Tuesday, May 31, 2016

చిడిముడి ఎందుకు?

చిడిముడి ఎందుకు - 
అడుగులు వేయగ ; 
అదిగో! తిరుమల!
దివ్య తిరుపతిని శ్రీ హరి        || 
;
వరముల గొడుగు వేంకటరణుడు; 
విరాళి వరముల అనుగ్రహమ్ముల; 
పెన్నిధి ఆతడు ; 
వరదహస్తుని చల్లని నవ్వుల నీడల 
మనము సేదదీరుదము! || 
;
సద్భావనలతొ ముడిపడి ఉండగ ; 
దేవుడు సప్తగిరీశుడు ఆప్తుడు ; 
ప్రజలందరికీ అండగ ఉండగ 
దోవలు అన్నియు పూలపాన్పులే! 
ఏమాత్రము ఇకపై 
అలసట అన్నది లేనే లేదుగ! || 
;
శాంతి స్నేహం సామరస్యాది
భావనల పర్ణకుటీరము 
ప్రతి మానసము ; 
కాంతిరూపుని కటాక్షానుగ్రహ 
ఫలితమ్ములుగా, 
దొరికిన సంపద భాగ్య ప్రభలయి; 
మెండుగ భక్తి - 
చిత్తములందున ముడిపడి ఉండగ ||
;
==============================,
;
# chiDimuDi emduku - 
aDugulu wEyaga ; 
adigO! tirumala!
diwya tirupatini Sreehari || 
;
waramula goDugu wEmkaTaraNuDu; 
wiraaLi waramula anugrahammula; 
pennidhi aataDu ; waradahatuni 
challani nawwula nIDala manamu sEdadiirudamu! || 
;
sadbhaawanalato muDipaDi umDaga ; 
dEwuDu aptagiriiSuDu aaptuDu ; 
prajalamdarikii amDaga umDaga ; 
dOwalu anniyu puulapaan pulE! 
Emaatramu 
ikapai alasaTA annadi lEnE lEduga! || 
;
SAmti snEham saamarasyaadi 
bhaawanala parNakuTIramu prati 
maanasamu ; kaamtirUpuni 
kaTAkshaanugraha phalitammulugaa, 
dorikina sampada bhaagya prabhalayi; 
memDuga bhakti - chittamulamduna 
muDipaDi umDaga ||

****************************************, 
by ;- [ భక్తి గీత దళ ] =
] చిడిముడి ఎందుకు? ;/
దివ్య తిరుపతి 

;
అఖిలవనిత ;t 35995 ; - 868 posts ;on May 30, 2016  
;

Monday, May 30, 2016

వెన్నెల దీవులు

నీ నీలి కనుదోయి ; 
చల్లని మమతల ఝరికి ; 
దోసిలిని పట్టేను ;
కృష్ణా! దోసిలిని పట్టేను ||   
అలవోకగ నవ్వెదవు; క్రిష్ణ!;
నీదు – కిలకిల నగవులందు ; 
పలువరుసల కాంతులన్ని ; 
వెన్నెలకు నెలవులయ్యేను 
జాబిల్లికి ద్వీపమ్ములయ్యేను  ||   
పుడమిని వెన్నెలలు ; 
కురియుటకేనా ; 
మేనులోన నిలువెల్లా ; 
రేయి  - నీలిమల రాశిని 
ప్రోది చేసి, నిలిపినావు ||

======================,

           wennela deewulu ;-
;
nii niili kanudOyi ; 
challani mamatala jhariki ; 
dOsilini paTTEnu;
 kRshNA!  ; 
dOsilini paTTEnu || 
;  
alawOkaga nawwedawu; krishNa!; 
niidu – kilakilala nagawulamdu ;
paluwarusala kaamtulanni ; 
wennelaku nelawulayyEnu;
jaabilliki dwiipammulaaye!  ||   
;
puDamini wennelalu ; 
kuriyuTakEnA ; 
mEnulOna niluwellaa; 
rEyi - niilimala raaSini 
prOdi chEsi, nilipinaawu ||  
                                                     

**********************************; 
నీ నీలి కనుదోయి /  వెన్నెల దీవులు  ;-  [ పాట 18  - బుక్ పేజీ 29] =
nii niili kanudOyi  ;-        [ పాట 18  - బుక్ పేజీ 29]     :-   
;

Sunday, May 29, 2016

ఊయెల లూగుమురా!

ఊయెల లూగుమురా! క్రిష్ణా!
          ఊయెల లూగుమురా!    
మురిపెములూరగ, ముద్దులు వేలుగ ;
       ఊయెల లూగుమురా! క్రిష్ణా! 
           ఊయెల లూగుమురా! క్రిష్ణా!   || 
;
దిశాంతముల యోజనముల కొలతలే ఎరుగవా!? 
పాదమెత్తి, పాదమొత్తి, నిఖిల జగము ;  
అలవోకగ కొలిచిన నీకిది ఒక లెక్కా!? 
ఊయెల లూగుమురా! క్రిష్ణా!
          ఊయెల లూగుమురా!     క్రిష్ణా!   || 

మురిపెములూరగ, ముద్దులు వేలుగ ;
       ఊయెల లూగుమురా! క్రిష్ణా!
           ఊయెల లూగుమురా!   
;
ఆ నింగి నుండి – ఈ నేలదాకా ; 
    ఈ నేల నుండి – ఆ నింగి దాకా ; 
          దవ్వులను కొలిచేవా? ;
               దూరాలు కొలిచేవా?|| 
మురిపెములూరగ, ముద్దులు వేలుగ ;
       ఊయెల లూగుమురా! క్రిష్ణా!
           ఊయెల లూగుమురా!   

===============================,    
  
# Uyela luugumurA!     
Uyela luugumurA! kRshNA! 
Uyela luugumurA! 
 ;        muripemuluuraga, muddulu wEluga ; 
               Uyela luugumurA! krishNA! 
                    Uyela luugumurA!    || 
;
gOpaala kRshNA! 
diSAmtamula yOjanamula kolatalE erugawA!? ; 
paadametti, paadamotti, nikhila 
jagamu ;  alawOkaga kolichina niikidi oka lekkA!? || 
 ;        muripemuluuraga, muddulu wEluga ; 
               Uyela luugumurA! krishNA! 
                    Uyela luugumurA!    || 
 ;        muripemuluuraga, muddulu wEluga ; 
               Uyela luugumurA! krishNA! 
                    Uyela luugumurA!    || 
A nimgi numDi – ii nEladaakaa ; 
Uyela luugumurA!    
I nEla numDi – aa nimgi daakaa ; 
dawwulanu kolichEwaa? 
 duuraalu kolichEwaa?
 ;        muripemuluuraga, muddulu wEluga ; 
               Uyela luugumurA! krishNA! 
                    Uyela luugumurA!    || 
;
****************************************,
;
****************************************,
ఊయెల లూగుమురా!    :-   [ పాట 17 - బుక్ పేజీ 28 ]  
 Uyela luugumurA!   :-   
 
అఖిలవనిత 35972 -- 867 posts,  May 29, 2016
కోణమానిని తెలుగు ప్రపంచం 66016 pageviews - 1045 posts,  May 27, 2016 

గోరుముద్దలు

గోరుముద్దలు తినగ వేళాయెరా!  
రా! రా! రారా! క్రిష్ణా! ; 
కోలుకోలంటావు, 
గోల చేస్తుంటావు ;  
రావోయి క్రిష్ణా! గోపాల బాల క్రిష్ణా!
 వేణులోలా! వినోదీ! క్రిష్ణా!   ||
;
అడుగులన్నీ నాట్యముద్రలైనాయి ; 
పడగపై వింత నాట్యముద్రలైనాయి; 
కాలిగోటిన మొత్తి,  కాళీయు మదమణచి; 
అలసిపోయావేమో! రావోయి క్రిష్ణా! 
గోపాల బాల క్రిష్ణా!
వేణులోలా! వినోదీ! క్రిష్ణా!   ||
;
శకటాసురుని అకట! 
విసిరేసినావు! 
నీ తుంటరితనమును 
కట కటా! వేగలేనౌరౌరా! ; 
ఆపరా! ఆపరా! ఆపరా!
రావోయి క్రిష్ణా!
గోపాల బాల క్రిష్ణా!
వేణులోలా! వినోదీ! క్రిష్ణా!   ||
;
గోవర్ధనమ్మును కొనగోట నిలిపినావులే!
చమత్కారివి నీవు ఔరౌరా! 
అంత పెద్ద  కొండను ఇట్టే ఎత్తిన నా వ్రేలు ఇదియే! 
అనుచు నాకు చూపిస్తూను ; 
ఈ గోరుముద్ద నాకు చాలదంటావు!
నాకు చాలదనబోకుమురా! బాలక్రిష్ణా! 
గోప బాలక్రిష్ణా!  గోపాల బాల క్రిష్ణా!
 వేణులోలా! వినోదీ! క్రిష్ణా!   ||| 

*******************************,
;
gOrumuddalu tinaga wELAyerA!  raa! rA! rArA! krishNA! ; 
kOlukOlamTAwu, gOla chEstumTAwu ;  raawOyi krishNA! 
వేNulOlaa! winOdI! krishNA!  ||
;
aDugulannii nATyamudralainaayi ; 
paDagapai wimta nATyamudralainaayi; 
kaaligOTina motti,  kALIyu madamaNachi; 
alasipOyAwEmO! rAwOyi krishNA! gOpAla 
bAla krishNA! వేNulOlaa! winOdI! krishNA! || 
SakaTAsuruni akaTa! wisirEsinAwu!
;
nI tumTaritanamunu kaTa kaTA! wEgalEnauraurA! ; 
aaparaa! aaparaa! aaparaa!
raawOyi krishNA!
వేNulOlaa! winOdI! krishNA!  ||
;
gOwardhanammunu konagOTa nilipinaawulE! 
chamatkaariwi niiwu aurauraa! ; 
amta pedda  komDanu iTTE ettina naa wrElu idiyE! 
anuchu naaku chuupistuunu; ii 
gOrumudda naaku chaaladamTAwu! 
naaku chaaladanabOkumurA! 
baalakrishNA! aa wrElu idiyE! ; 
anuchu naaku chuupistuunu; 
ii gOrumudda naaku 
chaaladamTAwu! 
naaku chaaladanabOkumurA! baalakrishNA! 
gOpa baalakrishNA! 
వేNulOlaa! winOdI! krishNA!  || 
;
****************************************,
;
గోరుముద్దలు   :-   [ పాట 16 - బుక్ పేజీ 27  ] 
gOrumuddalu   :-   [ పాట 16 - బుక్ పేజీ 27  ]  

Saturday, May 28, 2016

వేణు గానమున విశ్వము

వేణు గానమునమున రేణువైనదీ విశ్వము ; 
పూరేణువుగా, ‘విరి మానిని'గా ;  
పరిణతి చెందెను విశ్వము ;  
పరిణామ రీతి ఇది, అవశ్యము || 
;
అణువు అణువు, ప్రతి అర్చన – 
దినుసుగ మారిన జగతి, 
నిన్నలరించినదో, తానలరారినదో,
మరి మరి - నిన్నలరించినదో, తానలరారినదో!  ||  
;
తరు అర్చకులు, కొమ్మ పళ్ళెముల 
మోయుచుండిరి ఫలములనెన్నో!
నీ  మోవిచిగురునకు అందీయంగా ;
శబరీమాత ఎంగిలిపళ్ళను గైకొను గాధ ;
గురుతుకొచ్చినద గోవిందా!!!??   ||
;
‘వెన్నెల పుప్పొడి రజము'ను ; 
తనివితీర తనువెల్ల నింపుకుని; 
తనకు తానుగా -  నిలిచెను చూడుము;
కొలను తన్వి కోలాటము లాడగ  ||
;  
==========================,
wENu gAnamuna wiSwamu

wENu gAnamunamuna rENuwainadii wiSwamu ; 
puurENuwugaa, ‘wiri maanini' gaa ;  
pariNati chemdenu ; 
pariNaama riiti idi, awaSyamu || 
;
aNuwu aNuwu, prati archana – 
dinusuga maarina jagati, 
ninnalarimchinadO, tAnalaraarinadO,
mari mari ninnalarimchinadO, tAnalaraarinadO!  ||  
taru archakulu, komma paLLemula  
mOyuchumDiri ; phalamulanennO : 
nI  mOwichigurunaku amdIyamgaa ;
Sabariimaata emgilipaLLanu gaikonu gaadha ;
gurutukochchinada gOwimdA!? || 
‘wennela puppoDi rajamu ‘nu ; taniwitiira ; 
tanuwella nimpukuni; 
tanaku taanugaa - nilichenu chUDumiTu ;
kolanu tanwi, kOlATamu lADaga ;krishNaa!  ||
************************************************,

వేణు గానమున విశ్వము  :-   [ పాట 14 - బుక్ పేజీ 25 ] 
wENu gAnamuna wiSwamu  :-   [ pATa 14 - buk pEjI 25 ] 
3. కన్నులచూపులు :-  ; prabha - LINK ] :- 
నీ పదపద్మములను చేరుటకై ; 

ఎక్కెద సోపానముల ; నెన్నైన నా స్వామీ! ||నీ|| 


************************************************,
;
అఖిలవనిత 35958 = 864 posts, May 27, 2016 -
కోణమానిని తెలుగు ప్రపంచం - 66006 [/  61292 ;  ] ; 1045 posts, ; May 27, 2016 
తెలుగురత్నమాలిక ; 5420 - 155 posts; on May 19, 2016 

Friday, May 27, 2016

Yankee - అంటే ఏమిటి?

కొన్ని సార్లు కొన్ని ప్రాంతాల వారికి అనుకోకుండా వింత పేర్లు ఏర్పడుతూంటాయి 
వీటిని తుంటరి పేర్లు, ముద్దుపేర్లు, nick names అనవచ్చును.
త్రిలింగ దేశీయులం కాబట్టి మనం "తెలుగు వాళ్ళం" ఐనాము. 
అట్లాగే ఆంధ్రదేశస్థులం, కనుక "ఆంధ్రులు" ఆంధ్రజాతి వారము - ఐనాము.
తమిళులకు "అరవ వాళ్ళు" అనే పేరు వచ్చింది, 
అసలు హేతువు ఏమిటో స్పష్టంగా తెలీదు.  
&&&&&&&&&&&&,
ఆధునిక కాలం ఇది.
నేడు ప్రపంచం ఒక ఊరు, గ్రామం - ఐనది.
దేశ, విదేశాల సంస్కృతుల మధ్య రేఖలు చెరిగిపోతున్నవి.
అమెరికాలో వాడుకలో ఉన్న పదజాలం, విద్యావంతులు - 
వెంటనే చెప్పేస్తున్నారు.
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లో బాగా వాడుకలో ఉన్న పదాలలో ఒకటి "యాంకీ".
Yankee గురించి ఒక డూడుల్ ఉన్నది.
ఆ హాస్య poem ఇదిగో! ఇటు చదవండి.

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

A humorous aphorism attributed to E. B. White 
summarizes the following distinctions: 
To foreigners, a Yankee is an American.
To Americans, a Yankee is a Northerner.
To Northerners, a Yankee is an Easterner.
To Easterners, a Yankee is a New Englander.
To New Englanders, a Yankee is a Vermonter.
And in Vermont, a Yankee is somebody who eats pie for breakfast.
;
Another variant of the aphorism replaces the last line with: 
"To a Vermonter, a Yankee is somebody who still uses an outhouse". 
There are several other folk and humorous etymologies for the term.

&&&&&&&&&&&&

అన్నట్లు, మన దేశంలో 1980 ప్రాంతాలలో
"Yankee Doodle" అనే పేరుతో ఐస్ క్రీమ్ popular ఐ ఉన్నది.  
;
==================================,
యాంకీ / Yankee -?  ;
konni saarlu konni praamtaala waariki anukOkumDA wimta pErlu ErpaDutuumTAyi 
weeTini tumTari pErlu, muddupErlu, #nick names# anawachchunu.
trilimga dESIyulam kaabaTTi manam "telugu waaLLam" ainaamu. aTlaagE aamdhradESasthulam, kanuka "aamdhrulu" / aamdhraajaati waaramu - ainaamu.
tamiLulaku "arawa wALLu" anE pEru wachchimdi, asalu hEtuwu EmiTO spashTamgA telIdu.  
&&&&&&&&&&&&&&&&&&,
aadhunika kaalam idi.
nEDu prapamcham oka uuru, graamam - ainadi.
dESa, widESAla samskRtula madhya rEKalu cherigipOtunnawi.
amerikaalO wADukalO unna padajaalam, widyaawamtulu - wemTanE cheppEstunnaaru.
yunaiTeD sTETs aaph amerikaa lO baagaa wADukalO unna padaalalO okaTi "yAmkI".
/ gurimchi oka DUDul unnadi.
aa haasya poem idigO! iTu chadawamDi.

**************************************,

;
అఖిలవనిత 35939=- 863 posts, on May 26, 2016  

Thursday, May 26, 2016

గోవర్ధనాల గోవింద క్రిష్ణా!

గోవర్ధనాల గోవింద క్రిష్ణా!
వంశీ కృష్ణా! మురళీధారీ!   || 
;
భాండీర వనము సర్వము ; 
మధుర గాన కలశమైనది!
వేణురవళీ సుధలు నిండుగ ; 
త్రుళ్ళెడి కాంచన  కలశమైనది! 
గోవర్ధనాల గోవింద క్రిష్ణా!
వంశీ కృష్ణా! మురళీధారీ!   ||  
;
నిదుర లేచి, ఒడలు విరిచి, 
మెటిక చిటికెలు చిటుకుమను మును 
చిట్టి డమరుక ధ్వనులు అవగా ; 
విరించి, ఈశులు వంగి చూచుచు ; 
అంబరమున అట్టె నిలువగ; 
వారి నడుములు పట్టుకొనగా;  
పత్నులకు గుబులాయెరా!    .............. 
;
శారద,  భవాని మాతలు, 
పతుల బాగోగులను గూర్చి, కూరుచుండి, 
కూరిమి చర్చించుకొనుచూ, 
,                         బయలుదేరిరి, 
నిన్ను బాగా నిలదీయుచు,  
,            మెండుగా ప్రశ్నించవలెనని     || 
================================,
;
gOwardhanaala gOwimda krishNA!
wamSii kRshNA! muraLIdhArI!   || 
BAmDIra wanamu sarwamu ; 
madhura gaana kalaSamainadi!
wENurawaLii sudhalu nimDuga ; 
truLLeDi kaamchana  kalaSamainadi! 
gOwardhanaala gOwimda krishNA!
wamSii kRshNA! muraLIdhArI!   || 
;
nidura lEchi, oDalu wirichi, 
meTika chiTikelu chiTukumanu munu;
chiTTi Damaruka dhwanulu awagaa ; 
wirimchi, iiSulu wamgi chuuchuchu ; 
ambaramuna aTTe niluwaga; 
waari naDumulu ;  paTTukonagaa; 
patnulaku gubulaayerA! 
Saarada,  Bawaani maatalu, 
patula baagOgulanu guurchi, kuuruchumDi, 
kuurimi charchimchukonuchuu, 
bayaludEriri, ninnu baagaa niladiiyuchu, 
memDugaa praSnimchawalenani ||       
;
,,,,,,,,,,,,, [  extra ; + page 24 ]

హేమహారములు / గాలి వలువ [ song 2 ]

తెరువరా నీ కన్నుదోయి! ; 
దోసిలిని భక్తి ముడిచి ఒగ్గీ,  
వేచి చూచుచు నిలిచె నిఖిలము ; 

నీ కోసమేను శ్రీకృష్ణస్వామీ! || 
;
పూలతావుల చందనమ్ముల రంగరించి ; 
హరివిలుల హొయలు హేమహారమ్ములను; 
నీదు గళమున వేయవలెనని ; 
నీలి గగనము వేచిఉన్నది; 
రాగదోయీ! లేచి, రాగదోయీ!  || 
మంచు ముత్యపు ద్యుతిని కలిపిన ; 
కస్తూరి తిలకము తీర్చిదిద్దగ; 
ఎల్ల ప్రకృతి ఎరుకతో ఎట్టెదుట నిలిచీ,  
నిలువుకాళ్ళ జీత మడుగుచు ; 
నీదు అడుగుల మడుగులొత్తుచు ; 
రాగదోయీ! లేచి, రాగదోయీ!  ||
;
==============================;

             hEmahaaramulu/ gaali waluwa  :-  

teruwaraa nii kannudOyi! ; 
dOsilini bhakti muDichi oggI, ggi 
WEchi chuuchuchu niliche nikhilamu ; 

nii kOsamEnu SrIkRshNaswAmI! ||
;
puulataawula chamdanammula ramgarimchi ; 
hariwilula hoyalu hEmahaarammulanu; 
niidu gaLamuna wEyawalenani ; 
niili gaganamu wEchiunnadi; 
raagadOyii! lEchi, raagadOyii!  || 
;
mamchu mutyapu dyutini kalipina ; 
kastuuri tilakamu tiirchididdaga; 
ella prakRti eTTaeduTanu ; 
erukatO niluwukaaLLa jIta maDuguchu ; 
niidu aDugula maDugulottuchu ; 
raagadOyiiI! lEchi, raagadOyii!  || 
;
@@@@@@@@@@@@@@@@@@@@@ 
;
హేమహారములు / గాలి వలువ :-   [ పాట  13 - బుక్ పేజీ  25 ] 
gaali waluwa :-   [ pATa  13 - buk pEjI  25 ] 

గాలి వలువ [ song 1 ]

తెరువరా నీ కన్నుదోయి! ; 
ఇంక నిద్దుర లేచి, రాగదోయీ! : 
రాగమురళీధారి క్రిష్ణా! ; 
మదన మోహనా! 
మోహనానురాగ క్రిష్ణా! || : 
;
వేయి వెలుగుల వేలుపు ; 
పాలపుంతల; కాంతిసుధలను 
నింపి నిలిచేను , 
నిన్ను పిలిచేను ;  
రాగదోయీ! లేచి, రాగదోయీ!  ||
;
పసిడి వెలుగుల నలుగు లలది ; 
వెండి వెలుగుల తలంటు పోసి : 
గాలి వల్లెవాటున తుడువ ; 
వేచి ఉన్నది తూర్పు దిక్కు : 
రాగదోయీ! లేచి, రాగదోయీ!  ||
;
===============================,
gaali waluwa
teruwaraa nii kannudOyi! ; 
imka niddura lEchi, raagadOyii! : 
raagamuraLIdhaari krishNA! ; 
madana mOhanaanuraaga krishNA! || 
wEyi welugula wElupu ; 
paalapumtala ; kaamtisudhalanu 
nimpi; nilichenu, ninnu pilichenu ;   
raagadOyii! lEchi, raagadOyii!  ||
;
pasiDi welugula nalugu laladi ; 
wemDi welugula talamTu pOsi : 
gAli wallewATuna 
tuDuwa ; wEchi unnadi tUrpu dikku : 
raagadOyiiI! lEchi, raagadOyii!  ||  

;
*********************************************, 
గాలి వలువ :-   [ పాట  13 - బుక్ పేజీ  25 ] 
gaali waluwa :-   [ pATa  13 - buk pEjI  25 ] 
;

రాధా నవ మాలికలు [ song 2 ]

కదలక మెదలక కూర్చొనరా; 
ఇంపుగ నీకు సిగను చుట్టెదను ; 
సుద్దులు చెప్పుతు నే ;
సింగారించెద నిను ముద్దుల కన్నయ్యా!  ||    
కుదురుగ నీవు కూర్చుని ఉంటే
వెన్నపూసలను మరిన్ని ఇస్తా!
తిన్నగ నాసాభరణము పెడతా!   
మోహన క్రిష్ణయ్యా! సమ్మోహన క్రిష్ణయ్యా!  ||   
మకుటము కుదురుగ ఉండనీయరా! 
ఆపై దేనిని ముడువమందువు?  
మొగలిరేకులా? మల్లెపూవులా? 
సందడి చేసే కేకి పింఛమా? || 
;
నీదు – నుదురున హుషారు షికారు  చేసే ; 
ముంగురుల సౌరును ; సరుదమదువా?  
అలకల మెల్లగ తీర్చిదిద్దుదును; 
ఇందుకు ఏమి పొందిక నుండును? --- 
తొందర చేసే రాధ హృదయమా? 
ఈ జానపదుల కనకాంబరగీతి భణితులా? || 
;
=======================================,

raadhaa nawa maalikalu  [ song 2 ] 
;
kadalaka medalaka kuurchonaraa; 
impuga niiku siganu chuTTedanu ; 
suddulu chepputu nE ;
simgaarimcheda ninu muddula kannayyA!  ||   
kuduruga neewu kuurchuni umTE
wennapuusalanu marinni istaa!
tinnaga naasaaBaraNamu peDataa!   
mOhana krishNayyA! sammOhana krishNayyA!  ||   
makuTamu kuduruga umDanIyaraa! 
Apai dEnini muDuwamamduwu?  
mogali rEkulaa!? mallepuuwulaa?
;
samdaDi chEsE kEki pimCamA? ||  ;  
niidu – nuduruna hushaaru shikaaru  chEsE ; 
mumgurula saurunu ; sarudamaduwaa? ; 
alakala mellaga tiirchididdudunu; 
imduku Emi pomdika numDunu? --- 
tomdara chEsE raadha hRdayamA? 
I jaanapadula kanakaambaragiiti bhaNitulA? ||
;

నవ వకుళమాలికలు [ song 1 ]


కదలక మెదలక కూర్చొనరా;
ఇంపుగ నీకు సిగను చుట్టెదను; 
చక్కని కన్నయ్యా! 
నా ముద్దుల కన్నయ్యా!  ||
;
నారద ముడిని చుట్టినానురా! 
అందున నేమి పెట్టమందువు? 
మొగలిరేకులా? మందారములా?  
కుందమాలలా? : నవమాలికలా?  ||
;
చూడామణిని పెట్టినానురా!
అందున నేమి తురుమమందువు? 
పారిజాతములా? ; కలువపూవులా? 
జపాసుమములా? వకుళమాలలా?  ||

===========================,

nawa wakuLamaalikalu

kadalaka medalaka kuurchonaraa; 
impuga niiku siganu chuTTedanu ; 
muddula kannaayA! muddula kannayyA!  ||
naarada muDini chuTTinAnurA! 
amduna nEmi peTTamamduwu? 
mogalirEkulaa? mamdaaramulaa? :  
kumdamaalalaa? : nawamAlikalA? ||
;
chUDAmaNini peTTinAnurA! 
amduna nEmi turumamamduwu? 
pArijAtamula? ; kaluwapuuwulaa? : 
japaasumamulaa? wakuLamAlalA?  ||
;
-----------------------------------------------------------
;     
nawa wakuLamaalikalu ;   [ pATa 12  - buk pEjI   23 ] 
నవ వకుళమాలికలు :-   [ పాట 12  - బుక్ పేజీ   23 ]  

అఖిలవనిత 35910 pageviews - 858 posts,=on May 25, 2016 -

Wednesday, May 25, 2016

ఉయ్యాలలు [ song - 2 ]

రారే! రారే! - రారే, రారే, రమణుల్లార! -    
రమణీలోలుని తోడ ఆడగా    ||  
;
స్వాతిముత్తెపు ముక్కున కోపం;  
చలిలో ఎండై, చురకలు వేయగ ; 
అలిగెను కృష్ణుడు అలివేణులపై ;  
“నే పిలువగనే రాలేదేమ”నుచు ;  
“మక్కువతో విచ్చేయరు” -  అనుచును   || 
;
పీతాంబరములు నింగికి ఎగయ ; 
గళ పతకమ్ముల తారలు తళుకన ; 
గోటి చుక్కలను జాబిలి ముద్దిడ ;
ఊగెను కృష్ణుడు లతల ఊయెల ;
తూగెను యమునా రాగధారల   ||  
రారే! రారే! - రారే, రారే, రమణుల్లార!     
రమణీలోలుని తోడ ఆడగా    ||  

;============================,
                      uyyaalalu :- [ song - 2 ]
;
rArE!  rArE! -  rArE,  rArE, ramaNullAra! -   
ramaNIlOluni tODa ADagA    ||
;
swaatimuttepu mukkuna kOpam; 
chalilO emDai, churakalu wEyaga ; 
aligenu kRshNuDu  aliwENulapai ; 
“nE piluwaganE rAlEdEma” nuchu ;
“makkuwatO wichchEyaru” - anuchunu   ||  
piitaambaramulu nimgiki egaya ;
gaLa patakammula taaralu taLukana ; ;
 gOTi chukkalanu jaabili muddiDa ; 
uugenu kRshNuDu latala uuyela ;
tuugenu yamunaa raagadhaarala   ||  

----------- 
ఉయ్యాలలు :- [ song - 2  [ పాట 11  - బుక్ పేజీ 22  ]    
;
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

 uuyalalu / ఊయలలు [ song - 1 ] ; -
;
rArE!  rArE! -  rArE,  rArE, ramaNullAra! -   
ramaNIlOluni tODa ADagA    ||
;
Sirasuna SiKi pimCamu kadala ; 
niili mumgurulu allana chedara ; 
kasturi tilakapu nuduTa swEdamu : 
mutyapu damDai merasi kadalagaa  
ADenuchemguna, amgana chemgaTa :
ADenu kRshNuDu, bRmdAwanilO ||  
;
niilikannula niggulu kadala ; 
waaluchuupula kaamtulu meraya ; 
edapai kaustubha haaramu kulukaga
kEki bhujamupai gaaramu lolukaga  
ADenu kRshNuDu daaguDumUtalu ;
kommala daagina kommala tODa   || 
;
; links ,  links , links , links , links , links , links , links ,

1]   ఊయలలు [ song - 1 ;  [ పాట 11  - బుక్ పేజీ 22  ]  [song 1] ;
 F B :- మన సంస్కృతి - ఆచారాలు సంప్రదాయాలు.  
;
2] LINK :- magazine :- 
http://vocaroo.com/i/s0Zfhj12Devx (7. 33)
కృష్ణ భక్తి - రెండవ సంచిక: 
================================ 
;

Tuesday, May 24, 2016

ఊయలలు [ song [ 1 ]

రారే!  రారే! -  రారే,  రారే, రమణుల్లార! -   
రమణీలోలుని తోడ ఆడగా    ||
;
శిరసున శిఖి పింఛము కదల ; 
నీలి ముంగురులు అల్లన చెదర ; 
కస్తురి తిలకపు నుదుట స్వేదము : 
ముత్యపు దండై మెరసి కదలగా 
ఆడెనుచెంగున, అంగన  చెంగట :
ఆడెను కృష్ణుడు, బృందావనిలో ||  
;
నీలికన్నుల నిగ్గులు కదల ; 
వాలుచూపుల కాంతులు మెరయ ; 
ఎదపై కౌస్తుభ హారము కులుకగ
కేకి భుజముపై గారము లొలుకగ 
ఆడెను కృష్ణుడు దాగుడుమూతలు ;
కొమ్మల దాగిన కొమ్మల తోడ   ||

*************************************; 

see this song in Beautiful Magazine :- =
LINK :- ప్రాంజలి ప్రభ ; కృష్ణ భక్తి ;
; -------      ఊయలలు   :-   [ పాట 11  - బుక్ పేజీ 22  ]   
అఖిలవనిత - 35871 pageviews - 856 posts, [ May 20, 2016 ]

Friday, May 20, 2016

కలకంఠి కలరవములు

చిలుకు చిలుకు చిలుకు! 
చిలుకుడు సవ్వడులు!   ||  
;
వయారాలు  ఒలకబోస్తు ; 
వెన్న, పాలకుండలతో  ;  
వస్తూన్న గోపికల 
చిరు - నగల కలరవములు ;
చిరుగాలుల  సరదాగా చిలుకుచున్నవి   ||
;
క్రిష్ణుయ్య రాక కొరకు ; 
వేసార్చు ఎదురుచూపులు ;
రాధిక ఆవేదనలు ; 
కలకంఠి గళమందున 
'నవనీత'రమవగ చిలుకుచున్నవి   ||

===============================,

# chiluku chiluku chiluku! 
chilukuDu sawwaDulu!   ||  
;
wayaaraalu olakabOstu 
wenna, paalakumDalatO  ;   
wastuunna gOpikala 
chiru nagala kalarawamulu ; 
chirugaalula - saradaagaa chilukuchunnawi || 
;
krishNuyya raaka koraku ; 
wEsaarchu eduruchuupulu ;
raadhika aawEdanalu ; 
kalakamThi gaLamamduna 
nawaneetaramawaga chilukuchunnawi  ||
;

ఉళ్ళుళ్ళా ఉళ్ళ అనుచు

వింత నామమెట్లాగ నుదుటి పైకి చేరినదో! 
కస్తూరి నామమెటుల చేరినదో!   
చెప్పండీ అమ్మలాల! || 
;
లాల పోసి యశోదమ్మ దిద్దినదా ఏమి?  
పెదవి ఔడు గరచి ఉళ్ళుళ్ళా ఉళ్ళ అనుచు ; 
చిన్ని చుబుక మెత్తి పట్టి ; 
దొడ్డమ్మ రోహిణి తీర్చినదా ఏమి? || 
;
ఊయెల కడ క్షణము నిలచి 
బాలక్రిష్ణు జూచి 
లిప్తపాటు తనను తాను - మైమరచిన ;  
క్రూర పూతనా రాక్షసి 
కన్నయ్య నెన్నుదుటను ; 
కొత్త బొట్టు పెట్టినదో ఏమోనే!? ||  
 
 #  =============== ,
;
wimta naamameTlaaga ; 
nuduTi paiki ; chErinadO! 
kastuuri naamameTula chErinadO!   
cheppamDI ammalAla! || 
;
laala pOsi yaSOdamma diddinadA Emi? 
pedawi auDu garachi ; uLLuLLA uLLa anuchu ; 
chinni chubuka metti paTTi ;
doDDamma rOhiNi ; tiirchinadA  Emi?   || 
;
uuyela kaDa kshaNamu  nilachi
baalakRshNu juuchi ;
liptapaaTu tananu taanu - maimarachina ; 
kruura puutanaa raakshasi 
kannayya nennuduTanu ; 
kotta boTTu peTTinadO EmOnE!? ||
;

Thursday, May 19, 2016

మయూరి పింఛము


పింఛమంత దాచినావు; 
గుబురు పింఛమంత దాచినావు ; 
ఓ మయూరీ! 
నీవెంతటి గడుసరివే! 
నీ పింఛమెంత ధన్యమో ||
;
రెండు కనులు చాలవని: 
వేల కనులు మేనులోన : 
ధారణను చేసినావు ||
;
చిన్నారి కన్నయ్య వచ్చెనని, 
ఏ రీతిని కనుగొందువో : 
అలికిడికే  -
'పులకింతల  పురి' ని విప్పి ఆడేవు ||       

===============================,

# mayuuri pimCamu :- 
  
pimCamamta daachinaawu; 
guburu pimCamamta daachinaawu ; 
O mayUrI! 
niiwemtaTi gaDusariwE! 
nI pimCamemta dhanyamO ||
;
remDu kanulu chaalawani: 
wEla kanulu mEnulOna : 
dhAraNanu chEsinAwu ||
;
chinnaari kannayya wachchenani, 
E rItini kanugomduwO : 
alikiDikE 
'pulakimtala-puri'ni wippi ADEwu ||  

**********************************,


   మయూరి పింఛము :-  [ పాట 20 - బుక్ పేజీ 31 ]     :-  

గుప్పెడు పింఛముల గుత్తి


"ఏమర్రా! నే కొట్టిన గోటీ బిళ్ళ ఏది?"
"అదిగో అక్కడ!" చూపించాడు శ్రీ బాలకృష్ణుడు; 
"నా వామనగుంటల బాడిస గింజలు ఏవి? ఎక్కడ?"
"అదిగో అక్కడ!" చూపించాడు కృష్ణ మూరితి ;

"మా పెంపుడు మయూరి పురిలో పింఛాలు 
ఏవీ? ఎక్కడ?"  అడిగినవాడు ఈ పగిది
అందాల బాల క్రిష్ణమ్మ! 

"ఇవిగో ఇక్కడ!" పకపక నవ్వుతు 
చూపించారు గొల్లభామలు
దాచిన ఈకలు తెచ్చిరి పడతులు ; 
దాచిన నెమలి కన్నులు చూపిరి;

గుప్పెడు గుప్పెడు పింఛములు ; గుత్తిగ పట్టి; 
కృష్ణుని సిగముడినందు 
ఉంచినది నవ్వుతు రాధిక!

==============================================,

"EmarrA! nE koTTina gOTI biLLa Edi?"
"adigO akkaDa!" chUpimchaaDu SrI bAlakRshNuDu; 
"naa waamanagumTala bADisa gimjalu Ewi? ekkaDa?"
"adigO akkaDa!" chUpimchaaDu kRshNa muuriti ;

 aDiginawaaDu ii pagidi
amdaala baala krishNamma! 
"mA pempuDu mayUri purilO pimCAlu EwI? ekkaDa?" 
"iwigO ikkaDa!" pakapaka nawwutu 
chuupimchaaru gollabhaamalu
daachina iikalu techchiri paDatulu ; 
daachina nemali kannulu chuupiri;

guppeDu guppeDu pimCamulu ;
guttiga paTTi; 
kRshNuni sigamuDinamdu umchinadi nawwutu raadhika!

*************************************************,

అఖిలవనిత
Pageview chart 35820 pageviews - 852 posts, last published on May 17, 2016

Tuesday, May 17, 2016

'రామ'మై చిలుకమ్మ

పంచ వన్నెల చిలుక ; 
   శ్రీరామచిలుకమ్మ అయ్యేను!
అయ్యరో! రామయ్య!
 నీ గాధలను పలికినంతనె చిలుక-
     శ్రీరామచిలుకమ్మ పేరొందె పేర్మిని!  || 
;
సీతమ్మ 'శ్రీ - తలపు'  రంగుగా నుడివినది  ;
   తన డెందముప్పొంగ- శ్రీరామచిలుకమ్మ ;
       అందుకే ఆయేను అది రామచిలుక   ||
;
చెంగునా పడవెక్కి గుహుడు ఉల్లాసముగ ; 
   పాడిన హైలెస్స పదములన్నియు ;
     ఆయెనే రఘురాము రంజిల్లు కథలుగా ||  
;
=================================,

pamcha wannela chiluka ; 
  Sreeraamachilukamma ayyEnu!
ayyarO! raamayya! 
   nee gaadha palikinamtane
pEromde pErmini!  ||  
seetamma Sreeతlapu ; ramగుgaa nuDiwinadi ;
tana Demdamuppomga -  Sreeraamachilukamma
amdukE AyEnu tanu raamachiluka  ||
;
chemgunaa paDawekki ; guhuDu ullaasamuga ; 
paaDina hailessa padamulanniyu ;
aayenE raghuraamu ramjillu kathalugaa || 
;
******************************************,
;
 ----------- [ శ్రీరామ సుధ ]

Monday, May 16, 2016

ఎపుడో ఏమో గానీ ........

వర వర్ణిని రాధికా!!
గమనించవు దేనినీ!
       పలు వింతలు, విచిత్రములు
                 సృష్టిలోన ఏర్పడినవి! 
                        వర వర్ణినీ! రాధికా!!|| 
;
~ తటాకముల తరంగములు ; 
  చిరు హొయలులు నేర్చెను ; 
                  ఎపుడో ఏమో గానీ!  
~ నీ కురులందలి 
సొగసరి - చలనముల చతురతలను  ;  
     ఎపుడో ఏమో గానీ 
          ఒడుపుగాను నేర్చినవి!  ॥  

~ హరిణముల నయనద్వయి ; 
   తరళ సొబగులందినవి; 
                ఎపుడో ఏమో గానీ! 
~ నీదు వీక్షణముల 
      తరుణ సుందరములను 
          ఎపుడో ఏమో గానీ  
                పుణికి పుచ్చుకున్నవి   || 

==================,

# warawarNini, raadhikA!
gamanimchawu dEninii!
palu wimtalu, wichitramulu
sRshTilOna ErpaDinawi!
     warawarNiniఐ! raadhikA! || 
;   
 ~ taTAkammula taramgamulu ; 
chiru hoyalulu nErchenu; 
epuDO EmO gAnI! ; 
nErchenu ; 
epuDO EmO gAnI!
;
 ~ nee kurulaamdali ; sogasari - 
chalanamula chaturatalanu ; 
  epuDO EmO gAnI , 
        oDupuganu nErchinawi !  || 
;
~ hariNamula nayanadwayi ;
    taraLa sobagulamdinawi; 
      epuDO EmO gAnI ;
;

~ needu weekshaNamula; 
     taruNa sumdaramulanu; 
         epuDO EmO gAnI ; 
           puNikipuchchukunnawi!  || 

                
------- [ ఎపుడో ఏమో గానీ ; = #  epuDO EmO gAnI ; #]

 అఖిలవనిత
Pageview chart 35786 pageviews - 850 posts, last published on May 11, 2016

Wednesday, May 11, 2016

సీతాకోక చిలక, तितली


బటర్ ఫ్లై! బటర్ ఫ్లై! 
నీ రెక్కలపైన విరజిమ్మెను రంగులెన్నొ ; 
ఆ నీలి ఆకాశం;
నీ రెక్కల పైన ఆరబోసినది వన్నెలెన్నొ ; 
ఈ విశాల వసుంధర! 
;
లోకాన పూజలెన్నొ జరుగుతున్నవి ; 
పత్రి, పూలు, అత్తరులు ; 
క్రొవ్వొత్తి, గుగ్గిలాలు ; అగరు ఒత్తులు;
ధూప దీప సేవా నైవేద్యాల రీతులెన్నెన్నో!
తన పూజల సమము కావు, ఎంచి చూడగా!
;
ప్రశ్న : ఎవరి పూజలు? 
                    మించుట ఎట్లాగ?
జవాబు ;- వన్నెలెన్నొ నింపుకున్న 
                    రెక్కలను ఆడిస్తూ;
                       భువి అంతట తిరిగేను సీతకోక! 
వన్నె రెక్క రెపరెపలతొ ;
ప్రతి లిప్త అందించును ;
అగణితమౌ  అర్చనలను ;
నిఖిల విశ్వాలకు ఈ సర్వ ప్రకృతికి. ;
సీతమ్మకు ఇష్టమైన చిలక కాని చిలకమ్మ!
ఈ సీతాకోక చిలకమ్మ!
కనుకనే నొక్కి మరీ చెబుతున్నా,
तितली రెపరెప పూజలు మిన్నయే
అన్నిటికన్నా!
తక్కిన అన్నింటికన్నా! 
;
=====================================,
# baTar phlai! baTar phlai! 
nii rekkalapaina wirajimmenu ramgulenno ; 
aa neeli aakaaSam;
nii rekkala paina aarabOsinadi wannelenno ; 
ii wiSAla wasumdhara! ;;;
lOkaana puujalenno ; jarugutunnawi ; 
patri, puulu, attarulu ; kro wwotti, 

guggilaalu ; agaru ottulu;
dhuupa deepa sEwaa naiwEdyaala reetulennennO! ;;;;;;;
tana puujala samamu kaawu, emchi chUDagA! ;;;;;
praSna : ewari puujalu? mimchuTa eTlaaga?
jawaabu ;- wannelenno nimpukunna rekkalanu ; aaDistuu;
bhuwi amtaTa tiriEnu seetakOka! 
wanne rekka reparepalato ; prati lipta 

amdimchunu ; agaNitamau archanalanu ; 
ii prakRtiki. nikhila wiSwaalaku ;
seetammaku ishTamaina chilaka kaani chilakamma! 
ii seetaakOka chilakamma!  
kanukanE nokki marii chebutunnaa,
तितली reparepa puujalu minnayE
anniTikannaa! 
takkina annimTikannaa! 

[ तितली /titilee ] #

**********************************************,

కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 65745 pageviews - 1043 posts, last published on May 7, 2016 -

అఖిలవనిత
Pageview chart 35756 pageviews - 849 posts, last published on May 7, 2016 -

తెలుగురత్నమాలిక
Pageview chart 5375 pageviews - 152 posts, last published on May 6, 2016