Monday, February 27, 2012

గురు శిష్య పరంపర


;
నీలాల మేఘాలు దడబిడా వచ్చేయి;
ఆకసములోన ఆగమాగం చేస్తు, అల్లరిగ తిరిగేను;
మొయిళులను సాగరుడు పరికించి
చల్లనీ గాలులను పంపేడు;

శీఘ్రమే అవి వెళ్ళి, మబ్బులకు చెప్పాయి
"మలయ పవనాలము; మమ్ము మీ గురువులుగ,
నియమించినాడు జల దేవుడు"
గాలులకు శిష్యులై, మబ్బులు నేర్చాయి;
ఉరుముల గీతములు, మెరుపుల కావ్యములు;

ఇన్ని విద్యలు తెలిసి ఉన్నట్టి జలదములు,
అందరి మన్ననల నించక్క పొందాయి;

చినుకుల బాలురు నీరదమ్ముల విద్యార్ధులైనాయి;
వాన చినుకులు వైన వైనాలుగా;
మడుగు, చెరువులు, ఏరు, జలనిధుల నెన్నిటినొ;
వసుధ జననికి ఒసగ; 
ధరణి మృదు హాసముల సకల ప్రాణులకును, 
హర్షాతిశయ దివ్య దీవెనలు ఒసగేను! 

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

Friday, February 24, 2012

నాకీ photo నచ్చింది.


ఈ నాటి సామాజిక పరిస్థితులలో
బాల్య దశలోని సౌకుమార్య, లాలిత్యాలు
ఎంతవరకు సురక్షితముగా ఉన్నవి?
ఈ ఫొటో- ఇందులో- సూక్ష్మం గా, నేటి అవస్థలను,
చూసీ చూడగానే ఆకట్టుకునే వ్యంగ్య భావములోని వ్యగ్రత-
అందుకే నాకు ఈ photo నచ్చింది.

ఇరుక్కున్న ముక్కు


Beaverton City Library


చిలక చిలక, రామ చిలుక;
ముక్కు మీద టెక్కు కోపం; 
కోపం, అలుక కుప్పలు అయ్యి; 
ముక్కు కాస్తా ఎర్రన ఆయెను;

ఎర్రన, తిమ్మన- 
ముక్కు కవితలకు; 
అల్లికలెన్నో అందించినది 
రాచిలకమ్మ చిన్ని నాసిక

ఎర్రని -అలకల- కినుకల శుకము 
దోర జామ పళ్ళను చూసీ……….
చూసీ, చూడగనే…….. 

Q:- ఆ! ఏం చేసినది? 
     ఆహాహా! ఏమి చేసినది?

జామ కాయను కొరికె కసుక్కున;
పండులొ ముక్కు ఇరుక్కున్నది
జామ కాయను కొరికె కసుక్కున;
పండులొ ముక్కు ఇరుక్కొన్నది! 

కొమ్మలొ కోతి నవ్వె కిసుక్కున!                         
హ్హి హ్హి హ్హీ! వ్వె వ్వె వ్వే!
వెక్కిరింతల కోతికి డిల్లా!
చక్కిలిగింతల జిల్లాయీలు!

                      (అందరూ నవ్వుతారు)

హ్హి హ్హి హ్హీ! వ్వె వ్వె వ్వే!

]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]]
Published On Friday, February 10, 2012 By ADMIN. 
Under: ఆట - పాట, పాటలు. 
రచన  : కాదంబరి పిదూరి


Thursday, February 23, 2012

పరాంతిక సీత, Butter fly


పరాంతిక సీత: శ్రీరాముని ధర్మ పత్ని సీతాదేవి-
ఈ పేరును ఒక సీతాకోకచిలుక- సంపాదించుకున్నది.
హిమాలయాలు, కాశ్మీరు, ఇంకా
ఉత్తర భారతదేశము, టిబెట్, సిక్కిం, తైవాన్, మలయా మున్నగు దేశాలలో
ఈ పరాంతిక సీత- అనే జాతిని పరిశోధకులు  కనుగొన్నారు.
Ussuri, Sakhalin మున్నగు కంట్రీలలో కూడా ఈ ~ ఉన్నవి.
The Chestnut Tiger (Parantica sita)[Danaid group]
వీని రెక్కలు ప్రత్యేకత వలన ఈ గుర్తింపు వచ్చినది.
క్రింది రెండు రెక్కలు, వింత రంగును కలిగినవి.
ఛెస్ట్ నట్ వన్నె= దీనినే ఇండియన్ రంగు- అని
పేరును - విదేశీయులు- పెట్టారు-
గోధుమ రంగు మిళితమైన ఎర్ర రంగును ఛెస్ట్ నట్/ ఇండియన్ ఎరుపు రంగు-
అనే  పేరుతో పిలుస్తున్నారు.
Chestnut/ Indian red, is a color, a medium brownish shade of red

ఇండియన్ బటర్ ఫ్లై ఆర్గనైజేషన్ ఇత్యాది సంస్థలు
మన  ఇండియాలోని సీతాకోకచిలకల గురించి విషయసేకరణలో నిమగ్నమై, కృషి చేస్తూన్నవి.

Wednesday, February 22, 2012

శోభిల్లు బొమ్మల కొలువులు!



















కొండల దేవరా! కొలువునకు వేళాయె!
కొలువు తీరగ స్వామి! తీరుగా రావోయి!
మా కన్నులందున నీవున్న దృశ్యాలు;
ఉన్నత శోభల బొమ్మల కొలువులు!    ||మా కన్నులందున||

నీ తీపి పలుకులలొ సతి సోగ చూపులు;
కుదురుగా ఉయ్యాల లూగుచుండంగా;
కొండల దేవరా!
కొలువునకు వేంచేయ- మరచినావేమో!?
ఔరౌర!గొబ్బున రావోయి!      ||మా కన్నులందున|| 

సోమరిపోతు అయి; విహగ రాజు అటనె;
మబ్బు పీఠము పైన కూర్చుండి పోయేనొ?
గరుడ వాహన!
నీవు, కొలువునకు రాకుండ ఇంటనే ఉన్నావ!?
ఔరౌర! వేగమే రావోయి!       ||మా కన్నులందున||

ఆదిశేషుడు క్షీర ; సంద్రమ్ములోనే;
మత్తుగా కూళయై; బబ్బుండిపోయేనొ?;
పన్నగ శయనుడా!
కొలువునకు దయ సేయ- బద్ధకిస్తున్నావా?
ఔరౌర! దబ్బున రావోయి!     ||మా కన్నులందున||

&&&&&&&&&&&

Thursday, February 16, 2012

అత్తరు పలుకుల చిలకమ్మ




చిలకరించవే! చిలుకా!
పన్నీటి పలుకులను
చిలకరించవే! చిలుకా!||

మా పద్మావతీ వదన బింబము
జేవురించి, వసి వాడి ఉన్నది
ఎందుకనో, ఏమో గానీ, ఎరుగ నేరకున్నాము
లిప్తపాటులో సతి కినుక పోవగా
               || చిలకరించవే! ||

ఒక్కుమ్మడిగా ఓరచూపులు
జారుచు, నాధుని ప్రణయ పంజరము
లీలగనవగా, మదన సంబరము
అది గని ప్రకృతి ముదమున నవ్వగ
             || చిలకరించవే! || 
;

Wednesday, February 8, 2012

ఇబ్బడి ముబ్బడిగా క్రిష్ణ ప్రభలు









వెన్నెలా! వీక్షించుమమ్మా!
మబ్బు పలకను అందుకొనుమా!
నుడులు రాయుట నేర్చుకొనుమా!
దొరికె నేడు అవకాశం, - మహదవకాశం ||

నీలాల నీరములందు కేళీ
కృష్ణమూరితి ఈదులాడెను
తరంగముల పంక్తులందున;
వరదగుడుల లిపుల కూర్చిన
అక్షరాబ్యాసమ్ము చక్కగ జరుగుచున్నాది:
చూసి శ్రద్ధగ నేర్చుకొనుమా!

||దొరికె అవకాశం- మహదవకాశం ||


నీలి యమునా జలములందున;
మురిపాలు ఒలికే బాల క్రిష్ణుని;
ఆటపాటలు ఎంతొ ముద్దు!
ఇటు యామినికి అటునిఖిల జగతికి
కనుల నిండుగ వీక్షించి;
పొందుగ పరవశములన్

||దొరికె అవకాశం- మహదవకాశం ||
;

పల్లె పట్టులు వ్రేపల్లెలు;
బృందావనమున యమున సొగసుల;
క్రిష్ణ మరకత శోభలన్
ఇమ్మడిగా.....
అందుకొనె నింగి!
ముమ్మడిగా.....
శోభిల్లెను అవని ||
;

Tuesday, February 7, 2012

చిందు గోపాలం! సందె గోపాలం!



అందునా, నేనందునా!

;
బాలకృష్ణుడు వీడు ఇడుగో!
తన ప్రతి హేల- లీలా బింబమవగా;

అందునా, నేనందునా!?
చిందు గోపాలం! సందె గోపాలం!  ||

ఇంత కోపాలెందుకంటా!
అంతటీ సణుగుడులు, చిరు బుర్రులూ
అడగగానే యశోదమ్మ;
నెమలి ఈకలు ఇవ్వలేదని.....
||చిందు గోపాలం! సందె గోపాలం!||

గొణుగుడు, గుణుపు అలకలు;
ఎందుకోయీ? తెలుపవోయీ!
కుండ గోకుడు గోదావరి-
పిన్ని రోహిణి ఇవ్వలేదని
||చిందు గోపాలం! సందె గోపాలం!||
;

దోబూచులాటల మేటి క్రిష్ణుడు;
అందు వీడే! ఇందు వీడే!
వేరె నీకై వెదుకనేల?
సర్వంతర్యామివి నీవేనయా!
||చిందు గోపాలం! సందె గోపాలం!

           అందునా, నేనందునా!? ||