Saturday, September 15, 2018

కళ్ళలోన లక్ష వత్తులు - ఎదురుతెన్నులు

కళ్ళలోన యావత్తూ ; 
ఎదురుచూపులు ; 
క్రిష్ణయ్యా. నీ కోసము - 
ఎదురుతెన్నులు ;  ||
;
కళ్ళలోన వత్తులు ;
వేలు, లక్ష వత్తులు ;
క్రిష్ణయ్యా, నీ కోసము - 
ఎదురుతెన్నులు ;  ||
;
ఆట పాట చిత్రముల ; 
యవనిక తానెప్పుడూ ; 
విశాలమౌ యమునా సైకతమ్ములందున  ; 
కోట్లాదిగ పరివ్యాప్తిత హర్షముల వలయాలు ;  ||

నాట్య కళల లోకమ్ములు ; 
ఇట నెలకొన్నవి నీ కతమున ; 
ఇతిహాసము కథలకు కితకితలు ; 
నీ కతముననె కన్నయ్యా! 
మా చిలిపి చిన్నారి క్రిష్ణమ్మా ;  ||
;
===============;
kaLLalOna yaawattuu ; 
edurucuupulu ; 
krishNayyaa, nee kOsamu ;
edurutennulu ;  ||
;
kaLLalOna wattulu ;
wElu, laksha wattulu ; 
krishNayyaa. nee kOsamu - 
edurutennulu ;  ||

aaTa paaTa citramula ; 
yawanika taaneppuDU ; 
wiSaalamau yamunA saikatammulamduna  ; 
kOTlaadiga pariwyaaptita harshamula walayaalu ;  ||
;
naaTya kaLala lOkammulu ; 
iTa nelakonnawi nee katamuna ; 
itihaasamu kathalaku kitakitalu ; 
nee katamunane kannayyaa! 
maa cilipi cinnaari krishNammaa ;  ||  

No comments:

Post a Comment