Thursday, December 29, 2016

అల్లరులలో మేటి వాడు

నందకిశోరుడు, క్రిష్ణుడు ; 
బలరామునికి తమ్ముడు,
పింఛధారి, గోవర్ధన గిరిధారి, 
అల్లరులలో మేటి వాడు ; || 
;
రోహిణీ పిన్నమ్మ, యశోదమ్మలు; 
నవనీతమ్ములు, జున్ను, మీగడలు ; ; 
కొసరి కొసరి ఇస్తేను తీసుకున్నాడు ; 
తీసుకున్నాడు, సరే!;
పుచ్చుకున్న క్రిష్ణుడు ఎటు వెళ్ళినాడమ్మా!? ;
క్రిష్ణుడు ఎటు వెళ్ళినాడమ్మా!? ||
;
యమునా దరి చేరాడు ముద్దుగుమ్మడు ; 
చిరు తిళ్ళు తెచ్చారు కన్నయ్య నేస్తాలు, 
గోపెమ్మలు, రాధమ్మలు ;
కొంగులలో దాచి దాచి తెచ్చారు ; ||
;
తినుబండారములతోటి 
సరగున వచ్చేసారు మిత్రులు, 
ఇదిగొ సర్వం నీకేను! - అంటుంటే ; 
'కాకి ఎంగిలిలు చేసి చేస్తే - 
తనకు బాగా పనికివచ్చును, 
సరి సరి! సరే సరే!!
;
;- అల్లరులలో మేటి వాడు ; blogillu LINK

శ్రీ గోదాదేవి, శుకము

శ్రీ గోదాదేవి భుజమున నిలిచిన
తేనెల పలుకుల చిలకమ్మా! 
పన్నీటి పలుకులను
చిలకరించుమా! చిలకరించుమా! !||
;
లోకములను బ్రోచిన స్వామి ;
విధి నిర్వహణలోన సతమతమౌతూను ; 
అలసి ఉన్నాడు, ఓ కీరమా!
విధి నిర్వహణ వలన ; 
బహు డస్సి ఉన్నాడు ; 
తేనెల పలుకుల తోటి సేదదీర్చమ్మా!! : || 
;
శ్రీరంగనాయకి సతి కూడ ; 
భాగస్వామిని పతి విధిని ; 
అస్తారుబిస్తారు అయ్యి ఉన్నాది ;
పని ఒత్తిడి తోడ 
అస్తారుబిస్తారు అయ్యి ఉన్నాది ;
తేనెల పలుకుల తోటి సేదదీర్చమ్మా!! : || 
;
kusumaamba1955 rachana ;

Friday, December 16, 2016

భజరే!

భజరే! భజరే! భజరే! భజరే! 
కృష్ణ ముకుందం! గోకుల హాసం!
దేవకి తనయం! యశోద మోదం! ;;
యమునాతీరం! యామిని శోభా సౌరభ
           వ్యాపిత హృత్తేజం! :  ||
కస్తూరి తిలకం తేజిత ఫాలం ; 
కౌస్తుభ మణి  హారం;
మరకతాభరణ ధారీ, శోభిత ; 
నీల మేఘ ఘన సమున్నత వక్షం! :  || 

=============================;

                     BajarE!

BajarE! BajarE! BajarE! BajarE! 
kRshNa mukumdam! gOkula hAsam! 
dEwaki tanayam! yaSOda mOdam! ;;
yamunaateeram! yAmini SOBA sauraBa
           wyApita hRttEjam! :  ||kastuuri tilakam tEjita phAlam ; 
kaustuBa hAram;
maNi marakataabharaNa dhaarii, SOBita ; 
niila mEGa ghana samunnata waksham! :   || 
;
[ పాట 119 ;  బుక్ పేజీ 124  , శ్రీకృష్ణగీతాలు ] 
బృహత్తర విధి ;  కిరీట ధారిణి. కోణమానిని తెలుగు ప్రపంచం ;  LINK :-
;

శ్రీకార సీమ

మజిలీల మలుపులలో కాలూన లేనైతి కృష్ణా! 
        పసిబాల లీలగా, ఇటుల - పడి లేవ లేనైతి ; :  || 
;
ఈ కోన, ఆ కోన, చీకటుల 
  బాట,కూన దాటగ గలదా!? ; 
    రక్కసి ముళ్ళేవి గుచ్చుకోకుండా! :  || 
;
ఈ కొండ ఆ కొండ, మిట్ట పల్లాలను 
     ఎక్కి, చేరగ గలనా!? 
         చక్కని వెన్నెలల  శ్రీకార సీమను ;  || 
;
▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼
;
;                     Sreekaara seema ;-  
;
majiliila malupulalO kaalUna lEnaiti kRshNA! pasibaala 
liilagaa, iTula - paDi lEwa lEnaiti ; :  || 

ii kOna, A kOna, chIkaTula bATa,kUna 
dATaga galadA!? ; rakkasi muLLEwi guchchukOkumDA! :  || 

ii komDa A komDa, miTTa pallAlanu ekki, chEraga galanA!? 
chakkani wennelala  Sreekaara seemanu ;  ||
;
[ పాట 116  ;  బుక్ పేజీ 122  , శ్రీకృష్ణగీతాలు ]  ;  
;
▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼

నా తోట

నా తోట ఏ గాలి వీయించుతావో, 
నా వీట ఏ మధువు ఒలికించుతావో ;  || 
పాటలాధరమున 'కన్నీటి ఆట ' ; 
జాలువారేనురా ; జారిపోయేనురా :   
   హంసవై నీవె ఈదులాడేవు ; 
   రాయంచవై నీవె తానమాడేవు :  || 
;
ఎద పంజరములోన ; మలిసంజె వెలుగులు ;; 
కొలువు చేసేనురా, జిలుగు పూసేనురా! ;; 
   చిలుకవై నీవే పలుకులను నింపు : 
   రాచిలుకవై నీవే పాటలను నింపు :  ||
;  
==================;
              naa tOTa ;-;-
;
naa tOTa E gaali weeyimchutaawO, 
naa wITa E madhuwu olikimchutaawO ;  || 
pATalAdharamuna 'kannITi ATa ' ; 
jaaluwaarEnuraa ; jaaripOyEnuraa :   
   hamsawai neewe iidulADEwu ; 
   raayamchawai neewe taanamADEwu :  || 
;
eda pamjaramulOna ; 
malisamje welugulu ;; 
koluwu chEsEnurA, jilugu pUsEnurA! ;; 
   chilukawai neewE palukulanu nimpu : 
   raachilukawai neewE pATalanu nimpu :  ||
;
[ పాట 116  ;  బుక్ పేజీ 121  , శ్రీకృష్ణగీతాలు ]  - 
;
***************************************:
;

;  ↴116
నూట పదహార్లు, నాకు చాలు! ;-
1942 లో “దీన బంధు” సినిమా నిర్మాణం ;  చిత్తూరు నాగయ్య ; 
1970 లో ఢిల్లీ ఆంధ్ర సంఘము - సభను ఏర్పాటు చేసింది.
అక్కడ రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్
"మీకు ఎట్టి సన్మానం కావాలి?" అని అడిగారు.
"నూట పదహారు రూపాయలు, శాలువా చాలును."
అన్నాడు శంకరంబాడి.
***************************************:
;
ఇప్పటికి ఇవి నూట పదహార్లు ;   =
ippaTiki iwi nUTa padahaarlu ;                
;
 ▼▼▼▼▼▼▼▼▼▼▼▼

దివ్య మజిలీ

గుండె లో లోతుల కందళించిన వేళ ; 
కృష్ణా! ఏ పూవుగా నేను పూయ గల దానను!? ; 
ఏ గాలిగా నేను వీయగలదానను!?!? :  ||
;
వెలుతురుల 'అచ్చెరువు' వెల్లువలు  రేకెత్త ;  
తొలి సందె మలి సందె, ఊయలై నన్నూప 
;      ఏ హంసగా నేను ఈదులాడేను : 
       ఏ పాపగా నేను ఊగులాడేను ;  || 
;
కలలు కలతల దూరి ఉప్పెనగ పెనగ ; 
ఈ నేల, ఆ నింగి - నేస్తులై నను పిలువ ; 
        ఏ తరగలై నేను ఉరకలెత్తేను ; 
        ఏ దివ్య మజిలీలో సుంత ఆగేను ;  || 
;
================================; 
;
                     diwya majilii ;- 
;
gumDe lO lOtula kamdaLimchina wELa ; 
kRshNA! E puuwugA nEnu pUya gala dAnanu!? ; 
E gAligA nEnu wIyagaladA!? :  ||

weluturula achcheruwu welluwalu rEketta ; 
toli samde mali samde, uuyalai nannuupa 
            E hamsagA nEnu IdulADEnu : 
            E pApagA nEnu UgulADEnu ;  || 
;
kalalu kalatala duuri uppenaga penaga ; 
ii nEla, aa nimgi - nEstulai nanu piluwa ; 
            E taragalai nEnu urakalettEnu ; 
             E diwya majiliilIlO sumta aagEnu ;  || 
;
[ పాట 115  ;  బుక్ పేజీ 120  , శ్రీకృష్ణగీతాలు ]
చంద్రికలలో స్నానాలు JLD  [ link ] ;

Tuesday, December 13, 2016

బుల్ బుల్ మాసం Karthika

కార్తీకం బుల్ బుల్ మాసం ;
భలే సందడి విహారములతో!
పిక్నిక్ ఆటలు, విహార యాత్రలు 
పొరపొచ్చాలను తొలగించి 
నిర్మించేటి స్నేహ వారధికి  

పట్టువిడుపులు, దోస్తీలు
మైత్రీ అలకలు చిట్టి మెరుపులు 
పట్టు కుచ్చులు చిరు నవ్వుల చిందులు
చేతులు కలిపి చేతము నేస్తం!  

================;  

kaarteekam bul bul maasam ;
bhalE samdaDi wihaaramulatO!
piknik ఆటlu, wihaara yaatralu 
porapochchaalanu tolagimchi 
nirmimchETi snEha waaradhiki  

paTTuwiDupulu, dOstiilu
maitree alakalu chiTTi merupulu 
paTTu kuchchulu chiru nawwula chimdulu
chEtulu kalipi chEtamu nEstam!  
;

Monday, December 12, 2016

వెన్నెలలో స్నానాలు


వెన్నెలలో స్నానమేల? చందమామా! 
కన్నులలో తళుకులేల? చందమామా! :  || 
;
రాధ వలపు కన్నులలో నాదు మానసం ; 
పెను చిక్కులన్ని తొలగించి మక్కువ చూపి ; 
మగువ తోటి నా మనవిని చందమామా! 
విన్నవించు - మా మొర విని చందమామా! :  || 
;
ఆమె చూపు కరువాయెను ; 
నాదు మనసు చీకటాయెను చందమామా! ; 
చిటికెడంత కరుణ కురిసి చందమామా! ; ; 
ఇదే మంచి తరుణమని తెలిసి ; 
తారుణ్యత మది నెంచి ; 
మాకు జతను కూర్చుమోయి చందమామా!; 

సువ్వీ! సువ్వీ! అనుచు 
జానపదం అవవోయీ! చందమామా! ; 
జాణ నింగి చుక్క తోటి చందమామా! ;  ||

; ==================,

          nagu mOmu ;- 
;
nagu mOmu chUpaka nannEDipistAwu; pATa chAlunu kRshNA! :
'tEne rasa SAlalO parawaSAla tEla ; kRshNA! parawaSAla tEla ; ||

mumdu janmamulOna oDalella chillulugA chEsukuni ; 
muraLi - tapamaacharimchenu ; nee arachEta chErEnu; 
adi, gaaraalu pOyEnu! ; bahu gaaraalu pOyEnu! : ||

telisinadi kiTuku, telisenu lOguTTu ; 
toli wratamu nE chEsi, wENuwE autAnu ; 
nee wEli mudralu , mudrala muddulu nE pomdutaanu ; 
wE wElugaa nEnu pomdi teeredanu, kRshNA! || 
బృందావనమే రాధామనోహరం... 
[ పాట 113  ;  బుక్ పేజీ; 118  , శ్రీకృష్ణగీతాలు ]   
      [bhawuka ]

నగు మోము

నగు మోము చూపక నన్నేడిపిస్తావు; 
పాట చాలును కృష్ణా! :
'తేనె రస శాల'లో పరవశాల తేల ; 
కృష్ణా! పరవశాల తేల ; ||
;
ముందు జన్మములోన ఒడలెల్ల చిల్లులుగా చేసుకుని ; 
మురళి - తపమాచరించెను ; నీ అరచేత చేరేను; 
అది, గారాలు పోయేను! ; బహు గారాలు పోయేను! : ||
;
తెలిసినది కిటుకు, తెలిసెను లోగుట్టు ; 
తొలి వ్రతము నే చేసి, వేణువే ఔతాను ; 
నీ వేలి ముద్రలు , ముద్రల ముద్దులు నే పొందుతాను ; 
వే వేలుగా నేను పొంది తీరెదను, కృష్ణా! || 
;
==================,

             nagu mOmu ;- 
;
nagu mOmu chUpaka nannEDipistAwu; pATa chAlunu kRshNA! :
'tEne rasa SAlalO parawaSAla tEla ; kRshNA! parawaSAla tEla ; ||

mumdu janmamulOna oDalella chillulugA chEsukuni ; 
muraLi - tapamaacharimchenu ; nee arachEta chErEnu; 
adi, gaaraalu pOyEnu! ; bahu gaaraalu pOyEnu! : ||

telisinadi kiTuku, telisenu lOguTTu ; 
toli wratamu nE chEsi, wENuwE autAnu ; 
nee wEli mudralu , mudrala muddulu nE pomdutaanu ; 
wE wElugaa nEnu pomdi teeredanu, kRshNA! || 
బృందావనమే రాధామనోహరం... 
[ పాట 114  ;  బుక్ పేజీ 119  , శ్రీకృష్ణగీతాలు ]  
;

Friday, December 9, 2016

పాల వెన్నెల

పాల వెన్నెలలోన కరిగిపోయెను జగతి!!; 
నీ వాలు చూపులలోన ; 
జారి పోయె నా మది! 
రాధా! జారి- పోయింది నా మది! :  ||  

ఆమె ;- 
రామ చిలుకలకు పలుకులు కరువై ;  
ఉలకవు, పలకవు, ఎందులకో!? : 
అతను ;-  
తేనెల సోనల తలపులన్నిటిని 
దోచిన జాణవు, నీ వలననే!
కీరవాణికి అలకలు, కినుకలు! :  || 

ఆమె ;-  
జిలిబిలి చూపుల పూల దొంతరలు ; 
పేర్చితి వేలనో? ఎందులకో? ;; 
అతను ;- 
నా మదిని దోచిన మంద గమనవు! 
పూలశయ్యలు నీ కొఱకే! అవి నీ కొఱకే! :  ||
;
; ==========================;
;;
                         paala wennela ;-
;
paala wennelalOna karigipOyenu jagati!!; 
nee waalu chuupulalOna ; 
jAri pOye nA madi! 
raadhA! jAri- pOyimdi nA madi! :  ||  

aame ;- 
raama chilukalaku palukulu karuwai ; 
ulakawu, palakawu, emdulakO!? : 
atanu ;-  
tEnela sOnala talapulanniTini 
dOchina jANawu, nI walananE!
keerawaaNiki alakalu, kinukalu! :  || 

aame ;-  
jilibili chuupula puula domtaralu ; 
pErchiti wElanO? emdulakO? ;; 
atanu ;- 
naa madini dOchina mamda gamanawu! 
pUlaSayyalu nI ko~rakE! awi nI ko~rakE! :  ||
;
[ పాట 112 ;  బుక్ పేజీ 117  , శ్రీకృష్ణగీతాలు ]  

▼▼▼▼▼▼▼▼▼▼▼▼ ▼ ▼ ► ► ▼▼▼▼▼▼▼▼

Thursday, December 8, 2016

మెరుపు మేనా

మెరుపు మేనాలోన ; 
     రావేమి చెలియా!
గడుసు మొయిలుల తోసి, పారేసి ;; 
    దాటి దాటీ త్వరగ రావేమి, రాధికా! :  ||  

పున్నములు తెలబోయె ; 
  వెన్నెలలు వెలివోయె ; 
    చిన్నబోయెను రేయి ; 
       అన్నె పున్నెము లెంత 
        మాత్రమూ ఎరుగనిదమ్మా, 
              ఈ విదియ రేయి! :  ||

సన్నజాజుల తావి ; 
  కన్నె మోజుల జారి ; 
   చిన్నబోయెను తోట ; 
     చిన్నబుచ్చకు చెలియ! 

       ఏ నేరమూ ఎరుగనిదమ్మ! 
            పరిమళపు ఈ తోట :  || 
;
=========================;
;
;     merupu mEnaa ;- 
;
merupu mEnaalOna ; 
     raawEmi cheliyA!
gaDusu moyilula tOsi, paarEsi ;; 
    daaTi daaTii twaraga rAwEmi, rAdhikaa! :  ||  

punnamulu telabOye ; 
  wennelalu weliwOye ; 
    chinnabOyenu rEyi ; 
       anne punnemu lemta 
        maatramuu eruganidammaa, 
              ii widiya rEyi! :  ||

sannajaajula taawi ; 
  kanne mOjula jaari ; 
   chinnabOyenu tOTa ; 
     chinnabuchchaku cheliya! 

       E nEramuu eruganidamma! 
            parimaLapu I tOTa :  || 
;
[ పాట 11 ;  బుక్ పేజీ 11  , శ్రీకృష్ణగీతాలు ]  

▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼,

వీడ్కోలు

తాళ లేని పున్నమికి ; 
కర్పూర విడెమిచ్చి ; 
వేళ కాని వేకువకు ; 
మలి వీడ్కోలును పలికి : || 

చెలి జడలో మొగలి పూవు తావిని ; 
నేనై ఉందును ; 
ఉందును నేనిచటనే, 
సదా సదా, నిరంతరం ;  || 

రాధ జడ పరిమళాల తరాజు ; 
తుమ్మెదల కూడలి అయె ; 
రాధ కేశ వేదిక ;  || 

ఏమని చెప్పుదును ; 
తక్కిన పుష్పాల వేదనలు ; 
భ్రమరము లన్నియు చేరిన 
సీమ ఇదే ఆయెను - అని ; 

తమ వంకకు అవి 
    రావడమే మరిచినవని - 
తక్కిన పూవులు అన్నింటీ ; 
విలవిలలు, కృంగి కృశించుటలు ;  || 

==============================;
;
          weeDkOlu

tALa lEni punnamiki ; 
karpuura wiDemichchi ; 
   wELa kaani wEkuwaku ; 
mali weeDkOlunu paliki : || 
cheli jaDalO mogali puuwu taawini ; 
nEnai umdunu ; 
umdunu nEnichaTanE, 
sadaa sadaa, niramtaram ;  || 
raadha jaDa parimaLAla taraaju ; 
tummedala kuuDali aye ; 
raadha kESa wEdika ;  || 
Emani cheppudunu ; 
takkina pushpaala wEdanalu ; 
bhramaramu lanniyu chErina 
seema idE Ayenu - ani ; 
tama wamkaku awi 
    raawaDamE marichinawani - 
takkina puuwulu annimTii ; 
wilawilalu, kRmgi kRSimchuTalu ;  || 

***********************,
 ;-  [ పాట 111 ;  బుక్ పేజీ 115  , శ్రీకృష్ణగీతాలు ]