Wednesday, March 17, 2010

కథలకు లోగిళ్ళు





















జగముల ఏలిక కన్నయ్య –వగలొలికే భామా మణికీ
వగరు ఊసుల తొగరుల ముచ్చట్లు – వీనుల విందులు ఓ యమ్మా! ||

జగడము లుత్తుత్తి ప్రణయ కలహాలు – ముజ్జగ యానపు నారద మౌనికి
తెగ పని కల్పన – మహతికి త్రుళ్ళింత - వీనుల విందులు ఓ యమ్మా! ||

గగనపు నీలము స్వంత దారుడు – మగ నాలు రాధలో సగ భాగమయేను
భగవంతుడు భక్తుల దాసుడు నిత్యము -కన్నుల పంటలు ఓ యమ్మా! ||

అగపడడాతడు కన్ను దోయికి – ఖగ, రజ వాహను ( ని ) దాగుడు మూతలు
నగవుల నాట్యము, లలిత కళలకు ,కేంద్రము ,కనుకనె కమనీయములు
కమ్మని కథల లోగిళ్ళు – ఇమ్ముగ మనకు దక్కినవి ఓ యమ్మా! ||


Kovela

కథలకు లోగిళ్ళు
By kadambari piduri, Mar 9 2010 5:05AM

No comments:

Post a Comment