Thursday, August 14, 2014

2014 స్వాతంత్ర్య శుభాకాంక్షలు! (song)

తెలుగు పాటల తోట బృందావనమ్మిది
మది పులకరించగా
తెలుగు పాటల తోటలో తిరిగి వద్దామా
చక్కని తెలుగు -
మాటల పూల ఘుమఘుమల తేలి వద్దామా ||
;
అ ఆ- ల అచ్చులు,
అనువైన కుంభము;
క ఖ- ల హల్లులు;
అందుంచు తీపి సుధ జలములు ||
;
అక్షరములకు తెలుసు అందించు భావాలు;
మనిషి మనసుకు మంచి పాదు చేసేను
మంచి మనసుల మించు ప్రోది చేసేను  ||
;
కమ్మనైన తెలుగు భాష మనదే కదా!
కొమ్మలూగే పువుల పుప్పొడులజల్లులు
        ॥తెలుగు - తేనె మాటల మధువు
            కొలువనెవ్వరి తరము!?॥ |

************************************
చక్కని తెలుగు : ;