Thursday, September 29, 2016

ఎల్లలు గీయకు

మోహన క్రిష్ణయ్యా! 
మురళిని రాగము నీవయ్యా!  ||
;
రాగముల అనురాగముగా ;    
ఎదుట  నిలిచినది రాధిక ;
 నీ  ఎట్టెదుట నిలిచినది
        నెచ్చెలి రాధిక  ||
;
చివురు వ్రేళుల నాట్యమాపకు ; 
సంగీతమునకు అవధి గీయకు ; 
వ్యవధి లేని నీదు
మురళీరవళీ - మాధురులందున - 
జగముల తేలాడ నీవయవ - 
ఈ జగముల తేలాడ నీవయ్యా   || 
;
========================;

; ellalu geeyaku ;- 

mOhana krishNayyA! 
muraLini raagamu neewayyA!  ||
raagamula anuraagamugaa ;    
eduTa  nilichinadi raadhika ;
 nii  eTTeduTa nilichinadi
        nechcheli raadhika  ||
;
chiwuru wrELula naaTyamaapaku ; 
samgeetamunaku awadhi geeyaku ; 
wyawadhi lEni needu
muraLIrawaLI - maadhurulamduna - 
jagamula tElADa nIwayawa - 
ee jagamula tElADa nIwayyaa   || 
;
*******************************,

Sunday, September 18, 2016

దరహాస లీల

రండి రండి, 
  నేడు కడు వేడుక ;
వేణుగానలోలుని రాసలీల!
కనుడు కనుడు ; 
కన్నులపంటగ సాగే 
 ఈ రాసలీల హేల ;
      మక్కువల మేళా!  ;    ||  
;
నీలాల నింగి పైన గిరి, 
నిలిచినది! 
గోవర్ధనగిరి, - నిలిచినది! .........  
నీలమోహనుని మేని సౌరులందున
అట - 
అటులే అగుపించే దృశ్యం 
    బహు మనోజ్ఞము ;    ||  
;
శివుని శిరసు సిగలోన ; 
నెలకొన్న నెలవంక ; 
దిగివచ్చినదేమో!      ; 
మన -  మధురాపతి 
     మధుర మందహాసమ్ములలోనే
         ఆ క్రొన్నెలవంక 
               దిగివచ్చినదేమో!  ;    ||  
కనుడు కనుడు ; 
కన్నులపంటగ సాగెడి హేల!  
ఈ రాసలీల హేల మేళా!
మక్కువల మేళా! ;    ||             
;
=============
  
            #  darahaasa liila :-   

ramDi ramDi, nEDu kaDu wEDuka ;: 
wENugAnalOluni rAsaliila!
kanuDu kanuDu ; 
kannulapamTaga sAgE 
ii raasaliila hEla mELA! || 
;
gOwardhanagiripaina, 
niilaala nimgi nilichinadEmO 
niilamOhanuni mEnisaurulamduna 
[mari – aTa - ] || 
;
Siwuni Sirasu sigalOna ; 
nelakonna nelawamka ; 
digiwachchinadEmO!      ; 
mana madhuraadhipati 
madhuramamdahaasammulalOnE || ;
kanuDu kanuDu ; 
kannulapamTaga sAgeDi hEla!  
ii raasaliila hEla mELA!|| 
;
 :-   [ పాట 8 - బుక్ పేజీ 19 ; శ్రీకృష్ణగీతాలు  ]  

 ▼ ▼ ▼ ► ►  ▼ ▼ ▼ ► ►  ▼ ▼ ▼ ► ►  

బంగారు భావములు

ఆనవాళ్ళు , ఆనవాళ్ళు 
బంగారు భావములకు ఆనవాళ్ళు 
శ్రీరాముల నడవడికలు; 
ఎల్ల జగతికీ ఒసగిన 
భాగ్యాలు, సిరి సౌభాగ్యాలు ; ||

విడివడని ప్రేమలకు ; 
గుడి కట్టిన ఆలుమగలు ; 
మన – రాములోరు, సీతమ్మవారు
స్ఫటిక స్వచ్ఛ మమతలకు ; 
తేనెపట్లు సోదరులు ; 
శ్రీరాముల సోదరులు ; ||
;
ఆ అడుగుజాడలే తమ్ములు; 
బంధులు, ప్రజలు అనుసరించగా ; 
అందరికీ దొరికినవీ ; 
దారిచూపు వెలుగులు;
మనకు అందరికీ దొరికినవీ; 
దారిచూపు వెలుగులు ; ||
;
 ▼ ▼ ▼ ► ►  ▼ ▼ ▼ ► ►  ▼ ▼ ▼ ► ►
;

శ్రీకృష్ణ జన్మ సార్ధకం ఐనది!

క్షణములన్ని పూజా సుమములాయేను    
విరహోత్కంఠితాలయమునందు  
క్షణములన్ని పూజా సుమములాయెను    
ప్రణయ ఆరాధనకు 
నిలువెత్తు దర్పణం రాధమ్మ ;
మా రాధ డెందమున ప్రతిబింబమై ;
హత్తుకొని ఉన్నాడు గోపాలుడు ;
;
బింబ ప్రతిబింబ 
           గద్దె దొరికెను కదా
                  నీలమోహనునికి!
అందుకే - 
   సఫలత పొందినవి ;
      శ్రీక్రిష్ణు కదలికలు ; 
చరితార్ధమైనది కద 
          శ్రీకృష్ణుని జన్మం!  
;
==================================;
;
kshaNamulanni puujaa sumamulaayenu
wirahOtkamThitaalayamunamdu    
praNaya aaraadhanaku 
niluwettu darpaNam raadha ; 
adha Demdamuna pratibimbamai ;
hattukoni unnaaDu gOpaaluDu ;
;
bimba pratibimba 
       gadde dorikenu kadaa
                  neelamOhanuniki!
amdukE - 
   saphalata pomdinawi
        SreekrishNu kadalikalu ; 
charitaardhamainadi kada 
        SreekRshNuni janmam ! 
;

చంద్రజ్యోత్స్నరాధికా!

దివి నుండి దిగి వచ్చిన ;
చంద్రజ్యోత్స్నరాధికా! ;    ||దివి||
;
నీ నీలి కురులు మబ్బులైతే
నీవు నీలి నింగివిలే;
నీ కనులు జంట మీనులైతే ;
నీవు గగన గంగవులే!;    ||దివి||
;
నీ కంఠము శంఖమైన ;
గరళకంఠునికి శాంతము ;
నాసిక సంపంగి ఐన ;
నీవు పూర్ణ నందనమ్మువులే ;    ||దివి||
;
నీ  నాసిక సంపంగి ఐన ;
నీవు సౌగంధిికా 
      సురభిళ ఉద్యానమ్మువు! ;
నీ కరములు మృణాళ తంతులే అయితే ;
రాధా! నీవే మానస సరోవరమ్మువు ;    ||దివి||
;
నీ నఖములు నక్షత్ర కోటి ;
రజనియె చీకటి మరుగున దాగును ;
ప్రేమగీతికి స్వరము కూర్పు
                            నీవు అయితే ;
మధురభక్తికి 
         అర్చనా ప్రతిమవు నీవేనులే!;    ||దివి||

========================== ;
;
 madhura bhakti ;-
diwi numDi digi wachchina ;
chamdrajyOtsnarAdhikA! ;    ||diwi||
;
nii neeli kurulu mabbulaitE 
              nIwu nIli nimgiwilE;
nee kanulu jamTa meenulaitE ;
neewu gagana gamgawulE!;    ||diwi||
;
nee kamThamu Samkhamaina ;
garaLakamThuniki SAmtamu ;
naasika sampamgi aina ;
neewu puurNa namdanammuwulE ;    ||diwi||
;
nee  naasika sampamgi aina ;
neewu saugamdikaa 
      surabhiLa udyaanammuwu! ;
nee karamulu mENALa tamtulE ayitE ;
raadhA! nIwE mAnasa sarOwarammuwu ;    ||diwi|| ]
;
nee nakhamulu nakshatra kOTi ;
rajaniye cheekaTi maruguna daagunu ;
prEmageetiki swaramu kuurpu neewu ayitE ;
madhurabhaktiki 
    rchanaa pratimawu neewEnulE!;    ||diwi||  

***********************************,|  
 [ పాట  66 ; బుక్ పేజీ  71 ]    శ్రీకృష్ణగీతాలు ]  ;- [ fb Thursday, September 8, 2016  ] 


Thursday, September 8, 2016

శ్రీకారముల పెన్నిధి

రామాయణము ;- 
ప్రతి మదిలో గదిలో కాంతులను 
ప్రసరింప జేయు పేర్మి మణి  ;      ||
;
ఒడిదుడుకులు లేనట్టి ; 
నడవడికకు చుట్టినట్టి క్రావడి ; 
శ్రీకారముల పెన్నిధికిది 
సునాయాసమౌ సిద్ధి! :     || 
;
తుఫానులను ఎదుర్కొని 
మానవ జీవన యానము ; 
సుగమముగా సాగు రీతి ; 
నొసగిన బంగారు నావ! ;     || 

=============================
;
రామాయణము ;- prati madilO gadilO ; 
kaamtulanu prasarimpa jEyu pErmi maNi ;  ||
;
oDiduDukulu lEnaTTi ; 
naDawaDikaku chuTTinaTTi kraawaDi ; 
Sreekaaramula pennidhikidi 
sunaayaasamau siddhi! :  || 
;
tuphaanulanu edurkoni 
maanawa jeeawana yaanamu ; 
sugamamugaa saagu reeti ; 
nosagina bamgaaru naawa!   || 
;
******************************,
;
SreeRamachandra -  songs 
;

Tuesday, September 6, 2016

పల్లవి నీవేరా కృష్ణా!

పిల్లగాలి రెక్కలపై ;   
పరచుకున్న తావులలో - 
 ;               నీవేరా కృష్ణా!  :   || 
;
అల అల్లరి మధుపమ్ము ; 
ఝుంకారముల - నాదము 
 ;               నీవేరా కృష్ణా!  :   || 
;
తటిల్లతా హారముల జారెడు ; 
ముత్యముల తేట - 
 ;               నీవేరా కృష్ణా!  :   || 
;
పురి విప్పిన నెమలి ఆటలలో ; 
నెలకొన్న లయబద్ధత - 
 ;               నీవేరా కృష్ణా!  :   || 
;
చివురులలో కోయిలమ్మ గీతికలకు ; 
మొట్టమొదటి పల్లవి -
 ;               నీవేరా కృష్ణా!  :   || 
;
సందె పల్లకీలోన సాగు ; 
రాధ రాగ రాగములో - 
     మాధురి - నీవేరా కృష్ణా! :  
        అనురాగ రాగములో
              మాధురి -నీవేరా కృష్ణా! :   ||   
;
===========================;
                      raagaraagiNi :- 

pillagaali rekkalapai ;
parachukunna taawulalO - niiwErA kRshNA!  :   ||
;
ala allari madhupammu ;
jhumkaaramula - naadamu niiwErA kRshNA! :   || 
;
taTillataa haaramula jaareDu ;
mutyamula tETa - niiwErA kRshNA! :   || 
;
puri wippina nemali ATalalO ;
nelakonna layabaddhata - niiwErA kRshNA! :   ||  
;
chiwurulalO kOyilamma geetikalaku ;
moTTamodaTi pallawi - niiwErA kRshNA! :   || 

samde pallakiilOna saagu ;
raadha raaga [= anuraaga] raagamulO - maadhuri -
niiwErA kRshNA! :   ||  

 పల్లవి - నీవేరా కృష్ణా! = రాగరాగిణి :- ;- 

[ పాట 59 ; బుక్ పేజీ 64  , శ్రీకృష్ణగీతాలు ]  ;

Thursday, September 1, 2016

మురళి పంచన చేరెను రాగము!

మలయ పవన వీచిక ; 
మాయగా ........; 
ఆయెనుగా రాగముగా 
అత్యద్భుత రాగముగా! ;     || 
;
కొండలలో కోనలలో 
తారాడే కొండగాలి ; 
పిల్లనగ్రోవి పంచన 
ఇపుడు చేరినది, తెలుసా!? ;    ||
;
చెవులను హోరెత్తించినదీ 
క్రితం నిముషము దాకా! ; 
ఇపుడేమో మారుతము ; 
ఎటులనో ఏమోనో - 
ఇటుల రాగమాయెను 
తను మాయగా!    || 
;
దురుసు ఈదురు గాలియె ; 
క్రితం క్షణం దాకాను! 
ఇపుడేమో వేడి గాలి 
ఎటులనో ఏమోనో - 
ఇటుల రాగమాయెను 
తను మాయగా!  ;    || 
;
మాయ మర్మములు లేవు! 
పూర్వ పుణ్య ఫలముచే వాయువు ; 
కన్నయ్య చేతి వేణువులో చేరినది ; 
మృదు తాళ జతుల సంగీతము ఐనది; 
చిరుగాలిగ మారినది ;     ||
;
[ మురళి పంచన చేరెను రాగము!  ]
;
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
;
         తెలి గోళ్ళు - వెన్నెల ప్రతి ఫలనము ;-
                   [ Monday, August 31, 2009 ]
;
మురళిలోన తారాడే - మలయ పవన వీచిక
ఆయె రాగ మాలిక !- అది, ఎల్లరికీ వేడుక!  ;     || 
;
బృందావనిలోన,
అందందున - వలయ నాట్య హారములు 
భామినుల ఆట పాటలన్నీ -
యమునా తటి, 
యామినిపై వెద జల్లుతూన్న - 
కువలయ విరి సౌరభములు!   ;     || 
;
రాస లీల వేళలలో - 
వెదురు పైన స్వామి వ్రేళ్ళు !
శూన్య వంశి" వేణువు "గా - 
అవతరించు క్షణములలో
శ్రీ కృష్ణుని నఖములపై - 
విరియు జ్యోత్స్నల కాంతుల
రిమ రిమలు, మిల మిలలు - 
జిలి బిలి జాబిల్లి నవులు
ఆ - కిల కిలల అలల పయిన - 
                 రిమ్ ఝిమ్ ఝిమ్  
                           రిమ్ ఝిమ్ ఝిమ్  
;
===================================
             malaya pawana weechika ; 

aayenugaa raagamugaa ; atyadbhuta raagamugA! 
] komDalalO kOnalalO taarADE ; 
komDagaali ; ipuDu chEre muraLi pamchana ;    ||
;
chewulanu hOrettimchinadii kritam nimushamu daakA! ; 
ipuDEmO eTulanO EmOnO - 
iTula raagamaayenu tanu maayagaa!    || 
;
wEDi gaali, waDagaali, 
Iduru gaaliye ; kritam kshaNam daakaanu! 
eTulanO EmOnO - 
iTula 
raagamaayenu tanu maayagaa!  ;    || 
;
maaya kaadu, marmamulEwiyunuu lEne lEwu! 
puurwa janma puNya phalamu ; 
kannayya wENuwulO chErinadi ; 
mRdu taaLa jatula 
samgeetamu ainadi chirugaaliga maarinadi ;     || 
;
''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''  
] మలయ పవన వీచిక  ; ; new song ;- కుసుమాంబ ;
       తెలి గోళ్ళు - వెన్నెల ప్రతి ఫలనము ;-
                   [ Monday, August 31, 2009 ]

ఇప్పుడే అర్ధమైనది!

ఎన్నెన్నో పరిణామములు ; 
ఎటుల సంభవించినవో ; 
ఇపుడె మాకు అర్ధమైనది ఓ  రాధికా!!
;
జాలువారుచున్నవి
విరజాజుల పరిమళాలు ; 
సుమ సుగంధాల రాశి వీవు కదా!
అందులకే - సుర పుష్పం, 
సౌగందికాననములు చిన్నబోవుచుండెను!  :    ||
;
వెన్నెల పరదాల వెనుక ;
మోములను దాచుకొనుచునెను ;
బ్రహ్మ సృష్టి అందాలు,
స్వర్గ సిరుల చందాలు 
ఇపుడె మాకు అర్ధమాయె రాధికా!! :    ||
;
చతుర్దశ భువనమ్ముల
సోయగాలు యావత్తూ ; 
నీ దేహం మిసిమి చిన్నెలను
అరువుగా గొనెను - అని మాకు ; 
ఇపుడె అర్ధమైనది ఓ రాధికా!!!  !  :    ||
=============================== ;
;
                       ippude ardhamainadi! ;-

ennennO pariNAmamulu ;
eTula sambhawimchinawO ; 
ipuDe maaku ardhamaayenO ;   ||   
;
jaaluwaaruchunnawi
wirajaajula parimaLAlu ; 
suma sugamdhaala raaSi niiwu
aitiweewu amdulakE,; raadhikaa!
sura pushpam,
saugamdikaananamulu
chinnabOwu chumDenu!!  :    ||
;
wennela paradaala wenuka ;
mOmulanu daachukonu chunnawi ; 
brahma sRshTi amdaalu,
swarga sirula chamdaalu!;
ipuDe maaku ardhamaayenO raadhikaa!    :    ||
;
chaturdaSa bhuwanammula
sOyagaalu yaawattuu ;
niidu dEham misimi chinnelanu ; 
aruwugaa goninawi - ani maaku
ipuDe ardhamaaye nO  రాధికా!!  
;
;;; # new song # ;- కుసుమాంబ  1955  ;-    kusumaamba 1955 ;-  

జీవన పల్లవి

బృందావన తరు పుష్పములార! 
కాళిందీ తరంగములారా! 
నే తెలిపే ఊసులు ; 
;       చెవి యొగ్గి వినండీ ; 
;        కాస్త చెవి యొగ్గి వినండీ  ;   ||బృందా||
;
వేణు వినోదీ మోవి సోకగనే ; 
నా "జీవన పల్లవి" పలికినదిటనే! :   ||బృందా|| 
;
"మదన సదన సామ్రాట్" బిగి కౌగిలిలో ; 
నా 'మానస కీరము' కులికినదిటనే! :   ||బృందా|| 
;
జలజ నయనుని వలపు వానలో ; 
సంతోష తరంగము త్రుళ్ళినదిటనే! :   ||బృందా|| 
;
పురాణ పురుషుని రాగబంధమున ; 
'ప్రేమ పికములు ' కూసిన విటనే!:   ||బృందా||   
;
============================= ===========;
jeewana pallawi ;- 
bRmdAwana taru pushpamulaara! 
kaaLimdI taramgamulArA! 
nE telipE Usulu ; 
chewi yoggi winamDI ; 
kaasta winamDI :   ||bRmdA||
;
wENu winOdii mOwi sOkaganE ; 
naa "jIwana pallawi" palikinadiTanE!:   ||bRmdA|| 
;
"madana sadana sAmraaT" bigi kaugililO ; 
naa 'maanasa kiiramu ' kulikinaiTanE!:   ||bRmdA|| 
;
jalaja nayanuni walapu waanalO ; 
samtOsha taramgamu truLLinadiTanE!:   ||bRmdA|| 
;
purANa purushuni rAgabamdhamuna ; 
'prEma pikamulu ' kuusina wiTanE!:   ||bRmdA||  
;
[ పాట 60 ; బుక్ పేజీ 65  , శ్రీకృష్ణగీతాలు ]