Friday, April 24, 2009

ధనువుకు పూవులుచెలియ తెలి చూపు ఎంతటి శక్తి కలది! 
మనోజ్ఞ భావేంద్ర ధనువుల సృజియించ గలదు 
వెన్వెంటనె భావేంద్ర ధనువుల విరిచి వేయ గలదు 
తత్ శకలములు భువిని పుష్పములై వెలసెనంత! 
మదను శరములకు పూవుల కొరత లేదు, ఇంక మీద!

''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''

సంచారిణినా "నిదుర"
నిరంతర సంచారిణి ,

కోరి,ఎప్పుడూ
తాను 'మెలకువ ' లోనే 
చరిస్తూనే ఉంటుంది. 

అందుకనే , 
'తాను ' 
కల కాలం 
'కలల పల్లకీ' గా 
అలంకృతమవ్వాలనే 
తన అభిలాషను 
నెర వేర్చుకో గలిగింది
'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''

నిబిడీకృతము


ఆకాశం ,ఎంత గొప్పది 
ఇందు బింబం, తారకలూ 
దిన మణి,జీమూతములు, 
గ్రహ గోళాలూ .................

ఇన్నిన్ని సొబగుల నన్నిటినీ 
తనలోనే ఇంపింపుగ 
ఇంపొదవగ, ఇంపెదుగగ తనలోనే 
ఇమిడించు కున్నది! 

ప్రేమ తత్వం 
ఎంతటి ఔన్నత్యాన్ని సాధించిన 
"విజేత" అయ్యింది! 

తనలోనే 
సర్వ సౌమ్యత్వాన్నీ 
నిబిడీ కృత మొనరించుకున్నది కదా మరి!!

స్థిర వాసము


తటిల్లత 
మేఘశకలాలలోన 
'అస్థిత్వం' కొరకు 
ఎంతెంతో యత్నించీ ,విఫలురాలు అయ్యింది. 

కడకు ఆ సౌదామిని 
సుహాసినీ! నీ మందహాసమ్మునందు 
సాధించెను 
"స్థిర వాసము".
 
ఏ చిర కాల తపమ్ము చేత 
తటాలున ఇంతటి సత్ఫలితము 
లభియించెను!తన కౌరా!

పడతీ!
పడతీ!
 

నీ పెదవులపై దరహాసము, 
శరత్ చంద్రికలకు మెరుగులు దిద్దింది. 
నిదురలో చెదరిన నీ ముంగురులను సరి దిద్దిన 
చిరు గాలికి 'పూ పుప్పొడి ' పరిమళాన్ని అద్దింది. 

'సుగంధాన్ని ,మలయ పవనానికి ప్రసాదముగా 
ఒసగినట్టి 'పుష్ప రజములకు 
వన దేవత ప్రశంసలు,మిక్కుటముగా లభించినవి. 
తరుణి హాస స్పర్శ మహిమ నిరూపితము అవుతూనే ఉంది, 
సదా 

***        ***        *** 

నీ అధరాలలోన దర హాసం పులకరించింది 
నీ కనుకొలకుల 'అలుక ' కులుకుగ తా పవ్వళించిందోహో!. 
కినుకకు మెలకువ వస్తే,అది నాకు 'కానుక 
రాకుంటే,,, 
అది,ఈ కవితా అసిధారా వ్రతమ్మునకు 
అమూల్యమౌ బహుమతి. 

***        ***        *** 

ద్రాక్ష గుత్తిని పట్టి,పండు నొకటొకటే 
కొసరుగా తింటూన్నది , 
దరహాస లావణ్యములు విరియుచూ చెలియ. 
నల్లని రేయిలో,తెల్లని జాబిల్లి,అటు వేపున, 

సుదతీ! 
నీ 'తెలి నగవు నింగి ' పైన 
నీలి ద్రాక్ష ఫలముల జాబిల్లులు,ఇచ్చట, 
ఉపమాలంకరమ్ముల వ్యత్యస్తము కూడ 
కోండొకచో శోభిల్లును, చిత్రమే!


''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''

వీణా రవళి


బ్రహ్మ లోకము నుండి 
స్వప్న పల్యంకికలో 
శ్రీ వాణి "కచ్చపి" వీణియాను 
కిన్నెరలు తెచ్చారు. 
బింభాధరి పెదవి పైన 
కదలాడెడు మధు హాసము 
నిదుర మబ్బు వీచికలలో 
సుతారముగ, సుతి మెత్తగ 
తియ తీయగ విన వచ్చెను. 
సంగీత శాస్త్రమందున 
నూతన ఒరవడుల కిపుడె 
శ్రీకారము చుట్ట బడెను. 
కొంగ్రొత్త శృతులు,గమకములను నేర్చిన 
గమ్మత్తు గీర్వాణముతో 
"కచ్చపి" దరహాసమ్ముతొ 
శ్రీ శారదాంబనలరించగ 
మరాళమ్ముపైన తాను 
వయ్యారముగా వెడలెను!


బ్రహ్మ లోకము నుండి 
స్వప్న పల్యంకికలో 
శ్రీ వాణి "కచ్చపి" వీణియాను 
కిన్నెరలు తెచ్చారు. 
బింభాధరి పెదవి పైన 
కదలాడెడు మధు హాసము 
నిదుర మబ్బు వీచికలలో 
సుతారముగ, సుతి మెత్తగ 
తియ తీయగ విన వచ్చెను. 
సంగీత శాస్త్రమందున 
నూతన ఒరవడుల కిపుడె 
శ్రీకారము చుట్ట బడెను. 
కొంగ్రొత్త శృతులు,గమకములను నేర్చిన 
గమ్మత్తు గీర్వాణముతో 
"కచ్చపి" దరహాసమ్ముతొ 
శ్రీ శారదాంబనలరించగ 
మరాళమ్ముపైన తాను 
వయ్యారముగా వెడలెను!

సువర్ణ ప్రాకారము


కువలయ దళ నేత్రీ! 
నీ దృక్కులు 
రమణీయతకు నెలవు లైనాయి. 
నీ కన్నులు 
కమనీయతకు భాష్యాలు 
ఐనాయి 
నీ కదలికలు 
కవనానికి నిర్వచనాలైనాయి 
కోమలీ! 
నీ క్రీగంటి చూపు 
నా తపో దీక్షా గగన హర్మ్యానికి 
సువర్ణ ప్రాకారమైనది.


''''''''''''''''''''''''''''''''''''''''''''''''''

ఆసీనులునారీ మణీ! 
నింగిని వీడి వచ్చేసాయి 
క్రొక్కారు మెరుపులు . 
అవి మరల తమ స్వదేశానికి 
"మరలి వెడలడానికి 
తిరస్కరించాయి. 
రావడం,రావడమే 
నీ చిరు నగవులలో 
తిస్ఠ వేశాయి 
ఆ సౌదామినులు. 
'ఇంత సురక్షితమైన 
సొగసు వన్నెల 'సీమయే' 
దొరికిన తర్వాత 
ఈ సుస్థిర స్థానాన్ని 
వదులు కుంటాయా,అవి!!!??? !!

Thursday, April 23, 2009

వయోజన విద్యిల్లు

రాత్రి బడికి వెళదాము ; '''''''''''''''''' పగలంతా పొలంలోన చాకిరీతొ అలిశావు ; ఓ అన్నా!రా!రా!రా! రాత్రి బడికి పోదాము వేగిరంగ రా!రా!రా! // రంగు పొంగు పతంగీలా; లల్లాయ్ పల్లాయిగాను ; కాలాన్ని వృధాగాను గడిపేసే తమ్ముళ్ళూ,చెల్లెళ్ళూ ; రండి!రండి! రాత్రి బడికి ;
చల్లంగా జారుకుంటే; ఊరుకోను!ఊరుకోను! // టింగు రంగ మంటు సిలుకు పావడాలు కట్టుకునీ ; అచ్చన గాయలు ఆడే ఆడ పడుచులారా! ఇటు చూపులు తిప్పండి! ;
వయోజన విద్యిల్లు * పిలుస్తోంది,అందరినీ ; సత్వరమే రండి!రండి! చదువులే మన ఆస్థి అగును // ''''' [విద్య+ఇల్లు] ''''''''''''''''''''''''''''''''''

బహు ముఖ ప్రజ్ఞా శాలి - వరాహ మిహిరుడుక్రీ. శ. 499 నాటి వాడైన "వరాహ మిహిరు" ని అద్భుత దార్శనిక, ఖగోళ పరిశోధనలు మన భారత దేశమునకే గర్వకారణము. వరాహ మిహిరుడు ఉజ్జయినీ సమీపములోని "కాంపిల్య పట్టణము" లో జన్మించాడు. ఈతని తండ్రి పేరు "ఆదిత్య దాసుడు".

వరాహ మిహిరునికి ఆదిత్య దాసు బాల్యమునుండే జ్యోతిష్యములో జిజ్ఞాసను కలిగించాడు.
"లఘు జాతకము, బృహజ్జాతకము, బృహత్ సంహిత, వివాహ పటలము, యోగ యాత్ర, పంచ సిద్ధాంతిక"అనే అయిదు మహా గ్రంధాలను రచించాడు వరాహ మిహిరుడు. వీనిలో "వివాహ పటలము, యోగ యాత్ర"లు దొరకలేదు. అవి నేడు అనుపలబ్ధ్యములు!

"ప్రాచీనులు రచించిన గ్రంధములను నేను ఆమూలాగ్రమూ పఠించాను. ఆ విజ్ఞానముతోనే, నేను ఈ గ్రంధములను వెలయించాను" అని వినమ్రముగా చెప్పాడు అతను.
"సారస్వత మహాముని, ప్రజా పతి మనువు వాక్కులను గ్రంథస్థం చేస్తున్నాన"ని వరాహ మిహిరుడు చెప్పాడు.

తన పూర్వీకుల అమూల్యమైన విజ్ఞాన సంపదలను, తన తర్వాతి తరాల వారికి అందించే బృహత్ బాధ్యతలను, తన భుజ స్కంధాల మీద మోసిన ధన్య మూర్తి వరాహ మిహిరుడు.

ఆతని గ్రంథస్త విశేషాల పట్టిక

1. పంచ సిద్ధాంతిక - కొన్ని రకాల సాధారణ యంత్రాలను గూర్చిన వివరణలు, భూగోళమునకు సంబంధించిన విశేషాలు.

ఇందు లోని 13 వ అధ్యాయము
"త్రైలోక్య స్థానము". "రెండు అయస్కాంతాల మధ్య లోహ శకలము వలె ఏ ఆధారమూ లేకుండానే తారా గణమూ అనే పంజరములో భూగోళము పరిభ్రమించు చున్నది" అని నిర్వచనము నిచ్చాడు. టెలిస్కోపు వంటి ఘనమైన శక్తివంత పరికరాలేమీ లేని ఆ రోజుల్లోనే, ఈ అత్యద్భుత ప్రాకృతిక విశేషాలను లోకానికి అందించిన మేధావి వరాహ మిహిరుడు.

2. బృహత్ సంహిత - ఒక్కో అధ్యాయము చొప్పున 105 విషయాలకు విపులీకరణ.

అనేక ప్రపంచ భాషలలోనికి అనువాదము చేయ బడిన ఉద్గ్రంధము ఇది. ఈ సంహిత లో
  • సృష్టి ,తారా ,గ్రహ చలనాలు, ఋతువులు, ఉల్కా,హరి విల్లు వంటివి ప్రభవించుటకు గల హేతువులు, సూర్య, చంద్ర , గ్రహచలనాల వలన, వాని సంచారాల వలన, భూమిపైన ప్రాణులకు కలిగే సత్ప్రభావాలు, దుష్ప్రభావాలు.

  • వాస్తు ప్రకరణము -ఇళ్ళను ఎలాంటీ స్థలములలో కట్టుకో వచ్చును? ఎలాంటి కలపను వాడాలి లాంటి నేటి సైన్సులో నిరూపితమైన అంశాలతో ఆ నాడే మన దోసిట్లో పెట్టాడు అతను.
3. బృహజాతకము - ఇది అందరినీ ఆకర్షించే గ్రంధము.

మానవుని పూర్వ జన్మలు, అనేక జన్మ విశేషాలను పొందు పరిచాడు. సంజ్ఞలు(ప్రతీకలు), గుర్తులతో నిర్మిచిన శాస్త్ర గ్రంధ రాజము ఇది. మనుష్యులు ఎక్కడ, ఎలాగ జన్మిస్తారు? వారి ఆకారాలు,
స్వరూప, స్వభావాలు నిర్ణీత పద్ధతిలో నిర్మించ బడుతాయని , నిరూపిస్తున్న సిద్ధాంత పరంపరలు ఈ పుస్తకము ఆతని అసామాన్య ప్రతిభకు నిదర్శనము.

4. లఘు జాతకము:

పై
"బృహత్ జాతకమునకు" సంక్షిప్తీకరణముగా విరచించ బడిన పొత్తము ఇది. "బృహత్ జాతకము" ను మేధావులు మాత్రమే అర్ధము చేసుకొన గలరు. అదీ గాక ఇది గ్రంధ విస్తృతీలో చాలా పెద్దది. అందు చేతనే, సాధారణ ప్రజలకు సులభ గ్రాహ్యముగా, అందు బాటులో ఉంచే ప్రయత్నమే ఈ "లఘు జాతకము" . ఈ క్లుప్తీకరణ, విద్యార్ధులకు "ప్రాధమిక అవగాహనాను కలిగించగల అనుబంధ గ్రంధము"అని పేర్కొన వచ్చును.

మహా మేధావి వరాహ మిహిరుని గురించిన మరిన్ని విశేషాలను మళ్ళి తెలుసుకుందాము.


వరాహ మిహిరుడు - భౌగోళిక పరిశీలనక్రీ. శ. 499 వ సంవత్సరము నాటికే, భూమి అంతర్గత పొరలను గూర్చి వివరించిన మేధావి వరాహ మిహిరుడు. భూమి లోపల ఏ యే లోహాలు, ఎక్కడెక్కడ దొరుకుతాయో, గుర్తు పట్టడానికి వెలువరించిన అనేక కొండ గుర్తులు ఆచరణ యోగ్యమైనవే!

కొన్ని ఉదాహరణలను పరికించుదాము.....

కాటుక పిట్ట వలన ఆనవాళ్ళు:
1) కాటుక పిట్ట సంగమించిన చోట "నిధి" దొరుకుతుంది.

2) కాటుక పిట్ట త్రొక్కిన చోట "అభ్రకము" దొరుకుతుంది.

3) కాటుక పిట్ట మలవిసర్జన చేసిన చోట "బొగ్గులు" లభిస్తాయి.
ఇలాగే భూమి లోపలి పొరలలో నీరు, మంచి నీళ్ళు ఎంతెంత లోతులో ఉంటాయో కనుగొనేందుకు ఆతడు గైకొన్న ఆధారాలను గమనిస్తే సంభ్రమాశ్చర్యాలకు లోను ఔతారు.

అధికముగా మొక్కలు, పొదలూ మొలిచిన చోట్లు; చెట్లు, చేమలు ఉన్నచోట్లు ఆతని గవేషణకు మూలాధారాలు ఐనాయి. (నేడు వనాలు, చెట్లు ఛిన్నాభిన్నమౌతున్నాయి. అత్యాశా పరుల చేతుల్లో ప్రకృతి మాతకు రక్షణ ఏదీ? ఆనాడు వరాహ మిహిరుడు సూచించిన తరు, పశు, పక్ష్యాదులను వీక్షించాలంటే, భూతద్దమును పట్టుకుని బయలు దేరాల్సిందే కదా!)

తీయని మంచి నీళ్ళు దొరికే ప్రదేశాలను గుర్తించేందుకు ఉదాహృతమైన వరాహ మిహిరుని పరిశోధనలు కొన్ని:
1) నీలి మందు చెట్టు దగ్గర పాము పుట్ట గనుక ఉన్నచో, ఆ పుట్టకు దక్షిణ దిక్కు వైపుగా 'రెండున్నరగజాల' దూరములో, 'ఎనిమిదిన్నర గజాల' లోతున త్రాగడానికి యోగ్యమైన మంచి నీళ్ళు లభిస్తాయి.
2)“జంబూ వృక్షస్య ప్రాక్ వల్మీకో యది భవేత్ సమీపస్థఃత్ ,
అస్మాత్ దక్షిణ పార్శ్వే సలిలం పురుష్వయే సాధు”
అనగా - నిర్జల ప్రదేశంలో ఉన్న నేరేడు చెట్టుకు
తూర్పు దిక్కులో పుట్ట ఉండి ఉంటే,
దానికి దగ్గర్లో దక్షిణ దిశలో
2 పురుష ప్రమాణముల( 10 అడుగులు) లోతునందు తవ్వితే
అక్కడ అతి తీయని(sweet) జలనాడి ఉంటుంది -
అని నమ్మకంగా నుడివాడు వరాహమిహిరుడు.
వరాహమిహిరుడు ఎఱుక పరిచిన ఖగోళ దృశ్య విశేషాలలో కొన్ని:
1) సప్తర్షి మండలానికి, చక్ర భ్రమణము కలదు.

2)సూర్య గోళములో 33 మచ్చలు ఉన్నాయి. అవి రాహువు, కేతువు, తామస అగ్ని కీలలు.
అలనాడు వరాహ మిహిరుడు తెలిపిన భవిష్యత్ వాణిని తిలకించండి.
1) వాయు ప్రకోపితాల వలన సౌరాష్ట్ర, మగధ దేశాలలో భూకంపాలు సంభవిస్తాయి.

2) గురువు, శని గ్రహాలు రెండూ ఒకే నక్షత్ర దిశా స్థానములో వెలుస్తున్నాయి, అందు చేత క్రీ. శ. 1970 లలో (అనగా అక్టోబరు, నవంబరు లలో) పుర ప్రభేదములలో అంతర్యుద్ధాలు సంభవిస్తాయి.
ఉగాది ఎప్పుడు?

భారతీయులందరూ ఆప్యాయతతో చేసుకునే పండుగ "ఉగాది" .
కొత్త సంవత్సరమును ఉగాది పండుగగా ఆహ్వానిస్తున్నాము.
మరి ఈ ఉగాది నీ ఏ సమయములో నిర్ధారణ చేయాలి?
"బ్రహ్మాది యుగాది కృత్"
"బ్రహ్మ యుగావర్తః "
అనగా అది "వసంత విషువత్ కాలము"
ఈ నిర్ణయములో ఎంతో అనుకూలత,
భౌగోళిక పరిశీలనచే నెలకొల్పినదగుటచే,
ఎంతో సామంజస్యము కలిగి ఉన్నది.

ఈ రీతిగా వసంత కాలమును, ఉగాది
అని వరాహ మిహిరుడు నిర్దేశించిన స్వచ్ఛమైన నిశ్చయమైన నిర్ణయ,
ప్రజలచే ఆమోదించబడి,ఆచరించ బడుచున్నది కదా!
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

మేధినిలో వెలిసినాడు


మేధినిలో వెలిసినాడు !

By kadambari piduri, Jan 11 2009 7:59PM


మేధినిలో వెలిసినాడు అందాల రాయుడు! 
గోవిందుడు! శ్రీ గోవిందుడు! 

ఆటలాడుతాం! నాట్యాలు, నటనమాడుతాం! 
ఆనంద మూర్తి , నీ లీలలు చూపుటకే ఉల్లసిల్లు 
నీ ఆటలు -ఈ ఆటలు ధన్యమైనవి! 

పాట పాడుతాం! - కృతి, భజనల కీర్తించుతాం! 
శ్రీకాంతు లాస్య హేల లీలలను వినుతించుట చేతనే 
ఈ పాటలు సార్థకమ్ములైనవి! 


Views (123)

గోవింద నామము!


గోవింద నామము!పరి పరి విధముల - పది దిక్కులలో 
పదే పదే పరివ్యాప్తిగ - ఉన్నది 
అదియే! అదియే! గోవింద నామము! 
ఆరాధనీయము! సంపూజ్య తేజము! 

1)కన్నులకు కట్టినట్లు - కానవచ్చు వైభవమై 
భవమునందు భావమై - తనరు భవ్య దవనము! 
నెనరు భువన భవనము ! - కవనమునకు ఆలంబనము 

గూడు కట్టుకున్నవి - గుండెలలో మోదములు 
ముదములన్ని మేదినిలో -ఆమోదమైన జ్యోత్స్నలు 
సాంద్ర పూర్ణ చంద్రికలు - మేని భక్తి పులకింతల వెలుగులు 

Views (115)

మనసే గుడిగా మారినవేళ

(పల్లవి ) 
నిలకడగా ఉంటే 
ఇది"మది"ఔతుందా! 
నెమ్మది ఎరుకకువస్తే 
     
         గుడిఔతుందా!       స్వామి గుడిఔతుందా?
                       
      / |నిలకడగాఉంటే||

   
 ఉల్లసిల్లు మానసమే 
      సరోవరమాయెను 
 ఎల్ల వేళలందు; 
      అందు హంసము      తిరుగాడును 
  భక్తి హంసము            తిరుగాడును 
     ||నిలకడగా ఉంటే|| 


తిరుమలేశుకారుణ్యము 
ఎల్లలేమి ఎరుగనిది! 
ఎల్లెడలా, 
ఎల్ల వేళలందున 
     వెదజల్లెడు కౌముది! 
     పరిమళాల కౌముది! 
         ||నిలకడగాఉంటే|| 
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;


Views (112)
(పల్లవి ) 
నిలకడగా ఉంటే 
ఇది "మది" ఔతుందా! 
నెమ్మది ఎరుకకు వస్తే 
           గుడి ఔతుందా?! 
           స్వామి గుడి ఔతుందా? 
                         ||నిలకడగా ఉంటే||   
 ఉల్లసిల్లు మానసమే 
 సరోవరమాయెను 
 ఎల్ల వేళలందు; అందు 
               హంసము తిరుగాడును 
               భక్తి హంసము తిరుగాడును 
                         ||నిలకడగా ఉంటే|| 

తిరుమలేశు కారుణ్యము 
ఎల్లలేమి ఎరుగనిది! 
ఎల్లెడలా, 
ఎల్ల వేళలందున 
         వెదజల్లెడు కౌముది! 
         పరిమళాల కౌముది! 
                        ||నిలకడగా ఉంటే|| 


Views (112) | 


తిరుమలేశు సేవలలో


తిరుమలేశు సేవలలో !

(kavita) ;;;;;;

పల్లవి శంఖ ,చక్ర, కౌమోదకి 
నందక, మోహన మురళీ ధారీ! 

అనుపల్లవి 
ఇరు మూలల -
దశ దిశలలో నళినాక్షా! 
నీ కలువ కనుల కోమలమౌ వీక్షణాలు 
ఇటు ప్రసరించిన క్షణాలు! ఈ క్షణాలు! 
ఇంతె చాలునయ్యా!
ఇదే చిన్ని ఆశ! 
ఇది చాలును !చాలును! 

1)పొగ మంచు తెరల కావల నొక 
మిణుకు తార సరళి జ్యోతి 
కన్నులారగా నేను తిలకించాలని ఆశ! 
చిన్ని ఆశ! ఇంతే! 

2)నిదుర మబ్బు కలలన్నీ, 
స్వామి ఊసునందు 
హాయి చెమ్మగిల్ల వలెనంటూ 
ఆ వానలలో తనివారా ఎల్లరమూ 
తడవాలని చిన్ని ఆశ! అంతే! 

3) పూలలోని పరాగపు-చిన్ని రేణువుగ 
నేను తిరుమలేశు సేవలలో 
తరియించిన చాలుననే
                     ఇంపైన ఆశ! అంతే! 


Views (69) 

బిరాన చేరాలి!

బిరాన చేరాలి!

పల్లవి 

ఏడు కొండల స్వామి వెంకన్న!వెంకన్న! 

అను పల్లవి 

ఏడు గడ రక్ష రేకు - నీకు,నాకు,మనకున్నూ! 
ఈ మాట నిజమన్నా! ఔనన్నా! ఒట్టన్నా! 

1)కొండ కొమ్మున నెలవు -సిరి నాధుని కొలువు 
లంఘనమే నడకగా-కాలి నడకలే పరుగులుగా 
లంఘనములై, పరుగులయీ 
పద! పద! పద! బిరాన!అప్పుడు ... 
కోరస్ 
సిరి వెన్నెల మన-పదాల మెత్తలేగద!ఔనన్నా! 

2)తిరుమల కోవెల దాకా-నెలకొన్న పూల చెండ్లు 
శ్రీ కన్నయ్య అడుగులే! స్వామి అడుగు జాడల 
సిరి వెన్నెలాలే జల్లులా -పూతలే మెత్తలగును 
పద, పద, పద! బిరాన! 

కోరస్ 
పల్లె జాన పదాల -నెత్తావులు పరచేను! 
తద్ధిమి ధిమి, తద్ధిమి ధిమి!- కోలాటాలాడుతూ 
చిందులనే వేయుచూ - తిరుమల వాసుని కొలువుకు 
పద, పద, పద! బిరాన! 

Views (93) | 

దివ్యకరుణా సురభిళ నిధానమా!దివ్యకరుణా సురభిళ నిధానమా!

kadambari piduri

 
ఏలే!ఏలే! వెన్నెలా! లవంగ తోటల 
ఏలో! ఏలో !వెన్నెలా! వెన్నెలా! 

1)మాలా! మాలా! మల్లెలా! 
మొల్ల,చేమంతి "ముల్లె"లా 
ఏలో! ఏలో! వెన్నెలా!వెన్నెలా! 

2)వకుళ, పొగడ, పొన్నల 
గున్న మావి తోపుల 
ఏలో! ఏలో! వెన్నెలా! వెన్నెలా! 

3)మేలోయ్! మేలోయ్! మేఖల! 
తొలకరి మబ్బుల నీలాల! 
ఏలో! ఏలోయ్! వెన్నెలా! వెన్నెలా! 

4) నీఈవు, నీవోయ్! వానల 
ఏరువాకల తేనెల 
చిరు నవ్వుల జారే వెన్నెల! 
స్వామి చిరు నవ్వుల జారే వెన్నెల! 

5)నేను,నేనో మంచుల 
"అహమిక" జారిన తెమ్మెర! 
తెరలు మలిగిన వేళల 
మంచు ;తెరలే కరిగిన వేళల 
నీవే నేను ఓ స్వామీ! 
ఏడు కొండల వేంకట రమణా! 

(కోరస్) 
"అహమ్ బ్రహ్మోస్మి! 
త్వమేవాహమ్! 
దివ్యకరుణా సురభిళ నిధానమా! 


Views (86)