Friday, March 25, 2016

ఆట పట్టు, తేనెపట్టు

వ్రేపల్లె నేడొక తేనెపట్టు;
మకరందములకు ఆట పట్టు || 
;
అయినవాళ్ళూ, కాని వాళ్ళూ;
భేదముల సరిహద్దులన్నీ 
బలాదూరు అగును ఇచట! ||అయిన||
;
చద్ది అన్నం, కలి అంబలి ; 
సైతం ఇట అమృతమే! ||అయిన||
;
కర్రముక్కలు; ఆటల కోలాటములౌ 
చోద్యాలు ఇచటనే! ||అయిన||

వెదురు పేళ్ళూ వేణువులౌ 
వింతలన్నీ ఇచ్చటనే! ||అయిన||
;
========================== ;
ఉపశమన తరంగాలు October 8, 2015 
సుధాక్షీరం ;- LINK 
******************************,
అఖిలవనిత ;
Pageview chart 35332 pageviews - 838 posts, last published on Mar 20, 2016 - 

సోలంకి, పాలరాతి ధూళి కూలీ

కుమార పాల్ సోలంకి :-  జైనుల కోవెలలు = 
దేరసరస్లను , బసడి లను అద్భుతంగా నిర్మించిన చక్రవర్తి.  
జైన ఆరామములకు 
1. దేరాసరస్ [(derasaras) ]
2. బసడి - అని పేరు.  

&&&&&&

శత్రుంజయ = అంతః = 
మనసును పీడించు శత్రువులను జయించిన మనిషి అని అర్ధం. 
ఈ 'శత్రుంజయ' కు 108 పర్యాయ నామావళి కలవు, 
కానీ కొన్ని పేర్లు మాత్రమే వాడుకలో ఉన్నవి. 
పలిటానా జిల్లా, భావనగర్ పట్టణములకి 
నడుమ శత్రుంజయ నది ప్రవహిస్తున్నది.
కొండ మీద 860 జైన కోవెలలు - 
తొలి వెయ్యి అద్భుతములలో ఒకటిగా పరిగణిస్తున్నారు. 
11 వ శతాబ్దము నాటి నిర్మాణాలు. 
రిషభదేవ తీర్ధంకరుడు నుడివిన 
మొదటి పవిత్ర వాక్కులను భక్తులకు ఇక్కడ అనుగ్రహించుట జరిగింది. 
కనుక ఈ గిరి -  'రిషభదేవకు అంకితం ఈయబడినది. 
అన్య మతస్థుల దుష్టత్వానికి గురి అయినవి ఈ ఆలయాలు. 
తర్వాతి కాలమున 
సమర షా,  శ్వేతాంబర జైనులు, హీర విజయసూరి 
మున్నగువారు పునరుద్ధరణ  గావించారు.  
;జైన ఆరామములలో రకములు :- 
దేరాసరస్; బసడి - లూనా వాసహి, విమల వాసహి - మౌంట్ ఆబూ; 
;
] శిఖర్ బంది  ; ఘర్ = గోపురం లేని నిర్మాణముగా ఉన్న  గుడి 
;
&&&&&&
;
కుమార పాల్ సోలంకి గొప్ప జైన కళాపోషకుడు. 
కుమార సోలంకి ఈ గుళ్ళు కట్టిన పద్ధతిని, 
నిర్వహణాసామర్ధ్యానికి ఉపమానంగా చెబ్తున్నారు.
శిల్పుల దక్షతకు కూలీగా ధనానికి మారుగా 
అతడు, కళాకారులకు ఇచ్చిన మూల్యాన్ని - 
చరిత్రనందు అండర్ లైను చేయవలసిన 
విషయాల పట్టికలలోనికి చేరింది.
;
&&&&&&
;

ఇంతకీ అదేమిటి? :-
ఇళ్ళకు వెళ్ళేటప్పుడు ఇల్పులు, శ్రామికులు, వారు 
ఆ నాటికి - చలువ రాయి నుండి -చెక్కుతారు కదా! 
ఆ చెక్కిన శిల్పాల వలన 
పాలరాయిలలో నుండి ధూళి వస్తుంది. 
పాలరాతి ధూళికి ఎంతో విలువ ఉన్నది. 
కాబట్టి గృహోన్ముఖులౌతూన్న కూలీలకు 
'లభించు కూలీ - పాలరాయి ధూళి' ;            
ఈ నిబంధన వలన అనేక లాభాలు ఒనగూడినవి.
రాళ్ళను ఎంత సన్నగా, చిన్నగా చెక్కితే 
అంత ఎక్కువ రాతి దుమ్ము, గుజ్జు వెలువడుతాయి అన్న మాట. 
ఇందువలన శిల్పులు, లతలు, పువ్వులు, పుష్పదళాలు 
ఇత్యాది అంశాలను అతి సూక్ష్మంగా, మినియేచర్లు 
అంత నైపుణ్యంగా చెక్కారు.
;
ఈ 'టుక్స్', దేసరస్, కోవెలల కుడ్య, గోపురములపై, 
అణువణువునా కనిపిస్తుంది. 
;
పాలరాతి ధూళి - శిల్పులకు కూలీ :-
చమత్కారమైన ఐడియా ఇది!
సోలంకి ప్రవేశపెట్టిన కొత్త విధానంతో 
శిల్పులలో అంతర్గతంగా ఉన్న ప్రతిభ, 
ప్రజ్ఞా పాటవములు మెరుగులు దిద్దుకున్నవి.
ఫలితంగా మనకు ఈనాడు

నయన పర్వాన్ని కలిగిస్తూన్న జైన కోవెలలలను లబ్ధి కలిగినవి. 
;
&&&&&&
;
పాలరాతి ధూళి - శిల్పులకు కూలీ : 

1. కర్నాటక సంగీతం లోని 72 మేళకర్త రాగాలు ;- 
     'శ్రీ సరస్వతీ మేళకర్త  రాగ ' చిత్ర పటం
2. కటపయాది సూత్రం - 

Sunday, March 20, 2016

చెంగల్వరాయునికి పసిడి కీర్తనలు ;

కస్తూరి, కర్పూరములు రంగరించి , 
కాచు, పోకల కూర్పు మేలిమిగ సమకూర ;
గోరంత సున్నమును హంగుగా చేర్చంగ ; 
చెంగల్వరాయనికి బంగారు కానుక ||
;
పచ్చ పచ్చని చిలుక ; 
చెంగు చెంగున ఎగిరి ; 
దేవి ఒడిలో వాలె ||
;
స్వామి వైపు బాగ తొంగి చూచింది ; 
పరికించి చూసి కనిపెట్టె నొకటి;
అమ్మను అడిగింది కులుకుల కీరము ; 
"అయ్య అధరమ్ముల అరుణరాగాలు : 
ఎరుపు నురుగుల పొంగు - లెటుల వచ్చేను?" || 
;
కీరవాణి సిగ్గు దొంతరల మొగ్గాయె! 
'తాంబూలచర్వణ మహిమ కతమున జరిగె!'
తాంబూల విడియము నోరు పండించె! 
గోరింట అరచేత పంటలాయేను!" ||
;
అమ్మ వాక్కులకు నా తమాలమ్ము ; 
దరహాసిని ఆయె; 
పులకింతలందు ఓలాడె కురువకము; 
పద్మావతీ దేవి కెంపు పెదవుల ఎరుపు ; 
ముసిముసిగ కులికేను || 
;
=========================; 
;
# kastuuri , karpuuramulu ramgarimchi , 
kaachu, pOkala mElimiga samakuura ;
gOramta sunnamunu hamgugaa chErchamga ; 
chemgalwaraayaniki bamgaaru kaanuka ||
;
pacha pachchani chiluka ; 
chemgu chemguna egiri ; 
dEwi oDilO waale ||
;
swaami waipu baaga tomgi chuuchimdi ; 
parikimchi chuusi kanipeTTe nokaTi || 
;
ammanu aDigimdi kulukula keeramu ; 
"ayya adharammula aruNaraagaalu : 
erupu nurugula pomgu - leTula wachchEnu?" || 
;
keerawaaNi siggu domtarala moggaaye! 
'taambuulacharwaNa mahima katamuna jarige!
taambuula wiDiyamu nOru pamDimche! 
gOrimTa arachEta pamTalaayEnu!" ||
;
amma waakkulaku naa tamaalammu darahaasini aaye ; 
pulakimtalamdu OlalADe kuruwakamu; 
padmaawatii dEwi kempu pedawula erupu ; 
musimusiga kulikEnu ||
;
**************************************,
; - [ సుమదళ ]

**************************************;

అఖిలవనిత
Pageview chart 35272 pageviews - 837 posts, last published on Mar 20, 2016 
కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 65087 pageviews - 1041 posts, last published on Feb 28, 2016 -
తెలుగురత్నమాలిక
Pageview chart 5277 pageviews - 148 posts, last published on Jan 20, 2016 

చేమంతి పుప్పొడులు

మెడలోన మందారదామాలు , ఆ పైన
మొల నూలు గజ్జెలలొ బంతిరేకుల్లు ; 
కాలి అందెలలోన ; చేమంతి పుప్పొడులు; 
ఇరుకుకుని నవ్వాయి, చిందులే వేసాయి:
;
కస్తూరి ఘుమఘుమల ; 
పొగడ పూతావులు జలక్రీడలాడాయి ; 
మురుగులు, కడియాలు; కైందండ మురిపాలు
మణుల చిన్నెలకు దక్కె శతకోటి మురిపాలు;
కన్నయ్య సిగ ముడిని నెమలీకలు;
నీలమోహన క్రిష్ణ జాలముల 
ఓలాడు ఇన్ని వస్తు సామగ్రి
;
అవలోకితములగుచు నింగిలో మేఘాలు 
గునగునలు ఆడేను; గుసగుసలు ఆడేను ; 
"మరకతం మణి ఛాయనున్నాము మేము!
మాకు గల హక్కు బహు మిక్కుటము ! " - 
అనుచు ఉరుములే ఉరిమేను;
మెరుపు ఝళిపించేను ;
నీలంపు జిగి మేని అల్లరి క్రిష్ణయ్య
సందిటను చేరగా తపములే చేసేను;
నీలి మబ్బుల చాల తపములను చేసేను ||

by ;- [ శీర్షిక : మురళీ రవళి]
=====================================,

# meDalOna mamdaaradaamaalu , aa paina
mola nuulu gajjelalo bamtirEkullu ; 
kaali amdelalOna ; chEmamti puppoDulu; 
irukukuni nawwaayi, chimdulE wEsAyi: ||
[mukku puDakaga ]
kastuuri ghumaghumala ; pogaDa puutaawulu jalakrIDalADAyi ; 
murugulu, kaDiyaalu; kaimdamDa muripaalu
maNula chinnelaku dakke SatakOTi muripaalu;
kannayya siga muDini nemaliikalu;
niilamOhana krishNa jaalamula OlaaDu inni wastu saamagri !!!!!

awalOkitamulaguchu nimgilO mEGAlu gunagunalu ADEnu; 
gusagusalu ADEnu ; 
marakatam maNi CAyanunnaamu mEmu!
maaku gala hakku bahu mikkuTamu - anuchu
urumulE urimEnu; merupu jhaLipimchEnu ; 
neelampu jigi mEni allari krishNayya
samdiTanu chEragaa tapamulE chEsEnu 
neeli mabbula chaala tapamulanu chEsEnu ||
;
*************************************************
By ;- [ SIrshika : muraLI rawaLi]  కృష్ణం వందే జగద్గురుం
*************************************************