Wednesday, September 12, 2018

మురళిగా వెదురు సరికొత్త అవతారం

వెదురు బొంగు ఎత్తినది ;
సరి కొత్త  అవతారం - వేణువుగా ; 
నవ మోహన రాగముల కోశముగా ;  ||  
;
బిక్కు బిక్కు మంటూ ఉన్నట్టి వెదురు ; 
కీకారణ్యంలో మారు మూల  -
బిక్కు బిక్కుమంటూ ఉన్నట్టి ఈ చిట్టి తరువు ;   
|| ఎత్తినది అవతారం, సరి కొత్త వేణువుగా  || 
;
అసలే అతి సన్నం ; గడకర్రవు నీవు - అని 
మహా మహా వృక్షాలకు - చిన్న చూపు ;
తన పైన వల్లమాలినంత చిన్న చూపులు ;  ||
;
మురళికేమొ తెగ గుబులు, 
బొగులు వారే సొదలు ;
అవధి లేనంత దిగులు  ;  || 
;
'గాలి కాస్త విసిరిందా ; 
ఫెళ్ళుమనును కొమ్మలు ; 
వట్ఠి బొంగు పేడు ఇది' - 
అని  ............ 
ఎత్తైన ఆ చెట్ల గుసగుసలు - 
తనలోని లోపాలను ఎంచి ఎంచి,
నవ్వుకొందురే, ఎలా!? : 
|| మురళికేమొ తెగ గుబులు ||
;
ఏళ్ళ తరబడి తపస్సు ; ఎటుల ఏమి చేసెనో, 
కన్నయ్య చేత పడెను, వంశీ - తానైనది ఈ నాడు ; 
తీపి రాగములు పూసే ; మధుర మురళిగా, భళి భళీ! ;  || 
;
 శ్రీక్రిష్ణాష్టమి శుభాకాంక్షలు 2017  ; 
वंश / बाँस् బాన్సురీ ;
======================= ,
;
weduru bomgu ettinadi ;
sari kotta  awataaram - wENuwugaa ; 
nawa mOhana wENuwu, raagamula kOSamugaa ;  ||
;
bikku bikku mamTU unnaTTi weduru ;
keekaaraNyamlOna - maaru muula ;
bikku bikku mamTU unnaTTi ee ciTTi  taruwu ;  
||ettinadi awataaram - sari kotta wENuwugaa||
;
asalE ati sannam ; neewu gaDakarrawu - ani ;
mahaa wRkshaalaku - tana paina cinna cuupu ;
tana paina wallamaalinamta cinna cuupulu ; 
||muraLikEmo tega gubulu, awadhi lEnamta digulu||
;
'gaali kaasta wisirimdaa ; 
pheLLumanunu kommalu ; 
bomgu pEDu - idi'
ani  .......... 
ettaina aa ceTla gusagusalu - 
tanalOni lOpaalanu emci emci,
nawwukomdurE, elA!? :  ||
||muraLikEmo tega gubulu, awadhi lEnamta digulu||
;
ELLa tarabaDi tapassu ; eTula Emi cEsenO, 
kannayya cEta paDenu, wamSii - taanainadi ee naaDu ;
teepi raagamulu puusE madhura muraLigaa, bhaLi bhaLI! :  || 
;

No comments:

Post a Comment