Wednesday, June 29, 2016

తాంబూలముల సీత

పుండరీకాక్షునికి ,
మారామ చంద్రులకు
భూపుత్రిక,సీత!
చిలకలీయుమా!!
తమలపాకుల చిలకలీయుమా!!! ||
;
మారాము చేసేటి మా రాములకు  
చనువుగా, గోముగా ;
చిలక పలుకుల కలికి!
చిలకలీయుమా!!
తమలపాకుల చిలకలీయుమా!!!  ||
;
నీలమోహన రామ;
ఆజానుబాహుని అరచేతులందున
ఆకువిడెమును ఉంచి ;
పసిడి నవ్వును ఉంచెను ;
అవనిజ, సిరి సీత || |
;
నీలవర్ణుని పెదవి ఎరుపుల ఉప్పొంగు
తాంబూల చర్వణం అరుణరాగములు;
అనురాగములు చిలుకు దాంపత్యశోభలకు
కస్తూరి, కర్పూర,  కాచు, పోకల కూర్పు
తాంబూల మడుపులు శ్రీ హారతి ||
;
========================,

    తాంబూలముల సీత

pumDarIkaakshuniki,
maaraama chamdrulaku
bhuu putrika seeta!
chilakaleeyumaa,
tamalapaaku chilakaleeyumaa!!!  ||
;
maaramu chEsETi maa raamulaku
chanuwugaa, gOmugaa ;
chilaka palukula kaliki!
chilakaleeyumaa,
tamalapaaku chilakaleeyumaa!!!  ||
;
neelamOhana raama;
aajaanubaahuni arachEtulamduna
aakuwiDemunu umchi;
pasiDi nawwunu umchenu
awanija, siri seeta ||
;
neelawarNuni pedawi erupula uppomgu
taambuula charwaNam aruNa raagamulu ;
anuraagamulu chiluku
daampatyaSOBalaku
kastuuri, karpuura, kaachu, pOkala kuurpu
taambuula maDupulu Sreehaarati ||
;
------ [taambuulamula seeta ]

తమాలపల్లవ శుక, శారికలు

నింగి అడపం నిండా: నీరదం పత్రాలు :
ఆ మబ్బు ఆకులను మడిచి,
           ఇచ్చేవారు ఎవ్వరమ్మా!?
గొబ్బున ఇచ్చు వారెవరమ్మా!? ||
;
తమలపాకు చిలకలను చేయు
చాతుర్యాలు ఎవ్వారివమ్మా?
;
చెలులు :- ఇంకెవ్వరివమ్మా!?
ఇంకెవ్వరికున్నది ఆ ప్రజ్ఞ, ఆ నేర్పు!?
- మన రాధకు తప్ప! ||
;
మెరుపుల వక్కలను సమకూర్చినది వనిత ;
వర్షధార "కాచు" రుద్ది; జలజముల "కిళ్ళీలను" ;
అలవోకగ చేసేను అపరంజి బొమ్మ
;                     మన అపరంజి బొమ్మ ||
;
శ్రావణ మేఘాల విడియాలు సిద్ధం, సిద్ధం ;
కర్పూరం తాంబూలం సిద్ధం, సిద్ధం ;
కోమలి కుడి చేతి వ్రేళ్ళ శిఖరములుగ;
తమాల పల్లవం బొమ్మలు ; సిద్ధం, సిద్ధం ;
ఎర్రెర్రని పెదవుల గూటిలోన దాచేటి ;
మురళీధర! నందబాల!
మా నల్లనయ్య! రావయ్యా! ||

=========================,

#nimgi aDapam nimDA: nIradAla patrAlu :
aa mabbu aakulanu maDichii; ichchE
wArewarammA!?
gobbuna ichchE wArewarammA!? ||
;
tamalapaaku chilakalanu;
chEsE chaaturyaalewwariwammaa?
imkewwariwammaa!?
;
imkewwari kunna damma aa praj~na, A nErpu!?
mana raadhaku tappa! ||
;
merupula wakkalu nu samakuurchinadi wanita;
wEsi; warshadhaara kaachu ruddi; jalajamula "kiLLIlanu" ;
alawOkaga chEsEnu ; mana aparamji bomma ||
;
SraawaNa mEGAla wiDiyaalu siddham, siddham ;
karpuuram taambuulam siddham, siddham ;
kOmali kuDi chEti wrELLa SiKaramuluga;

tamaala pallawam
bommalu ; siddham, siddham ;
errerrani pedawula; gUTilOna daachETi ;
muraLIdhara! namdabaala!
maa nallanayya! raawayyaa! ||
;
[ తమాలపల్లవ శుక, శారికలు ]

''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
; రాధామనోహరం (శ్రీ కృష్ణ భావలహరి) ; October 3, 2015; 
అఖిలవనిత
Pageview chart 36180 pageviews - 870 posts, last published on Jun 25, 2016 - 

ksm - another song - :-

ముల్లోకములకు పారవశ్యము ;-
మంజుల వాణీ! శార్వాణీ! 
పినాక పాణి, హృదయ రాణివి! 
అమ్మా! నీ ఒడిలోన. ముల్లోకములు మైమరచేను! ||
అమ్మా! నీ తమాల పల్లవ కటాక్ష దృక్కుల 
ముల్లోకములు మైమరచేను! || 
తుషార మౌక్తిక ధవళ కాంతులు/ లను

Saturday, June 25, 2016

కన్నులలో లోకములు

"కంటిలోన నలకలేవొ పడినవమ్మ! ;
నా కంటిలోన నలకలేవొ పడినవమ్మ!”;
అనుచు నలుపబోకురా,
నల్లనయ్య! నలుపబోకురా  ||
;
నీ చల్లని వీక్షణముల ;
యుగములన్ని – క్షణములుగా ;
కరిగిపోవురా!  కృష్ణా! కరిగిపోవురా!  ||
;
రెప్ప కాస్త కందేనా –
క్షణములన్ని - యుగములుగా
నిలిచిపోవురా! కృష్ణా! నిలిచిపోవురా!
;
నీ కన్నుల బింబములలొ
ఈ సకల విశ్వ గోళమ్ములు ;
వేలాదిగ పొదిగి ఉన్నవనే  -
                          మాట మరిచి, నలుపబోకురా ;
చిన్ని కృష్ణా!! కన్నులు నలుపబోకురా!
కన్నులు నలుపబోకురా  ,
చేతులదిమిపెట్టి నలుపబోకురా!  

=========================================

                    kannulalO lOkamulu ;-  [ పాట 19 - బుక్ పేజీ 30 ]     :-

"kamTilOna nalakalEwo paDinawamma! ;
naa kamTilOna nalakalEwo paDinawamma!”;
anuchu nalupabOkurA, kannulu nalupabOkurA  ,
chEtuladimipeTTi nalupabOkuraa,
nallanayya! nalupabOkurA  ||
;
nii challani weekshaNamula ;
yugamulanni kshaNamulugaa ;
karigipOwurA! kRshNA! karigipOwurA!  ||
;
reppa kaasta kamdEnA –
kshaNamulanni - yugamulugaa –
nilichipOwurA! kRshNA!nilichipOwurA!  || ;
nii kannula bimbamulalo/ lOna ;
ii sakala wiSwa gOLammulu ;
wElAdiga podigi
unnawanE  maaTa marichi,
nalupabOkurA ; chinni kRshNA!! kannulu nalupabOkurA!

++++++++++++++++++++++++++++++++++
;
అఖిలవనిత
Pageview chart 36153 pageviews - 869 posts, last published on May 31, 2016 - 

కన్నులలో లోకములు ;-
కన్ను దోయి నులమ బోకురా! కృష్ణయ్యా! [పాట - 2]
తెలుగు వెబ్ దునియా  [ లింక్]
[ పాట 19 - బుక్ పేజీ 30
= kannulu nalupabOkurA!