Saturday, September 15, 2018

పుష్ప లతల నిశ్శ్రేణి ఆలంబన ఆరోహణ

ఆలంబనమే - 
అతని నవ్వు కాంతుల ; 
పుష్ప లతల నిశ్శ్రేణి ;
ఆలంబనమే - ఆరోహణమే ;  || 
;
ఆరోహణ ఆరోహణ ; 
సంగీతం రాగముల ; 
మృదు మాధురి ఆరోహణ ;  || 
;
లాక్షణికం లాక్షణికం ; 
లక్షణమౌ లాక్షణికం 
సూత్రముల అల్లికలను అందించును ; 
అతగాడి సుతిమెత్తని హొయలొలికే కదలికలు ;  || 
;
కదలికలే నాట్యాలు, లాస నర్తనముల ; 
ఎల్లరిని పులకింతల తేలించే అతడెవరు, అతనెవరు!? 
నెనరుగ చెప్పాలంటే - వేరెవ్వరు ఔతారు, 
మన అందరి శ్యామకృష్ణుడే కదటే ఓయమ్మా! ;  || 
;
================; ;
;
aalambanamE - 
atani nawwu kaamtula ; 
pushpa latala niSSrENi ;
aalambanamE - aarOhaNamE ;  || 
;
aarOhaNa aarOhaNa ; 
samgeetam raagamula ; 
mRdu maadhuri aarOhaNa ;  ||
;
laakshaNikam laakshaNikam ; 
lakshaNamau laakshaNikam 
suutramula allikalanu amdimcunu ; 
atagaaDi sutimettani kadalikalu ;  ||
;
kadalikalE nATyaalu, laasa nartanamula ; 
ellarini pulakimtala tElimcE ataDewaru, atanewaru!? 
nenaruga ceppaalamTE - wErewwaru autaaru, 
mana amdari SyaamakRshNuDE kadaTE OyammA! ;  ||

No comments:

Post a Comment