Wednesday, March 10, 2010

చల్లగా చూడవయా !
మనుజాళి నీ అనుగు బిడ్డలే గాన
నీ కనుపాపలో దాచి - కాచుకోవయ్యా! ||

విను వీధి గోళములు - విశ్వ కాంతులతో
అనువైన సీమగా - నీ నేత్ర ద్వయమును
ఎంచుకుని అందునే తిష్ఠ వేసాయిర స్వామి!
చినుకంత ఈ నీ దృక్కు - జగమంత వెలుగులే! ||

విల్లు పూవుల దొరకు - జనకుడవు నీవయ్య!
ఎల్ల లోకములకు - మానికపు అయ్యవు !
కొల్లలుగ కానుకలు - ఏమీయ గలము?
ఉల్లముల నిండుగా - మా భక్తి శ్రద్ధలు ||


&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
Kovela

చల్లగా చూడవయా

By kadambari piduri, Feb 18 2010 9:13AM

No comments:

Post a Comment