Saturday, March 27, 2010

ఉలి అక్కరలేని చలన శిల్పమై!

కేళీ విలాసా! మా ఇహ పరముల దైవమా!
మోహన వంశీ కృష్ణ! అహరహమూ నీ ధ్యాస -
ఆ బాల గోపాలమునకు జగమున, కనుగొనవో!???? ||

నీ ఫ్రతి అడుగు నాట్యము
ఫ్రతి చలనము హృద్యము
కళామతల్లి వలిపెములో
అపూర్వ ప్రభా రాసులు ||

వేణువు రవళించు చోట
వినోదముల ప్రవచనములు
లోలాయమాన క్రీడలు
లాలించు పలుకు గానములు ||

లలిత కళా సోపానము
లల్లిబిల్లి నర్తనములు
ఉలి అక్కరలేని చలన
శిల్పమైనదిట పల్లె ! -
మా వ్రేపల్లె ||

&&&&&&&&&&&&&&&&&&&&&&&&
Kovela

ఉలి అక్కరలేని చలన శిల్పమై!

By kadambari piduri, Mar 20 2010 7:54AM

No comments:

Post a Comment