Wednesday, March 31, 2010

మల్ల గుల్లములు ఏల?


సారసాక్షుడే అండ దండగా
సదా రక్ష మనకు !
తర్జన భర్జన లితరములేలనె ?
మల్ల గుల్లమేల ?
మనసా!మల్ల గుల్లమేల !!!!! ||

1.తిరుమల నాథుని దర హాసముల
కల్ప తరుల నీడ
దొరక బుచ్చుకుని పరుగులు తీయవె !
శాంత శృంగమదియే !!
మనసా!శాంత శృంగమదియే!! ||

2. వరద హస్తుని అభయము విరళము ;
చల్లనైన నీడ -
దొర కొన్న వారికి – చిటికెలొ లభ్యము ;
శాంత తత్వ మూలం ;
చిత్తములోని -
శాంత తత్వ మూలం ||

&&&&&&&&&&&&&&&&&&&&&&&
&&&&&&&&&&&&&
malla gullamulu Ela?
________________

saarasaakshuDE aMDa daMDagaa
sadaa raksha manaku !
tarjana Barjana litaramulElane ?
malla gullamEla ? manasaa !
malla gullamEla !!!!! ||

1.tirumala naathuni dara haasamula
kalpa tarula nIDa
doraka buchchukuni parugulu tIyave !
SAMta SRMgamadiyE !!
manasaa ! -
SAMta SRMgamadiyE !! ||

2. varada hastuni aBayamu viraLamu ;
challanaina nIDa -
dora konna vaariki – chiTikelo laByamu ;
SAMta tatva mUlaM ;
chittamulOni -
SAMta tatva mUlaM ||


&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

అందాల శ్రీ కృష్ణుడు

మురళి గాన సంపన్నుడు కృష్ణుడు
సరళ నర్తనమ్ములు – బొమ్మ కట్టినట్టి వాడు ;
నిరంజనుడు ,మా వాడు – మన వాడు
అందరి వాడు, అందరితో వాడే!
మన అందరిలో వాడే ||

అల నీలి మేఘ వర్ణమతని ముందర దిగ దుడుపు
గాలి వేణువున చేరి “ పాటగ” మారి,
వాని చుట్టు ప్రదక్షిణలు సేయు చుండు నిరతము ||

తన – రూప లావణ్యములకు – ప్రకృతి దాసోహమగును
రూపు కట్టినట్టి లాస్య కళా సంపన్నుడు
నిరుపమ గుణ స్తోముడు , నిఖిల లోక రక్షకుడు ||

( అందాల శ్రీ కృష్ణుడు ::::::: )
_________________

( rachana ; kadambari ) ;

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

aMdaala SrI kRshNuDu ::
_____________

muraLi gaana saMpannuDu kRshNuDu
saraLa nartanammulu – bomma kaTTinaTTi vaaDu ;
niraMjanuDu ,maa vaaDu – mana vaaDu
aMdari vADu, aMdaritO vaaDE!
mana aMdarilO vaaDE ||

ala nIli mEGa varNamatani muMdara diga duDupu
gaali vENuvuna chEri “ paaTaga” maari,
vaani chuTTu pradakshiNalu sEyu chuMDu niratamu ||
tana – rUpa laavaNyamulaku – prakRti daasOhamagunu
rUpu kaTTinaTTi laasya kaLA saMpannuDu
nirupama guNa stOmuDu , niKila lOka rakshakuDu ||

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

మృదుల రాగమ్మది !

మీటు చున్నది రాధ మాణిక్య వీణను ;
మీటునది అదె శ్రీ కృష్ణు హృదయమ్మును ||

ఆడేను కన్నయ్య చరణ యుగళి
ఆడనే మా మదుల (* 1 )
నిరత మృదు వ్యాహ్యాళి ||

ఆడేను మురళిని
ఆ పల్లవాంగుళి ||
దోగాడు మా మదిని
మృదుల రాగమ్మది |

&&&&&&&&&&&&&&&&&&&&&&

మదుల (* 1 ) = (=మది + ల )

&&&&&&&&&&&&&&&&&&&&&&mITu chunnadi raadha maaNikya vINanu ;
mITunadi ade SrI kRshNu hRdayammunu ||

ADEnu kannayya charaNa yugaLi
ADanE maa madula(=madi + la )
nirata mRdu vyaahyaaLi ||

ADEnu muraLini
aa pallavaaMguLi ||

dOgaaDu maa madini
mRdula raagammadi ||

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

( rachana ; kusuma )

శ్రీ సదన!

శ్రీ సదన! చిద్రూప!
చిన్మయ దరహాస!
భక్త జన హృత్ వాస!
శ్రీ చిద్విలాసా! ||

రాకేందు వదనా! రాజీవ లోచనా!
నీ - ఝణన నూపుర నాద
మొలికించు పద ద్వయిని
- ఒక క్షణమైన విడువను ||

నీ – మణి కంకణాల్ రవళి
చిలికించు కరముల
వంశి - వేణువుగ నన్ మలచుకోవయ్యా!
నిల్పుకో నా స్వామి ! ||

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$


SrI sadana! CidrUpa!
chinmaya darahaasa!
Bakta jana hRt vaasa!
SrI chidvilaasaa! ||

rAkEMdu vadanaa! raajIva lOchanaa!
nI JaNana nUpura naada molikiMchu
pada dvayini - oka kshaNamaina viDuvanu ||

nI – maNi kaMkaNaal ravaLulanu – chilikiMchu karamula
vaMSi - vENuvuga nan malachukOvayyaa!
nilpukO naa svaami ! ||


&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
rachana :::::::::: kusuma kumari ;

Tuesday, March 30, 2010

శరవణ భవ గురు గుహం శ్రీముత్తు స్వామి దీక్షితర్ కృతి ::::::
____________________
(పల్లవి) ;;;;;;
_____
పార్వతీ కుమారం
భావయే సతతం
శరవణ భవ గురు గుహం శ్రీ ||

(చరణం );;;;
_____

మార్గ సహాయ ప్రియ సుతం
మాధవాద్యమరాది నుతం
మాణిక్య మకుట శోభిత మానిత గుణ వైభవం ||

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&


muttu svaami diikshitar kRti ::::::
_____________________________
(pallavi) ;;;;;;
____________

pArvatI kumAram
bhAvayE satatam
SaravaNa bhava
guru guham SrI ||

(caraNam );;;;
__________

mArga sahAya priya sutam
mAdhavAdyamarAdi nutam
mANikya makuTa SObhita mAnita guNa vaibhavam ||

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

Click here ;

raagam: naaTTai kurinji
28 harikaambhOji janya
Aa: S R2 G3 M1 N2 D2 N2 P D2 N2 S
Av: S N2 D2 M1 G3 M1 P G3 R2 S

taaLam: roopakam
Composer: Muttuswaamee Dikshitar
Language: Sanskrit

రామ రామ గుణ సీమా !
మహారాజు స్వాతి తిరుణాళ్ కృతి ;;;;
___________________

(పల్లవి )::::

రామ రామ గుణ సీమా ! -
రామ హృదయాభి రామ సీతా

(అనుపల్లవి) ::::

సోమానన ఘన శ్యామ! హేమాంబరారి విరామ !

(చరణం 1)::::
___________

వాసవ ముఖ దేవ! వంద్యమాన చరణ;
వస మే హృది సదా; వారణ మోహన గతే!

భాసిత హేమ కల్ప; పాటిత ఖలాటోప;
నాశిత సంసార తాప; నయన భరిత కృప

(చరణం 2);;;;;

ప్లవగ సముదాయ పరివ్రత కలయ విభో!
మమ కుశలం దినమను నవ మణి మయ హార;

నీరధి మద హర భవ సరిదీశ
పార భూసురి సుందరాకార;

(చరణం 3) ;;;;;;;

దీన బంధో; మా మవ; దశ ముఖ విదళన
వినత కల్ప తరో ;వారిజ నాభ రూప ;;;

ముని మానస ధామ మృగ మద సులలామ;
వనిజాపాంగ సుదామ వైదేహి సకామ ;


&&&&&&&&&&&&&&&&&&&&

mahaaraaju svaati tiruNAL kRti ;;;;;
________________________


Song: raama raama guNaseemaa
________________________

(pallavi )::::

rAma rAma guNa sImA ! - rAma hRdayAbhi rAma siitA

(anupallavi) ::::

sOmAnana ghana SyAma! hEmAmbarAri virAma !

(caraNam 1)::::___________

vAsava mukha dEva! vandyamAna caraNa;
vasa mE hRdi sadA; vAraNa mOhana gatE!

bhAsita hEma kalpa; pATita khalATOpa;
nASita samsAra tApa; nayana bharita kRpa

(caraNam 2);;;;;

plavaga samudAya parivrata kalaya vibhO!
mama kuSalam dinamanu nava maNi maya hAra;

nIradhi mada hara bhava
saridISa pAra bhUsuri sundarAkAra;

(caraNam 3) ;;;;;;;

dIna bandhO; mA mava; daSa mukha vidaLana
vinata kalpa tarO ;vArija nAbha rUpa ;;;

muni mAnasa dhAma mRga mada sulalAma;
vanijApAnga sudAma vaidEhi sakAma ;

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

http://www.karnatik.com/c1817.shtml

Song: raama raama guNaseemaa
___________________________

raama raama guNaseema raagam:
simhEndra madhyamam57
simhEndra madhyamam mela

Aa: S R2 G2 M2 P D1 N3 SAv:
S N3 D1 P M2 G2 R2 S

taaLam: aadiComposer:
Swaati TirunaaL

Language:Sanskrit ;

జయ వారిద నీల !
రాగం: నాట ; తాళం: ఝంప - ( toDayaM ) ;
____________________________

జయ దేవకీ కిషోర!జయ కోటి మన్మధాకార !
జయ కాళిందీ తట విహార! జయ గోపికాజార ! ||జయ జయ || 1

జయ మురళీ గాన లోల! జయ సువర్ణ రుచి చేల !
జయ సలీల ధృత శైల ! జయ వారిద నీల ! ||జయ జయ||2
జయ చరిత్ర ధుత పాప! జయ ఖండితాసురాటోప !
జయ యాదవ కుల దీప ! జయ గోపాల రూప ! ||జయ జయ||3

జయ కుటిలా సిత కేశ ! జయ ముని మానస నివాస !
జయ పంకజ నాభాధీశ ! జయ భూమీ రమేశ ! ||జయ జయ||4

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

{ సేకరణ ;
కుసుమ కుమారి }}}}

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

toDayaM
^^^^^^^ - rAgaM: nATa tALaM: jhaMpa -


jaya dEvakI kishOra!jaya kOTi manmadhaakAra !
jaya kALindI taTa vihAra! jaya gOpikAjAra ! ||jaya jaya || 1

jaya muraLI gAna lOla! jaya suvarNa ruci cEla !
jaya salIla dhRta Saila ! jaya vArida nIla ! |jaya jaya||2
jaya caritra dhuta pApa! jaya khaMDitAsurATOpa !
jaya yAdava kula dIpa ! jaya gOpAla rUpa ! ||jaya jaya||3

jaya kuTilA sita kESa ! jaya muni mAnasa nivAsa !
jaya paMkaja nAbhAdhISa ! jaya bhUmI ramESa ! ||jaya jaya||4


&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
This is a melodious " bhakti gItam " ,sing in Kerala .

{ sEkaraNa ;
kusuma kumari }}}}

Monday, March 29, 2010

60 సంవత్సరములు


మన చాంద్రమానమును అనుసరించి నిర్మించిన పంచాంగము ప్రకారము
60 సంవత్సరములు కాల చక్రము .

ఈ శతాబ్దములో 1987 లో
మొదటిదైన " ప్రభవ " నామ సంవత్సరము మొదలైనది.

ప్రస్తుతము వికృతి నామ వత్సరము లోనికి అడుగిడినాము.

వరుసగా 60 సంవత్సరముల పేర్లను
విహంగావలోకనము చేద్దాము.

1. ప్రభవ =1987-88
2. విభవ=1988-89
3. శుక్ల =1989-90
4. ప్రమోదూత=1990-91
5. ప్రజోత్పత్తి=1991-92
6. అంగీరస=1992-93
7. శ్రీముఖ=1993-94
8. భావ=1994-95
9. యువ=1995-96
10. ధాత=1996-97
11. ఈశ్వర=1997-98
12. బహుధాన్య=1998-99
13. ప్రమాది=1999-2000
14. విక్రమ=2000-01
15. వృష =2001-02
16. చిత్రభాను=2002-03
17. స్వభాను=2003-04
18. తారణ=2004-05
19. పార్ధివ=2005-06
20. వ్యయ=2006-07
21. సర్వజిత్ =2007-08
22. సర్వధారి=2008-09
23. విరోధి=2009-10
24. వికృతి=2010-11
25. ఖర=2011-12
26. నందన=2012-13
27. విజయ=2013-14
28. జయ=2014-15
29. మన్మధ=2015-16
30. దుర్ముఖి=2016-17
31. హే విళంబి=2017-18
32. విళంబి=2018-19
33. వికారి=2019-20
34. శార్వరి=2020-21
35. ప్రవ=2021-22
36. శుభకృత్=2022-23
37. శోభకృత్=2023-24
38. క్రోధి=2024-25
39. విశ్వావసు=2025-26
40. పరాభవ=2026-27
41. ప్లవంగ=2027-28
42. కీలక=2028-29
43. సౌమ్య=2029-30
44. సాధారణ=2030-31
45. విరోధికృతు=2031-32
46. పరీధావి=2032-33
47. ప్రమాదీచ=2033-34
48. ఆనంద=2034-35
49. రాక్షస=2035-36
50. నల=2036-37
51. పింగళ=2037-38
52. కాలయుక్తి=2038-39
53. సిధార్థ=2039-40
54. రౌద్రి=2040-41
55. దుర్మతి=2041-42
56. దుందుభి=2042-43
57. రుధిరోద్గారి=2043-44
58. రక్తాక్షి=2044-45
59. క్రోధన=2045-46
60. అక్షయ=2046-47

$$$$$$$$$$$$$$$$$$$$$$$

అందరికీ సకల పురోభివృద్ధిని ఆకాంక్షిస్తూ
ఉగాది నూతన సంవత్సర శుభా కాంక్షలు.
నమస్తే ! సర్వే జనాః సుఖినో భవంతు!

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

Telusaa!


By kadambari piduri, Mar 20 2010 11:37AM

పక్షుల పలుకులు“మాటలు అంటే
మానవులకు మాత్రమె
సొంతం”అంటే ఎట్లాగ?

మైనా పిట్టల
ఈల పాటలను,
రామ చిలుకల
మిమిక్రీలను,
పికిలి పిట్టల
కువ కువ గానాలు

వింటూ ఆనందించండి!
విని అచ్చెరువులు పొందండి!

&&&&&&&&&&&&&&&&&&&&

Sunday, March 28, 2010

ఆ సౌందర్య సౌమనస్యములు

ఆ సౌందర్య సౌమనస్యములు ;;;;;
____________________

కదలవె! మనసా! కదలవె మనసా!
మురళీధరుని మోహన రూపపు
తలపు కొలనుల జలకములాడగ //

అలకలు అల్లల నాడగ :జిగి బిగి
అలకల కులుకులు - నవ్వుల మురియగ //

నీలి ముంగురులు కస్తూరి - తిలకము నానగ
కలువ కన్నుల జాబిలి దోగాడ
ముత్యము మురిసే - ముక్కును ముద్దిడ //

కౌస్తుభ పతకము, పూవుల దండలు
హరి చందనమున తానమాడు ఎద(ను)
పరిమళ సొగసుల ముద్దాడంగా //

కాళియ ఫణముల మణి రజనులు రాలగ
నూపుర రవళిని హత్తిన పదముల
మధుర నాదములు పులకించంగా //


$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
Posted On 8/15/2009 @8:49:51 PM [ Andhra Folks . net ]

చిటికెల పందిరి

చిటి చిటి జాబిలి చిటికెలు వేసెను
చుక్కలు వచ్చి,నింగిని చేరెను
నీలాంబరము తారల కొలువయె!

జాబిలి వెన్నెల చప్పట్లు చరిచెను
నక్షత్రాలు కొలువు దీరి – మరీ
మిణుగురు కాంతుల చిటికెలు వేసెను

వెన్నెల తీరులు శత కోటి
రాతిరి కాంతుల చలువ పందిరి
పిన్నలు,పెద్దల ఆటల సందడి, ఉరవడి


&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

( రచన ; కుసుమ కుమారి )

రసమయ లోకం
రసమయ లోకం రాధా మణిదీ!
తామరస – నయనునికీ మోదోల్లాసము ||

చలువ చూపుల పందిరి వేసి
వలువలు దోమ తెరలను జేసిన
తులువతనముల నాదోల్లాసము ||

కొలువు వెన్నెలల రతి సీమలలో
విలసిత వన్నెల చిత్తరువులుగా
విరిసిన ప్రణయము అలరారినది ||


&&&&&&&$$$$$$$$$$$$&&&&&&&&&
rasamaya lOkaM raadhaa maNidii!
taamarasa – nayanunikii mOdOllaasamu ||

chaluva chuupula paMdiri vEsi
valuvalu dOma teralanu jEsina
tuluvatanamula naadOllaasamu ||

koluvu vennelala rati siimalalO
vilasita vannela chittaruvulugaa
virisina praNayamu alaraarinadi ||


&&&&&&&&&&&$$$$$$$$$$$$&&&&&&&
( rachana ; piduri kusuma )

Saturday, March 27, 2010

ఉలి అక్కరలేని చలన శిల్పమై!

కేళీ విలాసా! మా ఇహ పరముల దైవమా!
మోహన వంశీ కృష్ణ! అహరహమూ నీ ధ్యాస -
ఆ బాల గోపాలమునకు జగమున, కనుగొనవో!???? ||

నీ ఫ్రతి అడుగు నాట్యము
ఫ్రతి చలనము హృద్యము
కళామతల్లి వలిపెములో
అపూర్వ ప్రభా రాసులు ||

వేణువు రవళించు చోట
వినోదముల ప్రవచనములు
లోలాయమాన క్రీడలు
లాలించు పలుకు గానములు ||

లలిత కళా సోపానము
లల్లిబిల్లి నర్తనములు
ఉలి అక్కరలేని చలన
శిల్పమైనదిట పల్లె ! -
మా వ్రేపల్లె ||

&&&&&&&&&&&&&&&&&&&&&&&&
Kovela

ఉలి అక్కరలేని చలన శిల్పమై!

By kadambari piduri, Mar 20 2010 7:54AM

Friday, March 26, 2010

చల్లని నీడ
(పల్లవి ) ::::::
________

నీరద నిర్మల చిన్మయ మూర్తి
సన్నిధి సకలానంద దాయకము
లభ్యము బ్రహ్మానందము తథ్యము,
(అను పల్లవి ):::::
_________
హృదయ నళినమా!
శ్యామ సుందరుని సేయి విడకుమా! ||
భజన సేయుమా ! భజన సేయుమా !

1. చెన్నుగ మృగ మద తిలకములు
నెన్నుదురును స్పృశియించేను !
ఆ వృత్తములలో అటు నిటు ఊగుచు
సహస్ర కోటి పొర్లు దండములు
వరలగ – సేయును ముంగురులు ||


2. చిన్ని ముత్యముల తెలి కాంతులతో
మిన్నగ పొందే గిలిగింతలతో
వెన్న దొంగ సంపెంగ ముక్కున
ఎన్నెన్నొ పరుగుల మక్కువ తపసులు
వరలగ – సేయును కొండ గాలులు ||

3. కన్నయ మేనున మణి భూషణముల్
తిన్నగ దూరును అనుమతి లేకనె !
అన్నన్నా ! తన చను వింతటిదా!!?
ఉదయాద్రి శృంగ పీఠమ్ము వరముగా
గడించె గడసరి భాస్కరుడు ||

Monday, March 22, 2010

తారల మిలమిల కాంతులు
తారల మిలమిల కాంతులు వచ్చి
దొరతో జగడము విన్నవించును
ఎట్లాగమ్మా చిక్కుల ముళ్ళను
విప్పేదెట్లా ? చెప్పమ్మా! ||దొరతో ||

రమణుని ఉరమున సుమ హారముల
మరంద రాసులు కుప్పలు కుప్పలు
పుప్పొడి రజనుల తళతళలు
ఒప్పుల కుప్పలు ఆడుచుండగా
పోటీ మాకివి భువి నక్షత్రములని || దొరతో ||

కోమలి పద్మ పాపిటి బిళ్ళల
మణుల ప్రభలు గుట్టలు గుట్టలు
జిగేల్ కన్నుల మిరు మిట్లు
ధరణికి చుక్కల అరణముగా
ఎవరిచ్చారని మిణుకుల తారలు || దొరతో ||


&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
&&&&&&&&&&&&&


Kovela ( Temple ) ;

తారల మిలమిల కాంతులు ; ( Twinkle stars ) ;

By - kadambari piduri, Mar 21 2010 10:59PM

Sunday, March 21, 2010

మోహన వంశీ కృష్ణ !
Krishna leelalu ;;;;;

కేళీ విలాసా! మా ఇహ పరముల దైవమా!
మోహన వంశీ కృష్ణ! అహరహమూ నీ ధ్యాస -
ఆ బాల గోపాలము - నకు జగమున, కను గొనవో!???? ||

నీ - ఫ్రతి అడుగు నాట్యము
ఫ్రతి చలనము హృద్యము
కళామ తల్లి వలిపెములో
అపూర్వ ప్రభా రాసులు ||

వేణువు రవళించు చోట
వినోదముల ప్రవచనములు
లోలాయమాన క్రీడలు
లాలించు పలుకు గానములు ||

లలిత కళా సోపానము
లల్లి బిల్లి నర్తనములు
ఉలి అక్కర లేని – చలన
శిల్పమైనదిట పల్లె ! -
మా వ్రేపల్లె ||

&&&&&&&&&&&&&&&&&&&&

kELI vilaasaa! maa iha paramula daivamA!
mOhana vaMSI kRshNa!
nii - Prati aDugu naaTyamu
Prati chalanamu hRdyamu
kaLAma talli valipemulO
apUrva praBA raasulu ||

vENuvu ravaLiMchu chOTa
vinOdamula pravachanamulu
lOlaayamaana krIDalu
kOlaaTamu saMdaDulu
uravaDulu ||

lalita kaLA sOpaanamu
lalli billi nartanamulu
uli akkara lEni – chalana
SilpamainadiTa palle ;;
maa vrEpalle ||


&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

దిక్కులకు ఆదియౌ - చక్కనీ స్వామికి
జయ మంగళం నిత్య శుభ మంగళం ||

పచ్చ తోరణములతో – నిత్య వైభోగి స్వామి
జయ మంగళం మంగళం నిత్య శుభ మంగళం ||

హెచ్చుగా భక్తులకు – అచ్చ కల్ప తరువీవుగా
లచ్చణంగా దక్కితి వదె - పది వేలు ,లచ్చ వరహాలు
జయ మంగళం నిత్య శుభ మంగళం ||

నిక్కువము మా కెపుడు – చుక్క పొడుపుల మేల్మి
మక్కువౌ పర్వముగ – మిక్కుటముగ నీ ధ్యాస
చక్కనీ శ్రీ వేల్పు తిరు వేంకట నాథునికి
జయ మంగళం నిత్య శుభ మంగళం ||

నచ్చి నిన్ను వరియించిరి – లచ్చిమి , అలి వేల్మంగలు -
విచ్చేసిరి భక్త కోటి - రచ్చ సేయకుండా ,
ప్రొద్దు పుచ్చ కుండా - నచ్చ జెప్పి స్వామిని -
పంపరమ్మ కొలువులకు - శుభ మంగళమనుచును
జయ మంగళం నిత్య శుభ మంగళం ||

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

dikkulaku aadiyau - chakkanii svaamiki
jaya maMgaLaM nitya SuBa maMgaLaM ||

pachcha tOraNamulatO – nitya vaiBOgi svaami
jaya maMgaLaM maMgaLaM nitya SuBa maMgaLaM ||

hechchugaa Baktulaku – achcha kalpa taruviivugaa
lachchaNaMgaa dakkiti vade - padi vElu ,lachcha varahaalu
jaya maMgaLaM nitya SuBa maMgaLaM ||

nikkuvamu maa kepuDu – chukka poDupula mElmi
makkuvau parvamuga – mikkuTamuga nI dhyaasa
chakkanI SrI vElpu tiru vEMkaTa naathuniki
jaya maMgaLaM nitya SuBa maMgaLaM ||

nachchi ninnu variyiMchiri – lachchimi , ali vElmaMgalu -
vichchEsiri Bakta kOTi - rachcha sEyakuMDA ,
proddu puchcha kuMDA - nachcha jeppi svaamini -
paMparamma koluvulaku - SuBa maMgaLamanuchunu
jaya maMgaLaM nitya SuBa maMgaLaM ||

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

ప్రణయ సుధా కలశమ్ము రాధిక
విభ్రమము తన ఊసుల చరితల రచన ||

చరితార్థము ఆ నుడువులు – ఏమరక మననములు -
మరి మరీ చేయు చుండు - చరితార్ధులు భక్తులు - ||

రాగ వీణ రాధిక - నిగ నిగ చెక్కిళ్ళ లోన
తన వెన్నెల సంపదలను - సొగసు గడుసు రీతిలో –
దాచుకొనె శశాంకుడు - ఈసు పడెను తారకలు ||

గిల్లి గిల్లి కజ్జాలా!?! – అల్లరిగా , ఆ పైన
మళ్ళిన కినుకలతోడ - మల్లె తావు పిలుపులా !?
బహు చోద్యము నీ రీతులు ! కోమలాంగి రాధికా! ||

ఎల్ల లోకముల నేలు ఆది విష్ణు - విల్లాగ నీ సిగలో మొగలి రేకు
లల్లికలో చిక్కు కొనెను - బుల్లి దొండ పెదవులతో
తేట తెల్లమొనరించవు - బహు చోద్యము నీ రీతులు ||

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

praNaya sudhaa kalaSammu raadhika
viBramamu tana Usula charitala rachana ||

charitaarthamu aa nuDuvulu –
lOkO – ttara gaathalu - charitaardhulu bhaktulu
mari mari – nii mananammunaMdu ||

niga nigala chekkililO vennela saMpadalanu
sogasu gaDusu rItilO – daachukone SaSAMkuDu ||

gilli – kajjaalaa!?! – maLLina kinukalatO
malle taavu pilupulaa !!!!? - bahu chOdyamu nI rItulu !!
alla lOkamula nElu aadi vishNu - villaaga nI sigalO mogali rEku
lallikalO chikku konenu - - bahu chOdyamu nI rItulu ||

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

jagamula Elika kannayya –vagalolikE Baamaa maNikii
vagaru Usula togarula muchchaTlu – vInula viMdulu O yammaa! ||

jagaDamu luttutti praNaya kalahaalu – mujjaga yaanapu naarada mauniki
tega pani kalpiana – mahatiki truLLiMta - vInula viMdulu O yammaa! ||

gaganapu nIlamu svaMta daaruDu – maga naalu raadhalO saga BAgamayEnu
Baga vaMtuDu Baktula daasuDu nityamu - viMdulu O yammaa! ||

agapaDaDaataDu kannu dOyiki – Kaga raja vaahanuni daaguDu mUtalu
nagavula naaTyamu, lalita kaLalaku – kEMdramu ,kanukane kamanIyamulu
kammani kathala lOgiLLu – immuga manaku dakkinavi ||

===============================================

జగముల ఏలిక కన్నయ్య –వగలొలికే భామా మణికీ
వగరు ఊసుల తొగరుల ముచ్చట్లు – వీనుల విందులు ఓ యమ్మా! ||

జగడము లుత్తుత్తి ప్రణయ కలహాలు – ముజ్జగ యానపు నారద మౌనికి
తెగ పని కల్పన – మహతికి త్రుళ్ళింత - వీనుల విందులు ఓ యమ్మా! ||

గగనపు నీలము స్వంత దారుడు – మగ నాలు రాధలో సగ భాగమయేను
భగవంతుడు భక్తుల దాసుడు నిత్యము -కన్నుల పంటలు ఓ యమ్మా! ||

అగపడడాతడు కన్ను దోయికి – ఖగ, రజ వాహనుని దాగుడు మూతలు
నగవుల నాట్యము, లలిత కళలకు ,కేంద్రము ,కనుకనె కమనీయములు
కమ్మని కథల లోగిళ్ళు – ఇమ్ముగ మనకు దక్కినవి ఓ యమ్మా! ||

================================================
jagamula Elika kannayya –vagalolikE Baamaa maNikii
vagaru Usula togarula muchchaTlu – vInula viMdulu O yammaa! ||

jagaDamu luttutti praNaya kalahaalu – mujjaga yaanapu naarada mauniki
tega pani kalpana – mahatiki truLLiMta - vInula viMdulu O yammaa! ||

gaganapu nIlamu svaMta daaruDu – maga naalu raadhalO saga BAgamayEnu
BagavaMtuDu Baktula daasuDu nityamu -kannula paMTalu O yammaa! ||

agapaDaDaataDu kannu dOyiki – Kaga, raja vaahanuni daaguDu mUtalu
nagavula naaTyamu, lalita kaLalaku ,kEMdramu ,kanukane kamanIyamulu
kammani kathala lOgiLLu – immuga manaku dakkinavi O yammaa! ||
================================================