Friday, September 30, 2011

అ - అచ్చులు


పలక పైన రాసాను,"అ""ఆ"


ముక్క, ముక్క - చెరుకు ముక్క
ముక్కలోన తీపి రసము

తీయని రసమును తీసీ తీసీ
బానలలోన మెండుగ వండీ
దండిగ బెల్లపు దిమ్మలు వచ్చె!

మధురమ్మౌ ఆ అచ్చులు తెచ్చీ
నాన్నారేమో అమ్మకు ఇచ్చిరి;
అమ్మ చేతి కమ్మని స్వీట్లు
నచ్చెను పిన్నలు, పెద్దలందరికి!

అరిసెలు తింటూ గంతులు ఆటలు;
"చిందులు చాలును! పిల్లల్లారా!
  చదువుల వేళ ఆయెను! రండి!
  బాసిం పెట్లు వేసుకుని,
  బుద్ధిగా కూర్చుని, చదవ0డీ!"
  అ0టూ తాత గద్దించాడు;

"అచ్చులు, హల్లులు నేరుస్తాము
భారత మాతకు జై! జై! జోతలు!
రేపటి పౌరులం!  పిల్లలము!
పిల్లలము మేము పిల్లలము"  

*****************************\\\\\\\\

      అ -  అచ్చులు - Lesson 1
         
                          రచన ;    kadambari

Thursday, September 29, 2011

టిబెట్ లో యోగి, Milerapa

















యోగి మిలెరపా, గొప్ప కవి.
1052  సంవత్సరములో  Mila-Dorje-Sengeవంశములో
జన్మించిన మహా పురుషుడు "మిలెరప యోగి".

Milarepa 1052 - 1135 మధ్య కాలము వాడు.
టిబెట్ ప్రజలు ఆరాధించే మహనీయుడు.
వజ్రయానమును (బౌద్ధ మత)
ప్రజాబాహుళ్యములో వ్యాప్తి చేసిన వ్యక్తి.

మిలెరపా యోగి 

అతని పాటలు, టిబెట్ మున్నగు దేశాలలో ప్రసిద్ధికెక్కినవి.
85 సంవత్సరాల వయసునాటికి,
మిలెరపా యోగి, 25 మంది శిష్యులు-
ఆతని అనుయాయులు,
బౌద్ధ గురు మిలెరపా గీతములను,
సుభాషితాలను నేర్చుకున్నారు.
వారి గురు భక్తి, ఆధ్యాత్మక కృషి ఎనలేనిది.
మిలెరపా సూక్తులు
నేటికీ అనేక ప్రాంతాలలో భజన కూటమిలలో
ఆలపించబడుతూ ఉన్నవి.
ఈ ఛాయాచిత్రము- Milerapa cave.
నేడు ఈ పరిసరములు చీనా ఆక్రమించినది.
ఐనప్పటికీ, చైనా దేశము- కొంత పహారాలో-
ఈ ప్రదేశాన్ని పర్యాటక యోగ్యంగా మార్చి, నిర్వహిస్తూన్నది.

*******************************\\\\\\

White Rock Horse Tooth cave -  తెలుసా? 
Milarepa's Cave (Link 1)
;
Tibetan's poet saint Milerapa
;

బడి - వెన్నెల సవ్వడి


school of kid's dreams 















"బడి" అంటే అక్షరాల గుడి- నేస్తం!  
ఈ వాక్యము సాక్షాత్తూ వేద వాక్కు, సత్యం
ఇది అక్షర సత్యం! పునః పునః సత్యం! ||  

"విద్య రాని వాడు
వింత- పశువు" అనే నానుడి!;
ఇది ఒక్క -
"నా-నుడి" మాత్రమె కాదు,  
ఇది అందరి ఎడదలలో                  
వడి వడిగా జాల్వారే
పసిడి జాబిల్లి వెన్నెల సవ్వడి       ||    

ప్రతి మనసూ - సుక్షేత్రము
ఉల్లాసము పుష్పము,
విరబూయును నిత్యము
అది,
"చదువు" యొక్క మహిమము ; ||
   
మంచి భావముల జాగృతి  
శాంతి తరు లతాగ్రములు,
పల్లవములు, పత్రముల
పచ్చదనము విలసిల్లును     ||


***********************\\\\\\\

అందరూ శిష్యులే!




లాలి లాలీ లాలి బాల సుకుమారీ!
లాలి జో! జో! లాలి బాల మహ ధీరుడా! ||

బాల బాలికల అందాల కలలు;
ఆ కలల లోకములను – పాలనము సేయగా
విచ్చేసెనమ్మా నిబ్బరపు రాత్రి   ||

రేయికి చెల్లాయి – 'నిద్దుర యువ రాణి'
స్వప్న లోకములన్ని – హుందాగ విహరిస్తు
కలల కథలెన్నిటినో!తాను నేర్చేనమ్మ  ||

ఈ పాఠశాలలో - కథలు ముక్కోటి
నేర్చుకోవడమంటె- ఎల్లరకు బహు సరదా!
అందుకే అందరూ- శిష్యులుగ మారుదురు
కమ్మ కమ్మని కథలు బోలెడు నేర్చేరు!   ||

                              రచన-  కాదంబరి

@@@@@@@@@@@@@@@@@



lAli lAlI lAli bAla sukumArI!
lAli jO! jO! laali baala maha dhIruDA! ||

baala baalikala aMdaala kalalu;
aa kalala lOkamula – paalana sEyagaa
vichchEsenammaa nibbarapu raatri   ||

rEyi china chellaayi – niddura yuva rANi
svapna lOkamulanni – huMdaaga viharistu
taanu nErchEnamma – kalala kathalenniTinO! ||
I paaThaSAlalO - kathalu mukkOTi
nErchukOvaDamaMTe- ellaraku bahu saradaa!
aMdukE aMdarU- Sishyuluga maaruduru
kamma kammani kathalu - bOleDu nErchEru!    ||

                                     writer:- kadambari

@@@@@@@@@@@@@@@@@@@@@@

     nice photo (Link)
;

Wednesday, September 28, 2011

మకర శిల

makara sila 




















దివ్య నర్మదా నదిలో, పేర్చినట్లు ఉన్న 
ఈ శిలా సమూహాన్ని చూడండి.
నర్మదా నదీ జలాల నడి మధ్యలో 
ఒక మొసలి- 
కాస్త మత్తుగా, బద్ధకంగా పడుకున్నట్లుగా ఉంది గదూ!
"శిలా మకరము" అని పిలుద్దామా?!

;


శిలలపై చెక్కని శిల్పాలు


కదిరి సీమలో
శిలలపై ఎవరూ చెక్కని చక్కని శిల్పాలు.
ఇవి-
కదిరి సీమలో,
మన ఆంధ్రప్రదేశ్ లో అగుపిస్తూన్న గిరి ప్రకృతి .
















కదిరి సీమలో 
శిలలపై ఎవరూ చెక్కని చక్కని శిల్పాలు.
;















;
;




















;
;

వేనాడు, కేరళ




వెదురు బద్దలతో చెట్లపైన,
కొమ్మలలో కట్టిన Tree houses,
జలపాతాలు, 900 ఏనుగులకు-
ఆశ్రమ నిలయము,
వే నాడు జిల్లా/, వై నాడు, కేరళ:- 
Wayanad district district- Kerala:-
Edakkal Caves, 
ఎడక్కల్ గుహలు ; 
(Edakkal literally means
'the stone in between'
in Malayalam)

కురువ ద్వీపము(Kuruvadweep island);
హరిత గిరుల అందాలు-
అందానికి అందములు!!!!!!!
మరి కేరళ- దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తూన్నదీ- అంటే 
అక్కడి రాష్ట్ర ప్రభుత్వపు దూరదృష్టి + తో , 
టూరిజ్మ్ రంగానికి అందించిన సదుపాయాల గొప్పదనమే కదూ!!!!
Paniyas, Kurumas, Adiyars, Kurichyas, 
Ooralis, Kattunaikkans etc.
Wayanad Wildlife Sanctuaries 
వివిధ జంతువుల పరిరక్షణకు నిలయం. 
rose-wood, anjili (Artocarpus), 
mullumurikku (Erthrina) వంటి 
తరు సంపద ధామము ఈ సీమ.
మొదలైన ఆదిమ జాతులు, కొండ ప్రజలు ఉన్నారు. 
స్థానికులు"ముదుమలై వన్య ప్రాణి సంరక్షణా కేంద్రము- గా వ్యవహరిస్తారు." 
రమారమి 5౦౦ స్క్వేర్ కిలోమీటర్లు
(an area 500 square kilometers) విస్తరించి ఉన్నది. 

&&&&&&&&&&&&&&&&&&&
Tags:-
Madumalai sanctuary  in Tamil Nadu 
and the Bandipur Sanctuary 


; వయ్ నాడు, Wayanad district, కేరళ 
Munnar, Wayanad and Kakkayam (Kozkikkod)
Wayanad Tree Houses - Kerala

Hill station- కూనూరు


కూనూరు Hill Station

"నీలగిరి చంద్రమ్మా!
 నీవె నా కను చూపు........ "

సరే! జానపద గీతం ఇలా చదివి,
అటు చూస్తే, ఓ సొగసైన ఫొటో!
ఊటీ వద్ద ఉన్న Hill station-
కూనూరు హిల్ స్టేషన్.
సముద్రమట్టానికి (altitude) 1856 మీటర్లు ,
ఈ దరిని నిర్మితమైన పార్కు- 
సింస్ పార్కు- (Sim's Park)
1874 లో కన్స్ట్రక్ట్ ఐనది.
నీలగిరులలోని ఊటీ- హనీమూన్ కేంద్రము,
వేరే పరిచయాలేల?
మన దేశంలో రెండో పెద్ద హిల్ స్టేషన్ ఐన ది ఇది.
ఇచ్చట ఓ చక్కని చెట్టు చక్కని సర్కస్ ఫీట్ చేస్తూ,
నిలదొక్కుకుని, పెరిగిన మనోజ్ఞ నయన కావ్యాలాపన,
మన కన్నులకు స్వంతము.

Coonoor is a fabulous hill station 
in the Nilgiri hills 
about 19 km from Ooty.
Sim's park ;

గిర గిరా గిర గిరా


 గిర గిరా తిరిగే చక్రాల బొమ్మలు;
ఫ్యానుల లాగా తిరిగే గిర గిరా టాయ్స్.
కొన్ని SPINNER TOPS.

SPINNER TOYS










spinning tops
బొంగరములు ఆట :

Graass తో బొమ్మల తయారీ


Graass తో బొమ్మల తయారీ

గడ్డి పరకలతో కూడా
బొమ్మలను తయారు చేయవచ్చును,
ఇదిగో, ఇలాగ! చూసారు కదా!!!!!!



















గడ్డి పరకల TOYS (Link
;

ఫలశిల్ప కళా ప్రతిభ ప్రజ్ఞ


ఉల్లిపాయ art 


ఈ పూలను చూసారా?
భలే అందంగా ఉన్నాయి కదూ?
హూ......! 
ఐతే ఇవి నిజంగా పూలు కావు.
ఇవి ఉల్లిపాయలతో చేసిన పుష్పాలు.
ఈ కళా పుష్పాలు
Vegetable Art /  
శాక శిల్ప కళా ప్రతిభకు తార్కాణం. 

;

Tuesday, September 27, 2011

చెమ్కీల గాలిపటము!


చెమ్కీల గాలిపటము


;













గాలిపటం! గాలిపటం!

ఆంజనేయునికి చెల్లెలా!

గాలిలోన ఎగురు విద్య

నీకు ఎలా అబ్బినది? ||


కుప్పి గంతుల కోతి

లంకకు – చిటికెలొ ఎలాగ చేరినది?

తోకరాయునికి లంఘనములను

నేర్పిన గురువువు నీవేనా? ||


చందమామ ఇంటిపైన

నామ ఫలకమయ్యావు!

సూర్యుని చిరునామా

నాకు తెలుసునంటావు ||


చుక్కల చెంపలలోన

చెమ్కీలను పూయింతువు

ఎల్లరి మనసు తెరల

ఖుషీ ఫొటో నీవైతివి ||

..

చెమ్కీల గాలిపటము! (Link: Forkids)

Published On Friday, 
September 16, 2011 
By ADMIN. Under: పాటలు.  


 రచన:  కాదంబరి
;

Friday, September 23, 2011

కనులలోన కావ్యములు


Poerty in Eyes
















నీలాల కన్నుదోయి  
లాల పోసుకుంటూన్నవి!
మధుర మధుర దృశ్య మాల 
కమనీయం, కను కావ్యం ||   


మసక మంచు తెరలందున
హిమ బిందుల దోబూచి
తుషారముల సముదాయం 
ఖుషీ దాగుడుమూతలు ||


ముత్యాల రాసులు – 
అవనీ తల తలంబ్రాలు- 
ఇలకు ఈ కానుకలు- 
ఆనందబాష్పాలు     ||

Tuesday, September 20, 2011

600 తేనెటీగల కాలనీలు


ఆరు వందల తేనెటీగల కాలనీలు

ఒకే చెట్టు కొమ్మలకు 600 తేనెతుట్టెలు పైనే ఉన్నాయి.
ఈ రికార్డుకు చేరువలోని వింత ఎక్కడనో కాదు,
మన దేశంలోనే జరిగింది.
కర్ణాటక రాష్ట్రములోని Hoskote taluk లో
నంద గుడి వద్ద ఈ కుగ్రామము .
రామగోవిందపురములో ఉన్నది ఆ మర్రి చెట్టు.
200 సంవత్సరాల తరువు ఇది.
ఆ మహా వటవృక్షము పై కోట్లాది తేనెటీగల కోలాహలం
శ్రవణప్రియంగా ఉంటుంది.
ఆరు వందల తేనెటీగల కాలనీలు....
అవన్నీ "లక లక లక"  అనవు గానీ,
ఝుం ఝుం ఝుమ్మంటూ పాడుతూ
జం జం ఝామ్ముగా సంగీత నాద సందడి చేస్తూన్నాయి అక్కడ.
ఈ ప్రాంతమును - ఆర్ధిక మండలి*,
పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని సూచించింది.
ఐతే ఇక్కడి స్థానిక ప్రజలకు
ప్రకృతి పరిరక్షణ పట్ల కల అవగాహన ప్రశంసనీయమైనది.
వారు ప్రకృతి సమతౌల్యమునకు పెద్ద పీట వేసారు.
హరితదనాన్ని కాపాడే దిశలో,
అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అక్కడి జనులు
సెజ్ - ల నిర్ణయానికి ఆక్షేపణ తెలుపుతున్నారు.
ఆ ప్రాంత వాసుల యోచన గొప్పది కదా!

“It’s a pride to protect the tree
which has been a host to a record breaking
600 bee colonies.
We would do our best to protect this natural heritage,”
said Principal Chief Conservator of
Forest and Wildlife IB Srivastava

(*Special Economic Zone (SEZ) has been proposed  )

@@@@@@@@@@@@@@@@@@@

“world’s largest number of beehives” 
;

కిత్తూరు కోట వద్ద temple tree, naga linga

Naga-Linga-Pushpa tree






















కిత్తూరు కోట వద్ద చూకీ మాత ఉన్నది.
(గరగ్ గ్రామము,అరటి తోటలోని ఆశ్రమము,
గురు మడివలేశ్వర నిర్వహణ)
ఈ గుడిలో ప్రతి రోజూ పూజా సుమములలో తప్పనిసరిగా -
నాగలింగము - పూవులు ఉంటాయి.
కోవెల ఆవరణలో ఈ చెట్టు కనువిందు.





;







Pole Star viewing shaft;
Kittur fort,Choukimatha;;
Naga-Linga-Pushpa tree fragrance,trunk full of buds,
flowers and round fruit the size of a shot putt
Madiwaleshwara banana plantation close by to Choukimatha;


కిత్తూరు కోట లో ధ్రువ నక్షత్రమును 
చూడగలిగే  వీలు కల్పిస్తూన్న చోటు ఉన్నది.
ధ్రువ నక్షత్ర వీక్షణాలయ - ఆ నిర్మాణము 


ధ్రువ నక్షత్ర వీక్షణాలయ

::::::::::::::::::: 

Saturday, September 17, 2011

“చెల్లపిళ్ళరాయ చరిత్రము”, “తాళ్ళపాక అన్నయ కవి


Melukote kovela


“ఆశావాది ప్రకాశ రావు సాహిత్యానుశీలనము” – రచయిత:- డాక్టర్ మంకాల రామచంద్రుడు

గండ పెండేరములను, అనేక బిరుదు సత్కారములను పొందిన విద్వాంసుడు ప్రకాశ రావు.
ఆశావాది ప్రకాశ రావు “ఆసాది” అనే దళిత ఉప కులమునకు చెందిన వ్యక్తి.
ఆసాదుల వృత్తి- కథా గానము.
వి.సుబ్రహ్మణ్యము నిఘంటు నిర్మాణ శాఖాధిపతి.
వడ్లా సుబ్రహ్మణ్యము ఆధ్వర్యములో
మంకాల రామచంద్రుడు ~~~
"అవధానాచార్య ఆశావాది ప్రకాశ రావు గారి" 
జీవన ప్రస్థాన, సాహిత్య సృజన, కృషీ క్షీర మథనమునూ చేసి,
ఈ గ్రంథ నవనీతమును పఠితల చేతిలో ఉంచారు.
340 పేజీలు ఉన్న ఈ పుస్తకమును అందమైన ముద్రణతో,
అచ్చుతప్పులు లేకుండా వెలువడడానికి కారకులైన ప్రచురణకర్తలు ప్రశంసార్హులు.

‌ఈ‌పుస్తకం లో ప్రస్తావించిన ఒక యక్షగానము – చెల్లపిళ్ళరాయ చరిత్రము:

చల్లపిళ్ళ, చెలపిళ్ళ అని కూడా ఈ గ్రంధములోన వాడబడినవి.
 “సెల్వపిళ్ళై” అనేది తమిళ పదము,
ఆ మాటకు అర్ధం “సుందరమైన దైవము”.
దానికి వికృతి పదమే- “చెల్లపిళ్ళ”.
108 తిరుపతి క్షేత్రములు ఉన్నవి.
వానిలో- ఒకటి యాదవాద్రి.
Cheluvanarayana Swamy

మైసూరు లోని మేల్కోటె- అనే ఊరులో
“యాదవాద్రి”లో శ్రీ వేంకటేశ్వర మూర్తి నెలకొని ఉన్నాడు.
( Cheluva Narayana Swami/ chella pille raya/
TiruNarayana in Yadugiri/ yadadri; Melkote, Karnataka state)
తాళ్ళపాక అన్నయ:-
ఈ యక్షగానము, గ్రంధ కర్త.
నాందీ పద్యాలలో-
“శేషాద్రిపతి కృతిభర్త పేరు; కృతికర్త నామము “తాళ్ళపాక అన్నయ్య”.
అనేక ఆధారములతో- అన్నయ కవి-
ప్రఖ్యాత పదకవి - ఐన “తాళ్ళపాక అన్నమాచార్యుని” మనుమడు- అని వక్కాణించాడు ఆశావాది.
తాళ్ళపాక అన్నమయ్య కు ముగ్గురు కుమారులు:-
 నరసింహ కవి,
పెద్ద తిరుమలాచార్యుడు,
అన్నయార్యుడు.


వీరిలోని రెండవ వాడైన పెద తిరుమలాచార్యుని తనూజుడే
ప్రస్తుత వ్యాసాంశమైనట్టి “చెల్లపిళ్ళరాయ చరిత్రము” గ్రంధ రచయిత.
1500 సంవత్సర ప్రాంతము వాడు.

ఇందలి కథ:-

శ్రీ శ్రీ వేంకటేశ్వర స్వామి వారు
ఢిల్లీ సుల్తాను కూతురు “బీబీ నాంచారు” ని వలచి, పెళ్ళి చేసుకోవడం.
(“తిరుపగూడు” మున్నగు పదాలు ఈ యక్షగానములో కలవు)

ఈ పుస్తకమును గుంతకల్లులోని
“భువన విజయ శారదా పీఠము” వారు ప్రచురించారు.
ఈ గ్రంధ ముద్రణకు తిరుమల తిరుపతి దేవస్థానము వారు,
ఆశావాది మిత్రులు సౌహార్ద్ర ఆర్ధిక సాయాన్ని అందించారు.
ఈ పొత్తమును “విజయ శారదా పీఠము” వారు ప్రచురించారు.
ఈ పైన చెప్ప బడిన అంశాలు కాక, మరో ప్రత్యేకాంశము ఉన్నది.

అదేమిటంటే – ఒక శిష్యుడు – 
తన ఉపాధ్యాయుని జీవితము గురించి రీసర్చ్ పుస్తకాన్ని రాయడము.
ఆ విద్యార్ధి – డాక్టర్ మంకాల రామచంద్రుడు.
ఈయన గురుభక్తితో “ఆశావాది ప్రకాశ రావు సాహిత్యానుశీలనము” అనే
పుస్తక రచనకు ఉపక్రమించారు.
2004 లో పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము నుండి
P.hd.పట్టమును (పట్టాను) పొందిన గ్రంథము ఇది.

[ఆధారము:-“చెల్లపిళ్ళరాయ చరిత్రము”,
ఆశావాది ప్రకాశ రావు సాహిత్యానుశీలనము"; పేజీ 268;]

****************************************\\\\\\\\

రచన:-డాక్టర్ మంకాల రామచంద్రుడు:
ప్రచురణ:- శ్రీ కళామంజరి. షాద్ నగర్, మహబూబ్ నగర్ జిల్లా:]

ప్రతులకు:-శ్రీమతి మాధవి, M.Sc., B.Ed.,
ఇంటి నెంబర్:: 18-533,
తిరుమల కాలనీ,
షాద్ నగర్,
మహబూబ్ నగర్ జిల్లా- 509216

ఆశావాది ప్రకాశ రావు సాహిత్యానుశీలనము
   23 JULY 2011 58 VIEWS 

రాసిన వారు: కాదంబరి
*****************
“చెల్లపిళ్ళరాయ చరిత్రము” 7727 ; ( About book) (Link 1)
                                 పుస్తకం.నెట్
వ్యాస లహరి  (Link 2)
Akhilavanitha ; Tuesday, April 12, 2011

సాహితీ సమరాంగణ సార్వభౌముడు “శ్రీ కృష్ణ దేవరాయలు”6369  (లింక్ 3)
                 30 JANUARY 2011 159 VIEWS ; pustakam. నెట్ 
సాహితీ సమరాంగణ సార్వభౌముడు “శ్రీ కృష్ణ దేవరాయలు”  
Price ; Rs25/- ప్రతులకు; 
Bollapalli subba rav, ( Retd Bank Manager),  
“Srinivas” ; 7-2-13 Lawyer Pet,
2 va viidhi, Ongole – 523002 ;   
లాయర్ పేట; ఒంగోలు               
ph; 08592-234262 ; Cell; 9705456900


మెల్కోటే/ Melukote/ Melkote , Mandya డిస్ట్రిక్ట్

Monday, September 12, 2011

రాయల్ సైజు Tea pot


Royal Crown 























కళాత్మకంగా ఉన్న్ ఈ రాయల్ సైజు టీ పాట్- ని చూడండి,
నేత్ర  పర్వానందంగా వీక్షించండి.
(Erphila's (Royal Crown Germany) mid-size rooster )

Saturday, September 10, 2011

Kites క్రీడలు



















పతంగీలు !పతంగీలు!
మబ్బులతో పంతాలతో
నీలి గగన శోభలెంతొ
ఇనుమడించెను
రంగు పతంగీ లేఖలు
అందుకొనును రోదసి!

గాలి పటపు కావ్యాలను
గగనమ్ములు పఠియించును
తారలు తనకే రాసిన
ప్రేమ లేఖలివి! కాబోలును!
అని తలచిన చంద మామ
వెన్నెల చేతులను చాచి

వలపు మీర తడిమి చూచి
తడి వెన్నెల నయనమ్ముల
ఆమూలాగ్రము చదువును
గాలి పడగ ఉత్తరములు

@@@@@@@@@@@@@@@@@@@@@               


తడి వెన్నెల నయనమ్ముల!

By kadambari piduri, Feb 10 2009 3:59PM



గాలి పటాలు (Link:-  aavakaaya,kam)




శ్రీలంకలో చంద్ర పానీయాల పేర్లు


కొండ పల్లి బొమ్మ 
moonshine liquor:-
ఇండియా లో సారాయి, మహువా, కల్లు,
ఇత్యాది నామావళి తో ఉన్న పానీయం ఇది.
desi, desi daru, hooch, Potli, kothli,
dheno, mohua, chullu, Narangi, kaju,
Saaraayi and santra - వగైరా పేర్లు
ఐ బెవేరేజ్ డ్రింకు కు ఉన్నవి

తాటి మట్టలకు గాట్లు పెట్టి,
ఆ కొమ్మలకు కట్టిన కుండలలో నింపుతారు.
తాటి ఆకు మట్టలనుండి కారే బొట్లతో-
కల్లుకుండలను నింపుతారు.
"అరకు" అనే పదం కూడా ప్రాచుర్యంలో ఉన్నది.
ఐతే - అరక్కు- పులవబెట్టిన పళ్ళ రసాల నుండి తయారు ఔతుంది. 
ఈ రెండు రకాల షర్బత్తులూ - మత్తు కలిగించేవే!
(Locally produced
moonshine is known in India
as tharra, and also (among other names)
as  Toddy is an alcoholic beverage
made from the sap of palm trees, and
arrack refers to strong spirits made traditionally
from fermented fruit juices, and the sap of the palm tree.)


శ్రీలంకలో వైను, బీరు, చంద్ర పానీయాల పేర్లు:-
నిషా కలిగించే ఈ డ్రింక్సు వలన ఆయా దేశాలలో
ఆర్ధిక వ్యవస్థలు కుదేలు ఔతూండడం కద్దు.
శ్రీలంకలో ఈ వైను, బీరు, చంద్ర పానీయాలకు కల పేర్లు చూడండి.
అవి భారతీయ పదాల పోలికలతో అచ్చెరువు కలిగిస్తాయి.

In Sri Lanka, home based brewing is illegal.[15] However,  this is a lucrative underground business in most parts of the island. Illicit brew is known by many names;

'Kasippu' is the most common and accepted name,
'Heli Arrakku' (archaic term means, Pot-Liquor),
'Kashiya' (which is a pet name
derived from more mainstream term Kasippu)  [కాశియా/ కశిప్పు }
భారత దేశములో "కాశ్యప ముని"- పేరు ద్వారా
ఏర్పడిన పేరుఇది.
ఇలాగే "" కాస్పియన్ సముద్రము - నామ దాతువునకు మూలము కూడా
కాశ్యప రుషి నామమే!

\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\

'Vell Beer' (means, beer of the paddy field),
'Katukambi',[కటుకాంబి]
'Suduwa' (means, the white  substance),
'Galbamuna',
'Gahapan Machan' (means drink it),[త్రాగండి! - అని అర్ధం]
vell fanta depending on locality.

(white sugar (from Sugarcane) manufactured in Sri Lanka,
yeast, and urea as a nitrogen source. )

ముడి పదార్ధాలు:-
(శ్రీ లంకలో)చెఱకు నుండి చేసే
తెల్ల చక్కెర, ఈస్టు, నైట్రోజన్ మున్నగు వాని నుండి
చేసే యూరియా- లు.  

]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]

Wednesday, September 7, 2011

ప్రకృతి ఘన వ్రతము


ఆనంద బాష్పమ్ములు, ఆణి ముత్యములు


తిరుమల శిఖరాల పైన;
ప్రకృతి ఘన వ్రతము సేయు వింత చూడుమా! చెలీ! ||

రాయి రప్ప తాళ వాద్య- రవములను పలికించును;
హాయి నింగి నీరదాల - ఘన మర్దళ ధ్వానమ్ములు||

నెమలి పురికి, మకర తోర-ణములతోడ చెలిమి కూర్మి;
ఖగ రాజు రెక్కలతో - స్వామికి ఛత్రములను నిలుపును ||

పద్మావతి సతి కన్నుల-ఆనంద బాష్పమ్ములు;
పద్మనాభునీ మేనున -సురభిళ ఆణి ముత్తెమ్ములు అవి, కన్నారా!? ||

  [సురభిళ ఆనంద బాష్పమ్ములు ఆణి ముత్యములు]

పత్ర సంపద


త్రమా!
నీ గొప్పదనాన్ని చిత్రించేందుకు
ఆకు పచ్చ వర్ణం- చాలు!
ఐతే,
ప్రకృతి -  పచ్చ దనాన్ని అలుముకున్న తర్వాతే గదూ
ఏ వన్నె కైనా
శ్రీకారం చుట్టుకోబడుతూన్నది!


పూలూ, పైర్లు,
నవ నవలాడే నవ ధాన్యాలు, పళ్ళూ
వానితో అనుసంధానమైన ప్రాణి కోటీ.....
ఇన్నిన్నీ, ఇన్ని రంగులు ప్రతిష్ఠించబడుతూన్నాయి
అంటే- మూలం నీవే సుమీ!

అందుకేనేమో
ఆది దంపతులకు
ప్రీతి ఐనవి బిల్వార్చనాదులు!!!!
గణపతికి నూటొక్క పత్రి పూజలే
                      బహు వేడుక !!!!!!

తాను సుఖముగా శయనించు   
ఆదిశేషు తల్పాన్ని వీడి
శ్రీవిష్ణుమూర్తి
వటపత్రశాయిగా ముద్దులొలికాడు
వరహాల ఎత్తుగా నిన్ను గుర్తించాడు,
దైవ అర్చనలో
నిన్ను – అంతర్భాగస్వామినిగా చేకూర్చుకున్నాడు


ళి భళీ!
ఆ భగవంతుని ఈ చమత్కారం!!!!
“పత్రం పుష్పం ఫలం తోయం.....”
తామరాకుల లేఖలు
అభిజ్ఞాన శాకుంతలమ్
కాళిదాసు మహర్నాటక రచనకు
కాంతి రేఖలు ఐనవి

తాళ పత్రములే
ప్రాచీన కాలమ్మునందిన
భారతీయ సాహితిని పదిలపరచీ,
మనకు అందించినాయి

మరి, మామిడాకుల తోరణాలు
గృహ సామ్రాజ్యముల సమీరములతో
చెబుతూనే ఉంటాయి ఈలాగున....
“ఓ మానవుడా! భగవంతుడే గుర్తించినాడు
హరితదనముల పత్ర సంపద గొప్ప విలువలను
పుడమినందున సంతసాలు
నిరంతరమూ పల్లవించాలంటే
పచ్చదనమును సంరక్షించుకొనుటయె
నీదు బాధ్యత, తెలుసుకొనుమా!”

అందుకే ఓ మనుజులారా!
ధరణి తరువుల పసిడి భరిణగ
నిరంతరము ప్రకాశించాలనుచు
ఎల్లరు కోరుకుందాము
ఇలాతలముకు
ఈ సద్భావనా ఆకాంక్షలు
శుభాశీస్సుల శీకరములు

&&&&&&&&&&&&&&

(పత్ర సంపద)

Tuesday, September 6, 2011

జల ములలో గొప్ప భవనము


"రుద్ర సాగర్" లో Palace














ఇండియాలో నీళ్ళలో కట్టబడిన భవంతులు
రెండు మాత్రమే ఉన్నాయి.
అవి
1. "నీర్ మహల్"(త్రిపురలోని మేలఘర్)
2. "జల మహల్"  (రాజస్థాన్/ the Jalmahal in Rajasthan )
త్రిపురలో నీర్ మహల్ ను
1930 లో మహావీర్ విక్రం కిశోర్ మాణిక్య బహదూర్ కట్టించాడు.
Neer Mahalని "రుద్ర సాగర్" నీటి మధ్యలో కట్టిన
నాటి వాస్తు కళా శిల్పుల నైపుణ్యానికి హాట్సాఫ్!

    (జల మధ్యంలో గొప్ప భవన సముదాయములు
      Neer-Mahal – a ‘palace on water’,
                     at Melaghar, in Tripura)
                          55 km from Agartala ) 

Monday, September 5, 2011

ఇది యేమి వింత?


ఉల్లాస సంపత్తి 
















సకల జీవులకు చకిత చతురముగ చిత్తో-ల్లాస సంపదలు
నికరముగా, ఉన్న పాటుననె-లభియించినవి  
యేమి వింత?, ఇది యేమి వింత?!!      ||

చిన్ని క్రిష్ణా!!
నీ- వినీల విలసిత కుంతలమ్ముల- హేలగ చేరెను భ్రమర శతమ్ములు;  
అలకల చేరి ఊయలలూగే- పిల్ల గాలులు; అళులపైన బహు అలుకలు పొందెను ||

కొలను జలముల - సూర్య కిరణములు;- చంద్ర జ్యోత్స్నలు, చుక్క బింబములు,  
మెలగు వినయముగ- నీ, నఖ ద్యుతులందున - తామెల్లరు ఇతిహాసములైనవి    ||    

సకల జీవులకు చకిత చతురముగ  చిత్తోల్లాస సంపదలు
నికరముగా, ఉన్న పాటుననె- ఒనగూడినవి
యేమి వింత?, ఇది యేమి వింత?!!

Answer:-

నేనేమని అందును?
ఇది యే వింత!
అహాహా! కనుగొనగా
ఇదియే మన అందరి వింత?
                      మన వింత?||


Saturday, September 3, 2011

ఏనుగు నల్లన – ఎందుకని?


Banteay Srei Temple












"ఏనుగు ఏనుగు నల్లన

ఏనుగు కొమ్మలు తెల్లన

ఏనుగు మీద రాముడు

ఎంతో చక్కని దేవుడు ”

బాల బాలికలు పాటలతో ఆటలు ఆడుతూ ఉన్నారు.
అక్కడికి మాస్టారు వచ్చారు.

మయూరికి సందేహం కలిగింది.
“మాస్టారుగారూ!  ఏనుగు అంత నల్లగా ఉంటుందేమిటి?
- ఏనుగు నల్లన -  ఎందుకని?”
మాష్టారు - అందుకు గల కారణము, కథా కమామిషూలను
శిష్యపరమాణువులకు ఇలాగ చెప్పసాగారు.
ప్రాచీనకాలంలో ఏనుగులు తెల్లగా ఉండేవి.

ఏనుగుల మేను రంగు
కాస్తా నల్ల రంగుగా మారడానికి కారణమేమిటి?
ఈ పరిణామానికి ఒక స్థల పురాణము ఉన్నది.
ఆనైయూర్ అనే పుణ్య క్షేత్రము, తమిళనాడు లో ఉన్నది.
ఈ దేవళమునకు ఒక గాథ కలదు.
దేవతల పాలకుడు ఇంద్రుడు.
సురుల ప్రభువైన ఆ మహేంద్రుని వాహనము ఏనుగు,
దాని పేరు ఐరావతము.
దాని వన్నె తెలుపు.
“తాను దేవేంద్రుని వాహనమైనందుకు”
ఆ గజరాజు గర్వం కలిగి ఉండేది.
ఒక రోజు స్వర్గమునకు దూర్వాస మహర్షి వచ్చాడు.
దూర్వాసుడు- అంటేనే
ముక్కుమీద కోపం కలవాడు – అని
ఆ ఋషి తత్వము గురించి అందరికీ తెలుసు.
అందుకనే ఇంద్రుడు మునికి స్వాగతం పలికి మర్యాదలు చేసాడు.
దేవేంద్రుని మన్నన, వినయ విధేయతలకు దూర్వాస ముని సంతోషించాడు.
ఇంద్రునికి అతను ఒక తెల్లని పుష్పమును ఇచ్చాడు.
ఆ white flower పరిమళాలను వెదజల్లుతూ ఎంతో కాంతివంతంగా ఉన్నది.
ఇంద్రుడు “ఈ పువ్వును నా భార్య శచీదేవికి ఇస్తాను” అని అనుకున్నాడు.
కానీ ఆ రోజు సభలో చతుర్దశభువనముల యొక్క అనేక సమస్యలను గురించి,
కుబేరునితో, మంత్రులతో చర్చిస్తూ ఉండిపోవాల్సి వచ్చింది.
పని ఒత్తిడి వలన ఆతడు దివ్య ప్రసూనము గురించి పూర్తిగా మర్చిపోయాడు.
ఇంద్రుడు ఐరావతము పై నుండి దిగుతూ,
హస్తి అంబారీలోనే దాన్ని మర్చిపోయాడు.
దివ్య సుమము తన పైన ఉండడము వలన
ఐరావతమునకు అమిత తేజస్సు కలిగింది.
అసలే తెలుపు, ఇప్పుడు అమోఘ తేజస్సుతో, మిసమిసలాడసాగింది.

ఇంకేముంది, పట్టపగ్గాలు లేకుండా సంచరించసాగింది,
అంతటితో ఊరుకోకుండా అందర్నీ ఊరికేనే పరిహసించసాగింది.
ఒకనాడు దూర్వాసుడు మేఘమండలములో సంచరిస్తూండగా
ఐరావతం కంటబడ్డాడు.

తన తొండంతో బుస్సున గాలి ఊదింది. ముని పడబోయి నిలదొక్కుకున్నాడు.
తెల్ల ఏనుగుకు అంత గీర ఎలా కలిగిందో- తన దివ్యదృష్టితో కనిపెట్టాడు.
“ఓ మదగజమా! పుష్ప ప్రభావమువలన గొప్ప శక్తి నీకు వచ్చింది.
ఇలా విర్రవీగడం నీకు తగదు” అంటూ హెచ్చరించాడు.
కానీ ఆ కరి మౌని పలుకులను పెడచెవిని పెట్టింది.
మౌని క్రుద్ధుడు ఐనాడు.
తన కమండలమునుండి నీళ్ళు దోసిలిలోనికి తీసుకున్నాడు.
“ఓ దంతీ! ఇకమీదట మీ గజ జాతి నల్లగా ఉంటాయి”
ఉరుముతూ అన్నాడు.
అప్పటినుండి ఏనుగుల దేహముల వర్ణము కాస్తా నల్లగా మారిపోయింది.
ఏనుగు గబగబా తన ప్రభువు దగ్గరకు వెళ్ళి మొరపెట్టుకుంటూ,
దూర్వాస శాపం గురించి లబలబలాడుతూ చెప్పింది.
దూర్వాస ఋషివర్యుడు వారికి ఒక శివలింగమును అనుగ్రహించాడు.
ఇంద్రుడు “ఈ శివలింగమును భూలోకమునకు తీసుకువెళ్దాము” అంటూ
పాపపరిహారార్ధము భూలోకమునకు బయలుదేరాడు.
అలాగ పృధ్వీతలమున సంచరిస్తూండగా, ఒక చోట వర్షం వచ్చింది.
అలాగ కుండపోతగా వాన కురుస్తూండడం వలన
ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం అసాధ్యమైనది.
కుంభవృష్టిలో పరమేశునికి అభిషేకం జరిగింది.
కైలాసపతి ఆకాశ గంగా జలాభిషేకంతో ఆనందభరితుడౌతూ,
“ఈ స్థలం పవిత్రమైనది. నన్ను ఈ సీమలో ఉంచండి” అని సెలవిచ్చాడు.
అప్పుడు ఇంద్రుడు అక్కడనే శివలింగమును ప్రతిష్ఠించాడు.
ఆ ఊరికి “Aanaiyur” అనే పేరు వచ్చింది.
అరవములో “ఆనై” అనగా ఏనుగు అని అర్ధము.
ఈ ఆలయము Usilampatti అనే ఊరికి దగ్గరలో ఉన్నది.
(thiruvilayadal మహేశుని లీలా విశేషాలతో ఆనైయూరు విలసిల్లుతూన్నది.

తమిళ రాష్ట్రములో సంవత్సరాది,
జనవరి  రెండవ వారములో Thai pongal – వస్తుంది.
తాయ్ పొంగల్ పండుగ ను తమిళ ప్రజలు
ఉత్సాహభరితంగా జరుపుకుంటారు.
(Tamil month of Thai) థై – నెలలో ఈ కోవెలలో,
ఊరులో చక్కని ఉత్సవ సంరంభాలు జరుగుతూన్నవి.

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

http://www.sidharism.com
......................................…


 ఏనుగు నల్లన – ఎందుకని?
Published On Saturday, August 20, 2011 By ADMIN. Under:
కథలు, జానపద కథలు. ;
రచన:   కాదంబరి
For kids, ఆగస్ట్ (Link for story)

Friday, September 2, 2011

పొలాలే చిత్రాలు, బొమ్మలు (Essay)


జపాన్ మున్నగు దేశాలల్లో వరి పొలాలు, పంట పొలాలు 
అందమైన బొమ్మలు గల కాన్వాసులుగా అవతరిస్తున్నాయి. 
spectacular giant crop murals గా 
పంట పొలాలు సాక్షాత్కరిస్తూన్నాయి. 
ఇవి ఆధునిక కళా జగత్తు లో స్థానం ఆర్జించినవి. 
లలోనే, రక రకాల బొమ్మలను పెంపొందిస్తారు.
cultivated JAL ఒక కళగా రూపొందింది.
అడ్వర్టైస్ మెంట్లు, ప్రకటనలు కూడా ఇలాగ చిత్రించవచ్చునన్నమాట!
ఈ విశాల సస్య కేదారాలు
కర్షకుల చక్కని ప్రణాళికతో, ఓర్పుతో కూడిన నేర్పునకు నిదర్శనాలు.
పంట వేసే టైములోనే ఎలాటి బొమ్మను ఎలా వేయాలో యోచిస్తారు.
బ్రహ్మాండమైన మురల్స్ ను ఇలాగ కొందరు పెంచుతున్నారు.
ఈ సువిశాల ధరిత్రీ చిత్రములు
సృష్టికర్తకు, సృజనకారునికీ మానసిక సంతోషాన్నీ,
ఆత్మానందాన్నీ ఇస్తాయి.
అంతే కాదు, సినిమా షూటింగులు,
టూరిస్టులకు ప్రత్యేక ఆకర్షణనూ కలిగిస్తూ,
కొత్త బంగారు లోకాన్ని ఎట్టెదుట నిలుపుతున్నాయి.
ఇలాటి the rice paddy art venues
ఆహార సముపార్జనకే కాక
మానవునిలోని అంతర్లీన కళా తృష్ణకు కూడా
ఆనవాలుగా నిలుస్తున్నవి కదూ!
అన్నం పరబ్రహ్మ స్వరూపం!అన్నం పరబ్రహ్మ స్వరూపం!
బియ్యం గింజల మీద అతి సూక్ష్మ చిత్రలేఖనములను చిత్రించి,
అందరినీ అబ్బుర పరుస్తునారు.

ఇలాంటి కళ- కొత్త పద్ధతులలో సాగుతూన్న
కళా మార్గాలు అభినందనీయాలు.
బియ్యం గింజల పైన మాత్రమే కాకుండా
బియ్యం పొలాలను కూడా = వరి పైరు క్షేత్రాలను కూడా
రసజ్ఞులు చిత్రలేఖన యవనికలుగా మార్చగలగడం
ఆధునిక యుగ అద్భుత మేధో విన్యాసాలకు ప్రతిబింబాలు.
ఔర! ఔరా! ఔరౌరా!

వెబ్ Ecoist  (లింక్ 1)