Showing posts with label new Krishna sings. Show all posts
Showing posts with label new Krishna sings. Show all posts

Wednesday, December 19, 2018

అల్లిబిల్లి జాబిల్లి ఆశలు

బుల్లి బుల్లి ఆశలు చందమామకు ;
మన అల్లిబిల్లి జాబిలికి ;  ||
;
పొన్నచెట్టు, కొమ్మలలో దాగినాడు క్రిష్ణుడు; 
నిలువెల్లా క్రిష్ణమ్మను చూడాలని ;
చెప్పలేని తహతహలు జాబిల్లికి ;  ||
;
రేపల్లెల గోపెమ్మల కొంగులందు 
దోబూచి ఆటలాడు క్రిష్ణయ్య ;
తనతోటి కూడా ఆడాలని :
చెప్పలేని తహతహలు జాబిల్లికి ;  ||
;
===============,
;
bulli bulli ASalu camdamaamaku ;
mana allibilli jaabiliki ;  ||
;
ponnacheTTu, kommalalO ;
daaginaaDu krishNuDu; 
niluwellaa krishNammanu cuuDAlani ; 
ceppalEni tahatahalu jaabilliki ; ||
;
rEpallela gOpemmala komgulamdu ;
dObUchi ATalADDu krishNayya ; 
tana tOTi kUDA ADAlani :
ceppalEni tahatahalu jaabilliki ; ||
;
Wednesday, October 15, 2014 ;-  వెన్నెలల చందనాల బొమ్మలు ;-
;
చందమామ తెచ్చెనమ్మ చందనాల వెన్నెలలు
వెన్నెలల చందనాల హత్తుకున్న బొమ్మలు
అవి ఎవ్వరివమ్మా? అవి ఎవ్వరివమ్మా? ; ||చందమామ ||                    

మిత్రులను వెక్కిరించి, అన్నయ్యను గోకి          
పొన్నచెట్టు కొమ్మలలో దాగినాడు క్రిష్ణుడు        
పొదరిళ్ళలోన నక్కినక్కి నవ్వేటి క్రిష్ణుని                                            
తనివితీర చూడాలని తహతహలా జాబిలికి ; ||చందమామ ||                          

"అల్లరి మానాలంటూ" ఆకతాయి క్రిష్ణుని                   
తల్లి జనని యశోదమ్మ తర్జనిని చూపించి                    
రేపల్లెల గోపెమ్మల కొంగులందు దోబూచి      
ఆటలాడ తనతోటి తహతహలు జాబిల్లికి ; ||చందమామ ||

యమున అలల నేస్తాలతొ, ఈదులాటలో నేర్పరి           
నీలినీలి కెరటాలలొ కాళీయుని వేదిక పై  
రస తాండవమాడేటీ నీలమోహన కృష్ణుని                                 
తనివితీర చూడాలని తహతహలు జాబిల్లికి; ||చందమామ ||
***********************,  ; 
;
అల్లిబిల్లి జాబిల్లి బుల్లి ఆశలు ; Link ;- 1 ;;
చందమామ తెచ్చెనమ్మ ...  ; Link - 2 ;
Email User Rating:  / 1  ;
Member Categories ;- బాల ;
Written by kusuma kumari ;
Tuesday, 07 October 2014 10:03

Hits: 1559
= allibilli jaabilli bulli ASalu ;

Thursday, November 8, 2018

తిండి తిప్పలు మరచును తాను

చూపువేలు  చూపుచుండె  తల్లి యశోదమ్మ 
చూపుడు వేలు  చూపుచుండె  మా తల్లి యశోదమ్మ;
నంద గోకులములోన, జనని యశోద ;  ||
;
వెన్న జున్నులే తిండి - ఎన్నడిటుల చూడ లేదు ; 
ఎరుగమమ్మ ఇట్టి గోల !? వేలెడంత లేడు గాని  ; 
చిడు ముడుల పెట్టు మమ్ము ; పిల్లడేన ఎట్టెదుటను ; 
వేగలేకున్నాను, అని తర్జని చూపుచుండె తల్లి యశోద  ;  ||

అన్నమింత చవి చూడడు ; వెన్న, జున్నులే తిండి ; 
అటు అటుకులు - ఇటు చిటికెలతో చాలును తనకు మైత్రి ; 
చిటికెడంత స్నేహానికి - అన్ని ధారపోసేను ;
ఆకలి దప్పులు తెలియవు - ఏమి చేయగల దానను - 
;
అని తల్లడిల్లు మాతను గని, 
కన్నని నవ్వుల సౌరభమ్ముల ;
విశ్వమెల్లెడలను పరివ్యాపించు ;  || 
;
=====================;  
;
tarjani cuupucumDe yaSOda ; tarjani cuupucumDe ;
namda gOkulamulOna, janani yaSOda ;  ||
;
wenna junnulE timDi - ennaDiTula cUDa lEdu ; 
erugamamma iTTi gOla !? wEleDamta lEDu gaani  ; 
ciDu muDula peTTu mammu ; pillaDEna eTTeduTanu ; 
wEgalEkunnaanu, ani tarjani cuupucumDe talli yaSOda  ;  ||

annamimta cawi cUDaDu ; wenna, junnulE timDi ; 
aTu aTukulu - iTu ciTikelatO caalunu tanaku maitri 
ciTikeDamta snEhaaniki - anni dhaarapOsEnu ;
aakali dappulu teliyawu - Emi cEyagala daananu - 
;
ani tallaDillu maatanu gani, 
kannani nawwula saurabhammulu ;
wiSwamelleDalanu pariwyaapimcu ;  ||

Wednesday, November 7, 2018

బాల వినోదం వినోదమే

అమ్మ ప్రేమ మరిగినాడు 
మా బాల గోవిందుడు ;
ఇక అంతయునూ వినోదమే! ;
అంతటా వినోదమే! ; ||
;
మట్టిలోన పొర్లి పొర్లి ;
ఒళ్ళంతా మురికి మురికి ;
నోటినిండ - బొక్కిన చిత్తడి మిత్తియే కదా!
మోహన క్రిష్ణుని కెంపు పెదవులంతా ;
తను బొక్కిన చిత్తడి మిత్తియే ;  ||
;
"హన్న, మన్ను విందు - ఛి ఛీ, మాను మింక." ; 
అలవి కాని అల్లరి కిట్టయ్యది ;
అమ్మ యశోదమ్మ చేతిలో చెవి ;
తుంటరి కృష్ణమ్మది ఆ చెవి ;
మాయి యశోదమ్మ, 
వాని చెవులు నులిమి ; 
కన్నులెర్ర జేయునమ్మ ; 
;
"అబ్బ, నొప్పి ; అమ్మా!
 మెలి బెట్టకుమీ చెవులను ;
నేనేల తిందునమ్మా! ;
నేను నేల మన్నునేల నేను తింటాను ;
అంటే అమ్మ ఎపుడు  నమ్మదే ; ||
;
తర్జనినే చూపింది నందుని ఇల్లాలు ;
మోకు తాడు తెచ్చింది ;
తర్జనభర్జనలు లేక ;
పెద్ద రోలుకి కట్టేసింది ;
అమ్మ ప్రేమను మరిగిన దామోదరునికి ;
అంతా వినోదమే! ; ||
;
మద్ది చెట్లు కూల్చి, శాపము మాన్పిన రీతి ;
మట్టి తినుట నెపమిది ; 
బ్రహ్మాండం, విశ్వాంతరాళములు ; 
చిన్ని వదనమందు కనిన అమ్మ ; 
బేల అయ్యె, అయ్యారే! ;
హేలగ బేల యశోదమ్మ అఖిల సౌభాగ్యవతి ; || 
;
==========================;
;
amma prEma mariginaaDu 
maa baala gOwimduDu ;
ika amtayunuu winOdamE! ;
amtaTaa winOdamE! ; ||
;
maTTilOna porli porli ;
oLLamtaa muriki muriki ;
nOTinimDa - bokkina cittaDi mittiyE kadA!
mOhana krishNuni kempu pedawulamtaa ;
tanu bokkina cittaDi mittiyE ;  ||
;
"hanna, mannu wimdu - Ci CI, maanu mimka." ; 
alawi kaani allari kiTTayyadi ;
amma yaSOdamma cEtilO cewi ;
tumTari kRshNammadi aa cewi ;
maayi yaSOdamma, 
waani cewulu nulimi ; 
kannulerra jEyunamma ;  
;
"abba, noppi ; ammaa! meli beTTakumee 

cewulanu ;
nEnEla timdunammaa! ;
nEnu nEla mannunEla nEnu tinTaanu ;
amTE amma epuDu  nammadE ; ||
;
tarjaninE cuupimdi namduni illaalu ;
mOku taaDu teccimdi ;
tarjanabharjanalu lEka ;
pedda rOluki kaTTEsimdi ;
amma prEmanu marigina daamOdaruniki ;
amtaa winOdamE! ; ||
;
maddi ceTlu kuulci ; SApamu maan pina reeti ;
maTTi tinuTa nepamidi ; 
brahmaamDam, wiSwaamtarALamulu ; 
cinni wadanamamdu kanina amma ; 
bEla ayye, ayyaarE! ;
hElaga bEla yaSOdamma akhila saubhaagyawati ; ||  
;

స్వామి సన్నిధిని పరిపూర్ణం

యమున ఉన్నది ; అలలను తేలే గాలి ఉన్నది  ; 
రాధ ఉన్నది ; ఇట రాధ ఉన్నది ; 
అవనీనాధుని రాకడ ఏదీ!? ;  || 
;
పున్నమ ఉన్నది - జాబిలి ఉన్నది ; 
పున్నమి జాబిలి వెన్నెల ఉన్నది ; 
స్వామి జాడ ఏదీ!?? ;  || 
;
కొమ్మల పళ్ళు ఉన్నవి -  
సొనలు చిప్పిలు  పళ్ళు ఉన్నవి - 
తోటల లతలు - లతాగ్రములున్నవి ; 
వన్నె చిన్నెల పూవులు ఉన్నవి ; 
స్వామి కానరాడేలనొ బేలా ;  || 
;
ఎదురు తెన్నుల పరిమళమ్ములు ; 
దిశలన్నింటా నిండి ఉన్నవి ; 
క్రిష్ణా! నీదు రాకతో సార్ధక్యం ; 
నీదు సన్నిధిని పరిపూర్ణం ; 
నిఖిలం పరిపుర్ణం - వేగ రాగదోయీ ;  || 
;
===================== ; 
;
yamuna unnadi - alalapayi tElE gaali unnadi  ; 
raadha unnadi - iTa raadha unnadi ; 
awani naadhuni  raakaDa Edee!? :  || 
;
punnama unnadi -  jaabili unnadi ; 
punnami jaabili wennela  unnadi ;
raadhika unnadi ; 
swaami jADa EdI!? ;  || 
;
kommala paLLu unnawi - 
sonalu cippilu paLLu unnawi ;
tOTala latalu - lataagramulu ;
wanne cinnela puuwulu unnawi 
swaami kaanaraaDE bElaa ;  ||
;
eduru tennula parimaLammulu ; 
diSalannimTaa nimDi unnawi ; 
krishNA! needu raakatO saardhakyam ; 
needu sannidhini paripurNam ;
sakalam kaLa kaLala nikhilam paripuurNam - 
wEga raagadOyI ;  || 
;

దుందుభి, ఢక్కా మోతలు

కూడా కూడా క్రిష్ణుడుండెను ; 
డుమ్ డుమ్ డుమ్ ;
ధన్ ధన్ ధన్ ;
దుందుభి ఢక్కా మ్రోగుచున్నవి ;
దిక్కులు ఎనిమిది పిక్కటిల్లగా ; ||
;
చెట్లు పుట్టలు, నీరూ గాలీ ;
నింగీ నేలా ; ప్రకృతి యావత్తూ ;
ఆనందముల ఒత్తులు గైకొని ;
జిగేల్ జిగేల్ మని వెలుగులీనును ; ||
;
కన్నయ్య జతలో ఉన్న చోట ; 
ఆములాగ్రం మహిత మేదినికి ;
వైభవమే, వైభోగమే ; 
సదా మహితమౌ వైభవమే ; ||

=================== ; ;
;
kUDA kUDA krishNuDumDenu ; 
Dumm Dumm Dumm ;
dhann dhann dhann ;
dumdubhi Dhakkaa mrOgucunnawi ;
dikkulu enimidi pikkaTillagaa ; ||
;
ceTlu puTTalu, neeruu gaalee ;
nimgee nElaa ; prakRti yaawattuu ;
aanamdamula ottulu gaikoni ;
jigEl jigEl mani weluguleenunu ; ||
;
kannayya jatalO unna cOTa ; 
aamulaagram mahita mEdiniki ;
waibhawamE, waiBOgamE ; 
sadaa mahitamau waibhawamE ; ||

పదే పదే పిలుచు గోరింక

కృష్ణా ; గొరవంక పిలుచును పదే పదే ; 
సంగీత కళల గమ్యమును ఎరిగిన - 
చక్కని దొరవు నీవని నమ్మినవి గోరువంకలు, 
శుక శారికలు, మరి మైనాలు ; 
అవనిని - సంగీత కళల గమ్యమును ఎరిగిన దొరవని - 
నమ్మిన విహంగాళి హంగామా చూడుము కృష్ణా ;  ||
;
మొయిలు వీవనల కాంచి నెమళులు ; మౌనముగా కూర్చుని ఉన్నవి ;
మోహన మురళిని సవరించుము కృష్ణా! వర మోహన మురళీ సవరణలతో ;
సమ్మోదముల నాట్యములాడును ; మయూరి - మోహన నాట్యములాడును ;
విప్పార్చిన తమ పింఛముల - నెమలి కన్నులను ఇచ్చును నీకే ;
|| గీత గాన కళ గమ్యమును ఎరిగిన దొరవని - 
తెలిసిన విహంగాళి హంగామా చూడుము కృష్ణా ||
;
వేణురవళి మహిమ ఏమో - తన్మయుడాయెను పక్షిరాజు ; 
నీదు గళమున సుమ హారమ్ముల - తరళ సుమముల రేకులు కూడా ; 
కదలకుండగా, కసికందకుండగా - నెమ్మదిగా పయనించును గరుడుడు ; 
మదనమోహనా, పక్షివాహనా, విహంగాళి హంగామా చూడు ;
|| గీత గాన కళ గమ్యమును ఎరిగిన దొరవని - 
తెలిసిన విహంగాళి హంగామా చూడుము కృష్ణా || 
;
=======================; ;
;
 gorawamka pilucunu padE padE ; 
gorawamkalu, Suka Saarikalu ;
kaLala gamyamunu erigina dorawu ;
samgeeta kaLala gamyamunu erigina ;
cakkani dorawu niiwani namminawi  - 
gorawamkalu, Suka Saarikalu mari mainaalu ; 
awanini - samgeeta kaLala gamyamunu erigina 

dorawani ;; nammina wihamgaaLi
 hamgaamaa cumu kRshNA ;  ||
;
moyili weewanala kaamci nemaLulu -
maunamugaa kuurcuni unnawi ; 
maunamugaa kuurcunu unnawi ;
mOhana muraLini sawarimcumu kRshNA!
;
sammOdamula naaTyamulaaDunu ; 
mayuuri, mOhana naaTyamulaaDunu ; 
wippaarcina tama pimCamula -
nemali kannulanu iccunu neekE ; 
|| geeta kaLala gamyamunu erigina awani ;
telisina wihamgaaLi hamgaamaa cuuDumu kRshNA ||
;
wENurawaLi mahima EmO - 
tanmayuDaayenu pakshiraaju ;
needu gaLamuna suma haarammula ;
taraLa sumamula rEkulu kUDA ; 
kadalakumDagaa, kasikamdakumDagaa ; 
nemmadigaa payanimcunu garuDuDu ; 
madanamOhanaa, pakshiwaahanaa ; 
wihamgaaLi hamgaamaa cuuDu ; 
|| geeta kaLala gamyamunu erigina awani ;
telisina wihamgaaLi hamgaamaa cuuDumu kRshNA ;  ||

అటుకులు తూనికలు కొలతలు

అమ్మ మనసు ఊరకుండునా!? 
అరకొరగా మెతుకు మెతుకు గతికితేను ;
బిడ్డ తిండి చప్పరింపు మేరకే అయితేను ;  ||
;
చిటికెడంత వెన్న, జున్ను, అటుకులు - చాలునమ్మ వీడికి ;
గోరుముద్ద చాలులేమ్మ!" అంటాడు బాలుడు ;
నందగోపాలుడు - అమ్మ మనసు ఊరకుండునా!? ;  ||
;
బిడ్డ తిండి అరకొరగా మెసవితేను ;
త్రేన్పు వచ్చెనిదిగో - అని ;
ఉత్తుతిగ తేన్పు తేన్చి ;
బ్రేవ్ - అని అంటాడు కన్నడు ;
;
"గుప్పెడు అటుకుల కొలతలు ;
అపరిమితము సంపదలు చేసేటి నేర్పరి ;
సుదాముని నేస్తుడు మన అందరి క్రిష్ణయ్య ;  || 
;
=================;   ;
;
amma manasu uurakumDunaa!? 
arakoragaa metuku metuku gatikitEnu ;
biDDa timDi capparimpu mErakE ayitEnu ;  ||
;
ciTikeDamta wenna, junnu, aTukulu -
 - caalunamma weeDiki ;
gOrumudda caalulEmma!" amTADu baaluDu ;
namdagOpaaluDu - amma manasu uurakumDunaa!? ;  ||
;
biDDa timDi arakoragaa mesawitEnu ;
trEn pu waccenidigO - ani ;
uttutiga tE npu tEnci ;
brEw ani amTADu kannaDu ;
;
"guppeDu aTukula kolatalu ;
aparimitamu sampadalu cEsETi nErapri ;
sudaaamuni nEstuDu mana amdari krishNayya ;  ||

;

ఉత్తేజం, ప్రభాతం, చైతన్య ప్రభాసం

హర్షములను విరబూయించేటి - 
చక్కటి కళ - క్రిష్ణయ్యకు సొంతము ; 
మన క్రిష్ణయ్యకె సొంతము ; || 
;
ఆసాంతం ఈ విశ్వం ఆశ్వాసం ;
ఉల్లాసం, ఉత్తేజం - ఉత్సాహం ; 
ప్రాణి కోటి చేతనలో చైతన్యం ప్రభాసం ;
ప్రతి నిత్యం ప్రభాతం - ప్రభాసం ; || 
;
ప్రతి పదము* ఆట పాట నటనలు ;
ప్రతి పదము**, పెదవి పైన వెన్నెలయే ;
కల్ల కపటమెరుగనట్టి ఆరాధన ;
మానవతకు కారుణ్యం కట్టినట్టి పట్టము ; ||  
;
పదము* = feet ; 
పదము** word speeking ; 
;
======================;  ;

harshamulanu wirabuuyimcETi - 
- - cakkaTi kaLa ; 
krishNayyaku somtamu ; 
mana krishNayyake somtamu ; || 

aasaamtam ee wiSwam aaSwaasam ;
ullaasam, uttEjam - utsaaham ; 
prANi kOTi cEtanalO caitanyam prabhaasam ;
prati nityam prabhaatam - prabhaasam ; || 

చమత్కార చదరంగం

ఆట కదరా కృష్ణా! ఇది ఆట కదరా కృష్ణా!  
ఆడుచున్నది గోపి - చదరంగమాట ;
మాట మాట కు - మాటి మాటికి ;  
చతురులే ఆడుతూ, చతురతలు మెరయగా ; ||

1) "బంటును జరపర శౌరీ!"
     అన్నది రాధిక, వీనుల విందుగ ;
;
2) "నీదు బంటును నేనే కాదా!
      జరుగుచుంటి"ననె శ్రీ గిరిధారి.
;
3) "గజమును జరపితినిప్పుడు నేను!
      కానిమ్ము క్రీడను, కువలయదమనా!"
;
"గజ గామిని! సొగసు నడకలను ;
చూసిన ఏనుగు అడుగు ముందుకు ;
వేయగ నేర్వదు - అంకుశమ్ములు -
నీ ఓర చూపులు చేయును అదుపు"

4) "ఒంటె కదిలినది ఐ మూలకును."
ముని పంటను నొక్కిన నవ్వుల పంట ; 
;
"ఒంటిగ నా ఒంటె - నడవ నేర్వదు."
తుంటరి కృష్ణుని జవాబులె తంటా ;
;
5) "తురగ వల్గనము అదుపు లేదు నియంత్రణ ; 
అతివ ఎత్తులకు చిత్తు నేనిక,
నీదు చిత్తము! నాదు భాగ్యము!
చిత్తం, చిత్తం!" 
చిలిపి వాక్కులవి చిద్విలాసునివి ; 

6) "చిత్తమును కుదురుగా నిలిపి, కృష్ణుడా! 
మంత్రిని ఐనా ముందుకు కదుపుము."
;
7) "కరణేషు మంత్రీ! - నిన్ను కని ఈ వేళ
దాగుకొనిరి ఇట అమాంతమ్ముగా అమాత్యవర్యులు ;
;
గోముగ గోపిక పలుకుల తళుకులు ;
గోవిందుని వాక్కులు రత్నప్రభలు ;
;
జగడములు అనిపిస్తు - ఉభయుల వాదములు ; 
ఆ జంట ఊసులు -  ఎల్ల జగములకు శ్రీరామ రక్ష ;
;
Chess game Krishna Gopika 

భద్రమైన ఆశ్రయం దొరికింది

ఆరాధన ప్రతిరూపం , 
అనురాగం ప్రతిరూపం ;
రాధామణి ఈమెయే ;  || 
;
కృష్ణ భావ లతిక ;  
ప్రేమ తిలక అరుణిమా -
భాష్య - రాగ రాగిణి, 
మమతానురాగ రాగిణి ;  || 
;
రాధామణి నెన్నుదుటను - రాజిల్లుచున్న తిలకము ;
విరాజిల్లు తిలకము -  ఆ దివ్య తిలకమ్మున ; 
కుంకుమ పూ వన్నియలకు - దొరికె భద్ర ఆశ్రయం ;  ||
;
=====================,

aaraadhana pratiruupam , 
anuraagam pratiruupam ;
raadhaamaNi eemeyE ;  || 
;
kRshNa bhaawa latika ;  
prEma tilaka aruNimaa ;
bhaashya - raaga raagiNi, 
mamataanuraaga raagiNi ;  || 
;
swarNa waikumTha nagari - 
weeDi iTula ; 
iTu waccina lakshmiwO ; || 
;
raadhaamaNi nennuduTanu - 
raajillucunna tilakamu ;
wiraajillu tilakamu - 
aa diwya tilakammuna ; 
kumkuma puu wanniyalaku - 
dorike bhadra Asrayam ;  ||
;

Tuesday, October 2, 2018

కార్వేటి శ్రీవేణు గోపాలుడు

విహారములు, విహారములు, ;
వాహినిలో విహారములు, ;
పూల తేరు నావ నెక్కి, 
రాధికాకృష్ణుల  మధు విహారములు ;  ||
;
బృహత్తరం, ధృవతారా శోభా సంకలనం ; 
రాధా దరహాసం, భామా మృదు హాసములు ;
పూల తేరు నావలోన,
రాధికా కృష్ణుల మృదు విహారములు ;  
;
హత్తుకొనును ఏవేవో మధురోహల లాలనలు ; 
ప్రతి యోచన లాలిత్యం, నూత్న సురభిళ పుష్పం ; 
ఒత్తుగాను పింఛములను పరచినారు ఎవ్వరు!?
కూర్మి కార్వేటి శ్రీవేణు గోపాలుడు, ఓ యమ్మా ;  || 
;
పూల తేరు నావలోన,
రాధికా కృష్ణుల మృదు విహారములు ;

పూల తెప్ప - రాధాకృష్ణులు

పల్లవి ;- 
తెప్ప పైన విహరించే - క్రిష్ణ రాధ జంట ;  
రాగాల తెప్ప పైన విహరించే - క్రిష్ణ రాధ జంట ;  
హరివిల్లుల తులమానిని ; ఆయెనమ్మ చిన్ని పడవ ;  ||
;
ప్రణయ వేణు మధు గీతికా యుగళం - 
గాధా పరిచంక్రమణం ; 
నిఖిల భువన సామ్రాజ్యం, మనోహరం, మనోజ్ఞము;
తెప్ప పైన విహరించే - క్రిష్ణ రాధ జంట ;
పూల తెప్ప పైన విహరించే క్రిష్ణ రాధ జంట :  || 
;
బృహత్తరం, ధృవతారా శోభా సంకలనం ; 
రాధా దరహాసం, భామా మృదు హాసములు ;
నిఖిల భువన సామ్రాజ్యం, మనోహరం, మనోజ్ఞము;
తెప్ప పైన విహరించే - క్రిష్ణ రాధ జంట ;
పూల తెప్ప పైన విహరించే క్రిష్ణ రాధ జంట :  || 
;
హత్తుకొనును ఏవేవో మధురోహల లాలనలు ; ప్రతి యోచన 
లాలిత్యం ; నూత్న సురభిళ పుష్పం ;  ||
ఒత్తుగాను పింఛములను పరచినారు ఎవ్వరు!?
కూర్మి కార్వేటి శ్రీవేణు గోపాలుడు, ఓ యమ్మా ;  || 
;
నిఖిల భువన సామ్రాజ్యం, మనోహరం, మనోజ్ఞము;
తెప్ప పైన విహరించే - క్రిష్ణ రాధ జంట ;

Monday, October 1, 2018

మౌనము సైతం మధువీణయే ఆయెను

మౌనము కూడా మధువీణ అయె ;
మానస మందిరమున మార్మ్రోగును ;
క్రిష్ణ మురళి గానము ; ;  ||
పదే పదే ;
మది మందిరమందున ;
క్రిష్ణ మురళి గానము ;
;
ప్రతి ఊహయు, స్వరజతి యగు ;
శృతిని కూర్చుకొనుచుండును ;
మేనులోని అణువణువుయు ;  ||
============================; ;
;
 maunamu kUDA madhuweeNa aye ;
maanasa mamdiramuna maarmrOgunu ;
krishNa muraLi gaanamu ; ;  ||

padE padE ;
madi mamdiramamduna ;
krishNa muraLi gaanamu ;
;
prati uuhayu, swarajati yagu ;
SRtini kuurcukonucumDunu ;
mEnulOni aNuwaNuwuyu ;  ||

జగన్మోహన - రాగ సుధ

రాగ సుధారసము గ్రోలుము ; 
జగన్ మోహన - రాగ సుధారసము గ్రోలుము ;
పరవశమున రాధికకు ;
వాడుకతో పదే పదే - అదే మాట వేడుక ;
క్రిష్ణ నామమే, శ్రీక్రిష్ణ నామమే ;  ||
;
అనవరతము రాగ సుధల  ;
కురిపిపించు నామము ;
ప్రేమమూర్తి నామము ; 
క్రిష్ణ నామమే, శ్రీక్రిష్ణ నామమే ;  ||
;
మేనెల్లా మెరుపులయే ;
అనుభూతి నామము ;
ప్రేమమూర్తి నామము ; 
క్రిష్ణ నామమే, శ్రీక్రిష్ణ నామమే ;  ||

============ ; ;
;
raaga sudhaarasamu grOlumu ; 
jagan mOhana 
raaga sudhaarasamu grOlumu ;
parawaSamuna raadhikaku ;
wADukatO padE padE ; 
adE mATa wEDuka ;
krishNa nAmamE,  
SreekrishNa nAmamE ;  ||
;
anawaratamu raaga sudhala  ;
kuripimcu nAmamu ;
prEmamuurti nAmamu ; 
krishNa nAmamE,  
SreekrishNa nAmamE ;  ||
;
mEnellaa merupulayE ;
anubhuuti nAmamu ;
prEmamuurti nAmamu ; 
krishNa nAmamE,  
SreekrishNa nAmamE ;  ||

ముగ్గుకర్ర కొలత - వనిత జడ

ముగ్గు కఱ్ఱ కొలత కొరకు ; 
వేరె వెదుకులాట ఏల, గోపీ! నీదు - 
బారు జడయె చాలు నిదిగో భామినీ ;
అనుచు లాగి పట్టె ముద్దులొలుకు కృష్ణ ; 
లాగి పట్టె నిటుల ముద్దు కృష్ణ ; 

muggu ka~r~ra kolata koraku ; 
wEre wedukulaaTa Ela, gOpee! needu - 
baaru jaDaye caalu nidigO BAminee ;
anucu laagi paTTe mudduloluku kRshNa ; 
laagi paTTe niTula muddu kRshNa ; 

చూడామణీ, కౌస్తుభ హారములు యశోదమ్మ వేసింది

ఆటలకు వేళాయెరా! పాటలకు వేళాయెరా! 
మురిపాల క్రిష్ణయ్య! రావయ్య వేగమే! ;  ||
;
కస్తూరి, గంధములు నీ మేనంత అలదింది
చూడామణీ, కౌస్తుభ హారములు వేసింది ;
తల్లి యశోదమ్మ! రావయ్య వేగమే! ;  ||
;
నెమలీక సిగలోన ముడిచి సింగారించింది ;
తల్లి యశోదమ్మ! రావయ్య వేగమే! ;  ||
;
మా నందనందనా - వేగమే రావయ్య! 
ఆనంద మోహనా. క్రిష్ణయ్య! రావయ్య! ;  || 

నీ షోకులు, ఠీకులు - పల్లెను మరిచేవు

నీ షోకు ఠీకుల - పల్లెను మరిచేవు ;
మా వ్రేపల్లెను మరిచేవు - మరి చాలు! చాలును! ;  ||
;
అద్దమున నీ మోము అందాలు - చూచుకొనుచూ
అట్టె నిలిచేవు - మరి మరీ మురిసేవు!
గారాలివే! వేలు ! మరి ఇంక చాలును ! గోపాల! ;
;
కొలను తన ఒడలంత అద్దముగ చేసెరా,
నీరాడు ఆటలకు నీ రాక కోసమై !
జల క్రీడ లాడేటి నీ స్పర్శ కోసమై!
నీరాజనము లొసగ - మై దర్పణము చేసి,
వేచేను ఆ యమున - వేగ రావోయీ !
మా ముద్దు గోపాల! మురిపాల బాలకా! ;  || 
;

ఇన్ని హంగులు, ఎడారి కూడా నందనవనియే

కృష్ణా కృష్ణా శ్రీకృష్ణా - 
మదనమోహనా, శ్రీకృష్ణ  ;
వేణువూదవోయి 2 ;
||పాట నీది, ఆట నాది ; 
కృష్ణా, మురళి నూదవోయీ||
;
పూవులు పూవులు, 
పూవుల తావులు ; 
పూలతోటి తేటులు - 
పరుగెత్తుకు వచ్చినవి ; 
నీవు నిలిచినట్టి తావు - బృందావనమే, 
నవ  బృందావనమే ; 
||పాట నీది, ఆట నాది ; 
కృష్ణా, మురళి నూదవోయీ||
;
గానలోలిని, నెలత రాధిక; 
రాగ తన్మయి దృక్కుల ;
రాగ డోలలు వెలసినవి ;
అనురాగ డోలలు వెలసినవి ; 
;
ఇన్ని హంగులు సమకూరగనే ; 
ఎడారి కూడా నందనవనియే ; 
మురళీ కృష్ణా, వేణువూదుము ;  
||పాట నీది, ఆట నాది ; 
నిఖిల లోకమే - ఉభయుల రంగవేదిక, 
కృష్ణా, మురళి నూదవోయీ||
;
==================; ,
;
kRshNaa kRshNaa SrIkRshNaa - 
madanamOhanaa, SreekRshNa  ;
wENuwuudawOyi 2 ;
||paaTa needi, ATa naadi ; 
kRshNaa, muraLi nuudawOyee ||
;
puuwulu puuwulu, 
puuwula taawulu ; puulatOTi tETulu - 
parugettuku waccinawi ; 
neewu nilicinaTTi taawu - 
bRmdaawanamE, nawa  bRmdaawanamE ;
||paaTa needi, ATa naadi ; 
kRshNaa, muraLi nuudawOyee||

gaanalOlini, nelata raadhika; 
raaga tanmayi dRkkula ;
raaga DOlalu welasinawi ;
anuraaga DOlalu welasinawi ; 
;
inni hamgulu samakuuraganE ; 
eDaari kUDA nandanawaniyE ; 
muraLee kRshNaa, wENuwuudumu ;  
||paaTa needi, ATa naadi ; 
nikhila lOkamE ubhayula ramgawEdika, 
kRshNaa, muraLi nuudawOyi|| 
;
 God Krisha songs 

Sunday, September 16, 2018

అవలీలగ అన్నన్ని లీలలు

భళి భళీ భళి భళీ ;
ఈ వ్రేపల్లెనందు నీ మేటి లీలలు ; భళి భళీ ;
ఎన్నైన ఎన్నైన వర్ణించుకొన - 
చాలునా యుగములు ;
వనమాలి, చాలునా కల్పములు ;  ||
;
కూర్మావతారమున నాడు మందర గిరిని ; 
పాల - కడలిలోన నీ మూపు పయిన ;
పదిలంగ నిలిపావు; 
కొనగోటి పయిన గోవర్ధనమ్మిది;
కూర్మావతారుడా, నీకేమి లెక్కా  ;  ||
;
క్షీరాబ్ధి శయనించి - ఎల్ల లోకమ్ములను ;
చల్లగా బ్రోచేటి చిద్విలాస స్వామి! ;
అల్లరుల క్రిష్ణయ్యగ నీకిపుడు 
ఉట్టి మీద పాలు ఎంత గనుక,
ఒక్క గుక్క, అంతే కదా ;  ||
;
శేషతల్పమునందు సుఖముగా శయనాలు ; 
కాళిందిలోన పెను పాము మర్దనము ; 
ఫణముల నాట్యాలు ఆడుతూ 
కాళీయు నణచుట, అది ఎంత ఒక లీల ;
నీకింక చిటికెలో అవలీల ;  || 
;
=======================; ;
;
bhaLi bhaLI bhaLi bhaLI ;
ee wrEpallenamdu ; 
mETi needu leelalu ; 
ennaina ennaina warNimcukona ;
needu - leelalennennaina ;
caalunaa yugamulu,
wanamaal, caalunaa  kalpamulu ;  ||
;
kuurmaawataaramuna naaDu ;
mamdara girini ;
padilamga nilipaawu; 
konagOTi payina gOwardhanammidi ;
kuurmaawataaruDA, neekEmi lekkaa ;  ||
;
ksheeraabdhi Sayanimci - ella lOkammullnu ; 
callagaa brOcETi cidwilaasa swaami ;
allarula krishNaga neekipuDu ;
uTTi meeda paalu emta ganuka,
okka gukka, amtE kada ;  ||  
;
SEshatalpamunamdu sukhamugaa Sayanaalu ; 
kALimdilOna penu paamu mardanamu ; 
phaNamula nATyAlu ADutU ;  
kaaLIyu naNacuTa, adi emta oka leela ;
neekimka ciTikelO awaleela ;  || 

కృష్ణుని సాక్షాత్కార సృష్టి నిఖిలం సమ్మోహ హర్షం

నీల కుంతల రాధమ్మ మనసు ; 
ఏల ఆయెను నేడు అతలాకుతలం ;
కల్లోలము, అల్లకల్లోలము ;  ||  
;
నీలి యమునా ఝరి ; 
లోలోన - బాడబ ; 
ఎందులకు ఇటులిటుల ; 
నేడు అతలాకుతలం ;
కల్లోలము, అల్లకల్లోలము ;  ||  
;
గుబులు నిండి వణుకుచున్న ; 
మిరుమిట్లు గుంపుల మెరుపు  మబ్బులు ;
నేడు అతలాకుతలం ;
కల్లోలము, అల్లకల్లోలము ;  || 
;
శ్యామకృష్ణుని సాక్షాత్కార అనుగ్రహమ్ము ;
నిఖిలం సృష్టికి - ప్రశాంతం హర్షం .......  ; 
అందులకే -
లీలా - మానుషరూపుని రాకకు ;
సతతం సుస్వాగతం ; 
శ్యామకృష్ణుని ఆగమనం ;
దివ్య పరిమళ శోభితం ;  || 
;
======================;  ;
;
neela kumtala raadhamma manasu ; 
Ela aayenu nEDu atalaakutalam
kallOlam, allakallOlamu ; ||  
;
neeli yamunaa jhari ; 
lOlOna - baaDaba ; 
emdulaku iTuliTula ; 
nEDu atalaakutalam
kallOlam, allakallOlamu ; ||
;
gubulu nimDi waNukucunna ; 
mirumiTlu gumpula merupu mabbulu ; 
nEDu atalaakutalam
kallOlam, allakallOlamu ; || 
;
leelaamaanusha ruupuDu ; 
Syaama kRshNuni saakshaatkaaram ;
nikhila sRshTiki ; SAmtam harsham ;
amdulakE -
leelaamaanusha - ruupuni raakaku ;
satatam suswaagatam ; 
Syaama kRshNuni aagamanam ; 
diwya parimaLa SObhitam ;  ||