Friday, August 28, 2015

శాంతి విలువ, Pigeon


చిట్టీ! ఓ చిట్టీ!
'పారావతము', పిజియన్
అంటే ఏమిటొ నీకు 
తెలుసునా చెప్పవమ్మ! ||
చిట్టి  :-
పారావతము, pigeon
అంటే 'పావురము, తెలుసమ్మా!!

మరి పావురమును 
నెహ్రూ ఆదిగా నేతలు
శాంతి ప్రతీకగ కీర్తిని
పొందినది పావురాయి! 

శాంతి విలువ లోకులకు 
గుర్తు చేయ, ఇలకు నీవు 
మరల మరల రావోయి
సున్నితముగా పావురాయీ!

========================

గిజిగాడు - గూడు

బంగారు పిచ్చిక
గిజిగాడు మచ్చిక 
  బుల్లి బుల్లి రెక్కలకు
   నటనాల ఆటలంట!  ॥ 

తన రెక్కల ఆడింపులు  
గాలిలోన కట్టినట్టి
అందమైన మేడలు || 

గగన తెరల పయి 
కాంచన కలశమ్ము వోలె  
చెట్టు యొక్క కొమ్మ కొసల
గొప్ప నిర్మాణత శోభిల్లెను ॥ 

ఇంద్రభవనమ్ముల కన్నా
నా 'మహల్ గూడు' బహు గొప్పది
అని చూపును గీరగాను
తన, మెహర్బానీ చెప్ప తరమా!?||

**************************

రచన:- కుసుమాంబ1955
 పిట్టలలో మేల్మి పసిడి 

Thursday, August 27, 2015

ఒహోహో! పావురమా!

చిట్టి చిట్టి పావురాయి;
సాగిపోవు నీలి నింగి;
పొడవాటి రెక్కలను;
నిడివిగాను చాచి, చాచి
      గాలి అలల పయిన - సుతిమెత్తగ 
         అలా,  అలా, అలా,  అలా || 

చల్లదనము వెన్నెలకు;
నేర్పుటకై ఎగురుతూ సాగినది
    గాలి అలల పయిన - సుతిమెత్తగ 
         అలా,  అలా, అలా,  అలా || 
;

Sunday, August 23, 2015

సప్న ఆభరణములు

నిదురకు ఎంత తొందర !!!!!!!    
మణి వోలె మెరిసేను తరుణీమణి;   

తన ఊహలను పొదువుకుని, 
కులాసాగ కులికేను స్వప్నాలు - 

ఇట ఆ కొత్త కలలన్ని 
స్వర్ణ ఆభరణమ్ములై మెరుపులీనేను;

ఆ పసిడి నగలన్ని 
తన ఒడలంత ధరియించ;
ఈ నిదురకు మెండుగా తొందర ! 

కనుకనే -
నా కనులపాన్పుల పయిన 
గడుసుగా వాలేను  

***************************
[ సప్న ఆభరణములు/ కలలనగలు ] [రచన: కుసుమాంబ]

======================

niduraku emta tomdara  :-


niduraku emta tomdara    
maNi wOle marisEnu taruNImaNi;   

tana uuhalanu poduwukuni, 
kulaasaaga kulikEnu swapnaalu - 

iTa aa kotta kalalanni 
swarNa aabharaNammulai merupuliinEnu;

aa pasiDi nagalanni tana oDalamta dhariyimcha;
ii niduraku memDugA todara!!!!!! ! 
kanukanE naa kanulapaan pula payina 
gaDusugaa waalEnu  

**********************************************************
( భావుక ; FB )

Sunday, August 16, 2015

మెరుపు తీగెల కవ్వములు

వెన్నెలలు ఒలుకును ఆ నీలినింగి; 
'మెరుపుతీగెల-చురుకు కవ్వాలు' చేపట్టి; 
చిరుజల్లులను నేర్పుతో చిలుకును;
మబ్బులకు ఉరుముల పలుకులను; 
          నేర్పునది ఎవ్వరు?
               ఇంకెవ్వరమ్మ, మా రాధమ్మ కదటమ్మ!

రాధమ్మ కులుకుల -
తన ప్రజ్ఞలను బాగ తులతూచుకుంటూన్న 
తంతు తెలిసినవాడు ఎవరమ్మ? తెలుపుమా!
వేరేవ్వారో కాదు, 
అతడు మురళీ నాదవిహారి; 
మన వంశీమోహన కృష్ణుడేనమ్మా!  
'''''''''''''''''''''''
[మెరుపు కవ్వం]

'''''''''''''''''''''''''''''''''''' 

‪#‎wennelalu‬ olukunu aa niilinimgi; 
chirujallu chilukunu; 
merupu tiigela churuku kawwaalu;
mabbulaku urumula palukulanu;
nErpunadi ewwaru?
imkewwaramma, 
maa raadhamma ulukula; 
tana praj~nalanu baaga; 
tulatuuchukumTUnna; 
tamతు telisinawaaDu; 
wamSImOhana liilaawinOdi;
guppugaa sigamuDini; 
barhipimCamulu daalchina; 
liilaawinOdi mana SreekRshNuDEnamma, 
oTTu! nammamDi!

'''''''''''''''''''''''''''''''''''' 
[kusumaamba] ; [Kusuma Piduriఉపశమన తరంగాలు 
August 12 at 5:32am · ]

ఆనందతాండవం

వేదిక దొరికింది 
ప్రకృతి ఆటలకు 
         వేదిక దొరికింది 
జగతి నాట్యాల ఆటలకు 
         వేదిక దొరికింది ||

పసిడి పువు రేపల్లె 
వేదికగ లభియించ 
కరువు లేదింక ఇక 
   అందాల ప్రకృతికి
    ఆనందతాండవం -
      సొగసైన హేలలకు 
      ॥వేదిక దొరికింది॥  

వ్రేపల్లె పూవుకు నడిబొడ్డు
తన ఆటలకు వేదికగ
నాట్యాల ఆటలకు వేదికగ 
సొగసుల వ్రేపల్లె పుండరీకమ్మును
గైకొనెను భక్తితో ఈ ఎల్ల ప్రకృతి 
 వేదిక దొరికింది॥        

******************
[ FB:- ఉపశమన  తరంగాలు mon day;- 9:02 PM 8/16/2015 ]
*******************

అఖిలవనిత
Pageview chart 32607 pageviews - 802 posts, last published on Aug 14, 

Friday, August 14, 2015

స్ఫూర్తి

మన మాతృభూమి 
అగణితమౌ
ఆదర్శాలకు స్ఫూర్తి 
       మనదేశం యశోప్రభల 
                    మనసారా కీర్తిద్దాం! ||

ప్రతి నుడువులోన విశ్వాసం;
అంబరపర్యంతముగా
         ఎగసి ఉప్పొంగుచుండ
     || మనదేశం యశోప్రభల 
                    మనసారా కీర్తిద్దాం! ||

ప్రతి అడుగులోన నమ్మకము,
సాగర కెరటములల్లే
        ఎగసి ఉప్పొంగుచుండ
     || మనదేశం యశోప్రభల 
                    మనసారా కీర్తిద్దాం! ||

****************************************
అఖిలవనిత

Pageview chart 32558 pageviews - 801 posts, last published on Aug 14, 2015

అవ్వ అప్పచ్చి

పోరడు, పోరి వచ్చారు 
బొట్టి, బొట్టెడు వచ్చారు;
అబ్బాయ్, అమ్మాయ్ వచ్చారు 

చెరకు గడలను తెచ్చారు ;
కణుపులు లెక్కెట్టి నవ్వారు, 
మాగాణి పొలంలొ నాటారు;
కాడిని పట్టి అరకను పెట్టి 
మడిచెక్కను చక్కగా దున్నారు;
భలేగ సేద్యం చేసారు;  

ఏపుగ పెరిగిన చెరకు ముక్కలు 
కొన్ని నీకు; మరి కొన్ని నాకూ – 
అంటూ చక్కగ ఎంచారు 
బాగా జనులకు పంచిచ్చారు; 

తక్కిన మోపులు తీసుకువెళ్ళి  
గానుగలోన ఆడించారు;
బెల్లం రసమును పిండారు 
పాకం బాగా పట్టారు;  

అరిసెలు, బూరెలు వండారందరూ!  
బోసినవ్వుల అవ్వకు అప్పచ్చి; 
అవ్వ అప్పచ్చి; తాత తిరుచ్చి;
బూరె బుసికి; గవ్వలు భరుచ్చి; 

పప్పు ఉండలు తీపి రుచి; 
చక్కెర చిలకల లచ్చి!
కాజా దోబుచి, బాదుషా హుళక్కి!
అవ్వకు లొట్టల అప్పచ్చి 
చప్పరింతల తాతకు హాచ్ హాచ్ హాచ్ఛీ!

*****************************

pOraDu, pOri wachchaaru 
boTTi, boTTeDu wachchaaru;
abbaay, ammaay wachchaaru 

cheraku kaNupulu techchAru, 
maagaaNi polamlo nATAru;
kaaDini paTTi baagaa sEdyam chEsAru;  
Epuga perigina 
cheraku mukkalu konni niiku; 
mari konni naakuu – amTU 
chakkaga pamchichchaaru; 

cheraku mOpulanu 
gaanugalOna aaDimchAru;
bellam paakam baagaa paTTiri;  

ariselu, buurelu wamDAramdaruu!  
bOsinawwula awwaku appachchi; 
awwa appachchi; buure bharuchchi; 
kaajaa tiruchchi; 
chakkera chilakala lachchi!
baadushaa huLakki!
awwaku loTTala appachchi 
awwa appachchi awwa appachchi! 

awwa appachchi అవ్వ అప్పచ్చి awwa appachchi అవ్వ అప్పచ్చి 
wijayaanandana

అఖిలవనిత 32533 akhilawanita

Wednesday, August 12, 2015

అగణిత భావాలు

ఎన్ని భావాలు; 
ఎన్నెన్ని భావాలు ||

ఎన్నో అక్షర దళాలను; 
సముదాయిస్తూ, 
రాశిగా ప్రోది చేసుకుంటూ ||

ఎన్నో లిపి వర్ణాలతో; 
ఎన్నో మాటలను 
కూర్చుకుని సాగుతూ ||
ఎన్నో మాటల పాదులలో ;
మరెన్నో నాటుతున్న 
పాటల తరు, లతలుగా ||

ఆ గీతాల విరబూస్తున్న; 
మానస బ్రహ్మకమల సౌరభ కోటిలను;
తమ సరిగంచుల చెంగులలో ; 
పదిలముగా పొదువుకుని ;
యుగ యుగాలుగా ; 
మును ముందుకు 
ఎడతెగని పయనాలను ; 
కొనసాగిస్తూ ....................... 
||ఎన్నెన్నో భావాలు ||

================

enni bhaawaalu;
ennenni bhaawaalu;||

ennO akshara daLAlanu;
samudaayistuu,
raaSigaa prOdi chEsukumTU || 

ennO lipi warNAlatO;
ennO mATalanu 
kuurchukuni saagutuu ||

ennO mATala paadulalO ; 
marennO naaTutunna; 
paaTala tar latalugaa ||
aa giitaala wirabuustunna; 
maanasa brahmakamala saurabha kOTilanu;
tama sarigamchula chemgulalalO ; 
padilamugaa poduwukuni ;
yuga yugaalugaa ; 
munu mumduku 
eDategani payanaalanu ; 
konasaagistuu ..................... 
||ennennO bhaawaalu|| 

************************

[Kusuma Piduri feeling awesome ; ఉపశమన  తరంగాలు [కుసుమాంబ]  ఫేస్ బుక్  June 27  :- ]

Tuesday, August 11, 2015

చదరంగంలో Camel

ఒంటె ఒకటి; ఎడారి ఓడ; 
చదరంగంలో వయ్యారి పాను;  
చతురం చతురం చదరంగం 
చతురం చతురం షత్రంజ్ ఆట ॥ 

కన్నురెప్పలు మూడు చొప్పున; 
ఆరు కలిగిన వింత జంతువిది;
మూపున నీళ్ళ ఫ్రిజ్ దాచుకుని
ఎండనుబడి తానెన్ని మైళ్ళు, క్రోసులు
యోజన దూరాల్ 
అలసట లేక నడవగలుగును
ఒంటె సవారీ బలే హుషారు
నేను ఇచ్చిన నీళ్ళను త్రాగి 
తుమ్ములు వచ్చెను కేమెల్ గారికి.
హాచ హాచ్ హాఛ్! ...... 
*********************

( Chess బోర్డులో bishop ; షత్రంజ్ బోర్డులో 16 pieces)

౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦  - ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦

 [ పిల్లలకు పద్య గీతాలు   ; రచన : కోణమానిని  ]

Sunday, August 9, 2015

వెన్నెల ఆకులు

బాలలము, మేము బాలలము ||
చీకటి చెట్లకు - వెన్నెల ఆకులు ;
చక్కని చిగురులు వేయిస్తాము : || 

చిక్కని మబ్బుల - బుడి బుడి సిగ్గుల;
సొంపౌ మొగ్గలు - తొడిగిస్తాము ;
చిరుతప్రాయము సౌధమునందున ;
ఇపుడే అడుగిడినామండీ!

మా మిసిమి కాంతుల కలల వీధుల ;
బంగరుబాటలు వేస్తున్నాము ;
కంటకమ్ములను గ్రుమ్మరించెడి 
కర్కోటకులిటు రావొద్దండీ! ప్లీజ్! ||   

బాలగీతిక :- 

===========================; 


baalagiitika :-


baalalamu, mEmu baalalalmu ||
chiikaTi cheTlaku - wennela Akulu ;
chakkani chigurulu wEyistaamu : ||
chikkani mabbula - buDi buDi siggula;
sompau moggalu - toDigistAmu ; }}
chirutapraayamu saudhamunamduna ;
ipuDE aDugiDinaamamDii!
maa misimi kaamtula kalala weedhula ;
bamgarubaaTalu wEstunnaamu ;
kamTakammulanu grummarimcheDi ;
karkOTakuliTu rAwoddamDI! pleej! ||   

********************** 

Sunday, August 2, 2015

రెక్కలపైన రంగవల్లికలు;

సీతాకోకచిలకమ్మలవే 
వచ్చేసాయి, వచ్చేసాయి! ||

రెక్కల వన్నెల రంగవల్లికలు;
అలరే చక్కని సీతాకోకలు -
వచ్చేసాయి, వచ్చేసాయి ||  

బృందావనిలో పూవుల వ్రాలి; 
గోప భామినుల తికమకపెట్టుచు;
మల్లె పొదలలో నక్కుచు దాగిన ; 
నందకుమారుని నేస్తులమన్నవి 
|| రెక్కల వన్నెల రంగవల్లికలు;
అలరే చక్కని సీతాకోకలు
చకచక ఎగురుతు వచ్చేసినవి  ॥ 

అంబరమందున నీలి తెరలపై ; 
పున్నమి జాబిలి చేవ్రాళ్ళు ;  
ఆ సంతకమ్ముల ఇంపుసొంపుల; 
దరహాస చంద్రికలకు; 
సొంతదారులం మేమేనంటూ ; 
కిలకిలా నవ్వినవి 
||రెక్కల వన్నెల రంగవల్లికలు;
అలరే చక్కని సీతాకోకలు
చకచక ఎగురుతు వచ్చేసినవి ॥ 

*************************

# siitaakOkachilakammalawE 
wachchEsaayi, wachchEsaayi! ||
rekkala wannela ramgawallikalu; 
alarE chakkani siitaakOkalu - 
wachEsaayi, wachchEsaayi ||

bRmdAwanilO puuwula wraali; 
gOpa BAminula tikamakapeTTuchu;
malle podalalO : nakkuchu daagina ; 
namdakumaaruni nEstulamannawi ||

ambaramamduna niili teralapai ;
punnami jaabili chEwrALLu ;  
aa samtakammula impusompula; 
darahaasa chamdrikalaku; 
somtadaarulam mEmEnamTU
kilakila nawwinawi ||

************************* 

సీతాకోకచిలకలకు welcome

సీతాకోకచిలకమ్మలు వచ్చేసాయి, 
రామచిలకలకు జామకొమ్మలు;
సీతాకోకచిలకమ్మలకు ; 
సుందర పరిమళ పుష్పాలు ||

చిలకపచ్చలు, మేనకపచ్చలు; 
కెంపు, గోధుమ, ఊదా వన్నెలు; 
ఎర్రని ఎరుపు; కాషాయం, 
వక్కరంగుల పొగరుల నిగ్గులు;
వన్నెలెన్నిటినో రెక్కల దాల్చిన 
||సీతాకోకచిలకమ్మలకు ; 
సుందర పరిమళ పుష్పాలు 
సీతాకోకచిలకలు విచ్చేసాయి
స్వాగతము సుస్వాగతము ||

**************************;   

siitaakOkachilakammalu wachchEsaayi, 
raamachilakalaku jaamakommalu;
siitaakOkachilakammalaku ; 
sumdara parimaLa pushpaalu ||

chilakapachchalu, 
mEnakapachchalu; 
kempu, gOdhuma, 
uudaa wannelu; 
errani erupu; kaashaayam, 
wakkaramgula pogarula niggulu;
wannelenniTinO rekkala daalchina ||siitaakOkachilakalu||

********************************

సంస్కృత సంచిక  [link]