ఉప్పొంగి ఉప్పొంగి
ఉరకలేస్తున్నాది ;
నీలి యమున వాహిని ;
ఎందుకని? ఎందుకని? ఎందుకని?; ||
నల్ల నల్లనివాడు ;
తెల్ల నవ్వుల వాడు ;
అల్లరల్లరి వాడు ;
అలనల్లన వస్తూన్నది -
ఎవ్వరది? ఎవ్వరనీ!? ;
ఆ వచ్చేది మన క్రిష్ణమ్మ ; ||
యమున తరంగాల పయిన ;
వయ్యారము లొలక బోసేను వెన్నెల ;
సయ్యాటల తెలి వెన్నెల ;
వ్రేపల్లియ యావత్తు - చేరేను యమునా తటి ;
సరిత్తు యావత్తు నిలువెత్తు గిలిగింతలు ;
రాసనాట్య వేదికయే ఐనందున ;
రాసనాట్య వేదిక - తానే అయినందున ; ||
రాసలీల రాసలీల రాసలీల ;
ఎటు చూసిన రాసలీల ;
చిటికె చిటికె చిటికెలు ;
చిటి వేళ్ళపైన చిటికెలు ;
కొస వ్రేళ్ళ పైన చిటికెలు ;
చప్పట్లు చప్పట్లు చప్పట్లు ;
కలువ పువ్వులంటి అర చేతుల చప్పట్లు ;
కిలకిలలు కిలకిలలు కిలకిలలు ;
కిలకిలల నగవులన్ని వెదజల్లు తావులతొ ;
దశదిశలను తోటలుగా మలచేటి కిలకిలలు ; ||
;
=============================; ;
;
uppomgi uppomgi urakalEstunnaadi ;
neeli yamuna waahini ;
emdukani? emdukani? emdukani?; ||
nalla nallaniwADu ; tella nawwula wADu ;
allarallari wADu ;
alanallana wastuunnadi - ewwaradi?
ewwaranee!? ;
aa waccEdi mana krishNamma ; ||
yamuna taramgaala payina ;
wayyaaramu lolaka bOsEnu wennela ;;
sayyaaTala teli wennela ;
wrEpalliya yaawattu ;
cErEnu yamunaa taTi ; sarittu yaawattu niluwettu
giligimtalu ;
raasanaaTya wEdikayE ainamduna ;
raasanaaTya wEdika taanE ayinamduna ; ||
raasaleela raasaleela raasaleela ;
eTu cuusina raasaleela ;
ciTike ciTike ciTikelu ;
ciTi wELLapaina ciTike ;
kosa wrELLa paina ciTikelu ;
cappaTlu cappaTlu cappaTlu ;
kaluwa puwwulamTi
ara cEtula cappaTlu ;
kilakilalu kilakilalu kilakilalu ;
kilakilala nagawulanni ;
wedajallu taawulato ;
daSadiSalanu tOTalugaa
malacETi kilakilalu ; ||
No comments:
Post a Comment