Saturday, May 25, 2013

గిన్నెలని క్లీన్ చేసే 'కిల్మోరా' చెట్టు

“కటార్ మల్ కోవెల” కు సంబంధించిన ఆచారములలో ఒక మొక్కకు అవినాభావ సంబంధం ఉన్నది.
కిల్మోరా చెట్టు వలన ఆ ఊరికి కూడా పేరు వచ్చింది. తరువు హిమాలయములలో గుర్రం జీను ఆకారములో ఉన్న ఉపరితలమున ఈ చెట్టు పెరుగుతున్నది.
నిట్టనిలువుగా కోసుగా ఉన్న కనుమ లాంటి ఆ చోట కిల్మోరా వలన “కిల్మోరా” అనే పేరు వచ్చింది.
బ్రిటీషు వారు పాలించే రోజులలో పాశ్చాత్య ఉచ్చారణలో క్రమేణా “అల్మోరా” గా మారిపోయింది.
కోశీ/ కౌశిక్ నది, సూయల్/ శాల్మలీ నది
ఈ గ్రామము వద్ద ప్రవహిస్తూ, పాడిపంటలకు, పచ్చదనముతో
ప్రకృతి విలసిల్లే ఆహ్లాదకర వాతావరణానికి హేతువులౌతూన్నవి.
ఆల్మోరా జిల్లా హరితభరిత సౌందర్యాల రాశి, హిమగిరులలోని ఖగ్ మారా కొండలు
(Khagmara hills)సందర్శకులకు, ట్రెక్కర్స్ ని ఆకర్షించే దర్శనీయ స్థలములు.

************************;

ఇంతకీ కిల్మోరా కథాకమామిషూ ఏమిటి?

వంగ పండు రంగు కలిగిన పుష్ప ఫల భరిత వృక్షము కిల్మొరా. 

ప్రాచీన కాలములో ప్రజలు - కతర్ మల్ గుడిలో- పాత్రలను శుభ్రం చేయడానికి-
ఈ కిల్మోరా చెట్టును ఉపయోగించే వారు.
మన దేశములో - పుణ్య క్షేత్రములో, ఆలయములోని గిన్నెలు,
తదితరములను పరిశుభ్రం చేయడానికై ఒక చెట్టు భాగాలను వాడటం-
బహుశా ఈ "అల్మోర"  (పాత నామం- కిల్మోరా)లో మాత్రమే మనకు కానవస్తూన్నది.
Koshi, (Kaushiki), and Suyal (Salmale)

******************************************;

ఉత్తరా ఖండ్ కి కలికితురాయి “ఆల్మోరా” మండలము.
నండదేవి దేవాలయం, కాసర దేవీ ఇత్యాది అనేక కోవెలలు బాలో కళ్యాణ్ చాంద్ మహారాజు కాలములో నిర్మించబడినవి.  “అల్మోరా” లో ప్రసిద్ధి గాంచినది.
స్వామి వివేకానందుడు  కాసర్ దేవీ గుడి దరి ఒక గుహలో ధ్యానం చేసేవారు.

Taags:-

Purple colour fuits, Kilmora Tree;

(Almora plug Kilmora plant for washing the utensils of "Katarmal Temple".