Thursday, February 28, 2013

मेरा కుశాలు ప్రభృతి


 #నడవాలో అమ్మాయిల ఆటల సందడి;
బొమ్మల కొలువులు, బూజం బంతులు,
పెళ్ళి సందడికి షడ్రుచి విందులు:
నీరెండ వసారాలో క్రీనీడల సోయగాలను పరుస్తున్నవి:
అలనాటి నా బాల్యాన్ని,
నా కనుదోయి వాకిలిలోనికి తెస్తూన్నవి:

ఎదురింటి ప్రభాస్ కెమేరా కట్టుకుని వచ్చి వాలాడు
“ఫ్రెండ్! ఈ చిన్నారుల కేళీఛాయలు,
మేరా (मेरा) కెమేరా నేత్రం పసికట్టింది:
అందుకే వచ్చేసాను,
ఈ తడవ నా ఫొటోగ్రఫీకి బహుమతి ఖచ్చితం!”
కెమేరా లెన్సును సరిచేసుకున్నాడు,
నిజమే! మండువా కేళీ దృశ్యాన్ని,
చిటికెలో కనిపెట్టింది నా నేస్తం మనో రసస్పందన!
మిత్రుని హృదయ రంగాన
ఆవిష్కరణోత్సవ సంరంభాన్ని నెలకొల్పుతూన్నది!
;

;
అది సరే! మరి ఇప్పుడు
ఈ పంచలోని
ఈ పంచదార బొమ్మల చక్కని ఆటపాటలు,
నా మానస సరోవర తీరాన్ని –
అందచందాలకు నెలవులుగా రూపొందిస్తూన్న
ఈ వింత వింత వైనాలను;
నవలగానో, కథగానో మలిచే
ఒక అక్షర శిల్పి -
నిలుచున్న పళాన- ఎదురైతే
ఎంత కుశాలుగా ఉంటుంది!
నా భావాలను
రసరమ్య మందిరంగా చిత్రించే ఓ రచయిత్రి
తటాలున తటస్థపడితే ఎంత బాగుంటుంది!!!!!

************************,
ప్రభృతి - photo link:-
http://www.rgbstock.com/bigphoto/n4Cz51a/Watching+the+Sun

(వరండాలో నీడలు - చక్కెరబొమ్మలు  ప్రభృతి ;
      రచన:: కాదంబరి)

******************************************;
Wednesday, February 27, 2013

నిశ్శ్రేణి


జల బిందు నిపాతేన; క్రమశః పూర్వతే ఘటః;
సహేతు@h సకల విద్యానాం; ధర్మస్య చ ధనస్య చ|

jala bimdu nipaatEna; kramaSa@h puurwatE GaTa@h;
sahEtu@h sakala widyaanaam; dharmasya cha dhanasya cha||
;

;
lehenga choli lady ;water pot

;

Tuesday, February 26, 2013

అండమాన్ పడౌక్ trees


"అండమాన్ - బంగాళాఖాతములో ఉన్న మన ఇండియా సీమలు.
"అండమాన్ ఎర్ర చందనము చెట్లు- విభిన్న వృక్ష  గుణాలను కలిగినవి.
ఏకంగా ఆ దీవుల పేరుతోనే "అండమాన్ పడౌక్" అని పిలువబడ్తూన్నవి.
అండమాన్ పడౌక్ అనే నామ వృక్షము
కేవలము అండమాన్ లో మాత్రమే  కానవచ్చుచున్నది.
120 ఫీట్ ఎత్తు వరకు పెరుగుతుంది.
టేబుళ్ళు, కుర్చీలు వగైరా ఫర్నిచర్ సామగ్రికి
ఈ Red Wood చెక్క ఎంతో అనుకూలమైనది.
ఎర్రచందనము జాతికి చెందిన చెట్టు ‘మహాగొని”. ఈ వృక్షములు విలువైనవి.
ఆంధ్రదేశమున "ఎర్ర మద్ది చెట్లు/ అర్జున వృక్షము"“ఏగిస చెట్టులు” ఈ వర్గమువే!
ఈ తరువు చెక్కతో అలంకరణవస్తువులు తయారౌతూంటాయి.
చెక్కపైన బొమ్మలు, పూలు, పూల తీగలు ఇత్యాదులు సున్నిత చెక్కడపు  పనులకు
"అండమాన్ రెడ్ వుడ్ చెట్టు" ఎంతో అనువైనది.
వయోలీన్ (ఫిడేలు) వంటి వాటిని ఈ దారువుతో చేయగలరు.
అలాగే గృహములో డ్రాయింగ్ రూమ్ లలో డెకొరేషన్ ఐటమ్ సు వీనితో చేసే  వాటికి –
విదేశాలలో డిమాండ్ ఉన్నది.
;
వ్యాఖ్యను జోడించు

;

2} బ్రౌన్, ఎరుపు వన్నెల సమ్మేళన ఛాయలు కల దారువు.
మహాఘని చెట్టు - ప్రజాతి అండమాన్ దీవులలోనే ఉన్నవి.
Andaman Padauk  చెక్క మన్నిక గలది.
ఈ చెట్టు మ్రాను బెరడు, చెక్క మొదట మంచి ఎరుపు రంగులో ఉంటుంది.
ఆ తర్వాత ఎండిన పిమ్మట ముదురుగోధుమ వర్ణము (brawn color) గా మారుతుంది.

3}నంది వృక్షము, కరివేపాకు, వేగిస మున్నగునవి వీని కోవవి.
ఋతు కాలాల అనుసరణ కలవి.
ఆయా ఋతువులలో ఆకులు రాలి, మరల కొత్త సీజనులో చిగురులు వేసిన
(Burr and Buttress formation) గుణములు కలవి.

4} mahogany trees కొన్ని ప్రజాతుల చెట్ల కొమ్మలకు, బెరడులకు వ్రేళ్ళు -
భూమి పైన కూడా వస్తూండుట వీని ప్రత్యేకత.
అనగా మర్రి చెట్టు ఊడలు, రావి చెట్టు ఇత్యాదులు.
ఈ Twin Islands ని " కాంచన ద్వీపము
"Island of Gold"" అని పేర్కొన్నారు.

Tags:-
అండమాన్, నికోబార్  జంట ద్వీపాలు;

(Pterocarpus dalbergioides) in
;Andaman islands -  mahogany;
"Island of Gold"

pterocarpus means “winged fruit.”

photo; Andaman Padauk tree (link)

(Rachana: kadanbari)

*********************************,


అఖిలవనిత
  20280 పేజీవీక్షణలు - 696 పోస్ట్‌లు, చివరగా Feb 16, 2013న ప్రచురించబడింది
బ్లాగ్‌ని వీక్షించండి
కోణమానిని తెలుగు ప్రపంచం
  37848 పేజీవీక్షణలు - 965 పోస్ట్‌లు, చివరగా Feb 16, 2013న ప్రచురించబడింది
బ్లాగ్‌ని వీక్షించండి 
{Vies:- 00050}
Telugu Ratna Malika
  2300 పేజీవీక్షణలు - 111 పోస్ట్‌లు, చివరగా Nov 22, 2012న ప్రచురించబడింది

Saturday, February 16, 2013

బాలి(ఇండినేషియా)దీవి, గరుడ విష్ణు మహా శిల్పములు

కుక్కి సుబ్రహ్మణ్య స్వామి- ని దర్శించిన
శ్రీ ఆదిశంకరాచార్యులు పరవశించారు.
ఆయన రచించిన భుజంగప్రాయాత స్తోత్రము
"భజే కుక్కి లింగం".

***************************;

సహ్యాద్రి శ్రేణిలో ఉన్నది కుక్కి పుణ్య క్షేత్రము.
ఇచ్చట "కుమార ధార" ఉన్నది.
దీనికి మరో పేరు "ధారా నది" జలస్నానము భక్తులను పునీతులను చేస్తున్నది.
సర్ప రాజు వాసుకికీ, విహంగపతి గరుడునికీ జరిగిన యుద్ధాన్ని
కశ్యపుడు ఆపిన సంఘటన ఇక్కడ జరిగినది.

ఆయా జంతు, పక్షిజాతులకు రమణక ద్వీపమునకు
(Ramanaka Islands (modern day Fiji) పంపినది      
ఈ ప్రదేశమునుండే!
;

 Garuda Wisnu Kencana 
ఇక్కడ లింగములను బుట్టలో పెట్టి పూజలు చేసే ఆచారము కలదు. కనుక "కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి" అని పిలుస్తున్నారని స్థానిక కథనములు.
తారకాసురుని అణచుటకై "దేవ సేనాపతి" గా దివ్యులు కార్తికేయ స్వామిని ఎన్నుకున్నారు.
మహాదేవశంభునిపుత్రుడైన కార్తికేయుని విజయ గాధలకు నెలవు
కుమార ధారా సరోవరము, కుక్కి సుబ్రహ్మణ్య తీర్ధము.

***************************;

21 తడవలు క్షత్రియులపై రణ దుందుభిని
మ్రోగించిన పరశురాముడు,
కుమారధారా తటాకములో స్నానము చేసి,
తన పాపప్రక్షాళన గావించుకున్నాడు.
తదుపరి తాను గెలిచిన ధరణిని యావత్తూ -
కశ్యపునికి ధారాదత్తము చేసి, "కాశ్యపి" గా
భూమి పేరొందుటకు హేతుభూతుడైనాడు.
;

Garuda Wisnu Kencana Park, Bali Indonesia Bali peninsula, Bukit: GWK
(photo 1: LINK)


Garuda Wisnu Kencana (GWK), 
Indonesia, is a 240 hectares 
private cultural park 
on the Bukit Peninsula 

(Photo 2 : Link)

TAGS:- 
బాలి (ఇండినేషియా) దీవిలో 
కెంచన పార్కు, 
గరుడ విష్ణు మహా  శిల్పములు


చూడుము: (LINK
శనివారం 16 ఫిబ్రవరి 2013
మన కశ్యప వారసత్వము (konamanini)


నందన వర్ష; ఫిబ్రవరి; 

అఖిలవనిత
 20042 పేజీవీక్షణలు - 695 పోస్ట్‌లు, చివరగా Feb 10, 2013న ప్రచురించబడింది
బ్లాగ్‌ని వీక్షించండి
కోణమానిని తెలుగు ప్రపంచం
 37470 పేజీవీక్షణలు - 964 పోస్ట్‌లు, చివరగా Feb 10, 2013న ప్రచురించబడింది
బ్లాగ్‌ని వీక్షించండి
Telugu Ratna Malika
 2281 పేజీవీక్షణలు - 111 పోస్ట్‌లు, చివరగా Nov 22, 2012న ప్రచురించబడింది
బ్లాగ్‌ని వీక్షించండి

Sunday, February 10, 2013

రాధ దోసిట నెమలీక


అలికిడి ఎవ్వరి అడుగులవీ?
ఆ అలికిడి ఎవ్వరి అడుగులవీ? ||అలికిడి||
;
కొలనున అలలుగ -
మెత్తగ సాగుతు;
తన పొలకువ ఇదనీ -
చెప్పక చెప్పే ఆ    ||అలికిడి||
;
పిడికిలి ముడిచీ -
గుట్టుగ ఏదో దాచెను రాధిక
గడుసుగ గట్టిగ - తన గుప్పిటినీ -
ముడిచినంతనే దాగేనా, చాలించు ||అలికిడి||
;
విడిలించిన తన పల్లవాంగుళుల -
ఉన్నది గుట్టుగ, ఏమిటో అది?
ఔరా! చక్కని నెమలీక అది!

ఇతర చెలులు :-

ఔను! ఔనే! ఔనౌను సుమా!
మిడి మెరుపులతో
బర్హి పింఛమది ఓ సఖియా!  ||అలికిడి||


కోరస్:-

తెలిసినదమ్మా రాధమ్మా!
బాలక్రిష్ణునికె కానుకలిచ్చే
భలే భలే బులబాటమది!
మదిని మోదములు నింపే;
చక్కని బులబాటమది!

ఇలలో ఇలాటి లావణ్యం - భళిరే!
నీకే సొంతం ఆ సాంతం;
రాధమ్మా! ఓ రాధమ్మా! ||

*******************;
;

;
[ఇంతటి సొగసులు :
రాధ దోసిట నెమలీక;  ];
అఖిలవనిత
 19953 పేజీవీక్షణలు - 694 పోస్ట్‌లు, చివరగా Feb 8, 2013న ప్రచురించబడింది
బ్లాగ్‌ని వీక్షించండి
కోణమానిని తెలుగు ప్రపంచం (00050585)
 37186 పేజీవీక్షణలు - 963 పోస్ట్‌లు, చివరగా Feb 7, 2013న ప్రచురించబడింది
బ్లాగ్‌ని వీక్షించండి
Telugu Ratna Malika
 2268 పేజీవీక్షణలు - 111 పోస్ట్‌లు, చివరగా Nov 22, 2012న ప్రచురించబడింది

Friday, February 8, 2013

ఒకే అక్షరము ఎక్కువ మార్లుఅంగ; అంగ రంగ వైభోగముగా;
ఉంగా ఉంగా అంటూ కేరింతలు కొట్టుట ;;

ఋతు రాగములు: కొంకుట;  కొక్కెము:వీవన;

*********************;

గంగ; గానుగ;
చెంగు చెంగున గంతులు వేయు; చెంగావి రంగు చీర;
జింజర్ = అల్లము; జాజి మల్లెలు;

*********************;

టాటా, వీడుకోలు!:  టిట్టిభము:

డిండిమ భట్టు; డీఢిక్క! ఢీ కొట్టుట:

*********************;

తాత; తంత్రీ వాయిద్యాలు; తిత్తి;
దందా; దుందుడుకు చర్యలు; దధీచి;
నాన్న; నున్నని;

*********************;

పాప; పోపు; పంపు; పైపు;
బాబు; బెంబేలు;  బీభత్సము - బీభత్సుడు;
మామయ్య; మేము; మమ్మల్ని; మమ్ము; మామిడి చెట్టు;

*********************;

యయాతి; అయ్యయ్యో! బ్రహ్మయ్యా
యాయవారము చేసుకొను: ఇయ్యమని; "యియ్యాల" = ఇవాళ:

రా! రా! ; రాగ రాగిణి; రేవూరు;

లింగూ లిటుకూ; లీలలు;
వావి వరుసలు: వేవిళ్ళు; వివాహము:

*********************;
;

అక్షరము ఎక్కువ మార్లు 

ఒకే అక్షరము ఎక్కువ మార్లు వచ్చే పద వల్లరి ఇది.
మరి మీరు - ఒక్కొక్క లెటర్ తో వీలైనన్ని చేస్తారా!???

 రైటర్సు అలాటి అక్షర క్రీడలు ప్రాక్టీసు చేస్తే -రచనలను భాషా పటిమతో నిర్వహించుకోగలుగుతారు! 

వీలైతే ఈ "మాటల పూలను" గుబాళించే ప్రక్రియకై ప్రయత్నించమని మా మనవి!

kaMki; koMkuTa; gaMga; gaanuga; aMga; aMga raMga waiBOgamugaa; uMgaa uMgaa aMTU kEriMtalu koTTuTa ;; cheMgu cheMguna gaMtulu wEyu; cheMgaawi raMgu chiira;
jiMjar = allamu; jaaji mallelu; TATA, wIDukOlu; DiMDima bhaTTu; taata; taMtrii waayidyaalu; titti; daMdaa; duMduDuku charyalu; dadhiichi; naanna; paapa; baabu; beMElu; biibhatsamu - biibhatsuDu; maamayya; yayaati; raa! raa! ; liMguu liTukuu; lIlalu; waawi warusalu: wEwiLLu; wiwaahamu: అల్లిబిల్లి

;

;

"ల"- లాలి వగైరాలు


ల- అనే అక్షరము ఒకే మాటలో రెండు సార్లు గానీ,

అంతకన్నా ఎక్కువ మార్లు గానీ వచ్చే పదాలను
"దాయి! దాయి! దామ్మా!" - అంటూ పిలుస్తారా?
బాలలూ, అండ్ వర్ధమాన రచయితలూ< అండ్ కవుల కలముల్లారా!

కాస్సేపు ఆలోచించి చూడండి!
ఆనక ఈ కింది పదాలు గమనించి చూడండి! సరేనా!

లాలి పాట; లొల్లాయి పదములు;
లీలలు;లీలగనైనా   తెలిసేనా!
మానుష మూర్తి కృష్ణుడు;
లొల్లి చేయుట; లలన; లైలా; అల్లిబిల్లి ఆటలు;

;

"ల"-అల్లిబిల్లి

la- anE aksharamu okE mATalO reMDu saarlu gaanI,
aMtakannaa ekkuwa maarlu gaanii wachchE padaalanu
"daayi! daayi! daammaa!" - aMTU pilustaaraa? baalalU,
aMD wardhamaana rachayitalU< aMD kawula kalamullArA!


laali pATa: lallabI!
lalana: liilalu:
allibilli aaTalu, paaTalu:
lailaa; lalana;
lolaayi padamulu:

Thursday, February 7, 2013

చిన్నారి పొడుపు కథ


బాబు :-
ఉర్వీ తలమున బాలలు, పెద్దలు:
నింగికి పంపిరి ఉత్తరమ్ములు;
దినమణి కిరణాలందున చక్కగ;
స్నానాలాడుచు ఉన్నవి చూడు!
పాప :-
చందమామకు షేక్ హాండ్ ఇచ్చును;
వెన్నెలమ్మల భుజములు  చరచును:
ఏమిటో అవి, చెప్పమ్మా!?

తల్లి తండ్రి ప్రశ్న :-
వాని పేర్లను చెప్పర బాబూ! ?                    
చిన్నారి పొడుపు కథ :-
పడగలు కాని పడగలు అవ్వి!
తల్లి ప్రశ్న:-
అంటే పాము పడగలా?
అమ్మాయి:-
కాదమ్మా! కానే కాదు!
తోకలు ఉన్నవి వెనకాతలనే!
తండ్రి answer:-
అంటే కోతులు,
      ఔనా బాబులూ!
అబ్బాయి :-
పటములు కాని పటములు,
కనుక్కో! నువు - ఓ నాన్నా!

అమ్మా నాన్నలు:-
కొంచెం క్లూ (clue) ను ఇవ్వర బాబూ!

(childrean all laughig!)

చిట్టి :-
గాలిపడగలు, గాలి పటమ్ములు,
అంగ్రేజీ (English)లో 'kites' అని అందురు

;

;

Kited లేఖలు :
TAGS Words:-

"Tako-Kichi" ="kite crazy".
Traditionally in JAPAN :-
kites are flown on "boy's day"
 May 5th (the 5th day of the 5th month)

ఎద్దు (ప్రబోధినీ నిఘంటువు)ఎద్దేవా: ఎద్దేవా చేయుట = ఎగతాళి చేయుట: ; ఎద్దడి: నీటి ఎద్దడి = + కరువు:
గొడ్డు; గొడ్డూ గోదా:
ఎద్దు - ;గేదె, ఆవు, బఱ్ఱె/ బర్రె; బర్రెగొడ్డు ,దున్నపోతు, పెయ్య; లేగ దూడ, దూడ;
మున్నగునవి జంతువుల(చతుష్ పాదములు) కలవి; విశేషాలు;
2)ఎడ్ల సావిడి; గోశాల; గొడ్ల సావిడి:
     కాడెద్దులు;
1) "గొడ్డొచ్చిన వేళ, బిడ్డ వచ్చిన వేళ" "గుడ్డెద్దు చేలో పడ్డట్టు  (సామెత);
"గొడ్డును బాదినట్టు బాదకూడదు"
3) "గొడ్డు చాకిరీ చేస్తూ"
4) గొడారి
) {గొడ్డలి = పరశువు - మొరటుగా ఉన్న పదును ఆయుధము}

*************************************;
;

kadanbari bomma

eddEwaa: eddEwaa chEyuTa = egataaLi chEyuTa: ;
eddaDi: nITi eddaDi = + karuwu:
goDDu; goDDuu gOdaa:
eddu - ;gEde, aawu, ba~r~re/ barre; barregoDDu ,
dunnapOtu, peyya; lEga dUDa, duuDa;  munnagunawi jaMtuwula/ chatush paadamulu kalawi; wiSEshaalu;
2)eDla saawiDi; gOSAla; goDla saawiDi:
kaaDeddulu;
1) "goDDochchina wELa, biDDa wachchina wELa" "guDDeddu chElO paDDaTTu  (saameta);
"goDDunu baadinaTTu baadakUDadu"
3) "goDDu chaakirii chEstuu"
4) goDAri
) {goDDali = paraSuwu - moraTugaa unna padunu aayudhamu}

*************************************;


          Telugu syllables

 అ ఆ ఇ ఈ  ఉ ఊ ఋ ౠ
ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అః

*****************************:  
                          తెలుగు అంకెలు

 ౧ ౨  ౩  ౪ ౫  ౭  ౮ ౯  ౧౦

మ్  కల్హార

*****************************:

             రోమన్ నెంబర్లు: (RomanNumbers)

How do you write roman numerals for numbers 1-30?

I=1 II=2 III=3 IV=4 V=5 VI=6 VII=7 VIII=8 IX=9 X=10 XI=11 XII=12
XIII=13 XIV=14 XV=15 XVI=16 XVII=17 XVIII=18 XIX=19 XX=20
XXI=21 XXII=22 XXIII=23 XXIV=24 XXV=25 XXVI=26 XXVI
27:XXVll 28:XXVll 29:XXlX 30:XXX

Friday, February 1, 2013
కొల్లమ్ = "మిరియాలు", Quilon
 కేరళలో వర్ణభరిత పర్వదినము కొల్లమ్ పూరమ్ ( Kollam Pooram)  
{అక్షరములతో ఆట/  అక్కరముల మహిమ;

*****************************:


Labels: అక్షర క్రీడ
**********************;

 అధ్యయనము 1 – “అ”;  “ఆ” -“అకార & ఆకారములు” అచ్చులు) –
 మరుగున పడ్తూన్న సొగసైన పదములను   కాస్తంత గుర్తుకు తెచ్చుకొనే ప్రయత్నమే ఇది!

/ / / * * * * * - +
{ఉదా|| =ఉదాహరణ;ము:- eg: example

**********************;

ప్రబోధినీ నిఘంటువు
 ***********************************;
Saturday, December 15, 2012
అధ్యయనము 1 – “అ” (Part 1)

] అనగనగా = అనగా అనగా

Friday, February 1, 2013

కొల్లమ్ = "మిరియాలు", Quilon

 కేరళలో వర్ణభరిత పర్వదినము కొల్లమ్ పూరమ్ ( Kollam Pooram)      
అనేక   ఏనుగులు అలంకృతమై, ఉత్సవ వేడుకలలో ప్రదర్శితమౌతాయి.
ఇసుకవేస్తే నేల రాలనంత జనము ఇక్కడికి వస్తారు .
( 1 )  శ్రీ క్రిష్ణస్వామి కోవెలలో ( Asramam Sri Krishnaswamy Temple,  )
ఈ పండుగ ఘనంగా జరుపుతారు. కేరళలోని పుణ్య క్షేత్రాలు సందడిగా ఉంటాయి.
కూడమాట్టం పండుగ(`కుదమత్తొం ') కై- ముప్ఫై మంది మావటీడులు పాల్గొంటారు.
15 మంది చొప్పున రెండు వర్గాలుగా ఈ 30 టుస్కెర్స్ విభజించబడుతారు. 

1 }ఒక గ్రూపు టస్కర్లు- శ్రీ తామరకులమ్ శ్రీ మహాగణపతి కోవెల టీము
(ఠమరకులం శ్రి ంఅహగనపథ్య్ టెంప్లె తేం ) ;
2  }రెండవ టీము - పుథియకావు భగవతి ఆలయము టీము
( Puthiyakavu Bhagawathy Temple team )
కూడమాట్టం పండుగ (`kudamattom ')
జాతీయ పండుగ- గా 
పరిగణించదగిన స్థాయి గల గొప్ప పండుగ - అని అభిజ్ఞుల అభిప్రాయము.                         
సాంప్రదాయబద్ధముగా దరువులు , మేళమ్ లు వైభవముతో "కూడమాట్టమ్" జరుగుతుంది.
ఆ సందర్భములో బాణాసంచాల హడావుడి- ప్రజలకు నయనపర్వము చేస్తుంది.

                  కొల్లమ్

"కొల్లమ్" అనే మలయాళ పదమునకు "మిరియాలు" అని అర్ధము.
సుగంధ ద్రవ్యాలలో - "మిరియములు" ది (spices, pepper) అగ్రస్థానము.
తెలుగులో "కారాలూ, మిరియాలూ నూరుతున్నాడు" నే జాతీయ ప్రయోగము ఉన్నది.
కొల్లమ్ - సంస్కృత పదము.
కొల్లమ్ పంట 'కో కొల్లలుగా' పండుతూన్నందుచేత - 
ఈ సీమకు "కొల్లమ్" అనే పేరు వచ్చినది.  
 
క్రీస్తు పూర్వము  125 (=  ౧౨౫ ) నుండి 
ఆరంభమైన కొల్లమ్  శకము ను ఇక్కడ ఆదరిస్తారు.
చిప్లన్ నగరిలో పరశురాముడు - రచించిన కొల్లమ్ కేలండర్ ను - 
కొల్లమ్ సీమా జనులు అనుసరిస్తారు.
 ( ('God's Own Country'; banks of the Ashtamudi in Kerala )  

కొల్లమ్ పట్టణము, జిల్లా ప్రాంతము - అష్టముడి తీరమున ఉన్న అందమైన సీమ.
సొగసులకు నెలవైన కేరళకు -
"భగవానుని ధామము" - అని కీర్తి వచ్చినది.

కొల్లమ్ మండలము; పూర్వ నామము
ఆంగ్లేయులు "క్విలోన్ ("Quilon") అని - కొల్లమ్ ను  పిలిచారు.

కేరళ రాష్ట్రములో ~ కొల్లమ్ ప్రధాన వాణిజ్య, ఆర్ధిక కేంద్రము. 

కేరళలో నాలుగు పెద్ద నగరములు :-

 అవి  1) త్రివేండ్రమ్, 2) ఎర్నాకుళమ్, 3) కోఝికోడ్, 4) కొల్లమ్   
;;
Tags:-
Ilanjithara melam,
elephant show
Kollam Pooram 
మ్  మ్  మ్ మ్  మ్  మ్ మ్  మ్  మ్ మ్  మ్  మ్ మ్  మ్  మ్ మ్  మ్  మ్

తినుబండారములు

చిట్టి చిట్టి మిరియాలు ; పెరటిలోన చల్లాను;
ఉసిరి కొమ్మ తెచ్చి, ఆ పక్కన నాటాను;
బొమ్మరిల్లు కట్టాను; అందర్ని పిలిచాను;
కార్తీక పిక్ నిక్కు మజా! మజా!

గుజ్జన గూడులు; అవ్వం బంతి; బువ్వం బంతి;
గుజనాల గూటిలో - పెళ్ళివారి విందులను
మించేను మా పిల్లలాట పాటల
        తినుబండారములు, తిళ్ళు;

బాలబాలికల తమాషాలు;
ఆటలు పాటలు, గంతులు హమేషా
ఇలఅలో నిండగు మోదము మెండు;
పెద్దవాళ్ళందరికి ఆటవిడుపులు దండి!

;

;


                      [ కార్తీకమాసము హేల:  ; ;  తినుబండారములు]

అక్షరములతో ఆట

ఒత్తులూ, దీర్ఘాలూ, ద్విత్వాక్షరములు - మాత్రం మారుస్తూ - ఈ
దిగువన ఇచ్చిన మాటలనుండి-
కొత్త పదములను అల్లరల్లరిగా- అల్లనల్లన- అల్లేస్తూ తయారు చేయగలరా?
Try for new words! O.K.! 

                         కొల్లేరు

1) కాళీ: 2) కల్ల: 3) కిల కిలా నవ్వుట: 4)కళ్ళు: 5) ఏరు:
6) లేరు: 7) లేఖ: 8) కల: 9) లెక్క: 10) కిళ్ళీ: 
11) "కోలు కోలు అనుట"  12) కోలాటము ; 13) లోకము; 14) కూలీ; కూలి; 15) కేళి ;

*****************************:

ఒకే అక్షరము రెండు సార్లు, అంత కన్నా ఎక్కువ సార్లు
వచ్చేలా అధిక పద సంపదను ఈ భరిణలో చేరుస్తారా? చూద్దాం!
షరతులు షరా మామూలే!
ఒత్తులూ, దీర్ఘాలూ, ద్విత్వాక్షరములు - మాత్రం
మీకు తోచిన రీతిలో మార్చుకో వచ్చును సుమండీ! 
 

                                     "క" హల్లు Letters  :-  


1) కాకి 2) కక్కీ (దొడ్డమ్మ) 3)కీకారణ్యము: 4) కీలకము: 5) కుక్కుటము:
6) కూకటి వేళ్ళు; 7) కుక్క 8) కేక 9) కిక్కు; 10) కైక/
కైకేయి; 11) koక్కెము; 12) కొక్కోకము; 13) కోక; 14) కోరకము; 15) కోరిక/ కోర్కె;
16) కౌతుకము;  17) కింకరుడు; 18) కంకణములు; 19) కైశికి; 20) కిష్కింధ;

21) కిసుక్కున నవ్వి; 22) కస కసా నములుట; 23) కక్కాయి; 24) కక్కుట;

25) వెక్కిరించు, కొక్కిరించు; కొక్కిరాయి ; 26) కాటుక;

27) కలకాలము; 28) కలకలము;

29) లుక లుకలాడుట; 30) " ' క ' కారము;

31) కంకుభట్టు; 32) కానుక; 33) కల కండ; 34) కండ కావరము

{అక్షరములతో ఆట/  అక్కరముల మహిమ;

          Telugu syllables


 అ ఆ ఇ ఈ  ఉ ఊ ఋ ౠ
ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అః 

*****************************:  
                          తెలుగు అంకెలు

 ౧ ౨  ౩  ౪ ౫  ౭  ౮ ౯  ౧౦ 

మ్  కల్హార 

*****************************: 

             రోమన్ నెంబర్లు: (RomanNumbers)


How do you write roman numerals for numbers 1-30?

I=1 II=2 III=3 IV=4 V=5 VI=6 VII=7 VIII=8 IX=9 X=10 XI=11 XII=12
XIII=13 XIV=14 XV=15 XVI=16 XVII=17 XVIII=18 XIX=19 XX=20
XXI=21 XXII=22 XXIII=23 XXIV=24 XXV=25 XXVI=26 XXVI
27:XXVll 28:XXVll 29:XXlX 30:XXX

;
 అ ఆ ఇ ఈ  ఉ ఊ


 palaka balapam : (photo LINK)
;