Sunday, September 16, 2018

బాలకృష్ణ సింగారం కోసమే ప్రయాస

ఈక ఈక తెచ్చి - చేసెదము మేము - 
చక్కని గుత్తి - పొందికగా ఇంచక్కా ; 
బాల క్రిష్ణుని సిగముడిని - నెమలి కన్నుల గుత్తిని ; 
తురిమెదము పొందికగ ఇంచక్క ;  ||
&
పురిని విప్పవమ్మా - నాట్యాల వేళాయెను - 
వయ్యారి ఓ నెమలీ - సయ్యాటల వన మయూరి  ;
ఓ కేకి, నీదు పింఛము నుండి -
మిలమిలల పింఛములు - కరుణతో ఇవ్వమ్మ! ; 
కొన్ని - మిలమిలల పింఛములు ;
కరుణతో ఇవ్వమ్మ! ;  ||

పువ్వు పువ్వును చేర్చి - అల్లెదము అందరము ; 
వన్నెల దండలు - పొందికగా ఇంచక్కా ;
కన్నయ్యకు ఇపుడు వేసి, సింగారించి ; 
తనివితీరా కనుల నింపుకుందాము ; 
&
కొమ్మ కొమ్మన - పరిమళములు పూయండి ;  
బృందావని మొలకలార! నందనవని తరువులార!
మీ కొమ్మ, రెమ్మల నుండి - ఘుమఘుమ ప్రసూనములు ;
ప్రేమతో ఇవ్వండి ;  ||  
;
=================; ;
;
baalakrishNa simgaaram kOsamE prayaasa ;- 

eeka eeka tecci - cEsedamu mEmu - 
cakkani gutti - pomdikagaa imcakkaa ; 
baala krishNuni sigamuDini ; 
nemali kannula guttini ; 
turimedamu pomdikaga imcakka ;  ||
&
purini wippawammaa - nATyaala wELAyenu - 
wayyaari O nemalee - sayyaaTala wana mayuuri  ;
O kEki, needu pimCamu numDi -
milamilala pimCamulu ;
karuNatO iwwamma! ; 
konni - milamilala pimCamulu ;
karuNatO iwwamma! ;  || 

puwwu puwwunu cErci - alledamu amdaramu ; 
wannela damDalu - pomdikagaa imcakkaa ;
kannayyaku ipuDu wEsi, simgaarinci ; 
taniwiteeraa kanula nimpukumdaamu ; 
&
komma kommana - parimaLamulu puuyamDi ;  
bRmdaawani molakalaara! namdanawani taruwulaara!
mee komma, remmala numDi ; 
ghumaghuma prasuunamulu ;
prEmatO iwwamDi ;  ||  

No comments:

Post a Comment