Sunday, September 16, 2018

గుమ్మపాలు రుచిని కృష్ణుడు చెప్పాలి

ఆ కుండలోన ఏమున్నది చెపుమా 
చెలులు ;- 
కుండను నడుమున పెట్టి ; 
కోమలి వెళుతూన్నది ;
కుండలోన ఏమున్నది!? 
ఆ కుండలోన ఏమున్నది చెపుమా ~
ఆమె సమాధానం ;-
కపిల ధేనువు భక్తి ఉప్పొంగగా ; 
చేపిన గుమ్మపాలు ఓ భామినీ! ;  ||
;
2] భుజముల దుత్త పెట్టి ; 
నడచి పోతున్నావు ; 
దుత్తలొ ఏమున్నది!? ;
ఆ దుత్తలొ ఏమున్నది!?  ; 
నుడువుమ హంసగామినీ ~~ 
ఆమె ;- ఈ దుత్తలలొ,
అరచేతి మందాల చిక్కని - మీగడల పొరలు ; 
తేటతెల్లముగ ఇంతియె పడతీ ;  ||
;
తలపయి కుదురులోన - కుదురుగ ఉన్నది కుంభం ; 
కుంభమునందేమున్నది?
పూర్ణ కుంభమున ఏమున్నదో ; 
కులుకుల నొలకబోసే కౌముది, చెప్పమ్మా ~~ 
ఆమె ;- తొణికే పెరుగులు, పొర్లే మజ్జిగలందున ; 
చందమామంటి నవనీతాల ముద్దలు, ఓ కలికీ ;  ||
;
తియ్య తియ్యని ఆ వెన్నను ; 
కొంచెం మాకు రుచికి - దయ ఉంచి ఇవ్వమ్మా  ~
ఆమె ;- కోరక దళ పెదవుల ; 
మా చిన్ని క్రిష్ణమ్మ; 
వచ్చేదాకా అందరు ఆగండి ; 
క్రిష్ణుడు చవి చూచి ; 'ఓహో' అని అంటే ; 
అందరికీ ప్రసాదం ;  కొండంత సంపత్తి ;  || 
;
=========================; ;
celulu ;- 
kumDanu naDumuna peTTi ; 
kOmali weLutuunnadi ;
kumDalOna Emunnadi!? 
aa kumDalOna Emunnadi cepumaa ~~ 
aame samaadhaanam ;-
kapila dhEnuwu bhakti uppomgagaa ; 
cEpina gummapaalu O bhaaminii! ;  ||
;
2] bhujamula dutta peTTi ; 
naDaci pOtunnaawu ; 
duttalo Emunnadi!? ;
aa duttalo Emunnadi!?  ; 
nuDuwuma hamsagaaminee ~~ 
aame ;- ee duttalalo,
aracEti mamdaala cikkani - meegaDala poralu ; 
tETatellamuga imtiye paDatee ;  ||
;
talapayi kudurulOna - 
kuduruga unnadi kumbham ; 
kumbhamunamdEmunnadi?
puurNa kumbhamuna EmunnadO ; 
kulukula nolakabOsE kaumudi, ceppammaa ~~ 
aame ;- toNikE perugulu, porlE majjigalamduna ; 
camdamaamamTi nawaneetaala muddalu, O kalikee ;  ||
;
tiyya tiyyani aa wennanu ; 
komcem maaku ruciki - 
daya umci iwwammaa ~~ 
aame ;- kOraka daLa pedawula ; 
maa cinni krishNamma; 
waccEdaakaa amdaru aagamDi ; 
krishNuDu cawi cuuci ; 'OhO' ani amTE ; 
amdarikee prasaadam ; komDamta sampatti ;  ||

No comments:

Post a Comment