Tuesday, July 28, 2009

కర్ణామృతము


సామెతలు ,పలుకు బడులు
సామెతలు ,పలుకు బడులు :::,,,,,,,,,,,,,,,,,,,,,,, 1) "ఈ చెవిని విని,ఆ చెవిలో(నుండి) వదిలేయాలి."2)"'కర్ణా కర్ణిగా వినీ ,ఆ విన్నది నీకు చెప్పాను." 3)చెవిని (=చెవిలో) ఇల్లు కట్టి ,పోరుట.(=చెప్పదలుచుకున్న విషయాన్ని ,ఎదుటి వారి మనసుకు ఎక్కే దాకా ,విడువకుండా చెప్పుట)4)'నువ్వు చెప్పినవన్నీ నమ్మడానికి నేనీమైనా "చెవిలో పువ్వు "పెట్టుకుని కనిపిస్తున్నానా?'5)చెవిలో గుస గుసలు (=రహస్యాలు)6)'చెవులు మూసి,చేతి కిస్తా!' (=బాగా తన్నుట)7)చెవిటి వాని ముందు శంకు (=శంఖము) ఊదినట్లు .8)చెవులు పట్టి ఆడించుట

1)చెవులు మెలి పెట్టుట.(=ధాష్ఠీకము)2) చెవుల పిల్లి=కుందేలు.3)"నీకు ప్రమోషన్ వచ్చిందనీ మాట నాకు"చెవుల పండుగ"గా ఉన్నది.(/"వీనుల విందు")4)"చెవులు కొరుక్కొంటున్నారు," ఏమిటో,ఆ రహస్యాలు?, కాస్త మా చెవిలో కూడా వేయొచ్చును కదా!."(/చెవులు కరచుట)5)చెవిలో సొంఠి కొమ్ము ఊదుట. (=పరుషంగా ,కటువుగా మాట్లాడుట)6)కర్ణేజవుడు=కొండెములను,చాడీలను చెప్పే వాడు.7)కర్ణా కర్ణిగా వినుట=పుకార్లు మున్నగునవి.8).వింటి నారిని పార్ధ సారధి "ఆ కర్ణాంతము" లాగి,సంధించెను.9)కర్ణ రసాయనము=చెవులకు ఇంపైనది.10)శ్రుత పాండిత్యము =కేవలము వినుట తోడనే ,పట్టు బడిన విద్య.,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,1) శ్రోత =వినేవాడు.2) వినికిడి,("అతణ్ణే నాయకునిగా ఎన్నుకుంటున్నారని 'వినికిడీ .")3)"ఈ పురాణ గాధలను"విన్నా,కనినా' పుణ్యము లభిస్తుంది." /'విన్న వారూ ,కన్న వారూ తరిస్తారు.'.4)"ఇలాంటి వింతలూ,విడ్డూరాలనూ ఎన్నడైనా విన్నామా!కన్నామా!"5)"విన్నారా,కనుగొన్నారా?"6) "ఫ్లైయింగు సాసర్లూ అనేవి ఉంటాయని 'విన్న వాళ్ళే గాని ,చూసిన (/కన్న వాళ్ళు)లేరు."7)'విన్నది విన్నట్లుగా చెప్పూట.'8)"నా మాట విను!" (= ఆచరించు/పాటించు! )9)అధికారులకు 'విన్న వించుకొనుట.'10)వినతి, 'వినతి పత్రము 'ను సమర్పించుకొనుట

1)'శ్రీకారములాంటి చెవులు.2)చెవుల పోగులు ,చెవి కుండలాలు .3)కర్ణ భూషణాలు.

'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
వీరిచే పోస్ట్ చెయ్యబడింది Kusuma Kumari లేబుళ్లు:
,
పద మంజరి
vaaDuka bhaa shalOni aMdamaina telugu maaTalanu , parikiMchEMdukai , maa I chiru prayatnamu .

౧) పూల బాట ::: "బ్రతుకు పూల బాట అయ్యింది .

౨) వడ్డించిన విస్తరి ::: " నీకేం, నీ జీవితము వడ్డించిన విస్తరి ,అన్నీ అమరి ఉన్నా భాగ్య శాలినీవు .

"౩) కల గూర గంప ::: అన్నీ విషయాలూ ఉన్న పుస్తకం ఇది ,కల గూర గంప లాంటిది ."

౪) అనేక ఆశయాల , ఆలోచనల 'కల బోత '.

౫)ఆ పిల్లలు ,అందరితో 'కలివిడి 'గా ఉంటున్నారు .

౬)" అడుగులో అడుగు వేసి ,కలిసి నడుద్దాము ,మనము అందరమూ !"౭) కలిసి వచ్చిన కాలములో నడిచి వ చ్చే బిడ్డలు వస్తారు .

౮) aame గొంతు కలిపి ,పాడి ,అందరినీ మెప్పించినది .

౯) కలిసి ఉంటే కలదు సుఖము

.................................................................................................................

కొన్ని పదములు :::

:::::::::::::::::::::::::::

1)కలము ,పెన్ను . ౨) కల కలము ::: జనములో కల కలము రేగినది .

౩) మదిలో కల వరము ఆయెను .౩)కల యో ? వైష్ణవ మాయయో ???

4) కల్ల (= అబద్ధము ) ,నిజము౫) కలిగిన వారు = ధన వంతులు

౬) కలికి , కలికి 'చిలకల కొలికి ' . ౭)" కలవారి అలివేణి ' రావే!!!!!!"

౮) "కల గంటి నో యమ్మ ! కల గంటిని !.

"౯) కల ,కలలు , స్వప్నములు

౧౦)" కల కాలము ఎల్లరు వర్ధిల్లు దురు గాక !

.......................................................................................................

యుగళ గీతము (ఈ మహిమ నీదేనులే !)

ఎస్.జానకి గాత్ర మాధుర్యమునకు వేరే వివరణలు అక్కర లేదు కదా!
పెండ్యాల నాగేశ్వర రావు "కళావతి(కలావతి) రాగములో కూర్చినది ఈ పాట,ఘంటసాల అత్యున్నత శిఖరములందున్నప్పుడు,వేరే పద్ధతిలో,వైవిధ్యముగా ఉదయించినది ఈ స్వరార్ణవము. జానకి స్వరముతో కలిసిన "యుగళ గీతము"గా శ్రోతలకుకర్ణాటక సంగీత విద్వాంసుడైన "బాల మురళీ కృష్ణ "గళములోని
ఒకానొక వైవిధ్య భరితమైన మాధుర్యాన్ని వీనులకు విందును చేకూర్చినది.
( చిత్రం: శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు
సంగీతము ;;;;; పెండ్యాల నాగేశ్వర రావు
రచన ;;;;;;; పింగళి నాగేంద్ర రావు
గానం: మంగళంపల్లి బాల మురళీకృష్ణ, యస్. జానకి )
________________________________
వసంత గాలికి వలపులు రేగ
వరించు బాలిక మయూరి కాగా
తనువు మనసు ఊగి తూగి
ఒక మైకం కలిగేనులే !!!
మహిమ నీదేనులే !
ప్రేమతీరు ఇంతేనులే //

~1) రవంత సోకిన చల్లని గాలికి
మరింత కోరిన వసంతుడనగా
తనువు , మనసు ఊగి తూగి
ఈ లోకం మారేనులె
మహిమ నీదేనులే !
ఆహా భలే హాయిలే !!!

2)విలాస మాధురి వెన్నెల కాగా
విహార వీణలు విందులు కాగా
ఏకాంతంలో నీవూ నేనే '
ఒక స్వర్గం కనుపించెనే !
మహిమ నీదేనులే !
ప్రేమ తీరు ఇంతేనులే //

Sunday, July 26, 2009

ఇల్లాలు(సినిమా పాట)

ఇల్లాలు -(cinima)
(నటి;గీతాంజలి )
రచన ;ఆత్రేయ :మ్యూజిక్ : మహదేవన్
పల్లవి:
------
మల్లె పూవులు విరిసెరా -
మంచు తెరలు కరిగెరా
-నల్లనయ్యా మేలుకో -
చల్లనయ్యా మేలుకో -
//మల్లె పూవులు విరిసెరా - మంచు తెరలు కరిగెరా -//

1)పురిటి వెలుగున బుగ్గపై - - నీ పంటి నొక్కులు కంటిరా - -
చిరుత నవ్వుల పెదవిపై - -చిరుత నవ్వుల పెదవిపై - -
నా కంటి కాటుక నంటె రా! - -
//నల్లనయ్యా మేలుకో ! -చల్లనయ్య మేలుకో ! - -//

2)చిక్కు పడినా కురులు చూసి - - సిగ్గు ముంచుకు వచ్చెరా ! - -
రేయి గడపిన హాయినంతా - -రేయి గడపిన హాయినంతా - -
మనసు నెమరు వేసెరా ! -//నల్లనయ్యా మేలుకో !చల్లనయ్యా!! మేలుకో !//

3)నీవు నిండుగా నవ్వినపుడే - -నాకు నిజముగ తెల్లవారును - -
నా కాపురాన రేపు మాపులు - -కాపురాన రేపు మాపులు -
-కలవురా నీ చూపులోనే - -
//మల్లె పూవులు విరిసెరా !మంచు తెరలు తొలగెరా !
నల్లనయ్యా మేలుకో! చల్లనయ్యా మేలుకో !//
-
-


వినిపించని రాగాలే -
కనిపించని అందాలే -
అలలై మదినే తలచే
-కలలో ఎవరో పిలిచే -
//వినిపించని రాగాలే -//
1)తొలిచూపులు నాలోనే -వెలిగించె దీపాలే (౨)
చిగురించిన కోరికలే -చిలికించెను తాపాలే -
వలచె మనసే మనసు వినిపించని
2)వలపే వసంతములా -పులకించిపోయినదీ (౨)
చెలరేగిన తెమ్మెరలే -గిలిగింతలు రేపినవీ -
విరిసి విరిసే వయసు వినిపించని
3)వికసించెను నా వయసే -మురిపించు ఈ సొగసే -
విరితేనెల వెన్నెలలో -కొరతేదో కనిపించే -
ఎదలో ఎవరో మెరిసే వినిపించని
(చదువు కున్న అమ్మాయిలు -
మ్యూజిక్ -సాలూరు రాజేశ్వర రావు -)

Post Views

శ్రీరస్తు శుభమస్తు!

శ్రీరస్తు శుభమస్తు !
------------------
కలువ రేకుల కనుల తిరుమలేశుండు !
దొర-ఏడు గిరులకు,
పదునాల్గు భువనములకు
స్వామికి సన్నుతి! శత కోటి నుతులు //

1)శ్రీ నగ చక్రవర్తి, పన్నగ శయనుడు
కౌస్తుభమణి నగలు ధరియించిన రేడు,
శ్రీ కాంతుడు కువలయ నేత్రుడు,
వరద హస్తుండు
అభయముల నొసగేటి 'వర' దాన మూర్తి!
"శ్రీరస్తు!"ఆశీస్సులే తాను అవగా -
ధరణి నిలువెల్లా సంతోషమే అవగా //
2)ఆద్యంత రహితుడు, ఆది కూర్మము వాడు
ఆ దివికి చెప్పేను వీడ్కోలులు
ఈ భువికి దిగి వచ్చి భక్త చింతా మణి
భువిని దివ్యముగా దివిగ మలచేను కద
మలయ పతి, శ్రీ పతి మురిపెమ్ముగా!
"శుభమస్తు!"దీవెనలు మలయప్పవి
అందుకొను హర్షముల లోకమే మనది! //
-By kadambari piduri
From my article in http://aavakaaya.com/

Saturday, July 25, 2009

తులా దండము
చంద మామయ్యకు
తల నొప్పి వచ్చింది
పిల్లా! లచ్చీ! //

ఆమె:
"ఎందుకని ఆ తంటా?
తలకు మించిన బరువు
లేమి మోస్తున్నాడంట?"

అతను:
మిన్నులో చేరాయి మినుకు మినుకుల
మిణుగురుల చుక్కల్లు!

"మేలైన అందాలు మాలోన ఎవరివని?"
చంద మామయ్యను నిలదీసి అడిగాయి.

ఆమె:
ఎల్లాగ తీర్చాడు,ఆ తగవును?
తీర్పరిగ ఉంటేను తంటాలు గద,పాపం?

అతను:
"జాబిలిని చూసీ,తెగ జాలి పడుతూను
చల్ల గాలి వాడు
తయ్యారు చేసాడు నాణెమగు తర్రాజు!"

ఆమె:
ఎట్టెట్టా ఆ?
ఎట్లాగ? దొరికింది ఆ తరాజు?
maavaa! ఓ మావ?"

అతను:
లచ్చి!నీ బంగారు చూపు వెన్నెలను దూసి
మంచి త్రాసును చేసీ ఇచ్చినాడు,పిల్ల!
వెన్నెలల రాయనికి తిప్పలు తగ్గాయి!

ఇలలో కల్హారము


కలలోన ఈ ఇలకు
జారి వచ్చిన
కలువా! కలువా!
వలపుకు ఎల్లలు
కలవా? కలవా? //

కల కోకిలవయ్యి
చాటవే,దిక్కుల
కల కల చుక్కల
తోరణ మాలలతొ
కులికేటి ధరణిని
సృష్టించు మింపుగా! //

మొలకలలోన ,,,
ముద్ద బంతి రేకులలోన
మగువ ధర హాసమ్ము
పరిమళమ్మెగసేను //

జాజులలోన ,,,
సన్న జాజి మోజులలోన
ప్రేమకు అర్ధము
పరమార్హమై నిలిచె
పర వశమ్ముల
గాధలై వెలిసేను //

Thursday, July 16, 2009

మరో చరిత్ర ఆవిష్కరణ


ఎంత బావుంటుంది!

---------------------------

ఏ పద గుంఫనలూ అవసరం లేని -

నిష్కల్మష భావం ఎదురై,

తన స్నేహ హస్తాన్ని చాచితే

ఎంత బావుంటుంది!


చిన్ని పాప చిరు నవ్వుల

వెలుతురు

పూతలలో

నేను వెండి కొండనై పోవాలని ఉన్నది!

అరుణ రాగపు ముచ్చికలోన -

ఉదయారుణ ఉషోదయ పద్మపు గొడుగులో -

మంచి తనమే మనిషి తనమై -

సేద దీరుతూన్న మధుర క్షణాలను -

"చరిత్ర"గా -

కాల యవనిక"పై ఆవిష్కరిస్తే

ఎంత బాగుంటుంది!

Saturday, July 11, 2009

పాల వెన్నెలల ఆల్బమ్
పాల వెన్నెలల ఆల్బమ్ లను


పున్నని షాపున కొన్నాను . -


తూగే రోజా పువ్వులు -


ఊగే చమేలి మొగ్గలు -


కాశీ రత్నాలు, మల్లె -


చేమంతుల హొయలులను -
ఎన్నెన్ని నీడలో?!వింత ఆనవాలులో?!//
అటు చూచే మావి కొమ్మ -


ఇటు చూచే తాటి చెట్టు -


చెయి సాచే కొబ్బరాకులు -


పనస, నిమ్మ, ఉసిరి చెట్లు -
ఎన్నెన్ని నీడలో?!


అందాల జాడలు//
చంద్రికల ఛాయలను -


ఏరి ప్రెస్స్ చేసాను -


వెన్నెల ఆల్బమ్ లోన -


అన్నన్ని సొగసులను -


పదిల పరిచే ప్రజ్ఞ -


నాదేను సుమ్మీ!


**********************************************


(బాల పాల వెన్నెలల ఆల్బమ్ - By kadambari పిడూరి )

Baalaవాసంత ఋతు హేల


1)చివురు పాదములెత్తి కేరింతలాడ -

పద పద్మముల గని,మురిసి పోయి -

గగన తలమును వీడి,సూర్య దేవుడిటు వచ్చి -

కస్తూరి తిలకమున తానొదిగి పోయేను.

2)'గిలక కాయలు' గుప్పిట పట్టి పట్టి -

ఎలమి ఊపెదవయ్య!యశోద పట్టి!

"వెండి జాబిలి" చేరె మెట్టినింటను!"

అనుచు నవ్వులు చిందె నీశ్వరుండు!


3)బంగారుమొల తాడు ఒత్తు కొనె నయ్యయ్యొ!

నాదు బంగరు తండ్రికి"అనుచు మానసమెంతొ -

తల్లడిల్లగ ,తా తల్ల్ల్లి తీసెను నగను వేగపడుచు.

ఒత్తుకొని పోయిన మేని నొక్కు లు చూచి -

నీలి పూవుల దండ"అని తోచగా -

తేటి గుంపులు ముసిరె నయ్యారే !కనుడు!
4)"అస్సురుస్సురు!"అనుచు -పులుగులను త్రోయుచూ -

అమ్మ ఆతృత తోడ నిను దాచు లోపల -

"భ్రమర జాతర!"లంచు వాసంత ఋతు హేల -

ఉరికి వచ్చేసింది,వ్రేపల్లె లోగిలికి.


Baalaవాసంత ఋతు హేలBy kadambari piduri,

Friday, July 10, 2009

మది పల్లకి బోయీలు

(పల్లవి: )ఒహ్హొహ్హొహోమ్ హోమ్!ఓ జనుడా! ఉవిదా!పెద్దలార!పిన్నలార! /

అనుపల్లవి:::::

నీదు హృదయమేమొ రాలుగాయి!

మాట వినని ఆకతాయి !

శ్రీరంగస్వామి చేసుకొనీ-

చేకొనెను గదా ఈ నాటికి-

ఈ ఎడదను శ్రీ చందన పల్లకిగా //


తుంబుర నారద గానము

దీనికి సమమౌతుందా?!

మరకత నీల ద్యుతిలో-కరిగి పోవు నాదమిదీ!

ఇదే గదా,వర నాదము! మన మదినీ ఇమ్మహినీ -//


రంభోర్వశి నాట్య లయలు -సురా పాన ఉన్మత్తత

దీనికి, సరి సమములనుట- తునికి తగవు తీర్పంట!

ఓంకార సమమైన నాదము ఇది, ప్రజలార!

బోయీల నడక సాగునులే! ఒహ్హొహ్హొ హ్హోమ్ అంటూ! //
కోరస్:::::

భక్తి ప్రపత్తులు, ప్రేమ-అనురాగం, మమత, రక్తి-

మన మానస పల్యంకికకు బోయీలురా!

కొనసాగును ఊత పదము!బ్రహ్మ నాద మోంకారము !

*********************************

(కోవెల : మది పల్లకి బోయీలు-

  • By kadambari piduri, )

శోభిల్లు మణి దీపములు

నా నుడి పలుకుల వై చిత్రి
నీ మోహన నామపు చాతుర్యం
నీ రూపము వైఖరి చాతురి
గోవిందా! ఇది
నీ కరుణా మహిమల
సౌందర్య పటిమల ఆహ్లాదిని!//

నానుడులు, సామెతలు, గాధలు, గీతులు
కావ్య భరితములు ఎల్ల భాషలు
భాసురమగు నీ ఊసుల రసోద్దీపనములు
మా గళముల శోభిలు మణి దీ్పములు! //

క్రిందు మీదు మీమాంసలు, వాదులు
ఎగుడు దిగుడు తర్కముల పోరులు
ఇబ్బడి ముబ్బడి వద్దే వద్దు!
ఒబ్బిడి శ్రీ పతి నామము చాలును //

గో్విందు భజనలే రసవిందు!
అందు బాటులో అందరికీ
స్వామి చరితము మననము నందున
ఘడియ లన్నియును సుధా పూర్ణములు //

**************************************

పాడవోయి పూలరంగడా!


పొన్ను కర్ర పట్టుకునీ -టక్కు టిక్కు టిక్కు టక్కు

అడుగడుగున దణ్ణాలెడుతు- చేరుదాము,రారండీ!

చెన్న రాయని నిండుగ చూద్దాము!

చెన్నుగ, నారాయణ మూర్తినీ కందాము //

1)చట్రాళ్ళు,గుండ్రాళ్ళు మన కొక లెక్కా!

చక చక ఎక్కేద్దాము , సప్త గిరులను !

పట్టు దలకు ఉనికి పట్టు మనమే గద నా రంగీ! //

2)గండ శిలలు,సెలయేళ్ళు-

మనకు ఛూమ్మంతర్!!!

సంతసాల ఆటపట్టు -

మనమే గద ప్రియ రంగీ! //

3)బళ్ళు కట్టు కెళదాము-

పిల గాళ్ళు బయలు దేరండీ!

మీ తొలుకు తీపి పలుకు బళ్ళు-

హుషారులకు మనికి పట్లు!

(కోరస్) ;;;;;;;;;;

''''''''''''''''''''

స్వామి హొంబట్టు వలువ మెరుపులవే!

శిఖరాల పసిడి కాంతి రాసులవే!

చేరువలోనే తిరుపతి చేరుదాము,రా రండీ!

అధరాలపైన వెంకన్న పేర్లు 'తేనె పట్లు 'రా!

సారంగా!పూల రంగా!"గోవిందా! గోవిందా!"

అంటూ మరి కదలండి!

అండ మనకు వాడేనండీ !

***************************

( పాడవోయి పూలరంగడా!By kadambari piduri )

Monday, July 6, 2009

రంగులు - రమణీయమైన మోజులు
"ఇంద్రధనుస్సు" అనగానే సప్త వర్ణ సమ్మేళన సుమనోజ్ఞ వర్ణ వేదికా తోరణం చటుక్కున మన తలపులలో మెదులుతుంది. ఎరుపు, నీలం, ఆకు పచ్చ ప్రధానమైన రంగులు. వివిధ నిష్పత్తులలో ఈ మూడింటి మిశ్రమాలే అనేకనేక వర్ణాలను సృజిస్తున్నాయి.

మనస్సుకు రంగుల పట్ల గల ఆకర్షణయే, అనేక పండగలకూ, పబ్బాలకూ; రంగవల్లికలు, చిత్రలేఖనము ఇత్యాది అనేక కళలకు, దేవతారాధనల వేడుకలకు, తిరణాళ్ళకు ఎన్నింటికో పునాదులను వేసిందని చెప్పవచ్చును.

"ఆయా రంగులను ఇష్టపడేవారు ఎలాంటి స్వభావాలను కలిగి ఉంటారు?" అనే విషయం మీద అనేక ఆసక్తికరమైన ఫలితాలు వెలువడుతున్నాయి.


"ఎరుపు" రంగును ఇష్టపడే వారికి కోపం అధికంగా కలిగి ఉండే స్వభావాన్ని కలిగి ఉండే అవకాశం ఉన్నది. వారికి తమ పట్టుదల, పంతం నెగ్గి తీరాలనే ఆవేశం, మొండితనం ఉంటాయి. అలాటి వారు ఆడంబరాలకు ఎక్కువగా వెచ్చిస్తారు. ముఖ్యంగా రమణులకు ఈ రంగుల పట్ల మక్కువ ఎక్కువ. పిల్లలు ఎక్కువగా లేత రంగులను, పెద్దలు ముదురు రంగులను ఇష్టపడతారు.


"పసుపు" వన్నెను ఇష్టపడే వారికి జీవితంలో అనుకున్నది సాధించాలన్న పట్టుదల ఉంటుంది. వీరికి ఆవేశం తక్కువగా ఉంటుంది. ఐనప్పటికీ కృత నిశ్చయాన్ని, దృఢ చిత్తాన్ని కలిగి ఉంటారు. "ముదురు నీలం" వన్నెను ఇష్ట పడే వారు భద్రతకై ఆరాటపడతారు. "ఆకు పచ్చ, నీలం వర్ణాలు" ప్రియమైన వారికి జీవితం పట్ల ఎంతో భద్రతా భావం కలిగి ఉంటారు. వీరు బ్రతుకు పట్ల ఎంతో విశ్వాసము కలిగి ఉండి, స్థిమితంగా ఉంటారు కూడా. ఆభరణాల ఎంపికలలో కూడా రంగుల పట్ల గల మక్కువ, అభిరుచులు తెలుస్తూంటాయి. "నీలం రంగు" శాంతిని ప్రసాదిస్తుంది.
*** *** *** *** *** *** ***

పురాణ, ఇతిహాస గాధావళిని అనుసరించి, వానిలోని వర్ణ విశ్లేషణలను గమనించండి, ఎంతో ఆశ్చర్యం కలుగక మానదు. త్రిమూర్తులు, వారి భార్యల ఆహార్యము, నివాసముల ఎంపిక విభిన్న తరహాలలో గోచరిస్తాయి.

"వీణా పాణి", "పుస్తక ధారిణి" ఐన శ్రీ సరస్వతీదేవి కువలయ నివాసిని, ఆమె తెల్లని కలువ పూవులో ఆశీనురాలై, సారస్వత జగత్తును అనుగ్రహిస్తున్నది.

శ్రీ లక్ష్మీ దేవి పద్మాలయ, తామర పూవు ఆమె నివాసము. శ్రీ విష్ణుమూర్తి పీతాంబరధారి, పన్నగ శయనుడు, వైకుంఠ నివాసి. పాపం! భోళా శంకరుడు, విభూది ప్రియుడు. ఐతే, దేవి సకల ఆభరణాలంకృత.
*** *** *** *** *** *** ***

స్త్రీలు సహజంగా అనేక రంగులని ఇష్టపడతారు. అందుకనే పేరంటాలకు, పెళ్ళిళ్ళకు, పండగలకూ పబ్బాలకూ వన్నె వన్నెల పట్టు చీరలు రెప రెపలాడుతూ నిండుదనాన్ని చేకూరుస్తాయి. కనుదోయికి ఆహ్లాదాన్ని కలిగించే "బొమ్మల కొలువు" వంటి వేడుకలు, మహిళామణుల నిర్వహణలో శోభాయ మానంగా సందర్శకులను అలరిస్తూ ఉంటాయి. ఈ వర్ణ సమ్మేళనాల ప్రభావం మీద పరిశోధనలు సరి కొత్త మలుపు తిరిగాయి. వైద్య రంగంలో ప్రయోగాలు ఈ దిశగా సాగుతున్నాయి. "బాబిట్" మొదలగు వారు ప్రకృతి వైద్యంలో ఈ విషయ పరిజ్ఞాన్ని ఉపయుక్త పరుస్తున్నాయి.
*** *** *** *** *** *** ***

బట్ట తల నివారణకై నీలి వర్ణోదకమును వాడి, అద్భుత ఫలితాలను పరిశోధకులు వెల్లడించారు. నీలం రంగు సీసాల్లో నీళ్ళు పోసి, సూర్యరశ్మిలో ఉంచాలి. అలాంటి నీలి వర్ణోదకమును రెడీ చేసుకోవాలి. బట్ట తలకు ఆలివ్ ఆయిలును పట్టించి ఆ తరువాత నీలి వర్ణోదకమును వెంట్రుకల కుదుళ్ళకు మర్దన చేస్తూ, వాడిన ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని ప్రకటించారు.

ఇలాంటీ సిద్ధాంతాలను ఆధారము చేసుకుని ఇప్పుడు ఇంటి గోడలకు, గదులకు వైవిధ్యభరితముగా వివిధ వర్ణముల సున్నాలను, డిస్టెంపరులనూ వాడుతున్నారు.

నవ వధువు చేతిలో గోరింటాకుకు, పెదవులలో తాంబూల రాగము, పాదములకు పారాణి సుందర మధు హాసాలను చిందిస్తాయి. పెళ్ళిళ్ళలో రంగు రంగుల పూలను అలంకరిస్తారు. ఈనాడు గోరింటాకు, ఒక అద్భుతమైన కళగా "మెహిందీ ఆర్టు"గా కొత్త పుంతలు తొక్కుతూ, అభివృద్ధి గాంచుతున్నది.ఇలాగ అడుగడుగునా నిత్య జీవితంలో రంగుల సొగసులు ప్రధాన నేస్తాలుగా మారి, మానవుని మనస్తత్వానికి అద్దం పడుతూ, అందరినీ పలకరిస్తూ, మానసికోల్లాసాన్ని కలుగజేస్తున్నాయి .

********************************************

(ఈ వ్యాసము http://andhrafolks.net లో ప్రచురణ )

Wednesday, July 1, 2009

యుగళ గీతము


(బి.సరోజ ,రామా రావు )
రేపంటి రూపం కంటి
పూవింటి చూపుల వంటి
నీ కంటి చూపుల వెంట
నా పరుగంటి !
రేపంటి వెలుగే కంటి !
పూవింటి దొరనే కంటి
నా కంటి ,కళలూ కలలు
నీ సొమ్మంటీ!
నాతోడు నీవైయుంటే
నీ నీడ నేనేనంటి..
ఈ జంట కంటే వేరే
లేదు - లేదంటి!
నీ పైన - ఆశలు వుంచి
ఆపైన కోటలు పెంచి,
నీ కోసమ్ ,
రేపూ మాపూ -
వుంటిని నిన్నంటి // రేపంటి //
నే మల్లెపువ్వై విరిసి
నీ నల్లని జడలో వెలసి
నీ చల్లని నవ్వుల కలసి
వుంటే చాలంటి !
నీ కాలిమువ్వల రవళి
నా -భావి మోహన మురళి
- రాగసరళి
తరలిపోదాం రమ్మంటి//రేపంటి //
నీలోని మగసిరితోటి
నాలోని - సొగసుల పోటి
వేయించి ,
నేనే ఓడిపోనీ -పొమ్మంటి !
నేనోడి ,నీవే గెలిచి
నీ గెలుపు నాదని తలచి ,
రాగాలు రంజిలు రోజే
రాజీ రమ్మంటి! //రేపంటి //
::::::::::::::::::::::::::::::::::::::::::::
{చిత్రం : మంచి -చెడు}
గానం : ఘంటసాల, ,సుశీల ;
రచన ; : ఆత్రేయ
మ్యూజిక్ : విశ్వనాధన్ - రామమూర్తి