ఎందుకనీ!? ;  ||
;
నందబాలుని పొడ గానదు తాను ; 
వాని జాడలు కానమిచే - 
తానందు ఇందు - గోరాడుచునే 
ఉన్నది జాలిగ విరహిణి రాధిక ;  ||
;
======================; ;
;
jaajara pATala jilibililO ; 
mOjula jAjula alibililO ;
bEla raadhika maanasamu ; 
gajibiji aayenu emdukanO!!? ;  ||
;
amganaamaNi cEti wipamci ; 
sarigama palukadu, emdukanee ; 
sarigaa - sarigama palukadu, emdukanee ;  ||
;
samgatulemduku mrOgadu weeNiya ; 
sariga merupula aSruwulu ; 
cempala jaarunu - emdukanee!? 
bhaamini cempala jaarunu - emdukanee!? ;  ||
;
namdabaaluni poDa gaanadu taanu ; 
waani jADalu kaanamicE - 
taanamdu imdu - gOrADucunE 
unnadi jaaliga wirahiNi  raadhika ;  ||

పద గతి ఇది-స్వర లయ మది ముదమతి గొని

పద గతి ఇది-స్వర లయ మది
ముదమతి గొని, వరమీయమనీ ;
నీ చరణ శృతి చప్పుడు విని ;
గప్ చుప్ గా దాగేనని ఎటనో అని 
"మా మురిపాల బాల కన్నయ్యదే కద -
ఈ ఉనికి" అనీ ...... 
;
సవ్వడి తరి 'ఇవ్విరి వని'
విచ్చేసిన అగణితమౌ - 
వనితలదీ బహు సందడి ;
దడబిడగా గడ బిడ ఇది!

లే జవ్వని మువ్వల జడి - గువ్వల సడి
రా చిలకల , శుక 'కిళి కిళి'-
సీత కోకల హడావుడి ;
చివురుల ఒడి కిల కిల మని 
మరి మరి మరి ఒలికిన తఱి 
;
నిన్నటి దాకా - మౌనాంకిత బృందా వని!
నే్డేమో నిలువెల్లా సౌదామిని ;
ఇలాగిలాగీలాగున గిలిగింతలు ఈ ఇలకు!
అహహాహాహా! ఆహాహాహా ! 
;
అది కని,కని చకితంబై - యామినిలో -
యమునా నది తరగలపై ;
'వెన్నెల చలి కిరణమ్ముల కలముల'తో
వ్రాసెనులే నీలి నింగి .........
నవ్య లాస్య విలాస లాస
హావ భావ నాట్య చలన నర్తన లయ
ఝళం ఝళన ఘటిత ఘటన నట వేదము!
;
శ్రీ బాల కృష్ణ! నీ క్రీడా సంరంభము
మాకందిన పారిజాత మకరందము
ఇల, భక్త కోటి కొసగినట్టి ;
సాహితీ కల్ప తరుల సౌరభములు!