Monday, January 31, 2011

మురళికి ఎంతో ఉల్లాసం!


































మురళికి ఎంతో ఉల్లాసం! -
ఎందు వలన? ఎందు వలన?
మిత్రులార! చెప్పండీ!

క్రిష్ణయ్య చేతి చివురు వ్రేళ్ళు
ఆ వేణువు పై ఆడినందు చేతనే,
నేస్తులార తెలిసినదా?!

వెదురు తోపులకు ఇప్పుడు – ఇంత పారవశ్యమేల?
బోలు వంశి కాస్త - మధు రాగమ్ముల గూడుగా మారెను
కద!
నిలువెల్లా ఓ మురళీ! – పులకరింతలేలనే?
కన్న(ని) కెంపు పెదవుల్లు – తాకి తాకగానే
జలదరింపు గాన లహరిగ – మారుట వింత కాదు లేవమ్మా!


































muraLiki eMtO ullaasaM! -
eMdu valana? eMdu valana?
mitrulaara! cheppaMDI!

krishNayya chEti chivuru vrELLu
aa vENuvu pai aaDinaMdu chEtanE,
nEstulaara telisinadaa?!

veduru tOpulaku ippuDu – iMta paaravaSyamEla?
bOlu vaMSi kaasta - madhu raagammula gUDugaa maarenu kada!
niluvellaa O muraLI! – pulakariMtalElanE?
kanna(ni) keMpu pedavullu – taaki taakagaanE
jaladariMpu gaana lahariga – maaruTa viMta kaadu lEvammaa!

Saturday, January 29, 2011

అప్సరసలు కనుక్కున్నారు






















మాధవ మందిర సోపానముల ;
రాధిక నిలిచిన పరవశ శిల్పమ్ము
క్రిష్ణా! నీ ధన రాశి తానే గదరా! ||

ఏమని తాని నిన్నే తలచెనో ;
రామ చక్కనీ భామామణి ఇటు ;
ఆమనినే గొని తెచ్చినదీ ;
ఈ మహిని పావనిగ ఒనరించినది ||

తథికిట తకధిమి, నీ నర్తనలకు ;
మధు రస పథముగ తానే ఆయెను;
అచ్చర కిన్నెర మనో నాయిక ;
ఇచ్చట రాధను కనుగొనినారు
మేదినికి దిగి వచ్చిరి వారు ||

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

apsarasalu kanukkunnaaru ;
_____________________

maadhava maMdira sOpaanamula ;
raadhika nilichina paravaSa Silpammu ;
krishNA! nI dhana rASi taanE gadarA! ||

Emani taani ninnE talachenO ;
raama chakkanI BAmAmaNi iTu ;
aamaninE goni techchinadI ;
I mahini paavaniga onariMchinadi ||

tathikiTa takadhimi, nI nartanalaku ;
madhu rasa pathamuga taanE aayenu;
achchara kinnera manO nAyika ;
ichcaTa raadhanu kanugoninaaru
mEdiniki digi vachchiri vaaru ||

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

ధ్యాన మహత్తు












ఆధరువాయెను నీదు ధ్యానము ;
మదిని మందిరముగ నిర్మించ గల ;
సాధనమ్మది - ఓ చిలకా!
(అను పల్లవి);;;;;
ధ్యాన మహిమను తెలుసుకో మరి, ఓ చిలుకా!
||ధ్యాన మహిమ||

వేణువు ఊదీ ఊదగనే ;
రాణువ కెక్కెను మలయ మారుతము ;
జాణ తనమ్ముల తంత్రీ వీచీ ;
పంక్తుల నింగిని తుల తూచేను
||ధ్యాన మహిమ||

గగన నీలిమను ఆ నది యమునకు :
పంచి ఇచ్చితివి, చిరు గాలీ!
నీల మోహనుడు క్రిష్ణునికీ ;
ప్రియ నేస్తము ఐనది యమున
||ధ్యాన మహిమ||

(ధ్యాన మహత్తు )

$$$$$$$$$$$$$$$$$$$$$

aadharuvaayenu
swaami dhyaanamu ;
madini maMdiramugaa nirmiMcha gala
saadhanammadi, O chilukaa! ||

(anu pallavi) ;;;;;
dhyaana mahimanu
telusukO mari, O chilukaa!
||dhyaana ||
vENuvu UdI UdaganE ;
raaNuva kekkenu malaya maarutamu ;
jaaNa tanammula taMtrI vIchI ;
paMktula niMgini tula tUchEnu ||dhyaana ||

gagana nIlimanu
aa nadi yamunaku :
paMchi ichchitivi, chiru gAlI!
nIla mOhanuDu krishNunikii ;
priya nEstamu ainadi yamuna || dhyaana ||

నీ శ్రీకర కరములు























నీ - క్రీగంటి చూపులలొ ఎత్తి పట్టితివి
ఆరాధన కర్పూర హారతినీ ;
శ్రీ నాథుని ఎదలో నిలిపిన తల్లీ! ||


కందనీనులే, నీ - పతి కరములు
చంద మామ వెన్నెల మా భక్తి;
పందిరి వేతుము భరవాసాగా
నీ కందు సంశయము వలదమ్మా!!
తొందరించకు,"పతి!రా! రమ్మ"ని
ముందరే త్వర పడి తోడ్కొని పోకు ||

చందనార్చిత జానకి రమణా!
నీకందరు ఎన్నగ కన్న బిడ్డలే!
రాకెందు వదన! శ్రీ రమా రమణుడా!
పల్లవ పాణీ! ఇంగితమెరిగితి;
ఇంకెందుకు విడుతును కలనైనా?
నాకందినట్టి ; నీ శ్రీకర కరములు ||

ఆడేరు పిల్లలు రా చిలుక సొగసులు























మబ్బులకు వైనంగ
మెరుపుల్ల తీగలు
బిగియించినాది
నీలాల గగనమ్ము;

వాన జల్లుల్లోన
తనివి తీరా
ఆట పాటల
చెంగు చెంగున
గంతులేస్తూను
ఆడేరు పిల్లలు
రా చిలుక సొగసులు

ముద్దు బాలల
చరణ - పట్టీలు, మువ్వలు
లయ తాళములను
నేర్పుతూ ఉండగా

శృతి చేసుకుంటూను - నీలాంబరం
తన నూత్న సంగీత లహరికలను
తొలి కారు రాగాల
శృతి మేళవింపులతొ
హర్ష సంగీతమును
వినిపిస్తు ఉన్నాది.

జమ్మి ఆకు బంగారం
















రావి ఆకులపైన
వర్ణ భరిత చిత్రాలు
వట పత్ర శాయీ! వంశీ వినోదీ!

జలధి పైన తేలాడుచు
మఱ్ఱి ఆకు పానుపున
బుల్లి క్రిష్ణ! రావోయీ!

జమ్మి ఆకు బంగారం
ఇంచక్కా గొనవోయీ!
వేణు గానములను మాకు
ప్రేమతోను నేర్పవోయీ!

మృదు రాగం ప్రతిఫలం



















రావి చెట్టు, జమ్మి చెట్టు
వేప, మఱ్ఱి, అశ్వత్థం
దండం, దండం!

తులసి దళం, వంశి వనం
నారి కేళం, తాళ పత్రం
దండం, దండం!

వ్యాస ముని భారతం
“జయం, జయం!”(*)
లేఖకుడు విఘ్నేశ్వర
దండం, దండం!

శ్రీ బాల క్రిష్ణా!
వట పత్ర శయనుడా! శ్రీ శేష శాయీ!
తులసీ వన మాల ధారి! వంశీ వినోదీ!

శ్రీ బాల క్రిష్ణా! ఇదిగో నవనీతం;
మృదు రాగం జగతికి
లభియించే ప్రతిఫలం

{ (*)“మహా భారతము” అసలు పేరు “జయం”}

రేగుచున్న శివ జటా జూటములు






























కాళీయుడు పడగలు విప్పార్చి
కూళ నాట్యమును సేయుచుండెనే! ||

క్రిష్ణ విలాస నర్తన హేలలు
విష్ణుని విశ్వ స్వరూప లీలలను
మనకు చూపెను, మెచ్చండీ! ||

మధువులు చిప్పిలు మురళీ గానము ;
నాగుని బుసలు, ఎగసే పొగలు;
రేగుచున్న శివ జటా జూటములె!(/లు ) ||

నమ్మరాని వింత





















ధరిత్రి నమ్మగ రాని వింతలలోన ఇది -
మిరుమిట్లు గొలిపెడి వింత సౌరు ఇది! ||

కరుణార్ద్రతలను ఒసగే దేవా!
దొరవూనీవే; దొంగవు నీవే!;
ఔరౌరా!నవనీత చోరుడా!
ధరిత్రి నమ్మగ రాని వింతలలోన -
మిరుమిట్లు గొలిపెడి వింత సౌరు ఇది! ||

కన్నయ్యా! అవ్యాజ ప్రేమలను, ;
పొన్నుగ జగతికి పంచే దొరవు,
ఎన్నగ చోద్యము! లీలా క్రిష్ణా!
ధరిత్రి నమ్మగ రాని వింతలలోన ఇది -
మిరుమిట్లు గొలిపెడి వింత సౌరు ఇది! ||

Friday, January 28, 2011

అవనిని అన్నిటి తత్వము మారెను











































నవనీత చోరా! నిన్ను గని
అవనిని అన్నిటి తత్వము మారెను,
ఏమని నుడువుదు?. ||

నీల మోహనము, నిత్య దివ్యము;
లాలనగా – నీ రూపము దోచీ ;
జలతారు ఱెప్పల దాచ్చుకున్న,
నా - లీలాల కన్నులు, తులిపి చోరులు ||

సుడి వడి - రాగ సుధా రస వాహినుల
తడుముకోక, తడబాటులు లేక
ఒడిసి పట్టినవి శ్రవణేంద్రియమ్ములు
గడుసు చోరులు వీనుల జంట ||

చిరు గాలి మయ బ్రహ్మ




















సకల జనులనూ సేద దీర్చెడు
చకిత చిత్ర లేఖన నైపుణ్యము
లకు నిలయము గాలి ||

ధరిత్రి పయిన తిరుగు వారికి ;
నిరతము స్వామి నామ స్మరణమునె
మెరుపు బంగరు మందిరమ్ములుగ చేసే
చిరు గాలి మయ బ్రహ్మను మించినది ||

పేరు పొందినది యమునా శీతల తుషార బిందుల
మలయ - మారుతము , నీ ముంగురు ఊయెలలందున
సౌరుగ ఊగు చనువు నీ కడ
దొరుకుట కడు ఔచిత్యమె కదరా, కన్నయ్యా!! ||

నీటి బుంగ మనసు - జల తరంగిణి























ప్రేమ గీతల ముగ్గుల బందీ
నీమము కదటే, మానస హంసకు
తామసమేలనె, ఓ చిలుకా! ! ||

శ్రీ వేంకట రమణుని
రామ చక్కనీ నామ సుధా ఝరి
గోముగ చక్కర్లు కొడుతూ ఈదుట :
ప్రేమ గీతల ముగ్గుల బందీ
నీమము కదటే, రామ చిలుకరో! ||

శ్రీ రంగ నాథునీ, మంద హాసములు ;
రంగరించు శృతి గమకపు అలలు
శ్రీ గీత తరంగిణి ఉల్లాసములు
నీటి బుంగ మా హృదయములాయెను
ఉదయార్ద్ర ప్రభా జల తరంగిణులు ||

Monday, January 24, 2011

గాలి - సుగంధముల గని















గాలికి మోదం కూర్చును పూవులు ;
పువ్వుల నేస్తం చేయగనే ;
సుగంధమ్ముల గనిగా ఆయెను గాలి.

పువ్వులతోటి స్నేహ హస్తమును ;
అందుకున్నదీ చిరు గాలి ;
ఐనది గాలి ఆ వెనువెంటనె ;
సౌగంధమ్ముల మ(క)రంద పెన్నిధి!

మలయ పవనములు సాగీ, సాగీ, పయనాలు;
పైరుల, తరువుల పలకరింపులు ;
ప్రజలందరికీ ప్రకృతి జననీ – అర్చన
ఎపుడూ ఆమోదం, అది ఆహ్లాదకరం.

ప్రకృతిలోని ప్రాణి కోటితో ;
జతలు కూడిన సమ తౌల్యతపై ;
ఆప్యాయతలు, అవగాహనలు,
సదా ఉండ వలె సజ్జనులారా!"
అనుచు, బుజ్జగించుచూ,
నుడివెను ఉదయం.

పచ్చ దనాలు, పైరు తరువులు జంట కవులుగా ముచ్చట్లు
















పచ్చ దనాలు, పైరు తరువులు
జంట కవులుగా ముచ్చట్లు;
పచ్చ దనాలు, పైరు తరువులు
జంట కవులుగా ముచ్చట్లు;

కోయిల, మైనా, పిచ్చుక,
పాల పిట్టలు, నెమలి, చిలుకలు
అగణిత వన్నెల విహంగాళికీ
కొమ్మలు ఆయెను ఆరామాలు !






















సీతా కోకలు, చల్లని గాలికి
పూవులు ఆయెను సింహాసనాలు;
పరిమళ సొగసుల ఆవాసాలుగ
వెన్నెల చక్కిలిగింతల మధువులు ;

స్నేహ బంధము

















కన్ను దోయితో సొగసు వీక్షణం ;
కర ద్వయముతొ కార్యాచరణం ;
పదముల జంట చేర్చును గమ్యం ;
వీనులు రెండూ శ్రావ్య మోహనం ;

పెదవులు జత పడి పదముల కేళీ ;
జతలు జతలుగా స్నేహాలు ;
జట్టు కట్టిన నేస్తాలు ;
తోడు నీడల బంధాలు ;
చేతులు కలిసిన చప్పట్లు ;

కెంపు భాండమని భ్రమంచిన విహంగ రాజు





























గుమ్మ పాలు తెచ్చాను ;
చెంగనాలు చాలునురా! ;
అమ్మ కొంగు
చాటు బిడ్డ! ;
కావేటి శ్రీ - రంగ నాథ! రావోయీ!
ఇటు రావోయీ! ||

పల్లె పట్టు కామ ధేను ;
విల్లిదిగో, కొల్లలుగా ;
తెల్ల వెన్నెలంటి పాలు
కురిసేను కురిసేను ||

ఉరికి ఉరికి ధారలయే;
తరిపి పాలు నీ కొరకే ;
ఆ - విరి పొదు
గులు చూడ చూడ ;
సిరి పారిజాతముల కన్న ;
పరమ మూల్యమే సుమా! తెలియుమురా! ||

పెదవి తిరుగు వంపులలో ;
ఒదిగి తొంగి చూచేటి ;
పాల నురుగు సరళి చూసి ;
మేలు కెంపు భాండమని ;
తలచి గరుత్మంత రాజు దుమికేను :
నా మేలి ముసుగు ఇదిగోరా, దాక్కోరా!
ఈ రాధమ్మ-
మేలి ముసుగు ఇదిగోరా, దాక్కోరా! ||

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

























gumma paalu techchaanu ; - cheMganaalu chaalunuraa! ;
amma koMgu chATu biDDa! ; - kaavETi SrI raMga naatha!
raavOyI! iTu raavOyI! ||

palle paTTu kaama dhEnu ; - villidigO, kollalugaa ;
tella vennelaMTi paalu kurisEnu ||

taripi paalu nI korakE ; - uriki uriki dhaaralugaa
aa viri podugu chUDa chUDa ; - siri paarijaatamula kanna ;
parama mUlyamE sumaa! teliyumurA! ||

pedavi tirugu vaMpulalO ; - odigi toMgi chUchu chunna
paala nurugu saraLi chUsi ; - mElimi keMpu BAMDammani ;
talachi
garuDa raaju dumiki,dumiki; - eduTa vaalEnu, hammayyO! ;
naa mEli musugu idigOraa, daakkOraa! -
I raadhamma - mEli musugu idigOraa, daakkOraa! ||

Sunday, January 23, 2011

ఎరుక తెలుపు దొరసాని
























స్వామి వారి మనోగతం ; భామ పద్మకే ఎరుక ;
ఎరుక తెలుపు దొరసాని ; సిరి దేవి కూడ తెలుపలేని ||

కప్పూరపు హారతులను ;
తెప్పలుగా తేలు పొగలు;
అప్పుడే గేలి సేయు ;
గొప్ప మొయిలు రాసులను
“మేమె స్వామి నలముకున్న
తోమరంపు నీలిమల ”ని; సిరి సిరి! ||

దూది మబ్బు రాసులతో ;
వాదమ్ములు ధూమములవి ;
మోదముగా సేయును వీనులకు విందులు ;
మీదు మిక్కిలిగ సిరి నవ్వుల ;
మేదినికి ఒసగు లీల లెన్న తరమ? సిరి సిరి! ||

&&&&&&&&&&&&&&&&&&&&&&





















svaami vaari manOgataM ;
BAma padmakE eruka ;
eruka kUDa telupu dorasaani ;
siri dEvi kUDa telupalEni ||

kappUra haaratulanu ;
teppalugaa tElu pogalugaa ;
“mEme swaami nIlima”ni ;
goppa moyilu(lanu) gEli sEyu ||

dUdi mabbu raasulatO ;
vaadammula dhUmamulavi ;
mOdamugaa vInu viMdu ;
mIdu mikkili siri navvula ;
mEdiniki osagu lIla lenna tarama? siri siri! ||

&&&&&&&&&&&&&&&&&&&&&&

Saturday, January 22, 2011

తిరు గిరులను చేయును, పారిజాత సుమ రాశిగ


పద్మ లోచనీ! పరమానంద దాయినీ!
తిరుచానూరున వెలసిన పద్మవతి!మా జననీ! ||

అదె తిరుమల! ఏడు గిరులు ;
సదమల మృదు సౌరభములు ;
ముదముగా అందును భక్త జనులకు ||

సరి కొత్త కళలు నీ చల్లని చూపులందున ;
తిరుచనూరు నుండి; తల్లి!నీ చూపుల విరి తావులు;
తిరు గిరులను చేయును, పారిజాత సుమ రాశిగ ||

Tuesday, January 18, 2011

పాల సంద్రములనుచు భ్రమ























గుజ్జు వెన్నలు, జున్ను
గ్రోలరా, కన్నయ్య! ;
అనుచు బ్రతిమాలుచు నుండు యశోదమ్మ ||

నిగ్గుటద్దం లాంటి మనసున్న పిల్లడు ;
మా బాల క్రిష్ణుడు ;
ఆబాల గోపాల
మానసోల్లాసములు ||






















ఉగ్గు పాల నురుగు లురికి , పొంగేటి ;
ఆ లేత బుగ్గలు చూసి మురిసేనమ్మ ; డు ;
పాల్గారు బుగ్గలను బుల్లి సొత్తలు మీటు
వాల్గన్నులందున నెమలి పింఛాలు ||

పాల బురుగులు చేయు
అధరాల సందడులు ;
పాల సంద్రములనుచు భ్రమ తోడ ఈ నాడు ;
వేయి పడగల ఆది శేషుండు దుమికెనే!

బోసి పోయిన వైకుంఠమ్ము నుండి
సప్త ద్వారమ్ములు వెడలి వచ్చినాయి;
పల్లవాంగుళులందు
వేణు మృదు రవళులయె ||

Saturday, January 15, 2011

నందన వనమున నాకము బస























గోరంత వెన్న ముద్ద
చాలు! చాలన్నాడే! ;
కొన గోటి మీద
గిరిని ;
నిలిపినట్టి గిరి ధారి,
గోవర్ధన గిరిధారి ;
గోవిందుడు, మన గోవిందుడు ||

మనసిజుని జనకుడు ;
మన పాలిటి కల్ప తరువు ;
కను మాయగ స్వర్గమ్మే
బృందా-వనిలో విడిది సేసె!
మనసారా తలుచుదు(/ద)ము ;
గోవిందుని, మన గోవిందుని ||

మదనోత్సవ విలాసుడు ;
కొదమ సింహ సమానుడు;
అదరహో! బహు తుంటరి! ;
మది మదినీ అలరించును ;
వీని - గోలంతా కళలుగా ;
వెల్లి విరియు హరి విల్లులు ||


@@@@@@@@@@@@@@@

naMdana vanamuna naakamu basa
___________________________



















gOraMta venna mudda
chaalu! chaalannaaDE! ;
kona gOTi mIda girini ;
nilipinaTTi giri dhaari,
gOvardhana giridhaari ;
gOviMduDu, mana gOviMduDu ||

manasijuni janakuDu ;
mana paaliTi kalpa taruvu ;
kanu maayaga swargammE
bRMdaa-vanilO viDidi sEse!
manasaaraa taluchudu(/da)mu ;
gOviMduni, mana gOviMduni ||

madanOtsava vilaasuDu ;
kodama siMha samaanuDu;
adarahO! bahu tuMTari! ;
madi madinI alariMchunu ;
vIni gOlaMtaa kaLalugaa ;
velli viriyu hari villulu ||

@@@@@@@@@@@@@@@@@@

Friday, January 14, 2011

తీపి అచ్చులు, హల్లులు

















ముక్క, ముక్క - చెరుకు ముక్క
ముక్కలోన తీపి రసము
తీయని రసమును తీసీ తీసీ
బానలలోన మెండుగ వండీ
దండిగ బెల్లపు దిమ్మలు వచ్చె!

మధురమ్మౌ ఆ అచ్చులు తెచ్చీ
నాన్నారేమో అమ్మకు ఇచ్చిరి;
అమ్మ చేతి కమ్మని స్వీట్లు
నచ్చెను పిన్నలు, పెద్దలందరికి!
అరిసెలు తింటూ గంతులు ఆటలు;
"చిందులు చాలును! చదువుల వేళయె!"
నంటూ తాత గద్దించెను

"అచ్చులు, హల్లులు నేరుస్తాము
భారత మాతకు జై!జై!జై!జోతలు!
రేపటి పౌరులం పిల్లలమేము!"

Wednesday, January 12, 2011

చంద్రుని పూర్వ పుణ్యము







సంభ్రమానందములు ;
వ్రేపల్లె వాసులకు - కైవశమ్మాయెనమ్మా!
వనితరో! కైమోడ్పు కన్నయ్యకే! ||

చిన్నారి క్రిష్ణయ్య ;చిరు నవ్వు శిల్పములు ;
ఆ కళా నైపుణ్యముల్ ;కూడి, నిత్య పౌర్ణిమలాయెను;
చందురుని - పూర్వ పుణ్యములేమిటోను?
బూచి రేయిని విడిచి;వినీల గాత్రుని పొందెనమ్మా! ||

క్రిష్ణయ్య వేసేను ; బుడి బుడి అడుగులను!;
పద ముద్ర పద్మమ్ములు ; ప్రతి అడుగు చూడగానూ;
ఓ జనని!- ఆటలకు గురువులాయే!;
నాట్యాలు నేర్పెనమ్మా! జనులకు నాట్యాలు నేర్పెనమ్మా! ||

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
SaMBramaanaMdamulu ;
vrEpalle vaasulaku ; k
aivaSammaayenammaa!
vanitarO! kaimODpu kannayyakE! ||

chinnaari krishNayya ;
chiru navvu Silpamulu ;
aa kaLA naipuNyamul ; kUDi,
nitya paurNimalE aayenu;
chaMduruni -
pUrva puNyamulEmiTOnu? ||

krishNayya vEsEnu ;
buDi buDi aDugulanu!;
prati aDugu chUDagaanuu;
O janani! , aaTalku guruvulaayE!;
naaTyaalu nErpenammaa! –
janulaku naaTyaalu nErpenammaa! ||

Tuesday, January 11, 2011

కవితల చెక్కిలి బంగరు రజనులు



























;;;;;;;;;;;

మబ్బులు,మబ్బులు, మబ్బులు
దుబ్బుల మబ్బులు దబ్బున వచ్చెను
మెత్తని మబ్బులు మెత్తల మబ్బులు,
తొలకరి ఆటల ముద్దుగ వచ్చెను ||

మబ్బులు,మబ్బులు
దూది మబ్బులు,నీలి మబ్బులు
ఛప్పన్నారు దేశాలన్నీ ;
చుట్టి వచ్చిన చిత్రపు మబ్బులు ||

నెమలి నాట్యముల ప్రేక్షకులు!
మల్లీశ్వరికి నేస్తాలు,
దేవుల పల్లి కలము కజ్జలముల్
చిటికెల చిందుల చెంగున వచ్చెను ||

కాళిదాసుని కవితల పల్లకీ
ధవళపు మబ్బులు
"మేఘ సందేశము" ఒడిలో బాలలు
కవితల చెక్కిలి బంగరు రజనులు ||

మిల మిల తారల చుట్టాలు;
తళుక్కు మెరుపుల నేస్తాలు
వాన చినుకుల పందిరులు
గగనపు పౌడరు పఫ్(=puf) లు మబ్బులు ||

పరిమళాల పెన్నిధి!



















గాలికి మోదం కూర్చును పూవులు
పువ్వుల నేస్తం చేయగనే
సుగంధమ్ముల గనిగా ఆయెను గాలి

పువ్వులతోటి స్నేహ హస్తమును
అందుకున్నదీ చిరు గాలి
ఐనది గాలి;
ఆ వెనువెంటనె
సౌగంధమ్ముల నిలయము, పెన్నిధి!

మలయ పవనములు సాగీ, సాగీ, పయనాలు;
పైరుల, తరువుల పలకరింపులు ;
ప్రజలందరికీ ప్రకృతి జననీ – అర్చన
ఎపుడూ ఆమోదం, అది ఆహ్లాదకరం.

ప్రకృతిలోని ప్రాణి కోటితో
జతలు కూడిన సమ తౌల్యతపై
ఉండ వలెను అవగాహన సదా సజ్జనులారా!
బుజ్జగించుచూ, నుడివెను ఉదయం.

తోడు నీడల బంధాలు, ముచ్చట్లు























కొమ్మలు -
కోయిల, పిచ్చుక, రామ చిలుకలు,
మైనా, నెమలి, పాల పిట్టలు,
అగణిత వన్నెల విహంగాళికీ ఆరామాలు !

కన్ను దోయితో సొగసు వీక్షణం
కర ద్వయముతొ కార్యాచరణం
పదముల జంట చేర్చును గమ్యం!

వీనులు రెండూ శ్రావ్య మోహనం ;
పెదవులు జత పడి, పదముల కేళీ
జతలు జతలుగా స్నేహాలు;

జట్టు కట్టిన నేస్తాలు ;
తోడు నీడల బంధాలు ;
చేతులు కలిసిన చప్పట్లు ;
జంట కవులకు ముచ్చట్లు;