Thursday, April 23, 2009

జన్మ ధన్యము!

జన్మ ధన్యము!


నవ కువలయ దళ నేత్రుడు 
సన్నుత కీర్తి లావణ్య చరితుడు, 
లలిత తేజుడు స్వామి 
విమల కమనీయతయె 
మా కన్నులకు పండుగ 

ఎదలు సంపెంగలు 
తన సొదలు పూ తేనియలు 
మొదలు నీ పదముల 
చేరె నంతే చాలును 
పారాణి రజనులను పొందిన 
పూవు జన్మ సార్ధక్యము 

స్వామి హృదయము పైని 
వన్నె పూల చెండులలో 
చిన్ని పూవును స్వామీ! 
శ్రీ వేంకట రమణుని చిద్విలాసుని 
అనుగ్రహములే అలిమిన నీలి సంపెంగను! 
జన్మ ధన్యము! 

Views (106)

No comments:

Post a Comment