Wednesday, March 3, 2010

అందం ఆనందం
తోటలొ పూవులు అందం
పూల పరిమళములు ఆనందం

వన్నెల వాలే ఉషా కాంతులు
జగతికి ఒసగే ' మెలకువ ' అందం, ఆనందం.

కొమ్మల వాలే పక్షులు అందం
నీడను ఒసగే చెట్లు అందము.

ఆకుల, పైరుల పచ్చ దనాలు
ప్రకృతి కొసగే శోభలు అందం, ఆనందం.

చెమ్మ చెక్కలు, చారెడు మొగ్గలు
ఒప్పుల కుప్పల ఆటలు అందం.
క్రికెట్టు, హాకీ, కేరంసు
చెస్సు,పజిల్సు అన్నీ అందం!

ఆటల పాటల సందడి వలన
అందరి నవ్వుల స్నేహం, మైత్రి
అందం, ఆనందం.


&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&


Baala

అందం ఆనందం

By kadambari piduri, Feb 25 2010 7:03PM

No comments:

Post a Comment