Saturday, September 15, 2018

బలభద్ర పాత్రునిదె అంతా భారం

మళ్ళీ ఘర్షణ క్రిష్ణయ్య ; 
అన్న తోటి ఇటు - మళ్ళీ మళ్ళీ ; - 
కృష్ణ ;- 
నేను మన్ను తింటినని చాడీలు ; 
ఆపకుండగా చెబ్తుండడము పరిపాటి ; 
నీకు భలే అలవాటు, ఓ అన్నా,
నీకిది సతతం సతాయింపులే!
బలరామ ;- 
ఐతేనేమి, నిఖిల విశ్వములు నీ వదనమున ; 
చూపిన జాలము నీదేను ; 
తరియించెనులే యశోద మాత ;
మన యశోద మాత ; || 
కృష్ణ ;- 
జగతి కోసమా నీ చింత!? 
ఆదిశేషు అపర అవతారము నీవు ; 
అందుకె ఇవిగో లోకములు ; 
నీ శిరసున పెట్టేస్తున్నాను ; 
ఇకపై అంతా నీదే భారం ; 
సహస్రఫణాళి క్షీరాబ్ధివాసీ! నేటి కిప్పటికి - నా అన్నా! 
బలభద్ర పాత్రుని రూపమున ; 
అలరారేటి సోదరుడా! ఇవిగో కొనుమా, 
బుజబుజ రేకుల ఇంపు ముద్దులు ;  ||                 

పాట - 2 ; 
============================;
paaTa - 2 ;- 
maLLI gharshaNa krishNayya ; 
anna tOTi iTu - maLLI maLLI ;
kRshNa ;- nEnu mannu timTinani caaDIlu ; 
aapakumDagaa cebtumDaDamu paripaaTi ; 
neeku bhalE alawaaTu ;
O annaa,neekidi satatam sataayimpulE!
balaraama ;- aitEnEmi, 
nikhila wiSwamulu nee wadanamuna ; cuupina 
jaalamu needEnu ; tariyimcenulE yaSOda mAta ; ||
;
kRshNa ;- jagati kOsamaa nee cimta!? 
aadiSEshu apara awataaramu neewu ; 
amduke iwigO lOkamulu ; 
nee Sirasuna peTTEstunnaanu ; 
ikapai amtaa needE bhaaram ; 
sahasraphaNALi ksheeraabdhiwaasee! ; 
nETi kippaTiki - naa annaa! 
balabhadra paatruni ruupamuna ; 
alaraarETi sOdaruDA! iwigO konumaa,
bujabuja rEkula impu muddulu ;  || 

No comments:

Post a Comment