Sunday, May 22, 2011

అడుగు జాడల శంఖ, పద్మ రేఖలు
























          ఈ యమునా తటి సీమల ;
          రాయబడిన సంతకములు
          ఆ పద్మ రేఖలెవ్వరివి?
          ఆ అడుగుదమ్ములెవ్వారివి? ;
          తెలుపుమమ్మ! ప్రియ సఖియా! ||
ఇంకెవరివి? క్రిష్ణునివి! ;
ఆ శంఖ, పద్మ రేఖలు
మా ముద్దు బాల క్రిష్ణయ్యవి!     ||

చరణ విన్యాసములను ;
హత్తుకొనినవి పడగలు;
కాళీయుని ఫణములపై;
అరుణోదయ చిత్రములు ||ఇంకెవరివి?||
చరణ విన్యాసములను
తన ఎదపై అచ్చుకొనెను;
వర ధరా తలము తానే
నిత్య కళ్యాణి అవగా ||ఇంకెవరివి?|| 
&&&&&&&&&&&&&&&&&&
 Lotus Sculpture
I yamunaa taTi sImala ;
raayabaDina saMtakamulu ;
aa padma rEKalevvarivi?
aa aDugudammulevvaarivi? ;
telupumamma! priya saKiyaa! ||
iMkevarivi? krishNunivi! ;
aa SaMKa padma rEKalu
maa muddu baala krishNayyavi!     ||
charaNa vinyaasamulanu ;
hattukoninavi paDagalu;
kALIyuni phaNamulapai;
aruNOdaya chitramulu ||
charaNa vinyaasamulanu
tana edapai achchukonenu;
vara dharaa talamu; taanE ;
nitya kaLyaaNi avagaa ||
&&&&&&&&&&&&&&&&&&& 

Saturday, May 21, 2011

మధు కథలకు పెన్నిధి

















యమునా తీరము కద!
ఇది మధు కథలకు పెన్నిధి!    || 
చురుకు దనం, చూస్తున్నాం మనమిక్కడ;
ఇది ఎటుల సంభవం? ఇది ఎటుల సంభవం?
                   ||ఇది యమునా తీరము కద!||  
రాస లీలా పర్వం
రాయబడిన కావ్యంగా;
భాసించును ఈ తీరం,
ఇది ఎటుల సంభవం? ఇది ఎటుల సంభవము!?
                        ||ఇది యమునా తీరము కద!||

సంతసాల సంపదలకు;
పర్ణ శాలగా -
మనిషి మనసు
సంతరించు సంఘటన
ఇది ఎటుల సంభవం? ఇది ఎటుల సంభవము!?
                        ||ఇది యమునా తీరము కద!||

&&&&&&&&&&&&&&&&
vistaaraM churuku danaM;
chUstunnaaM manamikkaDa;
idi eTula saMbhavaM?
idi yamunaa tIramu;    ||
raasa lIlaa parvaM
raayabaDina kaavyaMgaa;
BAsiMchunu I tIraM, idi   ||
saMtasaala saMpadalaku;
parNa SAlagaa -
manishi manasu
saMtariMchu saMGaTana
ichaTa eTula  saMBavammu!?
||idi madhu kathalaku pennidhi!    ||
 
&&&&&&&&&&&&&&&

Friday, May 20, 2011

క్రిష్ణ లీలలు
















నీవు, నడయాడిన ప్రతి జాడ,
ప్రతిదీ ఒక ముచ్చట కద!
కన్నా! - ఇది నీ లీల కాక వేరేమిటి!!! ||
 
కన్నా!
నీ నీలి మేను నిండ - వెన్న పూసలెన్నెన్నొ ;  
కన గలుగుతూన్న నీలి నింగి;            
విశాల గగనము,------  
"తారకలు నిండి ఉన్న- తన రూపమె!" - అనుకున్నది,
అది కూడా ఒక ముచ్చట - కద కన్నా!      
ఇది నీ లీల కాక వేరేమిటి!?! ||  
   
పెరుగు వెన్న - పూస పూస - మెరిసే నక్షత్రము;  
చిరు నవ్వు నీది జాబిల్లికి          
ముద్దు ముచ్చట! -----
శరదిందు పున్నమీ రేయికి    
ఇట విడిది చేయు వైభోగము!
అది కూడా ఒక ముచ్చట - కద కన్నా!  
ఇది నీ లీల కాక వేరేమిటి!?!     ||    
ఆ యమునా వాహినికి - నింగి అంటె అసూయ,
తన, అలల గాలి మబ్బులతో
దాచి వేయ జూచు నిన్ను!
బృందావని
నికుంజముల పొదువుకొనగ చూచును
ఈ ముచ్చట గాథలన్నినీ లీలలే క్రిష్ణయ్యా!       ||

Wednesday, May 18, 2011

మందారములకు మిసిమి కలిగెను






















ఏ మాత్రము జాప్యమును సేయకనూ;
భామినులార!సరగున రండీ!
సత్వరమే తామెల్లరునూ ;
పరుగిడి, వడి వడి  వేగమె  రండీ! ||
తులసీ మాలలు అల్లుదము;
కళ కళలాడును హరిత వర్ణముల  
జలజ నాభునీ గళమున దళములు ||
నయగారముల మందారములను;
దామోదరునికి సింగారించి ;
హొయలులు పూలకు ఒసగుదము   ||

పాటల దొర శ్రీ క్రిష్ణ మూర్తి















పాటల దొర శ్రీ క్రిష్ణయ్య
ఎద ఎదనూ ;తేట గీతిగా మార్చెనొహో!
నీటుగ ప్రతి మది మందిరమాయెను
ఇదేమి మాయా మర్మమొహో! ||
 
బృందావనిలో మాధవు అలికిడి ;
సందడి సేయుచు గాలి తెలిపెను ;
లేమలార! మనమందరమూ;
ఏమరకుండా సేయుదము;
సాధన తప్పక నిత్యమునూ;  
మృదు మురళీ వీచిక లయ్యెదము ||
రాధా దేవికి ఎపుడో ఆయెను
ఇనుముబ్బడిగా కరతలామలకము ;
సాధన విద్యా నిధి రహస్యము ;
మాధవీ లతా నికుంజములెల్లడ ;
ధ్యాన తపస్విని, క్రిష్ణ ప్రేయసి    
తానే సురభిళమాయెనొహో! ||
&&&&&&&&&&&&&&&&&













paaTala dora, eda edanuu ;
tETa gItigaa maarchenohO!
nITuga maMdiramaayenu eDadalu;
idEmi maayaa marmamohO! ||
E mAtramu jaapyamu
sEyakuMDa raMDi, raMDi!
parugiDi, vEgame  raa raMDi!
BAmA maNulAra! satvaramE
taamellaru saraguna raaraMDI! mIru
bayalu dEri, tarali raMDi! ||
bRMdaavanilO maadhavu alikiDi ;
saMdaDi sEyuchu gaaali telipenu ;
lEmalaara! manamaMdaramuu;
EmarakuMDA sEyudamu;
saadhana tappaka nityamunuu;
mRdu muraLI vIchika layyedamu ||
raadhaa dEviki epuDO aayenu ;
inumubbaDigaa karatalaamalakamu
saadhana vidyaa nidhi rahasyamu ;
maadhavI lataa nikuMjamulellaDa ;
dhyaana tapasvini krishNa prEyasi ;
taanE suraBiLamaayenohO! ||

&&&&&&&&&&&&&&&&&&& 

Thursday, May 12, 2011

రాధా దేవికి ఆశ్చర్యము

















పొలతి రాధిక అట్టె నిలిచిపోయేనయా
కదలనీ బొమ్మగా అచ్చెరువున  
నీ బొమ్మ తానే! క్రిష్ణయ్యా!     ||  

నీ కనుబొమ్మల కోవెలలొ తీరుగా ఉన్న:
కస్తూరీ - నామములలో వలయములు తిరిగేను:        
వే వేల భాస్కర కిరణావళి;                              
అది కనిన రాధమ్మ కదలనీ బొమ్మగా:  
నిలిచినదీ క్రిష్ణయ్యా! – అచ్చెరువున  ||  
 
కొసరి కొసరి పాల బువ్వ  ఇదిగో! అనుచు  
గోరుముద్దలు నీకు – తినిపించె రాధిక;
పాల బుడగలలోన బస చేసిన  
తన బింబముల కనిన రాధమ్మకు ;
సంభ్రమములందున తల మునకలు ||

 

Wednesday, May 11, 2011

కథాకళీ నాట్య ప్రదర్శన - natya vismayam,













భారత దేశ సాంప్రదాయక కళలను ప్రోత్సహించే దిశగా
AOL Foundation  కృషి కొనసాగుతూన్నది.
ఆర్ట్ ఆఫ్ లివింగ్ - వారి ఆధ్వర్యములో
కథాకళీ నాట్య ప్రదర్శన-
కేరళలోని తిరువనంతపురములో  జరిగింది.
ఫిబ్రవరి, 2011 లో Art of Living (AOL) వారు
ఈ బృహత్ ప్రయ త్నము ఏర్పాటు చేసారు.
150 మంది కథాకళి నాట్యకారులు చేసారు.
గిన్నిస్ బుక్ రికార్డు కై ఈ నాట్య ప్రదర్శనా కృషి జరిగినది.
నాట్య విస్మయం అనే పేరుతో ఈ ప్రదర్శనోత్సవము
February 13, 2011 ఏకధాటిగా 45 నిముషాలు చేసారు నర్తకీ నర్తకులు.
నాట్య విస్మయం అనే పేరుతో ఈ ప్రదర్శనోత్సవము ఉత్సాహంగా జరిగింది.
ఎ.ఒ.ఎల్.,ఫౌండర్ శ్రీ శ్రీ రవి శంకర్ నిరవధిక కృషితో
ఇలాగ మహా ప్రదర్శన
వేదికపై, నిరవధికంగా, నిరాటంకంగా జరిగినది
Art of Living (AOL) founder Sri Sri Ravi Shankar.

Tuesday, May 10, 2011

screen paintings (kadanbari)

Here is my screen paintings .

అనగనగా ఒక అమ్మాయి ;


"గుళ్ళ సీతా రామ పురము " temple


బొబ్బిలి రాజులు 350 సంవత్సరాల క్రితం కట్టించిన కోవెల అక్కడ ,
కళా వైభవానికి ప్రతిబింబంగా ఉన్నది.
ఆ సీమయే - శ్రీకాకుళం జిల్లాలో,
సంత కవిటి మండలము లో కుగ్రామము "గుళ్ళ సీతా రామ పురము".
వ్యాపార కూడలి , తాండ్ర పాపారాయుని సీమ ఐన
రాజాం పట్టణానికి 9 కిలో మీటర్లు దూరాన ఉన్నది
ఈ Gullaseetharam puram గుడి.
ఈ దేవళములో సీతారామ విగ్రహాలు
కను విందు చేస్తున్నాయి.
భద్రాచలంలో వలెనే
ఇక్కడ కూడా సీతా దేవి అమ్మ వారు,
పతి దేవుని ఒడిలో ఆసీనయై ఉన్నది.
నల్లని గ్రానైట్ రాయి విగ్రహములు అవి.
 ఏక శిలలో ఈ విగ్రహాలను చెక్కిన
శిల్పి ప్రజ్ఞ ప్రశంసార్హమైనది.
ప్రాకార మండపాలు,
Temple sculpture and carvings
నయనానందకరం చేస్తున్నవి

Wednesday, May 4, 2011

స్వామిని “నట రాజు”గ నిలిపినావు


















జనని! త్రిభువన పోషిణీ!
త్రైలోక్య శుభదాయినీ!
జయ మంగళం!అమ్మ!
జయ మంగళం! జయ మంగళం             ||

సలలిత రాగములు చిలుకంగా
అతులిత గానము సాగంగా
సరి గంగ వాహినీ లహరికలు ఎగయంగా
పతి ఈశునితో అఖండ నాట్యములు సేసినావు
స్వామిని “నట రాజు”గ నీవు నిలిపినావు
ప్రకృతీ మూలముల ఋజువు నీవు!          ||

అంబ! పరమేశ్వరీ! ఆది శక్తీ!
నీ - కాంచన దుకూల చేలాంచములతో
రవి కిరణ సముదాయముల ఆటలు
నీ మణి మేఖల రత్న మణులందున
పౌర్ణమీ చంద్రికల స్థిర వాసము       ||

 (స్వామిని “నట రాజు”గ నిలిపినావు ;

      Link - Konamanini

మంగళవారం 12 అక్టోబర్ 2010


ఆనంద రూపిణీ!

Sunday, May 1, 2011

కలువ పూలతో పూజలు



హంస వాహిని! బ్రహ్మ అర్ధాంగీ!
శ్రీ శారదాంబా! విద్యలకు జననీ!
నీకు శత కోటి నుతుల;
కుముదార్చనలివే! అమ్మ! గైకొనుమా!    ||శత కోటి నుతుల||

నీ వీణ రాగాలు ఒలికించగా;
సంగీత స్వర గాథలింపొందగా;
మనుజులకు ఒసగిన మహనీయవు!
నీకు శత కోటి నుతుల;
కుముదార్చనలివే! అమ్మ! గైకొనుమా!     ||శత కోటి నుతుల||

సిరి గానమొలికించు శుభదాయినీ! ;
లిపి నీకు నవ రత్న సింహాసనం ;
సురుచిర రూపిణీ! శుభ దాయినీ! ||శత కోటి నుతుల||

నిను తలచి, నిత్యము ;కొలిచేటి భక్తులము;
స-రి-గ-మ- ల :లాలించుమా!
మము ప-ద-ని-స- ల ; పాలించుమా! ||శత కోటి నుతుల||