Monday, May 18, 2009

రాజ నీతి


రాజనీతిజ్ఞుడు
జాంబవంతుని వాక్యము ;;;;;;;
''''''''''''''''''''''''''''"జాంబవాన్ తు అధి సంప్రేక్ష్య శాస్త్ర బుద్ధ్యా విచక్షణః ;
వాక్యం విజ్ఞాప యా మాస గుణవత్ దోష వర్జితం. "

నాది,నా అనేది !


''''''''''''''


నాది కానిదేది లేదు నీలో ;
నిజానికీ నేనున్నది నీలో :::::::
'''''''''''''''''''1)జంబులింగం పుత్రరత్నానికి డిక్టేషను చెబుతూ,
హోం వర్కు చేయిస్తున్నాడు.
తండ్రి ప్రశ్న ::::
''''''''
"నానీ!
'నా నాలిక మీద నానా రాగములు చిటికెలో మధురంగా విడుదల అవుతాయి;'
ఆ! ఇప్పుడు ఈ సెంటెన్సులో ఎన్ని "నా"అనే అక్షరాలు ఉన్నాయి?చెప్పు! "

తనయుని వాక్కు :::::::
'''''''''''
"ఇక్కడ 'నా'అనేది ఏదీ ఉండదు:
'విడుదల 'అసలే లేదు,అంతా అమ్మే కదా మరి!"


''''''''''''''''''''

2)"అమ్మ"కం దారులు ;;;;;;;
'''''''''''''

ఇచ్చట నాన్నలు అందరూ
"కొడుకులు అండ్ కో"లు" :

"కూతురులు 'కూత కొచ్చిన పిట్టలు;
మరియు పెళ్ళి అవగానే 'తుర్రు 'మనే బుర్రు పిట్టలు."

'''''''''''''''''''''''''''''''

3)"మన బాసు కథాకళీ చేస్తున్నాడు!"
"ఎం?ఎందుకనీ?" ఛాంబరులోనకు తొంగి చూస్తూ
అడిగాడు జంబు లింగం.

బాసు వీరంగం కనిపిస్తూ,వినిపిస్తూన్నది ఇలాగిలాగిలాగ ;;;;;;
"కావాలనే ఇలా టైపు చేసావు నువ్వు....."

కొత్తగా జాయిను అయిన లేడీ టైపిస్టు వినయ,విధేయతలతో తల వంచుకుని,
ఆయన ఎదురుగా నిలబడి ఉన్నది,అందరికీ ముసి ముసి నవ్వులను తెప్పిస్తూ!

"మరీ అంత వినమ్రతను చూపించనక్కర లేదు,
ఇదిగో!నా పేరును ఇలాగనా టైపు చేసేసి కూర్చున్నావు,..."
ఆమె ;;
''''''

"ఏమి సార్!నేను కరెక్టు దానే సేసి పూడుస్తిని,ఏమి ఉండినది?"

"నా పేరు పురుషోత్తమ రావు 'ఔనా!?!!!!!??
"ఆమ సారు వాడూ!>>"
"మరి ఇలాగ 'పురుగోత్తమ రావు 'అంటూ వేసి పడేసినావేందబ్బా????!"

"ఆమ!మా తమిళములో 'గ 'ఓన్లీ హల్లుల లిపిలో ఉండాది,
ఇంతకీ అందులోన ఏమి తప్పు వచ్చి ఉండినాది,సారూ!???"


'''''''''''''''''''''''''''''''''

Sunday, May 17, 2009

ప్రేమ గారడీ


''''''''

ప్రేమ గారడీ ;;;;;;
''''''''''


ఇంతి దోసిలిలోని
పుష్పాలపై వాలే
మిణుగురు పురుగుల రెక్కలలోనికి
నేను చిరు కాంతిగా చేరి,చిగురిస్తూ ఉంటాను

'''''''''''''''''''''''''''''''''

"ప్రేమ"
కలలలోంచి జారి పోయి
ఇలకు వాలిన ఈ రెండు అక్షరాలూ,

నీ చిరు నవ్వుల స్పర్శ సోకి
నవ చైతన్య పక్షము(=రెక్క)లతో
మరల "ఉఫ్ఫ్"న ఎగిరి,ఎగసి

తెలి రెక్కల కాంతుల వ్యాప్తిలో
తాము విస్తృత పరీమళమై
దశ దిశలకూ
పంచుతూనే ఉన్నాయి!

పడతీ!
ఆ "ప్రేమ "అనే
రెండక్షరములు చేసే గారడీ
అంతా ఇంతా కాదు సుమా!


'''''''

మదికి ఆకృతి నొసగినావు నీవు!

''''''

మదికి ఆకృతి నొసగినావు నీవు! ;;;;;;;;;;;
''''''''''''''''''''''

ప్రేమా!ఓ ప్రేమా!
అలసట చెందిన మనసులను
మరల మరల అలమట బెడుతూనే
ఉంటూంటావు!
ఇదేమి సరదా నీకు?

మనసున్న మనిషి అంటే
నీకెందుకనీ ఇంత అలుసు?!
"ఇంతింత"ని అనుకుంటూ
అంచనాలు వేయ లేనంతగా
'గడుసు దనాన్ని '
నిలువెల్లా
నింపుకున్న దానివి నీవు!

గాలికి
దూది పింజల లాగా
ఎగిరి పోతూన్న భావాలను
పరిమళ పుష్పాలుగా చేస్తావు!

గమ్యం ఎరుగని ప్రయాణాలలో
డస్సి పోయిన మనసులను
శ్రావణ నీరదములుగా
తొలకరింప జేస్తావు
చిలకరింప జేస్తావు నీవు,
ఓ ప్రేమా!


"మనసు"అనేది ఉందనీ
మదిని కలిగి ఉన్న జీవి
"మనిషి మాత్రమే!" అనిన్నీ
నీ వలననే నిరూపితమౌతూన్నది,ఓ ప్రేమా!

హృదయ తత్వ స్వరూపాన్ని
సదా
అవగతం చేస్తూనే ఉంటావు నీవు,ఎల్లరికీ!

అందుకే
ఓ ప్రేమ దేవతా!
నీకు మా శత సహస్ర వందనములు!


'''''''

అన్వేషణ


అన్వేషణ ;;;;;;
''''''


కృష్ణుని
పదముల సవ్వడికే
ఆమని వచ్చెను
వడి వడిగా //

యమునా నదిపై
ఏమీ ఉరవడి!?
కాన రాడనీ కృష్ణుడు
మరి మరి //

బృందా వనిలో
ఏలనె అలజడి!
గోపికలంతా వెదకిరి
అటు నిటు //


''''''''

చిన్నికోరిక


చిన్నికోరిక ;;;;
'''''''ప్రభూ!
అనంత వీధిలోనుండి
వేణు రవళి గీతిని వింటూ
తలిరాకుల హిమ బిందుల
నాట్యమాడు తెలి కాంతుల
అపురూప ప్రసాదముగా
లభియించిన
ఇంద్ర ధనువు
నా నయనమ్ముల
దాచుకొనుచు
నా పయనమ్ములు
ఈ లాగున సాగనీ!

తొలి వేకువ తుల తూగెడి
రత్న ధవళ స్నిగ్ధతలన్నీ
నా కనీనికల మెరయుచుండ
నా పయనమ్ములు సగనీ!

తేలి వచ్చు
తేలిక పాటి నీలి మబ్బు నావలందు
ఆట పాటలతొ సాగెడి
'మెరుపుల బాల బాలికలతొ '
నేత్ర పర్వములు సలిపే
నా దృక్కుల
పయనమ్ములు సాగనీ!''''''

Friday, May 15, 2009

పలుకుల సుధల తీపి'''''''


పలుకుల సుధల తీపి ;;;;;;;;;
'''''''''''''''''

పోకిరీల కోతి బావ
పోకడల కొండ ముచ్చు
ఇవి చాలమ్మా!నాకు-
ఆడు కొందు నించక్కా! //

2)సొగసు రామ చిలకలు-సితా కోక చిలుకలు
నా కన్నులలో వన్నియల-నాట్యాలు ఎన్నెన్నో! //

3)హరివిల్లుకు,వెన్నెలకూ-మెరుపులకు,ఉరుములకూ
సంధి నేను కుదురుస్తా-ఆటలెన్నొ నేర్పిస్తా! //

4)కుహు కుహూ కోయిలల-మైనా,గోర్వంకల
పలుకు రాగాలలోన - తీపి ఎలా కలిగెనమ్మా?

అమ్మ ఆన్సరు ::::::::
''''''''

"మీ చిన్నారుల తొక్కు పలుకు -
సుధలు చిన్ని బొట్టు చాలును
గ్రోలినందునే
'వాని ,పాట తీపి పొంగా'యెను.

ఆడండీ!పాడండీ! -
ఆట పాటలతొ,మేటిగ
విద్యలన్ని నేర్వండీ!

మీ చిలిపి చేతల సౌరభాలు -
ఎల్లెడలా నిండాలి
కల్మషాలు లేని జగతి -
మోద భరిత బృందా వని!"'''''''''''''''''''''''''''''''''''
శిల్పి


శిల్పి ;;;;;;;
''''''

ముగ్ధంగా పూల గుత్తి
భానుడు
"తన "ఉలి"
ఎక్కడున్నదో?"అనే
అన్వేషణలో ఉన్నాడు.

మరి,
ప్రకృతికి
మరిన్ని అంద చందాలను
అద్దాలి కదా!'''''''''''
'''''''''''

తమ తమ గమ్యములు ;;;
'''''''''''''

"పరాగ యోగంలో"
పుష్పములు
విరాఆజిల్లుతున్నాయి
శశాంకుని శీతల కాంతులకూ
సప్తాశ్వ రధారూఢునికీ
తమ తమ గమ్యాలేమిటో
చిటికెలోన తెలిసి పోయాయి.
''''''''''''''''''''''''''''''''

తమ తమ గమ్యములు
'''''''''''

తమ తమ గమ్యములు ;;;
'''''''''''''

"పరాగ యోగంలో"
పుష్పములు
విరాఆజిల్లుతున్నాయి
శశాంకుని శీతల కాంతులకూ
సప్తాశ్వ రధారూఢునికీ
తమ తమ గమ్యాలేమిటో
చిటికెలోన తెలిసి పోయాయి.
''''''''''''''''''''''''''''''''

milkmaid

''''''''''''''''''''''''''milkmaid is coming.
the pots
as Night,
The milk shine
as the sun rays.


''''''''''''''''''''''''''''

మనసే గుడిగా మారినవేళ!Kovela

మనసే గుడిగా మారినవేళ!

By kadambari piduri


(పల్లవి )
నిలకడగా ఉంటే
ఇది "మది" ఔతుందా!
నెమ్మది ఎరుకకు వస్తే
గుడి ఔతుందా?!
స్వామి గుడి ఔతుందా?


ఉల్లసిల్లు మానసమే

సరోవరమాయెను

ఎల్ల వేళలందు; అందు

హంసము తిరుగాడును

భక్తి హంసము తిరుగాడును ||నిలకడగా ఉంటే||

తిరుమలేశు కారుణ్యము
ఎల్లలేమి ఎరుగనిది!
ఎల్లెడలా, ఎల్ల వేళలందున
వెదజల్లెడు కౌముది!
పరిమళాల కౌముది! ||నిలకడగా ఉంటే||
Views (116)'''''''''''''''''''''''''''''''''''''

గోవింద నామము!

గోవింద నామము!

By kadambari piduri,

పరి పరి విధముల - పది దిక్కులలో
పదే పదే పరివ్యాప్తిగ - ఉన్నది
అదియే! అదియే! గోవింద నామము!
ఆరాధనీయము! సంపూజ్య తేజము!

1)కన్నులకు కట్టినట్లు - కానవచ్చు వైభవమై
భవమునందు భావమై - తనరు భవ్య దవనము!
నెనరు భువన భవనము ! - కవనమునకు ఆలంబనము

గూడు కట్టుకున్నవి - గుండెలలో మోదములు
ముదములన్ని మేదినిలో -ఆమోదమైన జ్యోత్స్నలు
సాంద్ర పూర్ణ చంద్రికలు - మేని భక్తి పులకింతల వెలుగు
లు

Views (118)

మేధినిలో వెలిసినాడు

Kovela
!

By kadambari piduri,


మేధినిలో వెలిసినాడు
అందాల రాయుడు!
గోవిందుడు! శ్రీ గోవిందుడు!

ఆటలాడుతాం!
నాట్యాలు, నటనమాడుతాం!
ఆనంద మూర్తి ,
నీ లీలలు చూపుటకే
ఉల్లసిల్లునీ ఆటలు -
ఈ ఆటలు ధన్యమైనవి!

పాట పాడుతాం! -
కృతి, భజనల కీర్తించుతాం!
శ్రీకాంతు లాస్య హేల
లీలలను వినుతించుట చేతనే
ఈ పాటలు సార్థకమ్ములైనవి!


'''''''''''''''''''''''''

ధ్యాన మాధురి

Kovela

ధ్యాన మాధురి

By kadambari piduri

శ్రీకృష్ణ గీతములు 4

భువన మనోహర! సుందర శ్యామా!
నిను గని,మరుడే మై మరచేరా! //భువన//

యమునా తీర సైకత వేదిక
లెగసెనురా!,నీ తలపు పవనముల
జిలిబిలిగా ఎగసెనురా!
అల్లి బిల్లిగా విరిసెనురా! //

బృందా వనమున 'రా చిలుకల'
ఎల పలుకులు,నీ ధ్యానమలోన
మధుర మాయెరా!-
సుధా మధుర మాయెరా! //

గోకులమున,వ్రేపల్లియలోన
హరిణ లోచనల చూపు డోలలలొ
సతతము,నిరతము
ఊగు చుండునది నీ రూపేరా! //
Views (69)

శ్రీ తులసి హారతి పాట


Kovela

శ్రీ తులసి హారతి పాట

By kadambari piduri,

(ప్రాచీన గీతము)

శ్రీ తులసమ్మకు పూజలు సేయగ - సుదతులు త్వరగా రా రండీ!
మల్లెలు, మొల్లలు, మందారాలు - మరి మాలతి, గులాబి,చేమంతులతో

పంచామృతములు, మంచి గంధములు -ధూప, దీప, నైవేద్యములు
అంచితముగ విందు, తాంబూలం-నీలాంజనము సొగసుగ చేకొని

సర్వ దేవతలు, సకల వేదములు - నిఖిల గీతముల తల్లిని కొలుచుట
మనసు మందిరమునందున కొలుతుము - తులసీ లక్ష్మిని పూజించండి!

Views (111)

Thursday, May 14, 2009

వోడ్కా ,బంగాళ దుంపలు

''''''''''''


చిటికెలు ;;;;;;;
''''''

1)"కోయం క్షీర కంఠః"

పాలు తాగే పసి వాడెవ్వరు?
మనకు 'తారక మంత్రమూఅండగా ఉండనే ఉన్నది!


2)"సత్యం బ్రూయాత్ ప్రియం
బ్రూయాత్ సత్య మప్రియం."


3)"ఆశా బలవతీ రాజన్."

4)వొద్కా పానీయము రష్యాలో ప్రసిద్ధి.
వోడ్కాను ఆలు గడ్డలతో తయారు చేస్తారు.

5)తిక్కన ఘంటము "లాహోర్"లో ఉన్నది.

6)అరేబియా సముద్రములో ఉన్న అన్ని దీవులూ "పగడపు ఉద్భవ దీవులు".

7)అసలు "నోరు" లేని చిమ్మట పురుగు ఉన్నది,దాని పేరూఅటాస్ మౌత్'.

8)గాయత్రీ మంత్రము"ను జపించేటప్పుడు
ముందు 24 ముద్రలు,
వెనుక 8 ముద్రలు వేయాలి.

9)తెలుగు,ఈటాలియన్,అగద (పశ్చిమ ఆసియా భాషలు) భాషలు 'సంగీత భాషలు 'గా భాషా శాస్త్రజ్ఞులచే గుర్తించ బడినవి.


వోడ్కా ,బంగాళ దుంపలు


'''''''''''''''

ఊర్మిళా దేవి నిద్ర

'''''''''''''''''''''''''


ఊర్మిళా దేవి నిద్ర ;;;;;;
'''''''''''''

లక్ష్మణ స్వామి తన భార్య ఊర్మిళా దేవిని అయోధ్యలో ఉంచి,తాను అన్న గారి వెంట అడవుల కేగినపుడు ఆమె కన్న తల్లి దండ్రుల భావాల అల్జడికి "పాట రూపము ఇది.


పాట ;;;;;;
''

1)నిదుర పోవే ఊర్మిళా!నిదుర పోవమ్మా!
లాలి లాలి లాలీ జో!
మా కన్న తల్లీ!ఊర్మిళా!//

2)కడుపులోన నిన్ను దాచి
తొమ్మిది మాసములు మోసి
కన్న బిడ్డా!నిన్ను మేము
కన్నాముర,చిట్టి తల్లీ!
కను పండుగ పొంగి పోతూ

పాడినాము,హాయి!హాయీ!ఆయిరారో!
జో జో జో లాలి అనుచు //
కన్ను దోయి ఊయెలలో నిను
పొదివినాము,పెంచినాము

పసిడి తల్లీ!,ఊర్మిళా!
ఊర్ముమా!ఉయ్యాల!అనుచు //

3) 'లాల ' పోసి లాలించినాము
లాలనలలో లావణ్య రాశీ!
లాస్యమే నీ బాల్యమాయెనులే!
లాలిత్యమే నీ జీవితమునకు
ప్రతి రూపమగునని తలచినాము

హాయి!హాయి!జో హాయీ!

నాడు లాస్యమే నీ బాల్యమాయెను
నేడిటుల,నీ వదనమందున
దర హాసమీ చొప్పున మాయమాయెనుగా!


4)పువుల పదములు అలలు అలలై
నీ దోగాడు పదముల
మెత్తలైనవి
జో లాలీ జో లాలీ! //

వనము లందలి విభుని పదముల
కంటకములు తగులునేమొ!"యని
ఇచట నీవు కుందు చుంటివి
పరమ సాధ్వివి నీవు ఐతివి
కన్న తల్లీ!లాలి! జో జో! //

5)కాననముల కదలుచున్న
కాంతు తలచీ
తలచి తలచీ
"నిదుర నందున
నీదు కలలే
'కావ్యములుగా వెలయు జగమున! '

నిదురయే
'నీ బ్రతుకు 'అయిన
విధి విలాసము నేమి అందుము?
కుమిలి పోతూ,కుమిలి పోతూ
నిను కన్న వారము,
పాడు తుంటిమి,అమ్మలూ!
చిన్న బోయిన మానసములతో
జోల పాటలు,లాలి పాటలు
జో జో జోలాలీ!
ఆయిరారో! హాయిలాలో! //'''''''''''''''''''''''''''''''''''

'''''''''''''''''''''''''''''''''''

కొంగు చాటు బిడ్డ
'''''''''''''''


కొంగు చాటు బిడ్డ ;;;;;;;;;
''''''''''''


1)పాలు గారు
నీ బుగ్గలు పుణికిన
వర మాతృత్వము
నాదేరా!
చిత్ర శోధనగా
మరి,తరచి తరచి
తరియించిన యశోద మాతనురా!

'''''''''''''''''''''''''''''''''''
2)వేణు దండమున
గారపు దండన!
వెక్కిరించెదవు,ఔరా!నన్ను!

'''''''''''''''''''''''''''''''''''
3)లక్షణ గీతము నీవేరా!
నా లక్ష్యము సాంతము నీవేరా!
నాకెరుక పడిన
ఈ స్వర్ణ క్షణముల
సర్వ వ్యాప్తివి నీవేరా!

'''''''''''''''''''''''''''''''''''''
4)నా చక్షువులందున
సాగెడి దృక్కుల
జాతి నీలమువు నీవేరా!
నీలాంబరమువు నీవేరా!

''''''''''''''''''''''''''''''''''''''
5)వల పక్షము పూనకు,
నను చిన్న బుచ్చకుము
నా పక్షము నీవను
బలము గొప్పదిర!
నా తలపులన్నిటికి
మొలుచు పక్షములు"
గరుత్మంతుడై
విను వీధులలో
నా మానసము
విహరించునురా!

''''''''''''''''''''''''''''''''''''''''
6)"కొంగు చాటున బిడ్డవు నీవ"ని
నిన్నటి దాకా భ్రమసితిరా!
"నీ కొంగుయె
నాకు 'రక్షక పత్రము.'అనుచూ నీవు
నాదు చుబుకము పుణికి
ఏమారుస్తూ,ఓదార్చుదువు.
అమ్మను నేనని మరచేలాగున,
నా కన్నయ్యా!నాదు కన్న తండ్రీ!

'''''''''''''''''''''''''''''''''''''''''

7)జీవినిరా
నేను,నీ సన్నిధి
"శ్రీ దివ్య సీమను"పొందిన
"సంజీవినిని"


''''''''''''''''''''''''''''''''''''''''''

అవధి లేని ఆశ్చర్యములు


అవధి లేని ఆశ్చర్యములు ;;;;;;
'''''''''''''''''''''''


సాకినది యశోద మాత
తన ఒడియే 'మధుర 'గ
తన ఒడియే విశ్వ రోదసిగ
కదరా! కన్నా!

'''''''''''''''''''''''''''''''

2)నీ కంటికి కాటుక తీర్చిన వెనుక
తన వేలిని కనుగొని మురిసినది!

"నీలి కలువగా విరిసినదీ
ఈ నా అంగుళి!"

అనుచూ తలచి
పదే పదే
ఇరుగు పొరుగులకు చూపించీ.

''''''''''''''''''''''''''''''''''

3)నీ మేనుకు కస్తూరి పూసినంతనే
అఱ చేతులను"గుప్పు"గ ముడిచినది

రోదసిలోని గోళములన్నీ
తన అఱ చేతులలోనే కన్నది,కన్నా!

ఆ సంభ్రమాశ్చర్యమ్ముల నుండీ
మరల ఎప్పటికి
తేరుకొనునో ఏమో?!
మన లోకమునకు
వచ్చే దెపుడో.ఏమో?!!!!!!


''''''''''''''''''''''''''''

ధర్మ ధేనువు


Baala

ధర్మ ధేనువు

By kadambari piduri,


1)కల్ప తరువై , గొప్ప కామ ధేనుగ మనకు
కోరి నిలచేదేమి? ఓ అన్నయా!

2)కల్పతరువై-గొప్ప కామధేనుగ మనకు
కోరి నిలుచును విద్య! ఓ అన్నయా!


3)ధర్మ గోవును ప్రోచు - గొప్ప శక్తిని ఇచ్చి
మేలు చేసేదేది? ఓ అన్నయా!

4)ధర్మ ధేనువు గాచు - గొప్ప శక్తిని ఇచ్చి
మేలు చేయును చదువు!ఓ అన్నయా!

Views (46)

Tuesday, May 12, 2009

తమలపాకుల చిలకలీయవే!


Kovela ;;;;;;
''''''''''

తమలపాకుల చిలకలీయవే!

By kadambari piduri, Feb 5 2009 9:13PM

పుండరీకాక్షునికి
పరమానంద రూపునికి
తమలపాకుల చిలకలీయవే!
చిలుకా!

నీ అరచేత లేలేత
పచ్చనాకులను
జీవితముగా కూర్చి
ఇచ్చినాడే! విభుడు!

పరికించి చేసేటి
కర్మల ఫలములు
చక్కనీ వక్కలుగ
వెలసెనే! చూడు!

కొండంత పాపాల
ఖండించ వలెననెడి
ఇసుమంత భావమే
సున్నమయ్యెను నేడు

అన్నిటిని కలబోసి
ఆ పైన కల నూర్చి
చిరు నవులు నీ కొసగునే!
స్వామి
వెల తూచలేనంత
ఆనందముల నొసగునే!

Monday, May 11, 2009

మానవుడు భాగ్య శాలి
'''''''

మానవుడు భాగ్య శాలి ;;;;;;;
'''''''''''''''''
ప్రేమ సీమలలో
అన్వేషణయే వాడుక.

ఆ వాడుకయే కడు వేడుక.

ప్రాణి కోటిలో
మనిషికి
ప్రత్యేకం
అనురాగ భావ వ్యక్తీకరణ

ప్రణయ సౌరభ మాలికలను
దాల్చగల భాగ్యం మా'నవుని 'దే కదా!

అందుకే
మనిషి మనసు
సుతిమెత్తని ఉద్యాన వన వాటిక.

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

నిరంతర గాన రవళి

''''''''''''''''''''''''''''''''''''''''''''''''

నిరంతర గాన రవళి ;;;;;;;;
'''''''''''''

తమో వాహినిలో
నిశ్చల తపస్సు చేసిన "వెలుతురు"
నీ మురళీ గానములో
ఉదయ కాంతిగా వెలికి వచ్చింది.
నీరవ నిశ్శబ్దంలో
ధ్యాన నిమగ్నయై ఉన్నది నాదోంకారము.

వెలుగు రాశులతో
ధరణీ తలం అవుతూన్న్నది
చైతన్య బృందావని.

ప్రణయ తటిల్లతలు
నీ సిగలో పింఛముతో
మెరుపులను పంచుకుంటున్నాయి.

పూ గుచ్ఛంలో నుండి
"పిల్లి మొగ్గలు"వేస్తూ,ఆటలాడుతూన్న
పరిమళాల బాల బాలికలు
నీ వేణు గాన తుషారములో
ఓలలాడుతూ
మృదు సమీరాలతో
వినోదాలను పంచుకుంటున్నాయి.
కృష్ణా!
మ్రోగించుమోయీ,మురళి!


''''''''''''''''''''''''''''''''''''''''''''''''

ప్రతి నేత్రంలో ఆవిష్కృతంకాలమనే రేవు ;;;;;
'''''''''''

వెన్నెలల దారులంట
వెడతాం!వెళతాం!

ప్రకృతి కృతికి శ్రీమంతం
ప్రతి నేత్రంలో ఆవిష్కృతం
పరిఢవిల్లు రసాద్భుతం

మదను విల్లు
తన పంచ పుష్పముల కొఱకై చేయు
అన్వేషణమ్మునకు దొరికె నేడు పరిష్కారం.

శిశిర, గ్రీష్మముల వలువలు
కాలం_రేవులోన విడిచి పెట్టి
హర్ష వర్షముల కోకలు
ధరియించెను,ఋతు రాణి.


;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

Saturday, May 9, 2009చైత్ర రధములు ;;;;;;;;
''''''''''


బాల బాలికల
తళుకుల పాటలు
చిలుకు మాటలు

జిబిలి గాలికి
చక్కిలి గింతలు //

బాల బాలికల
ఆటలు పాటలు
ఆనందాల కేరింతల్లు

ఆమని కొసగిన
'చైత్ర రధములూ //

బాల బాలికల
ప్రజ్ఞ,జిజ్ఞాసలు
నవ్యత నేర్చే
వారి ఆతృతలు
భావి జగత్తుల
ఆహ్లాదాల శ్రీకారములు//'''''''''''''''''''''''''''''''''''''''''''

వెలుగు మీనములు
వెలుగు మీనములు ;;;;;;
'''''''''''''


జల జలా జాలారి వనితల
నవ్వుల పువ్వుల జిలి బిలి లాహిరి
నీటికై వెడలేను

కడవలో పట్టేది మంచి నీరు,
నీటిలో విరబూయు
వెలుగు నీడలను 1
ఒడిసి పట్టేస్తుంది
తన నవ్వు జాలములందు.2


'''''''''''''''''''''''''''''''''''''
1)నీడలు= ప్రతి బింబాలు,ఛాయలు
2)జాలము=వల,ఇంద్ర జాలము


'''''''''''''''''''''''''''''''''''''

మూగ వోయిన నిదుర
''''''''''''''''''''''''''''

నీవు లేక కలలు రావు;
స్వప్న రహిత శూన్యమై;
నాదు నిదుర కాస్తా ;
మూగ వోయినది;

ముసురుకోనీయి చెలీ!
నీదు ముంగురులలొ
వాలిన తేటులకు
గట్టి పోటీని ఇచ్చును నాదు కలలు!
కనుకనే,
నాదు జీబురు నిదుర చుట్టూతా ;
నిను గురించిన తీపి స్వప్నాలను
ముసురు కోనీయి,చెలీ!
ముసరనీయి!

'''''''''''''''''''''''''''''''''''

''''''''''''


జో రాం దశరధ్ కా బేటా;
వహీ రాం ఘట ఘట్ మే లేట;
వహీ రాం జగత్ పసేరా."


"లోకమంతా విరాజిల్లే దశరధ తనయుడు శ్రీరామ చంద్రుడు ,
తనితీరా తలుస్తూనే ఉంటాము కదా!"


'''''''''''

Friday, May 8, 2009

తానే ఒక పులకింతగా మారి పోయిన గాయం!.


ఆవాహనగా ఆహ్వానితమై ;;;;;
'''''''''''''''''నీ దృక్కుల ధరణీ సుక్షేత్రంలో;
మృదు మంజుల గేయములుగ మొలకలెత్తి;
పచ్చ పచ్చని పైరుల చిరు నవ్వుల సందడిగా,
నా హృదయములోనికి దూరి
చేసిన ఈ గాయాన్ని చూడు!

కలల బరువును మోయలేక;
కర్ణుని రథంలా కుంగి పోతూన్న;
ఈ గాయాన్ని చూడు!

'నీవు బాధ పడతావేమో'అని;
"తానే ఒక పులకింతగా మారి పోయిన"
ఈ గాయాన్ని చూడు!

ఈ గాయం;
ప్రేమ తత్వానికి "సింహ ద్వారం".

ప్రేయసీ!
నువు చూడ దలుచుకున్నప్పుడే చూడు!

ఈ లోగిలిలో,
నా పర్ణ కుటీరంలో;
ప్రతిష్ఠితమైన ప్రేమ తత్వపు కాంతి
నీ చూపులలోనికి తిరిగి ఆవాహన అవుతుంది.

అపుడే కదూ,
ఆ ఆహ్వానిత శ్వేత కాంతి
సప్త వర్ణాలనూ
ప్రస్ఫులించే
మనోజ్ఞమైన
ఇంద్ర ధనువుగా
ఎట్టెదుట సాక్షాత్కరిస్తుంది.

పూల జడ
పూల జడ ;;;;;;
''''''

ప్రణయ దేవికి
సంగీతపు పూల జడ .

పొందికగా ఉన్న
పుష్పమ్ములు ఇవియే>>>>>>
వలపు,
లేదా తిరస్కారము;
ఉవిదా!
నీ నిరక్ష్యము,తృణీకారములు.


'''''''''''''''''''''''''''''''''''''''''

గారడీ

'''''''''''''''''''''''''''''''''''''''''''

"సార్! గారె రెడీ!ఇదిగోండి!" హోటల్లో సర్వర్ని పిలిచి, చూపిస్తూ అడిగాడు,పానకాలు; "ఇదిగో,నీ కళ్ళతో నువ్వే సరిగ్గా చూసి ,చెప్పు!
పైగా గారె రెడీ'అని చెవులు గింగిర్లెత్తేలాగా,చెబ్తున్నావు?
ఇది 'గారె రెడీ కాదు,పక్కాగా"గారడీ". నా షర్టు గుండీ సైజు అంత కూడా లేదు." ''''''''''''''''''''''''''''''''''''''''''

ఉషా స్నేహమూ,

''''''''''''''''''''''''''''''''''''''''''''''''' "మన గురుడు ఈ మధ్య మాంఛి ఉషారుగా ఉన్నాడు కదూ! వాటీజ్ ది రీజనూ?"
దీర్ఘం తీస్తూ అడిగాడు,కొలీగ్ ని,పానకాల రావు.

"టైపిస్టు ఉషా రాణి తో స్నేహమూ,పెళ్ళీ
రెండూ కుదిరాయి కదా!అందుకని!" మిత్రుడి డౌటును తీర్చాడు జంబు లింగం. '''''''''''''''''''''''''''''''''''''''''''''''''

"ఆవిష్కరణ"

2)"ఇదేమిటయ్యా,ఎడిటరూ?ఇలాగ?"
పత్రిక ఆఫీసుకి ఫోను చేసాడు మంత్రి గారు . "ఏమండీ! ఏమైంది?"
కంగారు పడ్తూ అడిగాడు,ఆ సంపాదకుడు.
"జంబలక్కు కాలనీ నిర్మాణానికి 'ప్రారంభోత్సవమూ'అనకుండా 
'పారబూత్సము 'అని వేశారు;
అలాగే "పుచ్చ కాయల పాపా రావు పుస్తకాన్ని
"ఆవిషకరణ 'ను చేసానంటూ అచ్చేసావు?"

"ఆవిష్కరణ"కు బదులు అచ్చు తప్పు పడింది,సార్!
క్షమించండి సార్!"
సంపాదక మహాశయుడు నించుని, 
చేతులు నులుముకుంటూ,అపాలజీ చెప్పు కొన సాగాడు,ఫోనులో. ''''''''''''''''''''''''''''''''''''''''''''''''

jokes

''''''''''''''
ట్యూషన్ టీచరు అడిగింది;  
"ఇదేమిటీ?బాల సుబ్రహ్మణ్యం! డిక్టేషన్ లో 
"పావు"అని మాత్రమే రాసావు,
కొరవ రాయ లేదు,ఎందుకని?"  

"మీరే కదా టీచర్!'పావురాయి ' అని చెప్పారు; 
అందుకనే 'పావు భాగం మాత్రమే రాసి పెట్టాను." 

వినయం ఉట్టి పడ్తూండగా,చెప్పాడు,
మన బాల సుబ్రమ్మణ్యము.  

''''''

jokes

''''  

jOkiMchutunnaamu ;;;;;
''''''''''''''''  

1)పంకజాక్షికీ,అత్త గారికీ 
బాగా లడాయి పడింది. రుస రుస లాడుతూ,వచ్చి 
తన కూతురు చిట్టితో అన్నది పంకజాక్షి, 

"హు!మీ బామ్మ 
పిట్ట కథలు బాగా అల్లి చెబుతుంది." 

చిట్టికి గొప్ప ధర్మ సందేహమే కలిగింది; 
"ఏ పిట్ట మీద మమ్మీ!
పావురాయిమీదనా,పిచ్చుక మీదనా,పీ కాక్ మీదనా?"

.............................................

పొందిక కుదిరిన చోట


'''''''
పొందిక కుదిరిన చోట ;;;;;; 
'''''''''''''''  
ఏ నేత్రాలకు 
"దృక్కులు" ;
దిశాంతాలకు కదలికలను నేర్పిస్తాయో ; 
ఆ నయనాలను ఆరాధిస్తాను నేను.

ఏ పాదాలకు  
కాంతి నిర్ఝరీ గమ్యాలకు తీసుకు వెళ్ళే ; 
మలుపులు తెలుసునో ; 
ఆ చరణాలకు సాష్టాంగ పడతాను నేను. 

ఏ హస్తాలు 
ఆప్యాయతలను ఆహ్వానిస్తాయో; 
ఆ చేతులను 
మనసారా కన్నులకు అద్దు కుంటాను; 

ఏ మాటలకూ,చేతలకూ 
హృదయంలో పొందికగా 
"వారధి"ని కడతారో 
ఆ మానస సరోవర కెరటాల 
హృద్యంగమ గమకములలో; 
మనసారా స్థిర నివాసమేర్పరచుకుంటాను నేను!  


''''

Thursday, May 7, 2009

కేర్ట్యూనింగులు


హ్హి హ్హి హ్హి హా హా హూ హూ;;;;;;
''''''''''''''''''''''''
2)కేర్ట్యూనింగులు ;;;;;;
'''''''''''''
1)"మీకు కవల పిల్లలు పుట్టారు,కంగ్రాచ్యు లేషన్సు!"
నర్సు నవ్వుతూ చెప్పింది. 

"అల్లుడూ! నీ వృత్తి బుద్ధి ఇక్కడ కూడా అమలు చేసావు కదా!"
సంతోషంతో,వేళాకోళామాడాడు మామ గారు.
ఇంతకీ ఆ అల్లుడు గారు చేసే వృత్తి
"జెరాక్సుshop ,ఫోర్జరీ సంతకాలు చేయడమున్నూ!
అదీ సంగతి.''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''' 1)ఆఫీసునుండి ఇంటికి వచ్చాడు జంబు లింగం. 
ఇల్లంతా చిందర వందరగా ఉన్నది. 
"ఛీ ఛీ !ఇంటికి రావాలంటే విసుగు.ఇల్లంతా జూ లాగా ఉంది."

"మరే,ఇప్పుడే కదా మరో జంతువు కూడా లోనికి వచ్చేసింది." 
భార్య శాంతంగా,తాపీగా సమాధానించింది. 


''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''' 2)ఇండియా మంత్రి పాశ్చాత్య దేశాలకు వెళ్ళాడు. 
"ఏమండీ! మా పొలాన్ని మీ వద్ద తాకట్టు పెడ్తాను.
పొలాన్ని ఉంచుకుని,నాకు పర్సనల్ ఋణమేదైనా స్కీము కింద ఇవ్వండి,ప్లీజ్!"

"కుదరదయ్యా!ఆల్రెడీ మీరు దేశాన్ని పూర్తిగా కుదువ పెట్టేశారు,
మీకు వ్యక్తి గతంగా అప్పు ఇచ్చి,ఆనక పశ్చాత్తాప్పడ దల్చుకోలేదు."
అన్నాడు
ఆ ప్రవాసా భారతీయ మిలియనీరు. ''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''' 

3)"బుద్ధుడు ఎక్కడ పండు కున్నాడు?చిట్టీ!" 

"హుసేన్ సాగర్ లో టీచర్!"


''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''

Wednesday, May 6, 2009

"కాలము"నకు వర్తమానము పంపించేసాయి


'''''''''''''''''''


 

"నిన్న"ల దృశ్యాల పూలన్నిటినీ దులిపి వేసి 
పుటలను త్రిప్పి, 
"నేడు"ల శ్వేత పత్రాలపైన  
కొంగ్రొత్త చిత్రాలను చిత్రిద్దాం! 

రేపులన్నీ, 
తాము "వర్తమానములు"గా 
మారి పోబోతున్నామని అంటూ 
"కాలము"నకు 
అపుడే వర్తమానానిnniపంపించేసాయి  

కాలము గొప్ప సృజన శీలి! 
తాను సృష్టించే సంఘటనల 
వన్నె వన్నె పూవులతో 

"చరిత్ర"కు సొగసైన జడలను  
నిరంతరమూ అల్లగల నేర్పరి,నిపుణ శిలి!  
మూర్తీభవించిన ఆ అల్లికల సౌందర్యాలను 
మేలిమి పరదాల చాటు నుండి 
చిరు నవ్వులు చిందిస్తూ 
"భవిష్యత్తు" 
సుతారముగా 
అడుగులు వేస్తూ వస్తూన్నది.  

ఆ "నడకలు" 
మనోజ్ఞమైన నర్తనములు కావాలి. 
అవి, 
వర్తమానపు మనోరంజన లాస్య 
నాట్య భంగిమలకు విలాసములు
(=అడ్రసులు) కావాలి. 

నవ్య కాల చిత్ర రచనలను 
"చరిత్ర" 
తన మెత్తటి పొత్తిళ్ళలోన  
మమతానురాగమ్ముల హత్తుకోవాలి!  


''''''''''''''''''''''''''''''''

సౌదామిని సూత్రమ్ము!

''''''''''''''''',,,,,,,,,,,,,,,,,  
'''''''''''''''''  
కొండ గాలి వీచింది 
పాల పిట్ట అరిచింది 
ఎగిరే పక్షుల గుంపుకు 
మబ్బు దారి చూపింది //
 
ఎటకో చెదిరే మొయిలుల 
సౌదామిని సూత్రమ్మున  
వైనంగా చేర్చి, అల్లి 
వర్ష హారమును దివ్యులు 
హర్షాతిరేకమ్ముతో చేసిరి //  

రేయి పల్లకీలోన 
జాబిల్లి వెడలి పోయె! 
తొలి పొద్దు విచ్చేసెను 
సంబరాలు మిన్నంటెను!  

ఇన్నిన్ని అందాలు 
ఈ జగతిలోన ఉన్నాయి 
నా గుండెల్లొ పొంగారే 
ప్రేమ తొణుకులాడుటకే! //


'''''''''''''''''''''

బూజం బంతి

'''''''''''''''''  
వాసంతం వచ్చింది 
కొండ కోన ఆకు,పూలు  
అణువణువును ప్రేమ మీర 
సుతి మెత్తగ నిమిరింది //  
పొన్నాయి పూలివిగో! 
పూల జడలు అల్లండి 
కొబ్బరాకు ఈనెలు ఇవి 
బుజ్జి బుట్టలల్లండి.  
చ్చనైన మామిడాకులు
బూరాలను చుట్టండి! 
మామిడాకు పి ప్పి ప్పీ!
ఈలలు,బూరాలూ  
ఇవి అన్నీ మీ కొరకే! 
రా రండీ!వేగిరమే! బాలలూ!"
అని అంటూ పిలుస్తూంది వాసంతము //
 
పైరు గుబాళింపుల 
బుజ బుజ బూజం బంతి ! 
గొబ్బెమ్మలు, రంగ వల్లి 
చేయండీ! బొమ్మల పెళ్ళి!  
పెళ్ళి విందు ఆటలు 
సృష్టి కర్తకు కను విందులు,ఇంపులు!  

,,,,,,,,,,,,,,,,,