Wednesday, September 12, 2018

సంగీత జగతికి జనని - మురళి రవళి

రాగ సంగీతముల - 
జనని అయ్యింది ;
మురళి రవళి నేడు ;
రాగ సంగీతముల - జనని అయ్యింది  ;  ||   
;
సంగీత జగతికి - జనని తానయ్యింది ;
మురళీ రవళికి ఇంతటి మహత్తుయా!?
అయ్యారే! లీలలలోన లోలాయమానం క్రిష్ణ లీలలు ; 
క్రిష్ణ లీలలలోన లోలో - లోలాయమానమే ;  || 
;
కన్నని జోడీ గోపి రాధమ్మ ; 
జతగ వేయు చెంగనాల అడుగులు - 
మన పూబోణి రాధికవి ;  ||
;
పద యుగళ చలనము ; 
అయ్యేను భరత శాస్త్రముకు ఆది గురువుల్లు ; 
తుళ్ళింతలై ఇచట ; 
గాన, నృత్యాలకు మధుర సమ్మేళనం ;  ||   
;  
లలిత కళా రాజ్యాలు వెలసినట్టి -
ప్రతి సీమయు ప్రకృతికి ప్రతిబింబము ; 
లలిత కళా రాజ్యాలు వెలసినట్టి ;
క్రిష్ణ లీలలలోన లోలో - లోలాయమానమే                      
;
==========================; ;
;
raaga samgeetamula ; 
janani ayyimdi ; 
muraLi rawaLi nEDu ;
raaga samgeetamula ; 
janani ayyimdi ; ||
;
samgeeta jagatiki janani taanayyimdi ; 
muraLii rawaLiki imtaTi mahattuyaa!? 
ayyArE! leelalalOna lOlaayamaanamE ;
krishNa leelalalOna lOlO - lOlaayamaanamE ;  || 
;
kannani jODI gOpi raadhamma ; 
jataga wEyu cemganaala aDugulu - 
mana puubONi raadhikawi ;  || 
;
pada yugaLa calanamulu ; 
ayyEnu bharata SAstramuku ; 
aadi guruwullu tuLLimtalai icaTa ; 
gaana, nRtyaalaku ; madhura sammELanam ;  ||  
;
lalita kaLA raajyaalu welasinaTTi ;
prati seemayu prakRtiki pratibimbamu ; 
lalita kaLA raajyaalu welasinaTTi ;
krishNa leelalalOna lOlO - lOlaayamaanamE ;  ||
;

No comments:

Post a Comment