Saturday, September 15, 2018

శ్యామకృష్ణుని తెల్లని నవ్వులు

ఊగగలవ నిరంతరం - 
తళుకు తళుకు చుక్కలు ; 
ఆ చురుకు చురుకు చురుక్కు 
తారకల మాలికలు ; || 
;
నీలి వన్నె ప్రజ్ఞ - విశాలమౌ గగనానిది ;
తెలి నవ్వుల ప్రజ్ఞలెన్నొ - నీల మోహనాంగునివి ; 
విస్తుబోవుచుందురు పల్లియలో జనులందరు ;
జవరాండ్రకేమొ ఎప్పటికీ బోధపడదు 
ఈ భేదంలోన దాగి ఉన్న ;
మర్మముల వింత - విచిత్రముల గోల ; || 
;
విరుద్ధము, ఈ విభేదము ; 
సమన్వయా లిటుల ఎటుల ; 
ఇటు ఇప్పుడు తారసిల్లె ; 
తారలైన తీర్చగలవ ..... ;

పెను సందేహం డోలలందు ; 
సదా అలసిపోకుండా ;
ఊగగలవ తారకలు - 
తళుకు తళుకు చుక్కలు ; 
ఈ సందేహం డోలలందు ; || 
;
===================; ;
SyaamakRshNuni tellani nawwulu  ;-
;
uugagalawa niramtaram - 
taLuku taLuku cukkalu ; 
aa curuku curuku curukku ;
aa taarakala maalikalu ; ||
;
neeli wanne prajna wiSAlamau gaganaanidi ; 
teli nawwula prajnalenno - neela mOhanaamguniwi ;
wistubOwucumduru - palliyalO janulamdaru ;
jawaraamDrakEmo eppaTikee bOdhapaDadu ;
ee BEdamlOna daagi unna ;
marmamula wimta - wicitramula gOla ; ||
;
wiruddhamu, ee wiBEdamu ; 
samanwayaa liTula eTula ; 
iTu ippuDu taarasille ; 
taaralaina teercagalawa ....... ; 
;
penu sandEham DOlalamdu ; 
sadaa alasipOkumDA ;
uugagalawa taarakalu -
taLuku taLuku cukkalu ;
sandEham DOlalamdu ; ||

No comments:

Post a Comment