Sunday, June 28, 2015

కీలు గుర్రం

చీకటి బూచీ! ఛల్ ఛల్ ఛల్!; 
వేకువ మాతా! హల్ చల్ చల్! ||
పుడమి రాణికీ టింగణా గుర్రం; 
ఛల్ ఛల్  ఛల్  ఛల్ ఛల్  ఛల్ 
ఛల్ ఛల్  ఛల్  చలాకి గుఱ్ఱం ॥ 

పంచ కళ్యాణీ ఛల్ ఛల్ ఛల్! 
బాలపాపలకు కీలుగుర్రము 
మారాం పిల్లకు కొయ్యగుర్రము
మంచి పాపలకు రెక్కలగుఱ్ఱము
ఛల్ ఛల్  ఛల్  ఛల్ ఛల్  ఛల్   || 

మారాం చేయకు పాపాయీ!
మారాం, హఠములు మానేస్తే; 

నీకూ దొరుకును జవనాశ్వం - గుఱ్ఱం
ఛల్ ఛల్  ఛల్  ఛల్ ఛల్  ఛల్   || 
====================

 kIlugu~r~ram / 
          kiilu gurram :-

chiikaTi bUchI! Cal Cal Cal!; 
wEkuwa mAtA! hal chal chal!
puDami raaNikI TimgaNA gurram; 
Cal Cal  Cal  Cal Cal  Cal  
Cal Cal  Cal  chalaaki gurram; ||

pamcha kaLyaaNI Cal Cal Cal! 
baalapaapalaku kiilugurramu; 
maaraam pillaku koyyagurramu;
mamchi paapalaku rekkalagurram;
Cal Cal  Cal  Cal Cal  Cal   ||

maaraam chEyaku paapaayI!
maaraam, haThamulu maanEstE; 

nIkU dorukunu jawanaaSwam - gu~r~ram (= ఱ్ఱం)
Cal Cal  Cal  Cal Cal  Cal   
Cal Cal  Cal  Cal Cal  Cal   ||

*************************
పిల్లలు కట్టే గుజ్జన గూళ్ళు july 28 wednesday 2010;

సంతోషమ్మే సగము బలమురా! 

ఏ ముని తపస్సు చెదిరినదో?

వియత్తలిని పాదముతో:     
కొలిచినాడు క్రిష్ణుడు, 
మన చిన్నారి  క్రిష్ణుడు! ||

ఏ ముని తపస్సు చెదిరినదో? 
ఏ బ్రహ్మర్షి - 
ధ్యానమ్ము భంగమయ్యినదో!?; 
చిటికెలోన 
దేవకీ- గర్భమ్మున దూరినాడు
అయ్యారే! క్రిష్ణుడు! 
మన చిన్నిక్రిష్ణుడు   || 

అమూల్యమణుల గని ఈతడు; 
సువర్ణ ప్రభల నిలయము; 
మన ధరణికి -
తేజస్సుల వరమయ్యెను, 
అయ్యారే! క్రిష్ణుడు! 
మన చిన్నిక్రిష్ణుడు  ||

ఎంతగా స్తుతించినా; 
ఎంతని వర్ణించినా; 
ఏమని వివరించినా: 
తనివితీరదే! తనివితీరదే!
మన చిన్నిక్రిష్ణుని/ డు 
॥ అయ్యారే! క్రిష్ణుడు! 
మన చిన్నిక్రిష్ణుడు ॥   
===================
 
wiyattalini paadamutO: 
kolichinaaDu krishNuDu, 
mana chinnaari  krishNuDu||

E muni tapassu chedirinadO? 
brahmarshi dhyaanammu 
bhamgamayyinadO!?; 
chiTikelOna 
dEwakii garbhammuna duurinaaDu 
ayyaarE! krishNuDu; 
mana chinni krishNuDu || || 

amuulya maNula gani iitaDu; 
suwarNa prabhala nilayamu; 
mana dharaNiki; 
tEjassula waramayyenu, 
ayyaarE! krishNuDu; 
mana chinni krishNuDu ||

emtagaa stutimchinaa; 
emtani warNimchinaa; 
Emani wiwarimchinA: 
taniwitiiradE! taniwitiiradE! 
mana chinnikrishNuni/ Du 
ayyaarE! krishNuDu; 
mana chinni krishNuDu || 
 
***********************************
అఖిలవనిత
Pageview chart 31658 pageviews - 786 posts, last published on Jun 16, 2015
కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 59103 pageviews - 1018 posts, last published on Jun 24, 2015 - 7 followers
Telugu Ratna Malika
Pageview chart 4424 pageviews - 127 posts, last published on Jun 22, 2015
 

Tuesday, June 16, 2015

బొడ్రాయి = నాభిశిల

వాస్తు శాస్త్రంలో నాభిశిల (नाभि (शिला) కు ప్రాధాన్యత ఉన్నది.
నాభి సంస్కృత పదానికి - బొడ్డు  అని అర్ధం. 
"బొడ్రాయి" అని తెలుగు పదం. చాలాగ్రామాలలో, బొడ్రాయి అనే మాటను, 
నేడు కూడా వాడుతున్నారు.
గర్భవతికి, కడుపులోని బిడ్డకూ అనుబంధంగా బొడ్డుత్రాడు ఉంటుంది.
నాభి - ప్రాణసంకేతం.
శంకుస్థాపన, గృహ ప్రవేశ వేళలలో, నాభిశిల స్థాపన ముఖ్య పరిశీలన అంశం. .
కేతేపల్లి (సువర్ణగిరి - ఈ పల్లెకు ప్రాచీన నామం. - నల్గొండ జిల్లా), 
బోగారం మొదలైన గ్రామాలలో
గ్రామదేవత పండుగగా స్థానికంగా అనేక పల్లెలందున పండుగను జరుపుకుంటారు.
"బొడ్రాయి పండుగ" ను తెలంగాణా ప్రజలు ప్రత్యేకంగా జరుపుకుంటారు.
కుమార్తెలను పుట్టినింటికి పిలుస్తారు. కూతుళ్ళకు కానుకలను ఇస్తారు.
శాఖాహారాది సూత్రాలను పట్టింపుగా అనుసరిస్తారు.
నాభి శిల ; శ్రీపర్ణి వాస్తు శాస్త్రాదులందు వాస్తు రీత్యా,
 "జీవికి నాభి వలె, కోవెలలు, భవన, గృహ నిర్మాణాదులందు 
నాభిశిల గురించి ప్రస్తావన చేస్తారు.
శ్రీకూర్మ శిల, మత్స్య యంత్రం మొదలగు యంత్రములు సైతం 
అనుబంధంగా విశిష్ట స్థానాన్ని కలిగిఉన్నవి.

******************************

నేపాల్ లోని కాళీగండకీ నది సాలగ్రామములకు ప్రసిద్ధి.
గండకీ నదిలోని సాలగ్రామములు, కూర్మశిలలు ప్రకృతిసిద్ధమైనవి.
శ్రీ మహావిష్ణు మూర్తికి ప్రీతిపాత్రమైనవి సాలగ్రామములు.
నేపాల్ దేశంలో గండకీ నదీ తీరమున విష్ణుమూర్తికి ప్రతిరూపముగా
"సాలిగ్రామ్" అని ఒక గ్రామము ఉన్నది.
సాలంకాయన మహర్షి ఒక పర్ణశాలలో నివసిస్తూ,
శ్రీ మహావిష్ణువును 'వనరూపి విష్ణువు' రూపమున 
సాలవృక్షమున పూజలు చేసాడు. 

******************************

అప్పటి నుండి ఆ కుగ్రామానికి 'సాలగామ్' అనే నామం వచ్చినది.  

శ్రీ వైష్ణవులు కఠిన నిష్ఠతో సాలగ్రామమును 
పూజామందిరములలో ఉంచి, ఆరాధిస్తూ ఉంటారు.
వరాహపురాణము, స్కందపురాణము, ఆపస్తంబుడు విధించిన సూత్రములు, 
తులసీ కథ, సాలగ్రామ భావన యొక్క ప్రాచీనతకు ఋజువులు. 
క్రీస్తు పూర్వము నాటిది ఈ "సాలగ్రామ పూజ".
"ఆది విష్ణు పంచాయతనము" విశిష్టత కలిగిన పూజా విధానం.

******************************


 clouds  










అఖిలవనిత
Pageview chart 31399 pageviews - 785 posts, last published on Jun 12, 2015 - 1 comment awaiting moderation
Create new postGo to post listView blog
కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 58763 pageviews - 1017 posts, last published on May 2, 2015 - 7 followers
Create new postGo to post listView blog
Telugu Ratna Malika
Pageview chart 4387 pageviews - 126 posts, last published on Jan 14, 2015

Friday, June 12, 2015

ధ్వని - అధిష్ఠాన దేవతలు

జగత్ జననీ! వాక్కులు జాలువారుటకు నీవు మూలస్థానమువు. 
చంద్రకాంతి మణుల పభలు కలిగిన ఆ రజను, తెల్లనిది, 
వశిన్యాది శక్తులు కలిగినవి నీ వాక్కులు. 
అటువంటి వాక్ శక్తి కలిగిన నిన్ను పూజించిన మానవుడు - 
రచనా సమర్ధుడగును, 
అతడు సరస్వతీ ముఖపద్మమునందలి 
పరిమళ యుక్త వాక్కులతో కూడిన 
కావ్యాలను రచించగలుగుతున్నాడు. 
                 -   (సౌందర్యలహరి, 3 వ శ్లోకము) :   
తాత్పర్య:- త్రిపురాంతికా దేవి - "మాతృకా వర్ణరూపిణి" అనీ, 
"పంచాశత్పీఠికా రూపిణి" అనీ - లలితాసహస్రనామములందు కీర్తించ బడినది.
పై శ్లోకమునందు వశిన్యాది దేవతలు:- ఎనిమిది మంది.
1. వశిని; 2. కామేశ్వరి; 
3. మోదిని; 4. విమల; 
5. అరుణ; 6. జయిని; 
7. సర్వేశ్వరి; 8. కౌళిని

'శ్రీ చక్రము 'నందలి 7 వ ఆవరణములోని 8 కోణములలో ఉంటారు. 
[సన్స్కృత పదజాలము - పునాదిగా - 
వ్యాకరణ పరిపుష్ఠ సిద్ధాంతములు నిర్మితమైనవి. 
50 అక్షరములు; 8 వర్గములుగా విభజించబడునవి. 
వానికి ఈ ఎనిమిదిమంది అధిష్ఠాన దేవతలు, 
వశిన్యాది దేవతలు 
ఉదాహరణకు - 'అచ్చులు ' ఒక వర్గముగా విభజితమైనవి. 
ఈ అచ్చులకు వర్గాధిదేవత - "వశిని".
1) క చ ట త ప వర్గాధి దేవతలు ఐదుగురు.
2) అంతస్థములు ; 3) ఊష్మములు -
ఈ రీతిగా అష్ట వాగ్దేవతలు "మానవులు ఉచ్చరించు శబ్దములు" కు ప్రేరణ ఐనారు. 
ధ్వనుల ఉచ్ఛారణలకు మూలస్తంభములు - వాగ్దేవతలు, 
కనుక వీరు శక్తి స్వరూపిణులు.
ఇట్టి శక్తివంతములైన వాక్కులు, అందలి భావములు, 
అటువంటి మాటలను పలుకవలెనను సంకల్పబలం, 
ఉద్దేశ్యాలకు కేంద్రబిందువు "అమ్మవారు".  
అందుచేతనే వాగ్దేవతలు ఆరాధిస్తున్న త్రిపురాంబికనూ, 
అమ్మవారినీ సేవించి తరించగలము.  
అద్భుత సౌగంధయుత కవిత్వమును అందించిన 
కాళిదాసాదులు, రసహీనమైన వేదాంత సారాంశాన్ని  కూడా సురభిళభరితమొనర్చిన శ్రీ ఆదిశంకరాచార్యుల ప్రతి రచన - 
ఇందుకు ఉపబలకములే కదా! 
శ్రీ శారదా దేవి - వాగ్దేవతల సంయుక్త రూపము.  
సారస్వతస్వరూపిణి ఐన శ్రీవాణీ దేవి వదనకమలము నుండి 
వెలువడు పరిమళము దైవికమైనది. 
ఆ సారస్వత, మాతృ స్వరూపిణి ప్రసాదము - 
మాధుర్య కవిత్వములు. 
మధురిమలు రంగరించ బడిన కావ్య సృజనలను - 
అమ్మవారి అనుగ్రహము - అని గ్రహించుట 
కవి యొక్క విద్యుక్త ధర్మము.

 roof design POP 

           






 - { రచన :  కోణమానిని - కుసుమ  
                   konamanini - kusuma )

Thursday, June 11, 2015

Camel భారీ

ఒంటె, ఊష్ట్రం,  ఎడారి ఓడ; 
పంచతంత్రమున కరభకము 
ఆంగ్ల భాషలో camel అందురు  
చదరంగంలో వయ్యారి పాను;  

కన్నురెప్పలు మూడు చొప్పున; 
ఆరు కలిగిన వింత జంతువిది;

మూపున నీళ్ళ ఫ్రిజ్ దాచుకుని
ఎండనుబడి తానెన్ని మైళ్ళు, క్రోసులు
యోజన దూరాల్ అలసట లేక నడవగలుగును

ఒంటె సవారీ బలే హుషారు
నేను ఇచ్చిన నీళ్ళను త్రాగి 
తుమ్ములు వచ్చెను కేమెల్ గారికి.
హాచ హాచ్ హాఛ్! ...... 












౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦  - ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦
రచన : కోణమానిని 
rachana : kONamaanini 


అఖిలవనిత
Pageview chart 31269 pageviews - 783 posts, last published on Feb 23, 2015 - 1 comment awaiting moderation
Create new postGo to post listView blog
Telugu Ratna Malika
Pageview chart 4372 pageviews - 126 posts, last published on Jan 14, 2015 
కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 58662 pageviews - 1017 posts, last published on May 2, 2015 - 7 followers
Create new postGo to post listView blog